గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: చంద్రముఖిలా మారిన ప్రభావతి.. కొత్త డ్యాన్స్ స్కూల్ ప్రారంభం.. రోహిణికి వేధింపులు-gunde ninda gudi gantalu today episode october 8th 2025 prabhavathi dance school meena balu star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: చంద్రముఖిలా మారిన ప్రభావతి.. కొత్త డ్యాన్స్ స్కూల్ ప్రారంభం.. రోహిణికి వేధింపులు

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: చంద్రముఖిలా మారిన ప్రభావతి.. కొత్త డ్యాన్స్ స్కూల్ ప్రారంభం.. రోహిణికి వేధింపులు

Hari Prasad S HT Telugu

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ లో ప్రభావతి చంద్రముఖిలా మారడం, కొత్త డ్యాన్స్ స్కూల్ పెట్టడంలాంటి ఇంట్రెస్టింగ్ సీన్లు కనిపించాయి. అటు శివ, గుణలకు మీనా క్లాస్ పీకడం, రోహిణిని దినేష్ మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం కూడా చూడొచ్చు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: చంద్రముఖిలా మారిన ప్రభావతి.. కొత్త డ్యాన్స్ స్కూల్ ప్రారంభం.. రోహిణికి వేధింపులు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 527వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు తనపై చూపించిన ప్రేమకు మీనా పొంగిపోవడం, అటు తమ జోలికి రావద్దని శివ, గుణలకు క్లాస్ పీకడం.. ఇటు రోహిణిని దినేష్ మళ్లీ వేధించడం చూడొచ్చు. చివరికి చంద్రముఖిలా మారిన ప్రభావతి కొత్త డ్యాన్స్ స్కూల్ పెట్టడమనే ట్విస్ట్ అదిరిపోయింది.

ప్రభావతికి క్లాస్ పీకిన మీనా.. మనోజ్‌కు బాలు క్లాస్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ అత్త ప్రభావతికి మీనా క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. అసలు విషయం తెలియకుండా పని తప్పించుకోవడానికి వెళ్లి రాత్రికి వచ్చిందని అనడంతో మీనా సీరియస్ అవుతుంది. పని చేయడానికే వెళ్లానంటూ రూ.3 వేలు చూపిస్తుంది. ఇప్పటికైనా మీనాను అర్థం చేసుకోమంటూ కామాక్షి కూడా ప్రభావతికి చెబుతుంది.

అటు మనోజ్ అంతా టైమ్ వేస్ట్ అని అనడంతో బాలు జోక్యం చేసుకుంటాడు. ఒకప్పుడు నీ పెళ్లాం ఇలాగే వెళ్తే నేను, మీనానే రోజంతా వెతికాం.. కడుపుకు అన్నం తింటున్నవాడిలా మాట్లాడు అంటూ క్లాస్ పీకుతాడు. ప్రభావతి కొడుకువి కదా ఇంతకంటే ఏం మాట్లాడావంటూ కామాక్షి కూడా మనోజ్ ను తిడతుంది.

అందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి, మనోజ్, రోహిణిలను ఆపి.. మీనా నిలదీస్తుంది. బాలు తనను బలవంతంగా పెళ్లి చేకున్నాడా.. మామయ్య భయానికి కాపురం చేస్తున్నాడా.. తన కోసం రోజంతా ఎలా వెతికాడో చూశారు కదా.. తనంటే ఎంత ప్రేమో చూశారా అంటూ ఆ ముగ్గురికీ క్లాస్ పీకి పంపిస్తుంది.

బాలును ఆటపట్టించిన మీనా.. శివ గురించి చెప్పిన బాలు

మీనా గురించి బాలుకు ఫోన్ చేస్తుంది పార్వతి. ఆమె క్షేమంగానే ఇంటికి వచ్చినట్లు చెప్పి పెట్టేస్తాడు. ఆ తర్వాత రాత్రికి బాలును మీనా ఆటపట్టిస్తుంది. నాకోసం ఏడ్చారట.. కాస్త ముందు వచ్చి ఉంటే నేనూ చూసేదానిని అని అంటుంది. తానేమీ ఏడవలేదని బాలు కవర్ చేసుకుంటాడు. తనకోసం ఎక్కడెక్కడ వెతికారని అడుగుతుంది. పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లానని అంటాడు.

అక్కడ మరొకటి జరిగింది.. మీ తమ్ముడు వచ్చి నాపై ఫిర్యాదు చేశాడు.. మా అక్కను ఇతడు చంపేశాడు అని అన్నాడు అని మీనాతో అంటాడు బాలు. వాడికి ఇప్పుడే ఫోన్ చేస్తానని మీనా అనగానే వాడిని ఎవరో రెచ్చగొట్టి పంపి ఉంటారులే అని బాలు ఆపుతాడు. ఆ తర్వాత తన తలలో మల్లెపూలు పెట్టాలని బాలుకు చెబుతుంది మీనా.

శివ, గుణలకు క్లాస్ పీకిన మీనా.. శివను రెచ్చగొట్టిన గుణ

అటు గుణ దగ్గరికి శివ వెళ్తాడు. మీ అక్క వచ్చేసిందటగా అని గుణ అడుగుతాడు. అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. గుణతో శివ ఉండటం చూసి ఇద్దరికీ కలిపి ఒకేసారి క్లాస్ పీకుతుంది. నువ్వు రెచ్చగొట్టి శివను పోలీస్ స్టేషన్ కు పంపించావని తెలుసని గుణతో అంటుంది. గుణకు సంబంధం లేదని శివ చెప్పినా వినదు. బాలు తనకోసం ఎంత వెతికాడో, తనపై ఎంత ప్రేమ చూపించాడో చెబుతుంది.

ఇప్పటికైనా తమ జోలికి రావద్దని వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కూడా శివను గుణ రెచ్చగొడతాడు. ఇక నుంచి బాలును వదిలేయాలని, వాళ్ల జోలికి తాను కూడా వెళ్లనని శివ అంటాడు. మొదట రెచ్చగొట్టినట్లు మాట్లాడినా తర్వాత గుణ కూడా సరే అంటాడు.

రోహిణిని మళ్లీ వేధించిన దినేష్

అటు ఫర్నీచర్ షాపులో ఉన్న రోహిణి దగ్గరికి దినేష్ మళ్లీ వస్తాడు. అంతకుముందే మనోజ్ బయటకు వెళ్తాడు. తనకు డబ్బు కావాలని రోహిణిని డిమాండ్ చేస్తాడు. మొన్నే కదా రూ.లక్ష ఇచ్చానని రోహిణి అంటుంది. ఇప్పుడు తన దగ్గర డబ్బు లేదని అనడంతో అయితే ఫర్నీచర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. దీంతో చేసేది లేక సరే అంటూ అతడు అడిగిన ఫర్నీచర్ మొత్తం ఇచ్చి పంపిస్తుంది.

అప్పుడే షాపులోకి వచ్చిన మనోజ్ ఇంతలోనే అంత బిజినెస్ చేశావా.. రూ.2, 3 లక్షలు వచ్చి ఉంటాయి కదా.. ఆ డబ్బు ఎక్కడ అని రోహిణిని అడుగుతాడు. అయితే వాళ్లు తెలిసిన వాళ్లు కావడంతో ఈఎంఐలో తీసుకున్నారని రోహిణి చెప్పడంతో మనోజ్ మండిపడతాడు. ఇద్దరి మధ్యా కాసేపు మాటామాటా జరిగిన తర్వాత రోహిణి వెళ్లిపోతుంది. తర్వాత విద్యకు ఫోన్ చేసి దినేష్ గురించి చెబుతుంది.

ప్రభావతి డ్యాన్స్ క్లాస్

అసలు సిసలు ట్విస్ట్ చివర్లో ఇచ్చారు. ప్రభావతి చంద్రముఖిలా మారడం చూపించారు. ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ అంటూ ఆమె ఓ క్లాసికల్ డ్యాన్సర్ రూపంలో కనిపించి ఆశ్చర్య పరిచింది. ఎపిసోడ్ చివర్లో ఆమె కొత్త డ్యాన్స్ స్కూల్ ప్రారంభిస్తున్నట్లు చూపించడం ఆసక్తి రేపింది. అయితే స్కూల్ ప్రారంభోత్సవం సమయంలోనూ మీనాకు అవమానమే జరుగుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం