గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తన ఇంట్లో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ పెట్టుకోడానికి కామాక్షి ఒప్పుకుంటుంది. రోహిణి మాటలు వింటుంటే నువ్వు గొప్ప డ్యాన్స్ మాస్టర్‌వి అయిపోయి లక్షలు సంపాదిస్తావని అనిపిస్తోందని కామాక్షి అంటుంది. కామాక్షి థ్యాంక్యూ అని సిగ్గుపడుతూ చెబుతుంది ప్రభావతి.
తర్వాత ఇంటికి సత్యం వస్తాడు. మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. అత్తయ్యను కొత్తగా చూడబోతున్నారు అని మీనా అంటే.. పాత పెళ్లాన్ని కొత్తగా చూస్తానా అని సత్యం అంటాడు. అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారు అని మీనా చెప్పేసరికి సత్యం ఉలిక్కిపడతాడు. నాట్య గురువు అయి భరతనాట్యం నేర్పిస్తారట. కామాక్షి ఇంట్లో డ్యాన్స్ స్కూల్ పెడతారంటా. అత్తయ్య డ్యాన్స్ బాగా చేస్తారు అని మీనా చెబుతుంది.
ఇలాంటి వయసులో ఇలాంటి భయానక దృశ్యాలని చూడాలని రాసి పెట్టుంటే తప్పుద్దా అని సత్యం అంటాడు. ఇంతలో వచ్చిన బాలుకు ప్రభావతి డ్యాన్స్ స్కూల్ గురించి చెబుతారు. ఇంతలో రవి, శ్రుతి వస్తారు. కాసేపట్లో మీరంతా భూతాన్ని చూడబోతున్నారు అని సత్యం అంటాడు. అంతా ప్రభావతి గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో ప్రభావతి గజ్జెల చప్పుడు చేస్తుంది.
దానికి పగటిపూట కూడా దెయ్యాలు ఉంటాయా అని బాలు, రవి భయపడతారు. అది మీ అమ్మరా అని సత్యం చెబుతాడు. ప్రభావతి కిందకు వస్తుంది. క్లాసికల్ డ్రెస్సులో ప్రభావతి వస్తుంటే భర్త, కొడుకులు భయపడతారు. ఎంత బాగున్నారో అని మీనా అంటుంది. నాట్య మయూరిలా అటు ఇటు తిరుగుతుంది ప్రభావతి. అమ్మా.. అమ్మోరా అని రవి అంటాడు.
ఇదే నా నిజ స్వరూపం. ఇదే నాలోని నాట్యం. నాట్యం నా ఆశ. ఇది నా జీవితంలో ప్రారంభించే వెర్షన్ 2.0 అని ప్రభావతి అంటుంది. ఆంటీ అంటూ హగ్ చేసుకున్న శ్రుతి మీరు ఈ డ్రెస్సులో జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిలా ఉన్నారు అని అంటుంది. దానికి పిచ్చోడిలా చేస్తాడు సత్యం. తర్వాత ప్రభావతి భరత నాట్యం చేస్తుంది. మీలో ఇంత ఆర్ట్ ఉందని చెప్పలేదేంటీ అని శ్రుతి అంటుంది.
పెళ్లి పేరుతో నాలోని నాట్యాన్ని తొక్కేసారు. ఇక నుంచి లోకమే చూడబోతుంది అని ప్రభావతి అంటుంది. అదో శాపం. పాపం పసిపిల్లలు దడుసుకుంటారేమో అని సత్యం అంటాడు. దాంతో భద్రకాళిలా త్రిశూలం పట్టుకున్నట్లు గురి పెడుతుంది ప్రభావతి. పరాశక్తి అంటూ బీజీఎమ్ వస్తుంది. బాలు గడ్డకట్టుకుపోతాడు. రవి, సత్యం తేరుకునేలా చేస్తారు.
ప్రభావతికి మీనా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ప్రభావతికి ఫొటోషూట్ చేస్తుంది రోహిణి. ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ అని స్కూల్ స్టార్ట్ చేస్తారు. నాట్య శిరోమణి అని రాసి ఉంటుంది. ప్రభావతి మురిసిపోతుంటుంది. ఎవరు రాకుంటే ఈ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని సత్యం అంటాడు. అత్తయ్య లక్ష్యం కోసం పెట్టారు అని రోహిణి అంటే.. కాదు లక్షల కోసం అని బాలు అంటాడు.
నాన్నతో రిబ్బన్ కటింగ్ చేపిద్దామని బాలు అంటే.. నేను చేయను. ముసలమ్మ ఏదో డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటానంటే ఒప్పుకున్నాను అని సత్యం అంటాడు. దాంతో ప్రభావతి ఫీల్ అవుతుంది. ఆంటీకి తక్కువ అమ్మాయికి ఎక్కువ అంటుంది. ముందు జ్యోతి ప్రజ్వలన చేయాలి అని ప్రభావతి అంటుంది. శ్రుతిని వెలిగించమంటుంది ప్రభావతి.
ఈ డ్యాన్స్ స్కూల్ ఐడియా నేనిస్తే శ్రుతిని పిలుస్తుంది. ఎంత పార్శాలిటో చూశావా అని మనోజ్‌తో చెప్పుకుంటూ అసూయ పడుతుంది రోహిణి. రెండే ఒత్తిని వెలిగించమని ప్రభావతి చెబుతుంది. ముందు అలిగిన రోహిణి తర్వాత వెళ్లి వెలిగిస్తుంది. మీనాను పిలువు అని కామాక్షి అంటే.. ఇక్కడున్నవి రెండే ఒత్తులు అని ప్రభావతి అంటుంది. మూడో ఒత్తి వేస్తే ఏమవుతుంది అని సత్యం అంటాడు.
ఒకటి తీసి వేయాలి అలా ఏం వద్దు. డబ్బున్న కోడళ్లకోసం రెండు ఒత్తులు మాత్రమే పెట్టి నా భార్యను తక్కువ చేస్తావా. నీ స్కూల్ వద్దు. వెళ్లిపోదాం పదా అని బాలు అంటాడు. మీనా ఆపుతుంది. నేనే అన్ని చేశాను. వెలిగించకుంటే ఏంటీ అని మీనా అంటుంది. మూడు ఒత్తులు వేశావుగా రెండే ఉన్నాయి. మూడోది మీ అత్త మింగిందా అని కామాక్షి అంటుంది.
అవును ఆకలేసి మింగా అని ప్రభావతి అంటుంది. అయితే రిబ్బన్ మీనాతో కట్ చేయించాలని బాలు డిమాండ్ చేస్తాడు. అందరికి మైనస్‌లే ఉన్నాయి. మీనానే గొప్ప అని బాలు అంటాడు.
కరెక్టే మీనాతో చేయిస్తే మంచి జరుగుతుందని సత్యం అంటాడు. నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది. తర్వాత ప్రభావతితో పాటు మీనా కూడా భరత నాట్యం డ్యాన్స్ చేస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం