గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాపై దొంగతనం- ఫంక్షన్‌లో సురేంద్రను కొట్టిన బాలు- అనుకుంది సాధించిన శోభన!-gunde ninda gudi gantalu today episode july 4th 2025 balu beats surendra in function star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాపై దొంగతనం- ఫంక్షన్‌లో సురేంద్రను కొట్టిన బాలు- అనుకుంది సాధించిన శోభన!

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాపై దొంగతనం- ఫంక్షన్‌లో సురేంద్రను కొట్టిన బాలు- అనుకుంది సాధించిన శోభన!

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు జూలై 4 ఎపిసోడ్‌లో నల్లపూసల వేడుకలో రోహిణి తాగుబోతుతో వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. కానీ, మీనా పూలదండకున్న నగ తీస్తుంటే సురేంద్ర వచ్చి దొంగతనం అంటగడతాడు. దాంతో మీనా ఏడుస్తుంది. సురేంద్ర నానా మాటలు అనడంతో బాలు కొడతాడు. దాంతో శోభన అనుకుంది సాధిస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 4 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలుతో ఫంక్షన్ అయిపోయింది. లోపలికి వెళ్దాం దా అని సత్యం అంటాడు. అయితే, ఇంటికెళ్లిపోదామని బాలు అంటాడు. ఇంతసేపు ఉండి తినకుండా వెళ్తే ఎలా ఉంటుందని సత్యం అంటాడు. మరి మలేషియా మనిషి ఎక్కడ అని బాలు అడిగితే రాలేదని సత్యం అంటాడు.

ఇంకెక్కడ మీ నాన్న

ఆయన రాడు నాన్న. పార్లరమ్మ చాలా తెలివైంది. ఏవో కథలు చెబుతుంది. వాళ్ల నాన్న మాత్రం రాడు అని బాలు అంటాడు. పూర్తిగా నిజం తెలియకుండా అనొద్దురా. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్నావుగా. ఇప్పుడు కూడా అలాగే ఉండు అని సత్యం అంటాడు. మరోవైపు రోహిణిపై మీ నాన్న ఇంకెక్కడ, ఒళ్లు మండిపోతుంది అని అరుస్తుంది. కన్న కూతురు ఫంక్షన్‌లో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని కామాక్షి అంటుంది.

వాళ్ల నాన్న రాకుంటే తనేం చేస్తుందన విద్య అంటుంది. ఆయన కనీసం నీ షష్టిపూర్తికి అయినా వస్తాడా అని ప్రభావతి అంటే సత్యం వచ్చి ఎందుకు అరుస్తున్నావ్. అసలే రోహిణి బాధలో ఉందని సత్యం అంటాడు. నాన్న స్థానంలో మీరు, అత్తయ్య ఆశీర్వదించండి అని రోహిణి అని ఆశీర్వాదాలు తీసుకుంటుంది రోహిణి. మరోవైపు బాలు గాడు అస్సలు కోపం తెచ్చుకోవట్లేదు. ఇలా అయితే ప్లాన్ ఫెయిల్ అవుతుందని మాట్లాడుకుంటారు సురేంద్ర, శోభన.

మీనా చెప్పినట్లుంది. వాడి బలహీనత మీద కొట్టాలి అని సురేంద్ర అంటే.. ఫ్యామిలీలో ఎవరి అన్న పడడు. ముఖ్యంగా తండ్రి, తల్లి, భార్య మీద అని శోభన అంటే.. అటు నుంచి నరుక్కురావాలని సురేంద్ర అంటాడు. ఇంతలో శ్రుతి వచ్చి నగలు తీస్తానంటే లేదని, ఇటు నుంచి మన ఇంటికి వెళ్లి గుడికి వెళ్లాలని శోభన అంటుంది. మా ఇంటికి కదా వెళ్లేది అని రవి అంటాడు.

సినిమా పేర్లు చెబుతున్నాడు

మీ అమ్మ ఎక్కడ లేని ఆచారాలు చెబుతుంది. ఆమెతో నేను మాట్లాడుతా అని శోభన అంటుంది. మరోవైపు తాగుబోతును తాను అప్పజెప్పిన పని గురించి అడుగుతుంది విద్య. తను ఎంత బతిమిలాడిన తాగలేదని, చేత్తో పెగ్ తీసుకుని కూడా ఒక్క చుక్క తాగలేదు, నాన్న గౌరవం అని సినిమా పేర్లు చెబుతున్నాడు. నేను టేకప్ చేసిన ఆపరేషన్‌లో ఫెయిల్ అయ్యాను. నా డబ్బులిస్తే వెళ్తాను. లేకపోతే మీరే పిలిపించారని చెబుతాను అని తాగుబోతు అంటాడు.

నువ్ తాగొచ్చి నా చేయి పట్టుకుని అల్లరి చేస్తున్నావని చెబితే అంతా నిన్నే పిచ్చికొట్టుడు కొడతారు అని విద్య చెబుతుంది. దాంతో తాగుబోతు భయపడి వెళ్లిపోతాడు. మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయిందని రోహిణికి చెబుతుంది విద్య. అత్తయ్య నన్ను టార్గెట్ చేస్తుంది. మనోజ్ అయిన నా గ్రిప్‌లో పెట్టుకుంటే ఊపిరాడుతుంది. ఇకపై అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. నన్ను ఎక్కడ నమ్మరు అని రోహిణి అంటుంది.

పోను పోను మీనా కన్న హీనంగా చూస్తారు. ఇంటికెళ్లేలోపు పెద్ద గొడవ చేయాలి అని రోహిణి ఆలోచిస్తుంది. మరోవైపు శోభన ప్లాన్ చేసినవాళ్లను తిడుతుంది. ఇంతలో సురేందర్ వచ్చి వాన్ని ఫిజికల్‌గా ఏం చేయలేం. సెంటిమెంటల్‌గా కొట్టాలి. అన్నం తినే టైమ్‌లో సత్యంను లేపి ఇక్కడ వీఐపీలు కూర్చుంటారని చెప్పాలి. దాంతో బాలుకు కచ్చితంగా కోపం వస్తుంది. ఆ తర్వాత వాన్ని పట్టుకోవడం వాళ్ల నాన్న వల్ల కూడా కాదు అని సురేంద్ర అంటాడు.

ఏదో ప్లాన్ చేసినట్లున్నారు

వాళ్లు చెప్పినట్లుగానే సత్యంను తినడానికి పిలుస్తారు. ఇంతలో బాలు వస్తే సత్యం పిలుస్తాడు. వీళ్ల మొహాలు చూస్తుంటే మళ్లీ ఏదో ప్లాన్ చేసినట్లున్నారు అని బాలు అనుమానించి సత్యంతో తినడానికి వెళ్తాడు. వాళ్ల అడ్రస్ అడిగితే తిప్పితిప్పి అక్కడ అని చెబుతారు. గెస్ట్‌లు తినేసరికి లేట్ అయ్యేలా ఉంది మీరు తినండి అని శోభన చెప్పి వెళ్లిపోతుంది.

సత్యం చేతులు కడుక్కోడానికి వెళ్తారు. వాళ్లు వచ్చాకే ఒకరు వడ్డించాలి, ఒకరు లేపాలి, గొడవ అవుతుందని సురేంద్ర వాళ్లు ప్లాన్ చేస్తారు. కానీ, సత్యం, బాలు మాత్రం చిన్నపిల్లలకు అన్నం వడ్డిస్తుంటారు. అది చూసి సురేంద్ర, శోభన షాక్ అవుతారు. పిల్లలకు టేబుల్స్ లేవు. ఆకలితో ఉన్నారు. మేము ఆకలికి ఓర్చుకుంటాం పర్లేదు అని సత్యం అంటాడు.

మేడమ్ మన ప్లాన్ అంతా వేస్ట్ అయిందని లంబు అంటాడు. దాంతో అంతా షాక్ అయి ప్లానేంటీ అని బాలు అంటాడు. మిమ్మల్ని బాగా చూసుకోమన్నారుగా అది ఫెయిల్ అయిందని అన్నానని లంబు అంటాడు. పక్కకు వెళ్లి ఛ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందని సురేంద్ర చిరాకుగా వెళ్తాడు. తర్వాత రోహిణి, శ్రుతికి దిష్టి తీస్తారు. శ్రుతి పూలదండ తీసి రవితో బయటకు వెళ్తుంది.

మీనాపై దొంగతనం

పూలదండతోపాటు ఓ నగ దానికే ఉండిపోతుంది. అందరం గుడికి వెళ్లాలి. వెళ్లి శ్రుతిని తీసుకురమ్మని కామాక్షి మీనాకు చెబుతుంది. శ్రుతిని పిలవడానికి వెళ్లిన మీనా నగ చూసి తీద్దామనుకుంటుంది. అది చూసి ఇది కరెక్ట్ టైమ్ అనుకున్న సురేంద్ర తీద్దామనుకున్నావా, తీసి దాచుకుందామనుకున్నావా. నా కూతురు చైన్ కొట్టేయడానికి వచ్చావుగా. నేను అంత చూశాను అని శోభనను పిలుస్తాడు సురేంద్ర.

అలా మీనాపై దొంగతనం అంటగడతారు. దాంతో మీనా ఏడుస్తూ బాలు మీద పడుతుంది. సురేంద్ర వచ్చి నానా మాటలు అంటే బాలు కొడతాడు. దాంతో శ్రుతి బాలుపై కోప్పడుతుంది. అలా అనుకుంది శోభన సాధిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం