సాంబయ్య సంవత్సరీకానికి మీనా పుట్టింటికి వచ్చిన బాలును ఇరుగుపొరుగువారు తలో మాట అంటారు. శివను కొట్టడంలో బాలుదే తప్పుందని నిందలు వేస్తారు. మీనాను బాలుకు ఇచ్చి తప్పు చేశామని పార్వతి కూడా బాలును నానా మాటలు అంటుంది.
ఆమె మాటలను బాలు వింటాడు తల్లితో పాటు ఇరుగుపొరుగు వారు తనను నిందిస్తున్నా... మీనా అడ్డుచెప్పకోవడం బాలును మరింత బాధపెడుతుంది. నా చేయి విరగ్గొట్టి నా ఇంటికే తినడానికి వస్తావా అంటూ శివ అవమానించడంతో కోపం పట్టలేకపోయిన బాలు శివను కొడతాడు బాలు. అత్తింట్లో తనకు జరిగిన అవమానం తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అత్తగారింటికి వెళ్లిన బాలు ఏం గొడవ చేసి వస్తాడోనని సత్యం టెన్షన్ పడుతాడు. తన పుట్టింట్లో బాలు చేసిన గొడవ గురించి సత్యానికి చెబుతుంది మీనా. జరిగిన విషయం మీనా ద్వారా తెలుసుకొని బాలును నిలదీస్తాడు సత్యం. నేను కారణం లేకుండా తొందరపడనని నీకు తెలియదా అని తండ్రికి బదులిస్తాడు బాలు. అంత బలమైన కారణం ఏమిటో చెప్పకుండా ఈ గొడవలు ఎందుకు చేస్తున్నావని కొడుకును అడుగుతుంది ప్రభావతి.
శివ దొంగతనం చేసిన విషయం చెప్పబోయి ఆగిపోతాడు బాలు. కొడుకుపై సత్యం ఫైర్ అవుతాడు. అక్కడ కార్యక్రమం ఏంటి? నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి అని బాలుకు క్లాస్ ఇస్తాడు. నీ మొహమే నాకు చూపించద్దు అని అంటాడు.
అత్తింట్లో జరిగిన గొడవ గురించి తండ్రితో చెప్పిన మీనాను తప్పుపడతాడు బాలు. మీనాతో గొడవ పడతాడు. భర్త మాటలను మీనా భరించలేకపోతుంది. కిచెన్‌లోని గిన్నెలన్నీ పడేస్తుంది. మీనా, బాలు గొడవ పడటం చూసి ప్రభావతి సంబరపడుతుంది.
బాలు కారు కనిపించకపోవడంతో ప్రభావతి, సత్యంలో అనుమానం మొదలవుతుంది. కారు ఏమైందని కొడుకును అడుగుతాడు సత్యం. రాజేష్ కారు రిపేర్‌కు వచ్చిందని, నేను ఖాళీగా ఉన్నప్పుడు రాజేష్ నా కారుతో ట్రిప్‌లకు వెళుతున్నాడని, అతడి దగ్గరే కారు ఉండిపోయిందని తండ్రితో అబద్ధం చెబుతాడు బాలు. బాలు చెప్పిన మాటలను ప్రభావతి నమ్మదు. బాలు ఏదో దాస్తున్నాడని అంటుంది. రాజేష్‌కు ఫోన్ చేసి కారు ఏమైందో కనుక్కోవాలని సత్యం అనుకుంటాడు.
బెడ్‌రూమ్‌లోకి వచ్చిన బాలు ఫోన్ చూస్తాడు. తల్లి దగ్గర శివ డబ్బు దొంగతనం చేసిన వీడియో చూడగానే బాలు కోపం పట్టలేకపోతాడు. కోపంగా ఫోన్‌ను బెడ్‌పై పడేసి బాత్‌రూమ్‌లోకి వెళతాడు. బాలు అంతగా ఆవేశపడేంతగా ఫోన్‌లో ఏముంది అని మీనా అనుమానపడుతుంది.
బాలు బాత్‌రూమ్‌కు వెళ్లగానే ఫోన్ తీసి చూస్తుంది. అప్పుడే బాత్‌రూమ్ నుంచి బయటకు వస్తాడు బాలు. మీనా చేతిలో తన ఫోన్ ఉండటం చూసి కంగారు పడతాడు. మీనాకు నిజం తెలిసిపోయిందని అనుకుంటాడు. శివ గుట్టు బయటపడిందా? ఆ తర్వాత ఏమైందన్నది సోమవారం నాటి గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో చూడాల్సిందే.
సంబంధిత కథనం