గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: పార్లర్‌పై నీ పేరు లేదమ్మా- ఇంట్లో నిజం చెప్పేసిన మనోజ్- షాక్ ఇచ్చిన ప్రభావతి!-gunde ninda gudi gantalu today episode june 13th 2025 rohini manipulates manoj reveals truth star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: పార్లర్‌పై నీ పేరు లేదమ్మా- ఇంట్లో నిజం చెప్పేసిన మనోజ్- షాక్ ఇచ్చిన ప్రభావతి!

గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: పార్లర్‌పై నీ పేరు లేదమ్మా- ఇంట్లో నిజం చెప్పేసిన మనోజ్- షాక్ ఇచ్చిన ప్రభావతి!

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు జూన్ 9 ఎపిసోడ్‌లో పార్లర్‌పై తల్లి ప్రభావతి లేకపోవడంతో రోహిణిని మనోజ్ అడుగుతాడు. దానికి ఫ్రాంచైజీ తీసుకున్నట్లు కవర్ చేస్తుంది రోహిణి. ఆ నిజాన్ని ఇంట్లో అందరికి గుడ్ న్యూస్ అని చెబుతాడు మనోజ్. కానీ, అందరిముందు రోహిణిని ఏమనకుండా ఇంట్లోవాళ్లకు షాక్ ఇస్తుంది ప్రభావతి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 13 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి కోసం మనోజ్ బ్యూటి పార్లర్‌కు వస్తాడు. బ్యూటి పార్లర్ మీద అమ్మ పేరు లేకపోవడం చూసిన మనోజ్ షాక్ అవుతాడు. ఇంతలో రోహిణి వస్తే.. పార్లర్ అమ్మ పేరు మీద ఉండాలిగా. లేదేంటీ అని అడుగుతాడు మనోజ్.

కంపెనీ వాళ్లే

నాకు ఈ బిజినెస్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. నేను కావాలనే ఈ కంపెనీ వాళ్లే నన్ను అప్రోచ్ అయ్యారు. మనం ఓకే అంటే వాళ్లు మనతో మెర్జ్ అవుతారు. ఇప్పుడు ఫ్రాంచైజీకి ఇచ్చాం. ఇప్పడు అందులో మనం పార్టనర్. దాంతో మంచి పేరు వస్తుంది, లాభాలు ఎక్కువస్తాయి, డబ్బు కూడా వస్తుందని రోహిణి చెబుతుంది. దాంతో నేను బిజినెస్ పెట్టుకోడానికి కూడా ఉపయోగపడుతుంది అని మనోజ్ అంటాడు.

ఆంటీ పేరు మార్చడం నాకు బాధగా ఉంది గానీ తప్పలేదు అని రోహిణి అంటుంది. దాంతో మనోజ్ వెళ్లిపోతాడు. ఇప్పుడు ఈ విషయం మీ అత్తయ్యకు తెలిస్తే పరిస్థితి ఏంటే అని ఫ్రెండ్ అంటే.. అవును, ఈ బాంబ్ పేలిస్తే అంతే సంగతి అని బయలుదేరుతుంది రోహిణి. మరోవైపు డౌన్ పేమెంట్ కట్టి బాలు కోసం కారు కొంటుంది మీనా. కారు తీసుకున్నాం కానీ ఆయనకు నచ్చిందో తెలియాలి అని మీనా అంటుంది.

మీ ఫ్రెండ్ కోసం కారు కండిషన్ చూడమని చెప్పండని రాజేష్‌కు మీనా తన ప్లాన్ చెబుతుంది. ఐడియా బాగుందని రాజేష్ అంటాడు. మరోవైపు మీనా అప్పు గురించి ఆలోచిస్తుంది ప్రభావతి. బాలు వస్తే మాట్లాడాలని ఆపుతుంది. ఇంతలో సత్యం వస్తాడు. ఆ తర్వాత మీనా వస్తుంది. ఇంటిని, పూలకొట్టు వదిలేసి వాళ్ల అమ్మగారింటికి వెళ్లింది అని ప్రభావతి అంటుంది.

పుట్టింటికి ఇచ్చింది

అందరు కష్టపడి మాలలు కట్టిన డబ్బు తీసుకెళ్లి వాళ్ల పుట్టింటికి వెళ్లి ఇచ్చింది అని ప్రభావతి అంటుంది. దాంతో తన డబ్బు ఇచ్చుకుంది, అందులో తప్పేముందని సత్యం, శ్రుతి, రవి, బాలు అంతా మీనాకు సపోర్ట్ చేస్తారు. ఆ డబ్బే కాదు ఇంకొంత డబ్బు అప్పు తీసుకుని వెళ్లింది. కారణం చెప్పమనండి అని ప్రభావతి చెబుతుంది. దాంతో సత్యం అడుగుతాడు.

అవును మావయ్య ఒక అవసరం పడింది. డబ్బు సరిపోలేదు అందుకే తీసుకున్నా అని మీనా అంటుంది. డబ్బంతా ఏం చేస్తుంది అని ప్రభావతి అంటుంది. రోహిణిని, నన్ను మా డబ్బు ఏం చేస్తున్నారని అడగలేదు. ఒక మీనాను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని శ్రుతి అంటుంది. వాళ్లకంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. దీనికేముంటాయి అని ప్రభావతి అంటుంది.

ఏం అవసరమో నాకు ఇప్పుడు చెప్పి తీరాలి అని ప్రభావతి అంటుంది. చెప్పదు. అవసరం లేదన అంతా అంటారు. అందరు ఒక్కటై దానికి సపోర్ట్ చేస్తున్నారు అని ప్రభావతి గొడవ చేస్తుంది. మీనా ఒంటి మీద బంగారమంతా మీకే ఇచ్చింది. మీరు వేసుకోమని ఇచ్చారా. మీనా కూడా అడగలేదు. బంగారం కొనుక్కుంటుందేమో అని శ్రుతి అంటుంది. కారణం అది కాదు ఇంకేదో ఉంది అని ప్రభావతి అంటుంది.

మహానటిలా తప్పించుకుంది

ఎందుకు అత్తయ్య దొంగలా నిలదీస్తున్నారు. అందులో నేను ఒక్క రూపాయి వాడుకోలేదు. నా పుట్టింటికి ఇవ్వలేదు. నమ్మితే నమ్మండి లేకుంటే లేదు. ఈరోజు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అని చెప్పిన మీనా మీకేమైన చెప్పాలా అని బాలును అడుగుతుంది. నేను చచ్చినా అడగను అని బాలు అంటాడు. నా భర్తకే లేని అనుమానాలు మీకెందుకు వస్తున్నాయని మీనా వెళ్లిపోతుంది.

ఎలా తప్పించుకుందో. మహానటిలా రెండంటే రెండు కన్నీళ్లు కార్చి వెళ్లిందని ప్రభావతి అంటుంది. నీ డబ్బు వాడుకుని అబద్దాలు చెప్పేవాళ్లను ఏమనవు గానీ నా భార్యను నిలదీస్తున్నావేంటీ అని బాలు అంటాడు. ఎవర్రా అని ప్రభావతి అంటే.. ఆపురా. తను తిని కూర్చోలేక వాగుతుంది అని సత్యం ఆపుతాడు. ఎందుకు ఊరికే గొడవ చేస్తారని శ్రుతి అంటుంది.

మరోవైపు మౌనిక నోములో ఉంటుంది. మంచి నీళ్లు అయినా తాగమని సువర్ణ అంటే మౌనిక వద్దంటుంది. మరి ఇంత కటిక ఉపవాసం చేస్తున్నావ్ అని సువర్ణ అంటే ఆయన మారితే చాలంటుంది మౌనిక. సంజు వచ్చి భోజనం వడ్డించమంటాడు. నాన్ వెజ్ లేకపోయేసరికి గొడవ చేస్తాడు సంజు. ఈ ఒక్కరోజుకు ఆగమని సువర్ణ చెబుతుంది. దానికోసం నన్ను కూడా పస్తులు ఉండమంటావా అని సంజు అంటాడు.

నిజం చెప్పేసిన మనోజ్

నీకు అంతలా కావాల్సి వస్తే బయటకెళ్లి తినమంటుంది సువర్ణ. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఉండి బయటకెళ్లి తినమంటారా అని కోపంగా వెళ్లిపోతాడు సంజు. మరోవైపు ఇంట్లో అందరికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని మనోజ్ అంటాడు. రోహిణి మన పార్లర్‌ను ఫ్రాంచైజీకి ఇచ్చింది. పెద్ద పార్లర్‌తో కలిసిపోయిందని మనోజ్ అంటాడు. అంటే పార్లర్ పేరు మారిపోతుందిగా అని మీనా అంటుంది.

అవును, ఇప్పుడు పార్లర్‌కు అమ్మ పేరు లేదు. తీసేశారు అని మనోజ్ సంతోషంగా చెబుతాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇంతలో రోహిణి వస్తుంది. వాడు చెప్పేది నిజమా అని ప్రభావతి అంటే.. అవును, నేనే చెప్పాలనుకున్నాను. మనోజ్ చెప్పాడు అని రోహిణి అంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. కస్టమర్స్ పెరుగుతారు. బిజినెస్ పెరుగుతుంది. లాభాలు వస్తాయని మనోజ్ అంటాడు.

అమ్మ పేరు మీద ఉన్న పార్లర్ పోయే.. ప్రభావతి బ్యూటి పార్లర్ అనే బోర్డ్ తీసి పడేసింది. ఇప్పుడు అమ్మ పేరు మీద ఉన్న బిజినెస్ పూలకొట్టు ఒకటే. నువ్ కూడా ఏదైనా ఫ్రాంచైకి ఇవ్వొచ్చుగా అని బాలు అంటాడు. లేదు, నేను అత్తయ్య పేరే ఉంచుతా అని మీనా అంటుంది. బాగా లాభాలు వచ్చాకా అత్తయ్య పేరు పెట్టొచ్చు. మనమే బ్రాంచ్‌లు ఏర్పాటు చేయొచ్చు అని రోహిణి అంటుంది.

లాభాలు వస్తే చాలు

నాకు తెలుసమ్మా. నువ్ ఏది చేసిన మంచికే చేస్తావ్. ఇది మంచి విషయమేగా అని ప్రభావతి ఏమనదు. దాంతో అంతా షాక్ అవుతారు. ఇప్పుడు నా పేరు మీద లేకపోతే ఏంటీ లాభాలు వస్తే అదే చాలు అని ప్రభావతి అంటుంది. థ్యాంక్స్ అంటూ రోహిణి వెళ్లిపోతుంది.

తర్వాత అత్తయ్య ఏం అనలేదేంటండి అని మీనా అంటుంది. మా అమ్మ కోపం గురించి తెలియదు. తుఫాను వచ్చేముందు ఉన్నట్లు చల్లగా ఉంటుంది అని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం