గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణిని అత్తయ్య ఏమనలేదేంటి అని మీనా అంటుంది. లోపల కోపాన్ని అణుచుకుంది. కోరి తెచ్చుకున్న కోడలు కదా వెనకేసుకొస్తుంది అని బాలు అంటే ఏమోనండి అని మీనా వెళ్లిపోతుంది. ఛ.. నాన్న అంత నీవల్లే. ఇప్పుడు పార్లరమ్మా ఎలా తప్పించుకుందో. కానీ, అమ్మ సైలెంట్‌గా వెళ్లిందంటే నాకు ఏదో తేడా కొడుతుంది అని బాలు అంటాడు.
ఇన్నాళ్ల నుంచి కాపురం చేస్తున్న నాకే అర్థం కాలేదు మీకేం అర్థమవుతుందిరా అని సత్యం అంటాడు. మరోవైపు గదిలో ప్రభావతి కోపంగా కూర్చుని ఉంటుంది. రోహిణి భయపడుకుంటూ వస్తుంది. తలుపు మూయమని చెబుతుంది ప్రభావతి. నేనే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను అని రోహిణి అంటుంది.
ఎప్పుడు. నీ కళ్లకు ఈ ప్రభావతి వెర్రిదానిలా కనిపిస్తున్నానా. అమాయకురాలిలా నటించకు నాకు చెప్పకుండా ఆ పార్లర్ పేరు మార్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారు. ఆ పార్లర్ నీకు ఎవరు కొనిచ్చారో మర్చిపోయావా. అది నేను నీకు కొనియ్యకుంటే ఇంటింటికి వెళ్లి రంగులు పూసుకునేదానివి. నీ మీద జాలితో పార్లర్ పెట్టిస్తే నా పేరే తీసేంత గొప్పదానివయ్యావా. నేనంటే లెక్కలేనితనమా అని ప్రభావతి అరుస్తుంది.
మంచి డీల్ వచ్చిందని రోహిణి అంటుంది. ఏ కోట్లు రానివ్వు. నాకు చెప్పాలి. నాతోనే చెప్పాలి. దానిమీద పెట్టిన ప్రతి రూపాయి ఇల్లు తాకట్టు పెట్టి ఇప్పించాను. ఎంతోమందితో మాటలు పడి నీకు పార్లర్ పెట్టిస్తే ఇలా చేస్తావా. నా అండ లేకుండా ఈ ఇంట్లో ధైర్యంగా తిరగగలవా అని ప్రభావతి అంటుంది. నిజమే మీరే డబ్బు ఇచ్చారు కానీ నేను మా నాన్నను అడిగి మలేషియా నుంచి డబ్బు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేశాగా అని రోహిణి అంటుంది.
ఏంటే గొంతు లేస్తుంది. మీ నాన్న గొప్పవాడని నిన్ను నెత్తిన పెట్టుకున్నానని అనుకుంటున్నావా. అసలు ఎప్పుడైనా మీ నాన్నను చూపించావా. కనీసం ఎలా ఉంటాడో అయినా తెలుసా. ఎంతమంది అడిగిన సర్ది చెప్పాను. నువ్ మలేషియా పేరు చెబితే తగ్గుతాననుకున్నావా. నేను అన్ని వేళలా ఒకేలా ఉంటాననుకోకు. నా విశ్వరూపం చూపిస్తే మళ్లీ ఇంటికి రావడానికి గడగడ వణికిపోతావ్ అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.
ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు. మీకు ఇచ్చే డబ్బులు ఇస్తున్నానుగా అని రోహిణి అంటుంది. ఏయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ రోహిణి గొంతు పట్టుకుంటుంది ప్రభావతి. నా కొడుకు ఇష్టపడ్డాడని కూతురులా చూసుకుంటే తప్పు చేసి ఎదురు సమాధానం చెబుతున్నావ్. నీ వల్ల పరువంతా పోయింది. పెద్ద కోడలు పరువు పోకూడదని ఇక్కడ అంటున్నాను అని ప్రభావతి అంటుంది.
నా పేరు మీద పార్లర్ ఉందని గొప్పగా చెప్పుకుంటే అందరి ముందు పరువు పోయేలా చేశావ్ అని ప్రభావతి అంటుంది. మీకు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నా అని రోహిణి అంటే.. కొట్టేందుకు చేయి లేపి ఆగిపోతుంది ప్రభావతి. తొక్కలో సర్‌ప్రైజ్. నా పేరు తీసేస్తే అది సర్‌ప్రైజా. షాక్ అయ్యానే అని ప్రభావతి అంటుంది. ఇంకెప్పుడు ఇలా ఏం చేయను ప్లీజ్ అని రోహిణి అంటుంది.
ఇదే లాస్ట్ గుర్తు పెట్టుకో ఇది కాకుండా ఇంకేమైనా దాచావా ఇప్పుడే దాచావా. ఇంకేదైనా దాచావని తెలిస్తే అందరిముందు నీ సంగతి తేలుస్తా జాగ్రత్తా అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది ప్రభావతి. దాంతో కన్నీళ్లు పెట్టుకుంటూ రోహిణి కిందకు దిగుతుంది. వామ్మో పేరు మార్చినందుకే ఇంతలా వణికించేసింది. అదే నాకు ఇంతకుముందు పెళ్లి అయిందని, బాబు కూడా ఉన్నాడని తెలిస్తే అమ్మో చంపి పారేస్తుంది అని భయపడిపోతుంది రోహిణి.
మరోవైపు బాలును రాజేష్ కారు దగ్గరికి తీసుకెళ్లి కండిషన్ చూడమంటాడు. అది తన ఫ్రెండ్ కోసమని చెబుతాడు. కానీ, షోరూమ్ దగ్గరే మీనా ఉంటుంది. తను ఉన్నట్లు చెప్పకని రాజేష్‌కు చెబుతుంది మీనా. కారు చాటుకు దాక్కుంటుంది మీనా. ఇది సెకండ్ హ్యాండ్ అంటే ఎవరు నమ్మరని చెప్పిన బాలు కారును ట్రయల్ వేసి చూస్తాడు. నిజంగా కొత్త కారులా ఉంది. కళ్లు మూసుకుని కొనొచ్చు అని బాలు చెబుతాడు.
అయితే నీకు నచ్చిందా అని రాజేష్ అంటే నచ్చిందని బాలు చెప్పి వెళ్లిపోతాడు. నేను ఒక్కచోటు చెబుతాను అక్కడికి కారు తీసుకురమ్మని మీనా చెబుతుంది. మరోవైపు మీనాను ఎన్నడులేనంత అందంగా తయారయ్యావేంటీ అని బాలు అడుగుతాడు. గుడికి వెళ్దామని బాలును మీనా తీసుకెళ్తుంది. అక్కడ పార్వతి, సుమతి ఉంటారు. పార్వతి పలకరించి వీలు చూసుకుని ఇంటికి రమ్మని అంటుంది.
కానీ, బాలు పట్టనట్లు ఉంటాడు. ఇంతలో మీనా కొన్న కారును రాజేష్ తీసుకొస్తాడు. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావని అడిగితే పూజ చేయిద్దామని రాజేష్ అంటాడు. అంతా మంచే జరుగుతుందని పంతులు ఎంట్రీ ఇస్తాడు. పోయిన ట్రాలీ గురించా అని బాలు అంటాడు. పోయినవన్నీ దొరుకుతున్నాయ్, అదే దొరుకుతాయ్ అని పార్వతి అంటుంది. నీళ్లు తాగే చెంబు పూలకొట్లో పెడితే పోయింది. అది కూడా దొరుకుతుందా అని బాలు అంటాడు.
ఊరుకోండి. అత్తగారితో జోకులు వేస్తారా అని మీనా అంటుంది. బాలుకు నిజం చెప్పకుండానే కారుకు మీనాతో పూజ చేయిస్తాడు పంతులు. ఈ కారుకు మనమెందుకు పూజ చేస్తున్నాం అని బాలు అంటే ఏం మాట్లాడకండి అని మీనా అంటుంది. కారు ఓనర్ ఎక్కడ అసలు అని బాలు చిరాకు పడితే అంతా నవ్వుతారు. ఏంటీ అంతా నవ్వుతారు అని బాలు అంటే ఈ కారు మీదే అల్లుడు గారు అని పార్వతి చెబుతుంది.
దాంతో ఆశ్చర్యపోతాడు బాలు. ఇది నేను కొనలేదుగా అని బాలు అంటే.. మీనా మీకోసం కారు కొన్నదని పంతులు చెబుతాడు. నాకు అంత కలలా ఉందని బాలు అంటాడు. ఇంత డబ్బు ఎక్కడది అని బాలు అడుగుతాడు. మాలలు అమ్మితే బాగానే డబ్బు వచ్చింది. మీరు ఇప్పిచ్చిన ఆర్డరే. మీకోసమే ఖర్చు పెట్టాను అని మీనా చెబుతుంది. తర్వాత బాలుకు మోనిక కాల్ శివతో గొడవ గురించి అడుగుతుంది.
శివగాడు వేలడంతా లేడు వాడి పనులు చూస్తుంటే ఎంత కోపం వస్తుందో తెలుసా అని బాలు అంటాడు. ఆ మాటలు వెనుక నుంచి వచ్చిన మీనా వింటుంది. తర్వాత మీ వదినా నాకోసం కారు కొన్నదని గొప్పగా చెబుతాడు బాలు. తనలా ఓర్పు ఉంటే ఎవరైనా మారుతారు అని మౌనికకు చెబుతాడు బాలు.
అదంతా విన్న నన్ను మీరు ఇంతలా అర్థం చేసుకున్నారని తెలియదని ప్రేమగా బాలును హత్తుకుంటుంది పూలగంప మీనా. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్