గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతికి ముందు నల్లపూసల కార్యక్రమం చేస్తారు. శ్రుతి మీద ఉన్న నగలు చూసి ప్రభావతి మురిసిపోతుంది. అందరి ఆశీర్వాదాలు తీసుకుంటారు రవి, శ్రుతి. బాలును మందు తాగమని తాగుబోతు విసిగిస్తాడు. రోహిణిని తన తండ్రి గురించి మనోజ్ అడుగుతాడు. శ్రుతి ఒంటి మీద నగలు కంటే మీ నాన్న ఎక్కువ తెస్తాడని అమ్మ అంటుందని మనోజ్ అంటాడు.
దాంతో రోహిణి చిరాకు పడుతూ వెళ్లిపోతుంది. ఇప్పుడు అందరం కలిసిపోయాం అని, ఒకరి ఇంటికి మరొకరం వెళ్లొచ్చు అని రవి, శ్రుతి సంతోషిస్తారు. బాలు తాగేసి గొడవ చేస్తే తప్పా మా అత్తయ్య నన్ను వదలదు. ఆ తాగుబోతోడు ఎక్కడో చూడు అని విద్యతో రోహిణి అంటుంది. తర్వాత రోహిణికి నల్లపూసలు వేస్తాడు మనోజ్. రోహిణి కోపంగా ఉంటుంది.
మంచి సెటప్ ఉంది. కారు డిక్కీలో పెట్టాను అని తాగుబోతు అంటే ఊపిరి ఆడక చచ్చిపోదు అని బాలు అంటాడు. ఆ సెటప్ కాదు. ప్లీజ్ బారు రావొచ్చుగా ప్లీజ్ అని బాలును పట్టుకెళ్తాడు తాగుబోతు. వ్యాన్‌లో ఉన్న మందు సెటప్ చూపిస్తాడు. మినీ బార్‌లా ఉందని బాలు అంటాడు. తాగుబోతు పెగ్ కలిపి ఇస్తాడు. అయిష్టాంగానే బాలు పెగ్ తీసుకుంటాడు.
తాగుబోతు పెగ్ మొత్తం కొట్టేస్తాడు. మరోవైపు రోహిణికి మీ అమ్మాతో కార్యక్రమం చేయడం గొప్ప విషయమని సురేంద్రతో ఒకతను అంటే.. వాళ్లకు అంత స్థోమత లేదని, చేతులు పట్టుకుని బతిమిలాడితే ఒప్పుకున్నా. మనం తిన్నాక మిగిలింది అడుక్కునేవాళ్లకు వేస్తాం కదా. ఇది కూడా అలాగే అనుకో అని సురేంద్ర అంటాడు. కావాలనే సత్యంను అవమానించేలా సురేంద్ర అంటాడు.
ఆ మాటలు విన్న రంగా కోపంగా లేస్తే సత్యం ఆపుతాడు. బాలు గాడు విని వీడిని పిచ్చికొట్టుడు కొడితే బాగుండనిపిస్తుందని రంగా అంటాడు. ఇంతలో బాలు కనిపించకపోయేసరికి కంగారుపడతారు. బాలు కోసం మీనా వెతుకుతుంది. బాలు పెగ్ పట్టుకుని ఉంటే తాగుబోతు మాత్రం తాగుతూనే ఉంటాడు. అది విద్య చూస్తుంది. నేను స్లోగా తాగుతాను నువ్ తాగు అని బాలు అంటాడు.
హమ్మయ్య తాగుతాను అన్నాడు. నా నాలుక లబలబలాడిపోతుంది అని తాగుబోతు అంటాడు. అన్ని నగలు ఉండేసరికి చిరాకుపడుతుంది శ్రుతి. రోహిణి కంట్లో ఏదో పడినట్లుంది వదిన చూడు అని ప్రభావతికి శోభన చెబుతుంది. దాంతో రోహిణి దగ్గరికి వెళ్లి కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ కోపంగా మీ నాన్న ఏంటీ ఇంకా రాలేదని అడుగుతుంది. ఫోన్ కలవలేదని చెబుతుంది రోహిణి.
నేను నీకు ఎలా కనిపిస్తున్నా. శ్రుతి తల్లి అడిగితే ఏం చెప్పాలి. నాకు అబద్ధం చెప్పావా. మీ నాన్న మలేషియా నుంచి నగ నట్ర తెస్తాడు అని చెప్పాను. అందరు కలిసి నన్ను మోసం చేశారా. రాకపోతే రావట్లేదని చెప్పాలి. మీ నాన్న రాకపోవాలి అప్పుడు చెబుతాను అని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. ప్రభావతిని కామాక్షి పక్కకు తీసుకెళ్తుంది. బాలు వాళ్లు బయట స్టార్ట్ చేశారు. ఏ క్షణమైన గొడవ జరగొచ్చు అని విద్య అంటుంది.
ఒక్కటే పెగ్ పట్టుకుని బాలు ఉంటాడు. తాగుబోతు చాలా తాగుతాడు. బాలును తాగమని బతిమిలాడుతాడు. తాగుబోతు రమ్మని పిలిచినప్పుడు రాకుంటే బాగుండదు. అందుకే గ్లాస్ పట్టుకుని ఉన్నాను. నేను తాగను. ఇక్కడ గొడవ చేయని అని నా భార్యకు మాటిచ్చాను. మా నాన్న పరువు పోకూడదు. ఈరోజు కాకుంటే ఇంకోరోజైనా కూర్చుందాం అని బాలు అంటాడు.
ఆ మాటలు విని మీనా సంతోషిస్తుంది. నువ్ గ్రేట్ బాసు. భార్యకు ఇచ్చిన మాట కోసం గ్లాస్ పట్టుకుని ఉన్నావే గ్రేట్ బాసు అని బాలు నిగ్రహానికి తాగుబోతు సెల్యూట్ చేస్తాడు. బాలుకు ఇచ్చిన పెగ్ కూడా తాగుబోతే తాగుతాడు. మీనా పిలిచేసరికి బాలు వెళ్లిపోతాడు. బాలును నిలదీసిన మీనా బాలును హగ్ చేసుకుంటుంది. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని మీనా ప్రేమగా చెబుతుంది.
ఈ పూలగంప మాట నిలబెట్టుకోవాలిగా. అమ్మాయి సైడ్ వాళ్లు అని చెబితే బాగుండదని అతనితో వెళ్లాను. నీకోసం అని మీనా బుగ్గ గిల్లుతాడు బాలు. మరోవైపు ఇంటికెళ్లేలోపు బాలుతో పెద్ద గొడవ చేయించాలని రోహిణి ప్లాన్ చేస్తుంది. రోహిణి వాళ్ల నాన్న పెద్ద ఫ్రాడ్ అని సత్యంతో బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్