Gunde Ninda Gudi Gantalu: అత్తింట్లో మౌనికకు రోజుకో శిక్ష- సంతోషంలో ప్రభావతి, సత్యం- సంజు ఇంటికి వెళ్లనని మాటిచ్చిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌లో సంజును మౌనిక పెళ్లి చేసుకుందని కుమిలిపోతాడు బాలు. అతని దగ్గరికి వచ్చిన మీనా అందరితోపాటు మౌనిక కూడా సంజునే నమ్మిందని చెబుతుంది. తర్వాత అత్తింట్లో మౌనికకు రోజుకో శిక్ష వేస్తానని సంజు అంటాడు.
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో బాగా తాగి ఉన్న బాలును ఇంటికి తీసుకొస్తుంది మీనా. ఇంటికొచ్చిన తర్వాత బాలును అనరాని మాటలు అంటుంది ప్రభావతి. నష్టజాతకుండా సొంత చెల్లి పెళ్లిలో ఇలా చేయాలని ఎలా అనిపించిందిరా అని తిడుతుంది.
ఇలా చేస్తున్నారేంట్రా
దాంతో బాలుది తప్పేం లేదని మీనా చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ, ప్రభావతి గద్దించి మీనా నోరు మూయిస్తుంది. మౌనిక పెద్దింటి సంబంధం చేసుకుందని నువ్ ఓర్వలేకపోతున్నావే అని మీనాను ప్రభావతి అంటుంది. తర్వాత సత్యం కూడా బాలును అంటాడు. ముగ్గురు కొడుకులు ఎందుకు పనికిరాకుండా ఇలా చేస్తున్నారేంట్రా.. మౌనికను వాళ్ల ఇంటికి పంపిస్తున్నామని ఏం గుర్తు లేకుండా అలా ఎలా ప్రవర్తించావురా. ముందు వెనుక చూసుకునేది లేదా అని సత్యం అంటాడు.
నీలకంఠం కండిషన్ గురించి
మామయ్య ఆయన చేసింది కరెక్ట్. ఇప్పుడు చెబితే ఎవరికి అర్థం కాదు. అసలే ఆయన బాధలో ఉన్నారు అని మీనా చెబుతుంది. తర్వాత నీలకంఠం పెట్టిన కండిషన్ గురించి బాలుకు చెబుతుంది ప్రభావతి. ఇంకోసారి మౌనికను చూసేందుకు ఆ ఇంటికి వెళ్లకూడదని, నువ్ వెళ్లకుండా చూసే బాధ్యత మాది అని మాటిచ్చామని, అలా చేస్తేనే మౌనికను ఇంటికి కోడలిగా తీసుకెల్తామని అన్నారని జరగింది చెబుతుంది ప్రభావతి.
బాలు నుంచి మాట
అవునురా, ఇంకా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే నువ్ ఆ ఇంటికి వెళ్లకపోవడమే మంచిది అని సత్యం అంటాడు. హో నన్ను ఇలా కట్టిపడేశారా. వాడు చెల్లెలిని ఏమైనా చేస్తే ఊరుకోను అని కోప్పడతాడు బాలు. అక్కడ ఏం జరిగినా ఆ ఇంటికి నువ్ వెళ్లకూడదని బాలుతో సత్యం, ప్రభావతి మాట తీసుకుంటారని తెలుస్తోంది. అతి కష్టంగా బాలు మాటిచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత బాలును పైకి తీసుకెళ్తుంది మీనా.
చెంప మీద కొట్టి వెళ్లిపోయింది
పైన గదిలో మీనాతో తన బాధను చెప్పుకుంటాడు బాలు. జీవితంలో మొదటిసారి భయమేస్తుంది. మౌనిక జీవితం ఏమైపోతుందో అని కంగారుగా ఉందని బాలు అంటాడు. మీకు భయమేస్తుందా. అలాంటిది మీకు ఉండదు అన్నట్లుగా మీనా అంటుంది. ఆ ఉరి తాడు తీసేయమంటే పసుపు తాడు అని భ్రమపడి నా చెంప మీద కొట్టి మౌనిక వెళ్లిపోయింది అని బాలు బాధపడిపోతాడు. దాంతో బాలును మీనా ఓదార్చే ప్రయత్నం చేస్తుంది.
అప్పుడే లేపేసేవాడిని
మరోవైపు నీలకంఠం ఇంట్లో సంజు, మౌనిక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు. మౌనిక సిగ్గుపడుతూ పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంది. మౌనిక సిగ్గు పడుతూ అక్కడే ఉండిపోతుంది. నువ్వేమైనా వీఐపీవా. నోరు మూసుకుని రా అని సంజు అనడంతో మౌనిక షాక్ అవుతుంది. ఏమంటున్నారు అని అడుగుతుంది. నాకున్న డబ్బు పరపతితో మీ బాలు గాడిని అప్పుడే లేపేసి ఉండేవాడిని అని సంజు అంటాడు. మౌనిక షాక్ అయి చూస్తుంది.
రోజుకో శిక్ష వేస్తాను
అసలు ఈ ప్రపంచంలోనే నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకున్నది మీ అన్నయ్య ఒక్కడే. వాడి చేతులు కట్టేసి ఆడుకుంటుంటే అప్పుడు కదా నాకు మజా వచ్చేది. నీ మెడలో పసుపు తాడు కట్టేసి.. ఇక్కడికి లాక్కొచ్చాను. ఇక్కడ నీకు దెబ్బపడితే వాడు అక్కడ గిలగిలలాడాలి. నీకు రోజుకో శిక్ష వేస్తూనే ఉంటాను అని సంజు కోపంగా, ఉక్రోశంగా అంటాడు. అది చూసిన మౌనిక షాక్ అవుతుంది. పెళ్లి చూపుల్లో అంత మంచివాడిలా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా అంటున్నాడేంటీ అని భయపడుతుంది.
తప్పుగా అనుకుంటున్నారు
తాగినప్పుడు జరిగిన గొడవ గురించి బాలు అన్నయ్యను తప్పుగా అనుకుంటున్నారని, నిజానికి బాలు అన్నయ్య చాలా మంచివాడని, నాకు ఏం కావొద్దనే మీతో అలా ప్రవర్తించాడని మౌనిక నచ్చజెబుతుంది. కానీ, సంజు వినడు. రోజుకో శిక్ష వేసినట్లుగా చూపిస్తారు.