గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బారుకెళ్లిన మీనా- వీడియో తీసిన యూట్యూబర్- గుణ కుట్ర గురించి బాలుకు చెప్పిన పూలగంప-gunde ninda gudi gantalu today episode august 22nd 2025 meena found truth guna plan on balu star maa serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బారుకెళ్లిన మీనా- వీడియో తీసిన యూట్యూబర్- గుణ కుట్ర గురించి బాలుకు చెప్పిన పూలగంప

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బారుకెళ్లిన మీనా- వీడియో తీసిన యూట్యూబర్- గుణ కుట్ర గురించి బాలుకు చెప్పిన పూలగంప

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు ఆగస్ట్ 22 ఎపిసోడ్‌లో జ్యూస్‌లో తానే మందు కలిపానని, బాలు తాగుడు మానేయాలని నాటు మందు కలిపినట్లు మీనా చెబుతుంది. దాంతో తనకు విషం పెట్టిందన ప్రభావతి అరుస్తుంది. మీనా బారుకు వెళ్లింది ఓ యూట్యూబర్ వీడియో తీస్తాడు. అతన్ని కొట్టి తరిమేస్తుంది మీనా. సీసీటీవీలో గుణ కుట్ర చూస్తుంది మీనా.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 22 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఆరెంజ్ జ్యూస్‌లో నేను మందు కలిపాను అని మీనా చెబుతుంది. దాంతో అయ్యబాబోయ్.. నా కోడలు విషం పెట్టేసిందిరోయ్.. నేను బతకను. నేను పోతాను. ఇప్పుడే పోతాను. విషం తాగేశాను అని ప్రభావతి గగ్గోలు పెడుతుంది. మందు అంటే మందే అత్తయ్య. విషం కాదు. నా భర్తకు విషం ఎందుకు పెడతాను అని మీనా అంటుంది.

నువ్వెందుకు మందు కలిపావ్

జ్యూస్‌లో నువ్వెందుకు మందు కలిపావ్ మీనా అని రోహిణి అడుగుతుంది. మా ఆయన మందు మానేయాలని నాటు మందు తీసుకొచ్చి కలిపాను అని మీనా చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మరి అత్తయ్య తాగుతుంటే ఆపకుండా ఎందుకు బయటకు వెళ్లావ్ అని రోహిణి అడిగితే.. ఏమైనా జరుగుతుందేమో అని విరుగుడు మందు తీసుకురాడానికి వెళ్లాను అని మీనా అంటుంది.

మా అమ్మకు ఏదైనా జరిగితే ఏంటీ పరిస్థితి అని మనోజ్ అంటాడు. మీనాను ఎవరు ఏమనొద్దు. మీనా మంచి పనే చేసింది. భర్త తాగుబోతు అంటుంటే సహించలేక మానిపించాలనుకుంది. బయట మాటలు పడేది మీనానే కదా అని సత్యం సపోర్టింగ్‌గా మాట్లాడుతాడు. ఇక బాలు బాధగా వెళ్లిపోతాడు. మీనా చేసింది గుర్తు చేసుకుంటాడు. మీనా వస్తుంది.

పచ్చి తాగుబోతులకు పసరు మందు పెట్టి మానిపిస్తారు. నాకు అదే చేశావా. ఎందుకు చేశావ్ అని బాలు అడిగితే.. అందరూ మాటలు అంటే ఎలా ఉంటుంది అని మీనా అంటుంది. నేను తాగలేదు మీనా. అందరిలా నన్ను చూడకు మీనా. నేను వేరు. నాకు పనంటే దైవంతో సమానం. నువ్ కొనిచ్చిన కారు నాకు దేవాలయం లాంటిది. అలాంటి కారులో నేను ఇలాంటివి ఎందుకు చేస్తాను అని బాలు అంటాడు.

మౌనిక సలహా

నీ దగ్గర బాధ చెప్పుకుని లాభం ఏముంది అని వెళ్లిపోతాడు బాలు. మీనాకు మౌనిక కాల్ చేస్తుంది. బాలు వీడియో గురించి చెబుతుంది. అన్నయ్య తాగాడని నువ్వు కూడా నమ్ముతున్నావా. మనం సగం వీడియో మాత్రమే చూశాం. పూర్తి వీడియో చూడలేదు. అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. కేవలం నీకోసం మారిపోయాడు. అన్నయ్యను నువ్వు నమ్మితీరాలి. నేను నమ్ముతున్నాను. అన్నయ్యపై ఎవరో కుట్ర చేశారు. అన్నయ్య పక్కన నిలబడు అని మౌనిక సలహా ఇస్తుంది.

కాల్ కట్ చేసి ఎవరో కావాలనే వీడియో తీశారు అని మీనా అనుకుంటుంది. తర్వాత ప్రభావతికి మీనా జావ ఇస్తే తాగదు. దాంతో మీనానే తాగి చూపిస్తుంది. పోలీస్ స్టేషన్‌కు బాలు వెళ్లి మాట్లాడుతాడు. ఎస్సై దగ్గరికి వెళ్లి తాను తాగలేదని చెబితే వాళ్లు నమ్మరు. నవ్వుతారు. నాలాంటి వాడు ఒక్కడే ఉంటాడు. అందుకే ఎవరు నమ్మట్లేదు అని బాలు అంటాడు.

సీఐ గారు వస్తారు. ఆయనతో మాట్లాడు అని ఎస్సై చెబుతాడు. బాలు వెళ్లి కూర్చొంటాడు. వీడికి బాగా పొగరు ఉన్నట్లుంది. దించండి అని ఎస్సై చెబుతాడు. దాంతో పేపర్ బండిల్స్ తెమ్మని కానిస్టేబుల్ చెబుతాడు. డబ్బులు అడిగితే ఇవ్వడు. బాలు వెళ్లి తీసుకొస్తాడు. తర్వాత బాలుతో టీలు తెప్పిస్తారు. టీ తీసుకొచ్చిన బాలు అందరికీ టీ ఇస్తాడు.

కోర్టుకు వెళ్లి తెచ్చుకో

బాలుకు ఏదో ఒక పని చెబుతుంటారు. టేబుల్ క్లీన్ చేపిస్తారు. ఇంతలో సీఐ వస్తారు. తాను తాగలేదని బాలు చెబుతాడు. కానిస్టేబుల్ వీడియో చూపిస్తాడు. ఈ వీడియో చూస్తే నువ్ తాగలేదని ఎవరు నమ్మరు. తాగి నడిపితే నీకు ప్యాసెంజర్లకు ప్రమాదం. నీకు కారు ఇవ్వరు. వెళ్లి కోర్టులో తీసుకో అని సీఐ చెబుతాడు. నన్ను నమ్మేవాళ్లు ఎవ్వరు లేరు అని బాలు వెళ్లిపోతాడు.

మరోవైపు బారు దగ్గరికి మీనా వెళ్తుంది. అది చూసి యూట్యూబర్స్ వీడియో తీస్తారు. బారు ఓపెన్ చేయకుందే ఓ స్త్రీ పడిగాపులు పడుతుంది అంటూ మాట్లాడుతారు. దాంతో వాళ్లను మీనా కొడుతుంది. మీలాంటి వాళ్ల వల్లే నా భర్తపై తాగాడని నింద పడింది. అది తప్పు అని రుజువు చేయడానకి వచ్చానని చెబుతుంది మీనా. భర్త బారుకెళ్లి తాగలేదంటే ఏ భార్య నమ్మదు. కానీ, ఈ లేడి నమ్మి వచ్చింది అని మరోలా మాట్లాడుతాడు యూట్యూబర్.

దాంతో ఫోన్ తీసుకుని కింద పడేయాలని చూస్తుంది మీనా. ఈ వీడియో వస్తే ఇంటికొచ్చి కొడతాను అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది మీనా. ఇంతలో బార్ ఓపెన్ చేస్తారు. ఓనర్‌తో మాట్లాడుతుంది మీనా. బాలు గురించి జరిగింది చెబుతుంది. తర్వాత బాలు తాగనిది, గుణ వీడియో తీసింది అంతా చూస్తుంది. అదంతా వెళ్లి బాలుతో చెబుతుంది.

బాలుపై కుట్ర

గుణ వీడియో తీసింది బాలుకు చూపిస్తాడు రవి. ఆ వీడియోతోపాటు తనపై కుట్ర జరిగింది అని బాలు చెబుతాడు. ఆ వీడియోను సత్యం, ఇంట్లోవాళ్లు, పోలీసులు అంతా చూస్తారు. బాలు తప్పు చేయలేదని మీనా నిరూపించింది. ఇప్పుడు ఏమంటారు అని ప్రభావతి వాళ్లను నిలదీస్తాడు సత్యం. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం