గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఈ ఊరివాళ్లను నమ్ముకుని డ్యాన్స్ స్కూల్ పెట్టుకున్నందుకు నాది బుద్ధి తక్కువ అని ప్రభావతి వెళ్లిపోతుంటే.. కనీసం టిఫిన్ అయిన తినండి అని మీనా అంటుంది. ఏమొద్దు. నువ్వే నూనే పోసి వత్తి పెట్టావ్‌గా ఇలా జరగాల్సిందే అని ప్రభావతి వెళ్లిపోతుంది. కోపంలో అన్నది ఫీల్ అవ్వకు అని సత్యం వెళ్తాడు.
ఈ విషయం మనం ఏం చేయగలం అని మీనా అంటుంది.. నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక రాయి వేసి చూద్దాం అని బాలు అంటాడు. మరుసటి రోజు ఉదయం ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌లో ఈగలు తోలుకుంటూ ఉంటే కామాక్షి వచ్చి సెటైర్లు వేస్తుంది. నేను చీటి పాడేవారికి చెప్పాను. వారిని ముగ్గురికి చెప్పమని చెప్పాను. పొద్దున ఒక బ్యాచ్, రాత్రి ఒక బ్యాచ్‌ను పిలవొచ్చు అని కామాక్షి అంటుంది.
ఇంతలో మీనా, బాలు తాంబూలం తీసుకుని వస్తారు. వీళ్లను పంపించేయ్. నన్ను ఎగతాళి చేయడానికే వచ్చారు అని ప్రభావతి అరుస్తుంది. గురువు గారు మేము నిజంగానే నాట్యం నేర్చుకుందామని వచ్చాం. శిశ్యులు లేరని మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు. అందుకే మీకు శిష్యులుగా వచ్చామని మీనా అంటుంది. ప్రభావతి ఏదోటి అనబోతుంటే.. ఆగు వదినా నీ బాధ చూడలేక నీ కొడుకు కోడలు నీకు శిశ్యులుగా వచ్చారు. నువ్వు తీసుకునే ఫీజు రెండు వేలు తీసుకొచ్చారు. ఇది శుభ శకునంలా ఉందని కామాక్షి అంటుంది.
డ్యాన్స్ అంటే పూలు కట్టడం కాదని ప్రభావతి అంటుంది. అలా కాదు గురువావతి అని బాలు అంటాడు. అలా అనొద్దు గురువు గారే అనాలి. మీరు కూడా నేర్చుకొనేటప్పుడు ఏం రాదుగా అని మీనా అంటుంది. రెండో రోజే దుకాణం కట్టేయాల్సి వస్తుంది నీ ఇష్టం అని కామాక్షి అంటుంది. దాంతో ప్రభావతి ఒప్పుకుంటుంది. నటరాజ స్వామికి ప్రార్థన చేయమని చూపిస్తుంది ప్రభావతి.
బాలు వింతగా చేస్తూ నవ్విస్తాడు. దీన్ని భరత నాట్యం అంటారా అని ప్రభావతి చిరాకుపడుతుంది. భర్త నాట్యం అంటారా బాలు అంటాడు. మీరు నేర్పించండి ముందు అని మీనా అంటుంది. రేయ్ నువ్వు పక్కకు వెళ్లు. నువ్వు రావే అని మీనాను చేయమంటుంది ప్రభావతి. మీనా భరత నాట్యం చేస్తుంది. తర్వాత ప్రభావతి చేస్తుంది. కన్నులతో చూసేది అనే పాటకు అత్తాకోడలు ఇద్దరు పోటీ పడి మరి భరతనాట్యం చేస్తారు.
ప్రభావతి చేస్తూ చేస్తూ చివరికి మెడ పట్టేసుకుంటుంది. మెడ తిప్పలేను అంటూ ప్రభావతి నొప్పితో కేకలు పెడుతుంది. ఇన్నాళ్లు పని చెప్పకుండా చేశావ్. నరాలు ఎక్కడెక్కడి పట్టేశాయి. ఇలా జరిగినప్పుడు నూనేతో మర్దన చేస్తారు. ఆవిడకు కాల్ చేసి నేను రమ్మంటాను. మీరు వెళ్లండి అని కామాక్షి చెబుతుంది. దాంతో ప్రభావతిను కారులో తీసుకొస్తారు.
కుడి చేయి చాచుకుని ఉండటంతో పరువు పోతుందని ప్రభావతి అంటుంది. దాంతో రెండు దుప్పట్లతో ప్రభావతి కనిపించకుండా కవర్ చేస్తూ ఇంట్లోకి తీసుకెళ్తారు బాలు, మీనా. సత్యం చూసి ఏమైందిరా అని అడుగుతారు. శిల్పంలా మారిపోయారని బాలు అంటే.. డ్యాన్స్ చేస్తుంటే మెడ పట్టేసిందని మీనా చెబుతుంది. అహంకారం ఎలాంటి శిక్ష వేస్తుందో చూశావా అని సత్యం అంటాడు.
ఇంతలో మంత్రసానిని కామాక్షి తీసుకొస్తుంది. ప్రభావతిని లోపలికి తీసుకెళ్లి వైద్యం చేస్తుంది మంత్రసాని. ప్రభావతి నొప్పితో అరుస్తుంటుంది. కాసేపటికి అంతా కిందకు వస్తారు. ప్రభావతి కూడా కిందకు వస్తుంది. అయితే, అప్పటివరకు కుడివైపు ఉన్న ప్రభావతి మెడ ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. వైద్యం వికటిస్తుంది. రేపు వచ్చి మళ్లీ వైద్యం చేస్తానని మంత్రసాని వెళ్లిపోతుంది.
మీనా నువ్ కావాలనే వచ్చి చేరావుగా. నీ వల్లే నా మెడ పట్టేసిందని ప్రభావతి అంటుంది. దాంతో ప్రభావతిని సత్యం, శ్రుతి తప్పుబడతారు. బాలు, మీనా ఇద్దరు దీని గురించి మాట్లాడుకుంటారు. నువ్ డ్యాన్స్ మధ్యలో ఆపాల్సింది. మెడ పట్టేసేవరకు ఎందుకు చేశావ్. అది నా ప్లాన్‌లో లేదని బాలు అంటాడు. మీరు కూడా మీ అమ్మనే వెనుకేసుకురండి అని మీనా అలుగుతుంది.
తర్వాత మనోజ్ షాప్‌కు రోహిణి మలేషియా మావయ్యగా నాటకం ఆడిన మటన్ కొట్టు మాణిక్యం పరుగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడికెందుకు వచ్చావని రోహిణి అడిగితే.. మీనా చూసేసింది. ఇక్కడికే వస్తుందని మాణిక్యం చెబుతాడు. ఇంతలో మీనా వస్తుంది. అప్పుడే రాజేష్‌కు బీరువా కోసం బాలు వస్తాడు.
మనోజ్ చూపించిన బీరువాలోనే మాణిక్యం దాక్కుని ఉంటాడు. అందులోనే మాణిక్యం ఉన్నాడని రోహిణికి విద్య చెబుతుంది. దాంతో రోహిణి షాక్ అయి వెళ్లి బీరువా పట్టుకుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్