గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి శ్రుతి కౌంటర్- సంజుకు సీన్ రివర్స్- మల్లెపూల వర్షంలో బాలు, మీనా రొమాన్స్-gunde ninda gudi gantalu today episode july 24th 2025 sanju disappointed sathyam family happy star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి శ్రుతి కౌంటర్- సంజుకు సీన్ రివర్స్- మల్లెపూల వర్షంలో బాలు, మీనా రొమాన్స్

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి శ్రుతి కౌంటర్- సంజుకు సీన్ రివర్స్- మల్లెపూల వర్షంలో బాలు, మీనా రొమాన్స్

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు జూలై 24 ఎపిసోడ్‌లో సత్యం ఇంటికి రవి, శ్రుతి వస్తారు. దాంతో సత్యం ఇంట్లో సంబురాలు చేసుకుంటారు. కానీ, రోహిణి మాత్రం మంట పెట్టాలని చూస్తుంది. శ్రుతి మాత్రం అలా జరగనివ్వకుండా కౌంటర్ వేస్తుంది. ఇంతలో వచ్చిన సంజు అదంతా చూసి ఉక్రోశంతో ఊగిపోతాడు. మౌనిక మాత్రం సంతోషిస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 24 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కేజీ స్వీట్స్ తీసుకుని మరి సంజు ఎంజాయ్ చేస్తుంటాడు. మౌనికను సంతోషంగా ఉండు, ఎంజాయ్ చేయమని అంటాడు. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి అని మౌనిక అడుగుతుంది. నీకు ఎంతో ఇష్టమైన మీ ఇంటికి తీసుకెళ్తున్నా. ఫంక్షన్‌లో పెద్ద గొడవ జరిగిందట. మీ వాళ్లకు తీవ్రమైన అవమానం జరిగిందట. ఆ బాధను మనం ఇంకాస్తా పెంచాలిగా అని శాడిస్ట్ నవ్వు నవ్వుతాడు సంజు.

ఇల్లరికం రావడం

మరోవైపు శ్రుతిని పంపించడంపై శోభనను సురేంద్ర అంటాడు. శ్రుతి మన మాట వింటుందా. అయినా మన అల్లుడు మనింటికి ఇల్లరికం రావడం. కూతురు కాపురం ముక్కలు చేసుకోవడం కాదు. శ్రుతి లాంటి టెంపర్‌కి రవిలాంటి నిదానస్తుడే కరెక్ట్. తర్వాత అయినా శ్రుతి మన మాట వినాలనే తన సైడ్ మాట్లాడాను. అప్పుడే వాళ్లింటికి వెళ్లగలం అని శోభన అంటుంది.

వాళ్లను అంత అని ఏ మొహం పెట్టుకుని వెళ్తావ్ అని సురేంద్ర అంటాడు. ఏమైనా ఒక్కగానొక్క అమ్మాయి. తప్పదు. ప్రభావతిని మెల్లిగా మచ్చిక చేసుకుని మళ్లీ ఇల్లరికం వచ్చేలా ప్లాన్ చేస్తాను అని శోభన అంటుంది. మరోవైపు మీనాకు తినడానికి పెద్దగా ఏముండదు. అయినా అది మీనా తింటుంటే ప్రభావతి వచ్చి తిడుతుంది. మధ్యాహ్నం టైమ్‌కు టిఫిన్ తింటున్నా. మళ్లీ అరగకుంటే అటు ఇటు నడవాలి అని ప్రభావతినే ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేస్తుంది మీనా.

ఇంతలో బాలు వచ్చి విజిల్ కొడతాడు. రవి, శ్రుతి వస్తారు. దాంతో అంతా సంతోషిస్తారు. ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా అని ప్రభావతి అంటుంది. తర్వాత బాలును అంటుంది ప్రభావతి. ఇప్పుడు మీ సమస్య తీరిపోయింది కాబట్టి మళ్లీ నా మీద పడుతుందే. మళ్లీ కథ ముందుకు వచ్చింది అని రోహిణి లోపల భయపడుతుంది. రవి బిర్యాని గురించి అంటే నేను పంపించడమేంటని అంటాడు.

కొత్త రోజుల

దాంతో బాలు రవి కాలు తొక్కి అవును అని చెప్పు అని అంటాడు. దాంతో రవి అవును అంటాడు. ఈరోజు మళ్లీ కొత్త రోజులా స్టార్ట్ చేద్దాం. అందుకే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అని శ్రుతి అంటుంది. ఆరోజు మీ నాన్నగారికి అంత అవమానం జరిగిందిగా ఎలా మర్చిపోయావ్ అని రోహిణి అంటుంది. ఎలా మంటపెడుతుందో చూశావా అని రవితో బాలు అంటాడు.

నేనే మర్చిపోయాను. నువ్వెందుకు గుర్తు పెట్టుకున్నావ్. మంచి చెడు ఎలా ఆలోచించాలో నాకు కొంతమంది చెప్పారు. ఇకనుంచి పాతవన్నీ ఎవ్వరు మనసులో పెట్టుకోవద్దు అని శ్రుతి అంటుంది. తర్వాత శ్రుతి, రవి కేక్ కట్ చేస్తారు. భార్యాభర్తలంతా ఒకరినొకరు తినిపించుకోండని శ్రుతి చెబుతుంది. అలాగే తినిపించుకుంటారు. ఇంతలో సంజు, మౌనిక వస్తారు.

నా పుట్టింటివాళ్లు బాధలో ఉంటే మీలా సంతోషించలేను అని మౌనిక రానంటుంది. సంజు బలవంతంగా ఇంట్లోకి తీసుకొస్తాడు. కానీ, సంజుకే పెద్ద షాక్ తగులుతుంది. అంతా సంతోషంగా ఉండటం చూసి దిమ్మతిరిగిపోతుంది. మౌనిక మాత్రం సంతోషిస్తుంది. మౌనికను చూసి అంతా సంతోషిస్తారు. సంజు మాత్రం ఉక్రోశంతో ఊగిపోతాడు. ఇది కదా నేను కోరుకునేది. అలాగే, అందరు ఉన్నారు అని మౌనిక అంటుంది.

సంజు ఉక్రోశం

రవి, శ్రుతి ఇంట్లో ఉండట్లేదని విన్నాను అని సంజు అంటాడు. లేదు బావ, దూరంగా ఉన్నాం అంతే విడిపోలేదు అని రవి అంటాడు. ఎక్కువ మాట్లాడిన, తప్పు చేసిన నేను ఊరుకోనని నీకు తెలిసినంత బాగా ఎవరికి తెలుసు బావ అని బాలు అంటాడు. మీరిద్దరు కూడా కేక్ కట్ చేసి తినిపించుకోండని మీనా అంటుంది. హ్యాపీ ఫ్యామిలీ అనే కేక్‌ను సీన్ రివర్స్ అయిందని కోపంతో కట్ చేస్తాడు సంజు.

బావ నువ్ కేక్‌ను ముక్కలు చేసినట్లు మా కుటుంబాన్ని ఎవరు ముక్కలు చేయలేరు. నేను కేక్‌ను కాదు చాకుని. ఇప్పుడు తినిపించుకోండి అని బాలు అంటాడు. దాంతో సంజు, మౌనిక తినిపించుకుంటారు. భోజనం చేసి వెళ్లమని ప్రభావతి అంటే వేరే పని ఉండి వచ్చాం. వెళ్తాం అని సంజు అంటాడు. బావగారు ఏదో స్వీట్స్ తెచ్చారే. మాకోసమేనా అని బాలు అంటే.. అందరికీ నేనే తినిపిస్తా అని అందరికి తినిపిస్తుంది మౌనిక.

ఫోన్ వచ్చినట్లు చేసిన సంజు వెళ్లాలి అని చెబుతాడు. ఇవాళ మా ఇంట్లో పండుగ సంబురంగా జరుగుతుంది. మౌనిక ఉండని అంటాడు సత్యం. పర్లేదు నాన్న వెళ్తాను అని మౌనిక అంటుంది. తర్వాత టెర్రస్‌పై ముగ్గురు అన్నదమ్ములు భార్యల గురించి మాట్లాడుకుంటారు. రవిని శ్రుతి, మనోజ్‌ను రోహిణి, బాలును మీనా కాల్ చేసి రమ్మంటారు. దాంతో అంతా వెళ్లిపోతారు. మీనా దగ్గరున్న మల్లెపూలకు బాలు తగలడంతో అవి పైకి ఎగిరిపడతాయి.

బాలు, మీనా రొమాన్స్

మీనాపై బాలు పడిపోతాడు. వారిద్దరిపై మల్లెపూల వర్షం కురుస్తుంది. మీనా, బాలు రొమాంటిక్‌గా చూసుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం