గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజేష్ తన ఫ్రెండ్స్‌తో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గుణ వస్తాడు. నేను ఇప్పుడు వచ్చింది అసలు కోసం. మిమ్మల్ని వడ్డి అడిగితే మనుషులను పెట్టి కొట్టిస్తున్నారుగా. మీతో వ్యాపారం చేయలేను. అందుకే, అసలు వడ్డీ చెల్లించండి అని గుణ అంటాడు.
ఇంత సడెన్‌గా అడిగితే ఎలా అని రాజేష్ అంటాడు. సడెన్‌గా ఏం కాదు 24 గంటల టైమ్ ఇస్తున్నా. ఒక్కరోజులో అసలు ఇవ్వండి. లేకుంటే మీ కారులు తీసుకెళ్తా. నా డబ్బులు నాకు కావాలి. లేదా మీ కారులు కావాలి. మీరో ఆలోచించుకోండి. మీ ఆబద్భాందవుడు ఉన్నాడుగా. వాడికి చెప్పుకోండి అని గుణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఛ.. బాలు గాడు ఏంట్రా ఇలా తయారైంది అని ఒకతను అంటాడు.
వాడు ఏం చేశాడురా. గుణను వాడు ఎందుకు కొట్టాడో తెలిసుగా. మళ్లీ వాడిని అంటారేంట్రా అని రాజేష్ అంటాడు. 50 వేలు, లక్ష ఇప్పటికిప్పుడు ఎలా కడతాం అని అంటారు. బాలు గాడి కోపానికి మనం బలి అవుతున్నాం. ఈరోజు కొంచెం ఓపిక పట్టాల్సిందిరా. లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఇంకొకరు అంటారు. మరోవైపు శ్రుతితో రెస్టారెంట్‌లో పార్టీ చేస్తున్నారని. లేట్ అవుతుందని రవి అంటాడు.
అయితే, మనం పార్టీస్ చేసుకోవద్దా అని శ్రుతి అంటాడు. బర్త్ డేస్ కాదుగా అని రవి అంటాడు. నిన్ను అని శ్రుతి ఒక్కసారిగా రవి మీద పడిపోతుంది. ఇవా మనం తొలిసారిగా కలిసిన రోజు. ఏడాది అవుతుందన శ్రుతి చెబుతుంది. రవిపై పడుకుని తమ లైఫ్‌లో గుర్తున్న డేట్స్ అన్ని చెబుతుంది శ్రుతి. తర్వాత పెళ్లి అయ్యాక నువ్వు అన్ని మర్చిపోతున్నావ్. నా మీద ప్రేమ పోయింది. నేను బోర్ కొట్టేశానా అని శ్రుతి అంటుంది.
డేట్ మర్చిపోతే బోర్ కొట్టేసినట్లా, ప్రేమ లేనట్లా అని రవి అంటాడు. ఇప్పుడు ప్రూవ్ చేస్తానని చెప్పి సత్యం దగ్గరికి తీసుకెళ్తుంది శ్రుతి. మిమ్మల్ని ఒకటి అడగాలి అంకుల్. మీరు ఆంటీని ఫస్ట్ టైమ్ ఎప్పుడు చూశారు అని అడుగుతుంది శ్రుతి. వాళ్లకు పెళ్లి అయి 30 ఏళ్లు అవుతుంది. ఎలా గుర్తుంటుంది అని రవి అంటాడు. గుర్తుందిరా అని సత్యం అంటే.. హా ఏం గుర్తుంటుంది. నాకు నిన్నటిదే గుర్తుండదు అని ప్రభావతి అంటుంది.
రవి నువ్ మీ అమ్మ క్యాటగిరీనే. నీకు అమ్మ బుద్ధులే వచ్చాయి. మీరు చెప్పండి అంకుల్ అని శ్రుతి అంటుంది. 1992 మార్చి 1 ఉదయం పది గంటల టైమ్‌లో అని సత్యం అంటాడు. దాంతో రవి నోరెళ్లబెడతాడు. చూశావా అంకుల్ ఇయర్ కాదు డేట్ టైమ్ కూడా గుర్తుపెట్టుకున్నారు అని శ్రుతి అంటుంది. అంత షార్‌పుగా ఎలా ఉన్నావ్ నాన్న అని రవి అంటాడు.
ఆ రోజు పెళ్లి చూపులకోసమని వాళ్ల ఇంటికి వెళ్లాను. చిలుక పచ్చ చీర, దానికి మ్యాచింగ్ గాజులు, తలనిండా మల్లెపూలు, చెవులకు చిన్న జంకీలు పెట్టుకుంది అని సత్యం అంటాడు. దాంతో ప్రభావతి కూడా మురిసిపోతుంది. చూశావా అది లవ్వంటే.. మీరు నిజంగా గ్రేట్ అంకుల్. ఆంటీ మీరు చాలా లక్కీ అని శ్రుతి అంటుంది. సత్యం, ప్రభావతి ఇద్దరు సిగ్గుపడుతారు.
ఏమో అనుకున్నాను అన్నీ గుర్తున్నాయా అని ప్రభావతి అంటే.. పబ్బీ అని సత్యం అంటే.. పో సత్యం అని ప్రభావతి అంటుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్‌గా ఈ సీన్ ఉంటుంది. తర్వాత రోహిణి, మనోజ్ మొదటిసారి కలుసుకున్న రోజు అడుగుతుంది శ్రుతి. ఏప్రిల్ 1, బ్లూ కలర్ ప్యాంట్ వైట్ షర్ట్ ఫార్మల్స్ అని రోహిణి చెబుతుంది. మరోవైపు సర్వర్ జాబ్ చేయలేకపోతున్నాను. ఇంకేదైనా జాబ్ చేయాలనుకుంటున్నాను అని మనోజ్ ఫోన్‌లో మాట్లాడుతాడు.
ఇంతలో శ్రుతి పిలుస్తుంది. దాంతో మనోజ్ భయపడిపోతాడు. మీరు మొదటిసారి రోహిణిని చూసినప్పుడు ఏం డ్రెస్ వేసుకుంది అని శ్రుతి అంటుంది. దాంతో మనోజ్ చెబుతాడు. అందరికి అన్ని గుర్తున్నాయి. నీకు మాత్రమే లేదు అని శ్రుతి అలుగుతుంది. తర్వాత ఇద్దరు వాదించుకుంటారు. తర్వాత తప్పు ఒప్పుకుంటాడు రవి. ఈవెనింగ్ తర్వగా వచ్చి నీతో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాను అని రవి అంటాడు.
సరే నన్ను తీసుకెళ్లు. బైస్కిల్‌పై అని శ్రుతి అంటుంది. ఇదేం ట్విస్ట్ అని రవి అంటాడు. అంటే, డేట్ మర్చిపోయినందుకు నీకు పనిష్‌మెంట్ ఇవ్వాలిగా అని శ్రుతి అంటుంది. మరోవైపు బాలు వచ్చి ఏమైందిరా అని అడుగుతాడు. గుణ వచ్చి అసలు, వడ్డీ కట్టమని వార్నింగ్ ఇచ్చాడని చెబుతారు. అసలే అధిక వడ్డీ బ్లాంక్ పేపర్‌పై సంతకాలు తీసుకున్నాడు. దానిపై ఏం రాసుకుని ఏం చేస్తాడో అని భయంగా ఉందని అంటారు.
బ్లాంక్ పేపర్స్‌పై సంతకం ఎలా పెట్టారు అని బాలు అంటాడు. బ్లాంక్ పేపర్స్‌పై సంతకం పెట్టడం వల్ల కాదు నీ గొడవ వల్ల జరిగింది. బాలు మంచితనం మనందరిని రోడ్డుపై పడేస్తుంది అని వాళ్లు అంటారు. ఆరోజు నువ్ సహనంగా ఉంటే ఈరోజు టెన్షన్ పడాల్సిన అవసరం మాకుండేది కాదని ఒకతను అంటాడు. ఇప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వస్తాను అని వెళ్తాడు బాలు.
గుణ దగ్గరికి వెళ్తాడు బాలు. అది చూసి కాలు మీద కాలు వేసుకుంటాడు గుణ. నా ఫ్రెండ్స్‌ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్. నా మీద కోపంతో వాళ్లను అసలు కట్టమంటే ఎలా కడతారు. వాళ్లు టైమ్‌కు వడ్డీ కడతారు. అసలు కట్టలేరు అని బాలు అంటే.. అదంతా నీకు అనవసరం అని గుణ అంటాడు. అసలు నీకు ఏం కావాలి అని బాలు అడుగుతాడు.
ఇప్పుడు నీ బండి నా రూట్‌లోకి వచ్చింది. నువ్ అందరి ముందు కొట్టి అవమానించినందుకు ప్రతికారం తీర్చుకోవాలిగా అని గుణ అంటాడు. శివను పాడు చేశావ్. నీతో కలిసి దొంగతనం కూడా చేశాడు. ఆ వీడియో నా దగ్గర ఉంది అని బాలు అంటాడు. ఉంటే ఏం చేస్తావ్. ఆ వీడియో బయటపడితే వాడే ఎక్కువగా ఇరుక్కుంటాడు అని గుణ అంటాడు. వాడు పూర్తిగా దారి తప్పకముందే వదిలేయ్ అని బాలు అంటాడు.
నీ ఫ్రెండ్స్ సంగతి నాకు వదిలేయ్, శివగాడి సంగతి వాడికొదిలేయ్ అని గుణ అంటాడు. రేయ్ అని గట్టిగా అరిచిన బాలు అన్ని చూస్తూ వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావ్. ఆరోజు శివగాడి చేయి విరిగింది. నీ రెండు కాళ్లు విరుగుతాయ్ అని వార్నింగ్ ఇస్తాడు బాలు. నీ వల్ల వాళ్లకు నాపై భయం లేకుండా పోయింది. నన్ను జోకర్‌లా చూస్తున్నారు అని గుణ అంటాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా అని బాలు అంటాడు.
అది నీ చేతుల్లోనే ఉంది. నీ ఫ్రెండ్స్‌ని అంతా అసలు కట్టమను. లేదా నా కాళ్లమీద శివ కాళ్ల మీద పడి నీ ఫ్రెండ్స్ అందరి ముందు క్షమాపణ చెప్పు అని గుణ అంటాడు. దాంతో కోపంగా గుణ కాలర్ పట్టుకుంటాడు బాలు. ఇది నా ఆఫీస్. ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అనవసరంగా జైలుపాలైపోతావ్. చెప్పు మా ఇద్దరి కాళ్లమీద పడి క్షమాపణ చెబుతావా అని గుణ అంటాడు.
కారులు ఎలా లాగేసుకుంటావో నేను చూస్తాను అని బాలు వెళ్లిపోతాడు. వీడు ఇంత ధైర్యంగా అంటున్నాడంటే ఏం చేయబోతున్నాడు అని గుణ అనుకుంటాడు. మరోవైపు రవి, శ్రుతి సైకిల్‌పై వెళ్తుంటారు. పాట పాడమని శ్రుతి అంటే.. దేశభక్తి పాట పాడుతాడు రవి. దాంతో ఆపేయంటుంది శ్రుతి. తర్వాత రవిని రోడ్డుపై సైకిల్ మీద హగ్ చేసుకుంటుంది శ్రుతి. దాంతో రోడ్డుపై వద్దని రవి అంటాడు.
తర్వాత రవిని ఎక్కించుకుని సైకిల్ తొక్కుతుంది శ్రుతి. అది శ్రుతి తల్లిదండ్రులు చూస్తారు. ఇలా వెళ్తున్నారేంటీ అని తల్లి అంటుంది. ఏం అవసరం వచ్చి బైక్ అమ్మేసుకున్నాడో అని తండ్రి అంటాడు. త్వరలో ఆ సైకిల్ కూడా పోయి ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చేస్తుందని అంటాడు. తర్వాత శివను కొట్టినందుకు పార్వతి వాళ్లు బాధపడుతున్న విషయం బాలుతో సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్