గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కామాక్షి ఇంట్లో ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తుంది. ప్రభావతి నాట్య భంగిమలతో రూమ్ అంతా నిండిపోతుంది. ముందు శ్రుతిని జ్యోతి ప్రజ్వలన చేయమంటుంది ప్రభావతి. దానికి రోహిణి అసూయ పడుతుంది.
డ్యాన్స్ స్కూల్ ఐడియా నేనిస్తే శ్రుతితో జ్యోతి ప్రజ్వలన చేయిస్తుంది. ఇంత పక్షపాతం ఉండకూడదు అని మనోజ్‌తో రోహిణి అంటుంది. తర్వాత రోహిణితో జ్యోతి ప్రజ్వలన చేయిస్తుంది. మీనాను కూడా పిలవమని కామాక్షి అంటే.. రెండే ఒత్తులున్నాయని ప్రభావతి అంటుంది.
దాంతో బాలు కోప్పడతాడు. నూనే, దీపాలు అన్ని నేనే రెడీ చేశాగా ఇదంతా అవసరం లేదులెండి అని మీనా అంటుంది. ఆస్తులున్న ఇద్దరు కోడళ్లతో వెలిగించి నా భార్యను మాత్రం తక్కువ చేస్తావా. అయితే రిబ్బన్ కటింగ్ మీనాతో చేయించాలని బాలు డిమాండ్ చేస్తాడు. వీళ్లందరిలో ఎవరు గొప్ప. అందరికి అన్ని మైనస్‌లే ఉన్నాయి అని బాలు అంటాడు.
వీడు చెప్పింది నిజమే. మీనా చేత్తో కల్యాణ మాలలు ఇస్తే ఆ జంట చక్కగా కాపురం చేస్తారని గుళ్లో పూజారి గారు చెప్పారు. అమ్మవారికి కూడా మీనా ఇచ్చిన పూలదండే ముందుగా వేస్తారు. కాబట్టి మీనా చేత్తో రిబ్బన్ కటింగ్ చేయిద్దాం అని సత్యం అంటాడు. నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు.
డ్యాన్స్ స్కూల్ ఎవరితో ప్రారంభించాలనేది దానిపై గొడవ జరుగుతుంటుంది. మీనాతోనే చేయించాలని బాలు పట్టుబడతాడు. సత్యం కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ, ప్రభావతి వద్దు గాక వద్దంటుంది. నానా మాటలు మాట్లాడుతుంది. బాలుకే శ్రుతి కూడా సపోర్ట్ చేస్తుంది. కామాక్షి కూడా అంటుంది. అయినా ప్రభావతి మాట వినదు. ఏడుపు మొహం పెడుతుంది.
అత్తయ్య ఒక లక్ష్యంతో ఈ డ్యాన్స్ స్కూల్ పెట్టారు. ఆవిడకు నచ్చినవారితో రిబ్బన్ కటింగ్ చేయిస్తే బాగుంటుంది. అత్తయ్య సంతోషిస్తారు. ఇంక మావయ్య చేత్తో కటింగ్ చేయిస్తే మరింత సంతోషిస్తారు అని అందరికి మీనా నచ్చజెప్పుతుంది. దాంతో సత్యంతో రిబ్బన్ కటింగ్ చేయిద్దామని అంతా అనుకుంటారు. అలాగే, ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌ను సత్యం ప్రారంభిస్తాడు.
అందరూ ప్రభావతికి ఆల్ ది బెస్ట్ చెబుతారు. అందరికి సంతోషంగా థ్యాంక్స్ చెప్పిన ప్రభావతి మీనాకు మాత్రం విసుక్కుంటూ థ్యాంక్స్ అని ఏదో ఫార్మాలిటికి చెబుతుంది. తర్వాత ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌కు ఎవరు రారు. బయట ఆడుకునే పిల్లలకు తాను డ్యాన్స్ నేర్పిస్తానని, వెళ్లి వాళ్ల తల్లిదండ్రులతో చెప్పి వచ్చి జాయిన్ చేయించుకోమని ప్రభావతి చెబుతుంది.
ప్రభావతి మాటలు విన్న పిల్లలు నవ్వుతారు. ఏంటీ ఆంటీ మీరు డ్యాన్స్ నేర్పిస్తారా. మీ సైజుకు మీరు డ్యాన్స్ నేర్పించడటం ఏంటీ అంటూ పిల్లలంతా ఎగతాళి చేస్తారు. ప్రభావతిని చూసి నవ్వుతారు. దాంతో ఒళ్లు మండిపోయిన ప్రభావతి పిల్లలపై ఫైర్ అవుతుంది. దానికి పిల్లలు ఏడుస్తూ వెళ్లిపోతారు.
ఎప్పటికీ ప్రభావతి దగ్గరికి స్టూడెంట్స్ ఎవరు రారు. దాంతో ఏం చేయలేక దోమలు కొట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఈ విషయం తెలిసిన బాలు తన తల్లికి స్టూడెంట్స్ పెరగాలని భావిస్తాడు. దాంతో మీనానే ప్రభావతి తొలి శిష్యురాలిగా చేరమని చెబుతాడు. దానికి మీనా ఒప్పుకుంటుంది.
ప్రభావతి చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే.. కామాక్షి వచ్చి ఏంటీ వదినా ఈగలు తోలుకుంటున్నావా అని అడుగుతుంది. దాంతో కామాక్షిపై మండిపడుతుంది ప్రభావతి. ఇంతలో బాలు, మీనా వస్తారు. అయ్యో డ్యాన్సావతి పెట్టిన స్కూల్‌కి ఎవరు రాకపోవడం ఏంటీ అని బాలు పంచులు వేస్తాడు. అందుకేగా మనం వచ్చాం. నేను మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకుందామని వచ్చాను అని మీనా చెబుతుంది.
కానీ, ప్రభావతి నమ్మదు. వీళ్లు నన్ను ఎగతాళి చేయడానికే వచ్చారు కామాక్షి అని ప్రభావతి అంటుంది. లేదు నిజంగానే డ్యాన్స్ నేర్చుకుందామని వచ్చాను అని మీనా అంటుంది. కాలికి గజ్జెకట్టి ఇంట్లో తైతక్కలాడినట్లు కాదు భరతనాట్యం అంటే అని ప్రభావతి అంటుంది. నేర్పించి చూడండి అని మీనా అంటుంది. సరే నాతో కలిసి చేయగలవా అని ప్రభావతి అంటుంది.
గలను అనే అనుకుంటున్నాను గురువు గారు అని మీనా అంటుంది. కాదనకండి గురువు గారు అని బాలు అంటాడు. దానికి సరే అని ఒప్పుకున్న ప్రభావతి మీనాకు భరత నాట్యం నేర్పిస్తుంది. గురువుకు సమర్పించినట్లు తాంబూలం అవి ప్రభావతికి ఇచ్చి కాళ్లకు బాలు, మీనా నమస్కారం పెట్టి డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు.
ప్రభావతి, మీనా ఇద్దరు పోటా పోటీగా డ్యాన్స్ చేస్తారు. అలా గురు శిష్యులు ఇద్దరు పోటీ పడి మరి భరత నాట్యం చేస్తారు. ప్రభావతి మొదటి శిష్యురాలిగా మీనా అవుతుంది. మీనా సరిగ్గా చేస్తే బాలు అవస్థలు పడతాడు. మూమెంట్స్ రాకపోయేసరికి కిందపడతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్