Gunde Ninda Gudi Gantalu Serial: సత్యం ఫ్యామిలీ సుశీల ఊరికి బయలుదేరుతారు. దారి పొడవునా కారులో బాలుతో గొడవపడుతూనే ఉంటుంది ప్రభావతి. తల్లి మాటలకు ధీటుగా బాలు బదులిస్తుంటాడు. బాలు కారులో వచ్చి తప్పు చేశానని ప్రభావతి అంటుంది. నా కారులో కాబట్టి నిన్ను ఇంకా కూర్చోబెట్టుకున్నామని, అదే మనోజ్ కారులో అయితే ఈ పాటికి మధ్యలోనే నింపు దింపేవారని బాలు అంటాడు. కొందరు మనుషులు పాముల కంటే డేంజర్, నచ్చని వాళ్లపై విషం చిమ్ముతూనే ఉంటారని తల్లిపై సెటైర్లు వేస్తాడు బాలు. నువ్వు ఎవరిని అంటున్నావో నాకు తెలుసునని ప్రభావతి అంటుంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు సంతోషం అని బాలు సమాధానమిస్తాడు.
పసర్లపూడిలో తన చిన్ననాటి స్నేహితులు కనిపించడంతో సత్యం సంబరపడతాడు. తన స్నేహితుల యోగక్షేమాలు కనుక్కుంటాడు. తనలాగే బతుకుతెరువు కోసం అందరూ పల్లెటూరును వదిలిపెట్టి వెళ్లిపోయారని తెలిసి సత్యం బాధపడతాడు.
తన స్నేహితుడు ఢిల్లీలో జాబ్ చేసి చివరకు సొంతూళ్లో సెటిలయ్యాడని తెలిసి సత్యం ఆనందపడతాడు. సత్యం మాటలు విని ప్రభావతి కంగారు పడుతుంది. మనం కూడా పల్లెటూళ్లో సెటిలవుదామని భర్త ఎక్కడ అంటాడోనని భయపడిపోతుంది. నువ్వు అననివ్వవు కదా అని బాలు బదులిస్తాడు. సత్యం స్నేహితులు ఒక్కొక్కరు వచ్చి అతడితో మాట్లాడుతుంటారు.
డబ్బు వెంట పరిగెత్తి ఇన్నాళ్లు ఊరికి దూరమయ్యానని, ఊరికి రమ్మని అమ్మ చాలా రోజులుగా అడుగుతుందని, ఇన్నాళ్లకు కుదిరిందని అంటాడు. సిటీలో డబ్బుతోనే సావాసాలు, డబ్బు వల్లే శత్రుత్వాలు పెంచుకుంటూ బతకాల్సివచ్చిందని సత్యం బాధపడతాడు. పల్లెటూరిలో సెటిల్ అవుదామని అనుకున్నా పిల్లల చదువుల కారణంగా కుదరలేదని అంటాడు.సత్యం తన కుటుంబంతో పల్లెటూరికి రావడం చూసి సుశీల సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.
మలేషియా మావయ్యగా యాక్ట్ చేస్తోన్న మటన్ కొట్టు మాణిక్యానికి ఫోన్ చేసి మరోసారి జాగ్రత్తలు చెబుతుంది రోహిణి. కారులోనే రమ్మని వార్నింగ్ ఇస్తుంది. ఏ మాత్రం తేడా రావద్దని అంటుంది. రోహిణి సీక్రెట్‌గా మాట్లాడటం బాలు కనిపెడతాడు.
మలేషియా మావయ్యగా మటన్ కొట్టు మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు. ధనవంతుడిలా బిల్డప్ ఇస్తాడు. తనకు రోహిణి ఇచ్చిన బోల్డ్ బ్రాస్‌లేట్, చీరలు మలేషియా నుంచి తీసుకొచ్చినట్లుగా మనోజ్‌కు ఇస్తాడు. అదంతా నిజమని నమ్మిన ప్రభావతి తెగ పొంగిపోతుంది. మాణిక్యంపై తెగ పొగడ్తలు కురిపించడమే కాకుండా అతడికి తెగ మర్యాదలు చేస్తుంది. మటన్ కొట్టు మాణిక్యం వాలకం, మాటతీరు చూసి రోహిణి, బాలు డౌట్ పడతారు. అతడు మలేషియా నుంచి రాలేదని అనుకుంటారు. అతడిని ప్రశ్నలతో తికమకపెడుతారు.
బాలుకు దొరక్కుండా మాణిక్యం జాగ్రత్తపడుతుంటాడు. అతడిపై కావాలనే డామినేషన్ చూపిస్తుంటాడు. రోహిణి కూడా మాణిక్య ఎక్కడ దొరికిపోతాడో అని తెగ కంగారు పడుతుంటుంది. మాణిక్యం ఇంట్లో వాళ్లతో ఎక్కువ మాట్లాడకుండా చూసుకుంటుంది. పల్లెటూరిలో కూడా మీనాపై సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టాలని ప్రభావతి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె జోరుకు సుశీల అడ్డుకట్ట వేస్తుంది. మీనాకు సపోర్ట్ చేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో చూడాల్సిందే.
సంబంధిత కథనం