గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: ఇంటి పైన భార్య బాధితుల్లా అన్నదమ్ములు, సరదా నవ్వులు- హాల్లో తోడికోడళ్ల ముచ్చట్లు!-gunde ninda gudi gantalu today episode may 19th 2025 balu manoj ravi on meena rohini shruthi star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: ఇంటి పైన భార్య బాధితుల్లా అన్నదమ్ములు, సరదా నవ్వులు- హాల్లో తోడికోడళ్ల ముచ్చట్లు!

గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: ఇంటి పైన భార్య బాధితుల్లా అన్నదమ్ములు, సరదా నవ్వులు- హాల్లో తోడికోడళ్ల ముచ్చట్లు!

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు మే 19 ఎపిసోడ్‌లో బాలుపై సత్యం కోప్పడతాడు. మీనా కూడా బాలును అంటుంది. ఇక మరోవైపు రవితో శ్రుతి టూర్ గొడవ పెట్టుకుంటుంది. దాంతో ఇంటిపైన అన్నదమ్ములు ముగ్గురు వెళ్తారు. సరదాగా ముచ్చట్లు పెడతారు. కింద హాల్లో టీ తాగుతూ తోడికోడళ్లంతా కలిసి మీటింగ్ పెట్టుకుంటారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 19 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన బాలును సత్యం నిలదీస్తాడు. అత్తింటికి వెళ్లి నువ్ చేసిందేంటీ. అక్కడ జరుగుతున్న కార్యం ఏంటీ, నువ్ చేసిందేంటీ అని సత్యం అంటాడు. అక్కడ ఈ ప్రభావతమ్మా, పార్లరమ్మ లాంటివాళ్లను పోగేసి పెట్టారు. నన్ను తల ఓ మాట అన్నారు. ఇంటికి పిలిచి అవమానిస్తే నేనేందుకు ఊరుకుంటాను అని బాలు అంటాడు.

అంతా చెడగొట్టి వచ్చారు

అంటార్రా. తండ్రి లేడు, తల్లి కష్టపడుతుంది. కొడుకుల చూసుకోవాల్సిన అల్లుడు కష్టం తీసుకొస్తే నాలుగు మాటలు అంటారు అని సత్యం అంటాడు. మాకెవరు ఉన్నారు. ఆ చుట్టూ పక్కల వాళ్లే బంధువులు. శివకు చేయి బాగోలేక మా నాన్నకు దీపం కూడా పెట్టుకోలేకపోయాడు. అంతా చెడగొట్టి వచ్చారు. మేము బాగుంటేనే కదా మా నాన్న ఆత్మకు శాంతి. ఎవరు తినలేదు. ఎవరి మనసు ప్రశాంతంగా లేదు. ఏంటీ కోపం, ఎందుకీ పగ. నా కుటుంబం మీద ఎందుకింత కక్ష చూపిస్తున్నారు అని మీనా ఏడుస్తూ అంటుంది.

ఇలా మూర్ఖంగా మారవేంట్రా. ఇష్టంలేకపోతే ముద్ద తిని రావాల్సి వచ్చింది. తెలిసి కూడా రౌడీలా ప్రవర్తించి వస్తావా. నా ఇంటి కోడలిని కంటతడి పెట్టిస్తావా. నువ్ చేసేది ఎందుకో అంతు పట్టడం లేదు. వెళ్లిందే కాక మళ్లీ వాడిని కొట్టొచ్చావ్. తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావ్. నీ మొహం కూడా నాకు చూపించకురా అని సత్యం వెళ్లిపోతాడు. మీనా ఏడుస్తుంటే ప్రభావతి మాత్రం సంతోషిస్తుంది.

మీనా, బాలు వెళ్లిపోతారు. అత్తయ్య బాలుకు ఆ ఇంటిమీద ఎందుకింత కోపం వచ్చిందో తెలియట్లేదు అని రోహిణి అంటుంది. ఏదో బలమైన కారణం ఉంది. అది ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది అని ప్రభావతి అంటుంది. వెళ్లి మీనా దగ్గరికి వెళ్లి నాన్నకు ఎందుకు చెప్పావ్. నన్నెందుకు చెడు చేస్తున్నావ్. ఆయన నా మొహం చూడనంటున్నారు అని బాలు అంటాడు.

కుటుంబం జోలికి రాకండి

నా చేయి కూడా విరగొడతారా. అందరు అయిపోయారు. ఇప్పుడు మా కుటుంబం మీద పడ్డారు. మీకు ఆవేశం వస్తే తమ్ముడు, అన్న, వదినా, అమ్మ అని ఏది చూడరు. మీరు ఒక్కరే ధర్మం పాటిస్తున్నట్లు. మా కష్టాలు మాకున్నాయి. ఇంకొకసారి నా కుటుంబం జోలికి రాకండి అని మీనా అంటుంది. నాకు కూడా కష్టాలున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి అని బాలు అంటాడు.

మీకేం కష్టాలున్నాయి. మా నాన్న సంవత్సరీకం జరగకుండా చేశారు. మీరు మాట్లాడకండి కష్టాల గురించి అని మీనా అంటుంది. నేను అందరి మంచి కోరడమే తప్పు అయిపోయింది. మీరంతా గొప్పవాళ్లు నేను ఒక్కన్నే చెడ్డవాన్ని. పర్వాలేదు. కొత్తగా నాకు పోయిందేమి లేదు. చిన్నప్పటి నుంచి నేను ఎవరికి అర్థం కాలేదు. నీకు మాత్రం ఏం అర్థమవుతాను అని బాలు అంటాడు. దాంతో బాధగా, కోపంగా కిచెన్‌లోని గిన్నెలు ఎత్తేస్తుంది మీనా.

ఆ సౌండ్ విని ఈ గొడవ ముదిరితే ఇది పుట్టింటికి పోవడం ఖాయం. కానీ, అంతకంటే ముందే ఆ పూలకొట్టు తీయించాలి అని ప్రభావతి సంతోషిస్తుంది. రవి దగ్గరికి వెళ్లి తన తల్లి వచ్చిందని శ్రుతి చెబుతుంది. సైకిల్‌పై వెళ్లడం చూసి పరామర్శించడానికి వచ్చింది. వచ్చి ఇవి ఇచ్చింది. నాలుగు రోజులు హాలీడేస్ ట్రిప్. ఇద్దరం జాలీగా ఎంజాయ్ చేయడానికి అని శ్రుతి అంటుంది.

లీవ్ పెట్టలేను

నాకు కుదరదు. ఇప్పుడిప్పుడే రెస్టారెంట్ బాగా రన్ అవుతుంది. నన్ను నమ్మి మా ఓనర్ నాకు చాలా పనులు అప్పజెప్పారు. నాలుగు రోజులు లీవ్ పెట్టలేను. నాలుగు గంటలు కూడా రాలేను. నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్లలేను అని ఇలా ఇచ్చారా అని రవి అంటాడు. అలా ఏం అనలేదు. పాజిటివ్‌గా ఆలోచించు. ఎక్కడికి వెళ్లలేదు కదా అని ఇచ్చారు అని శ్రుతి అంటుంది.

ఇద్దరు గొడవ పడతారు. నాలుగు రోజుల ట్రిప్‌కు ఏడాది ముందు ప్లాన్ చేసుకోవాలా. సిల్లీ రీజన్స్ చెబుతావేంటీ అని శ్రుతి అంటుంది. నాకు రావాలని లేదు. నీకు అంతలా ఉంటే నువ్వు వెళ్లి ఫ్రీగా అని రవి వెళ్లిపోతాడు. మరోవైపు పైన బాలు పడుకుంటాడు. అక్కడికి మనోజ్ కూడా వస్తాడు. దాంతో నీకేమైంది. పార్లరమ్మా గెంటేసిందా అని బాలు అడుగుతాడు. చాలా వేడిగా ఉందని మనోజ్ అంటాడు.

ఇద్దరు పడుకోడానికి గొడవ పడుతారు. ఇంతలో రవి వస్తాడు. లేచిపోయినోడు చాప లేపుకుని వస్తున్నాడు అని రవి అంటాడు. భార్యలతో ముగ్గురు గొడవలు పడింది మాట్లాడుకుంటారు. దాంతో ముగ్గురు అన్నదమ్ములు పైన పడుకోడానికి వచ్చి సరదాగా మాట్లాడుకుంటారు. అన్ని విషయాల్లో మన మెంటాల్టీ వేరే అయిన ఈ ఒక్క విషయంలో మాత్రం కామన్ కష్టం వచ్చిందని రవి అంటాడు.

చిన్నప్పటి జ్ఞాపకాలు

భార్య బాధితుల్లా అన్నదమ్ములు మాట్లాడుకుంటారు. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఇలాంటి టైమ్‌లో మందు తాగుతావ్ కదరా అని మనోజ్ అంటే.. వద్దులేరా నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మందు కొట్టొద్దు భార్యను కొట్టాలి అని బాలు అంటాడు. ఆడవాళ్లను కొట్టడం సంస్కారం కాదు అని మనోజ్ అంటాడు. ఊరికే అన్నాలేరా మీనాను కొట్టొద్దు అని బామ్మ చెప్పిందని బాలు అంటాడు.

శ్రుతికి కరాటే వచ్చని రవి చెబుతే నవ్వుతారు. మీనా ఇటుకతొ కొడుతుందని బాలు అంటే మనోజ్ నవ్వుతాడు. దాంతో మనోజ్‌కు కితకితలు పెడతారు బాలు, రవి. మరోవైపు మీనా దగ్గరికి శ్రుతి వెళ్తుంది. బాలు, రవి పైన పడుకోవడం గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో రోహిణి కూడా వస్తుంది. ముగ్గురు భర్తలు పైన పడుకున్నారని అనుకుంటారు. ముగ్గురు మూర్ఖుల్లా తయారయ్యారన్నమాట అని శ్రుతి అంటుంది.

కింద హాల్లో కూర్చుని మీనా, రోహిణి, శ్రుతి టీ తాగుతుంటారు. మనోజ్ గొడవ పడటం ఏంటీ అని శ్రతి అంటే.. భర్తలు అయితే చాలు అని రోహిణి అంటుంది. తమకు తెలియకుండానే భర్తలను వెనుకేసుకొస్తాం అని అనుకుంటారు. రవి చాలా సాఫ్ట్ కదా ఎందుకు గొడవలు అవుతున్నాయని మీనా అడిగితే.. వాడు పైకి కనపడని మరో బాలు అని శ్రుతి అంటుంది.

ఒకే రక్తం కదా

అయితే, బాలు ముగ్గురులోను ఉన్నాడన్నమాట అని రోహిణి అంటుంది. అందరిది ఒకే రక్తం కదా అని మీనా అంటుంది. మగవాళ్లంతా ఇంతే అనుకుంటారు. పెళ్లికి ముందు మీనా వేరు మాట పడేది కాదని చెబుతుంది. పెళ్లికి ముందు ఎలా ఉండేవాళ్లో చెప్పుకుంటారు. ఇలా మనం మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా బాగుంది. మనలో బాండింగ్ పెరుగుతుంది అని శ్రుతి అంటుంది.

ఇప్పుడు వాళ్లు పైన బాధపడుతుంటారంటావా అని శ్రుతి అంటే.. పై నుంచి బాగా నవ్వుతున్న సౌండ్స్ వినిపిస్తాయి. దుర్మార్గులు ఎలా నవ్వుతున్నారో చూడు అని రోహిణి అంటుంది. రేపు చూపిస్తా ఈ నవ్వులన్నీ మాయం చేస్తా. మీరు కూడా ఆడుకోండి అని శ్రుతి అంటుంది. తర్వాత బయట కారు లేదు ఏమైందని సత్యం అడుగుతాడు. రాజేష్ వాడి కారు రిపేర్‌కు ఇచ్చాడు. నాకు ఖాలీ దొరికితే తీసుకెళ్తున్నాడు అని బాలు చెబుతాడు.

వాడు ఏదో దాస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. ఫోన్‌ను కోపంగా విసిరేసి బాత్రూమ్‌కు వెళ్తాడు. అది చూసిన మీనా ఏముందీ ఈ ఫోన్‌లో. చూస్తూ ఆవేశం తెచ్చుకున్నాడు అని ఫోన్ చూస్తుంది మీనా. ఇంతలో వచ్చిన బాలు మీనా ఫోన్ చూడటం చూసి షాక్ అవుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం