Gunde Ninda Gudi Gantalu: మందు పెగ్‌తో మౌనిక ఫస్ట్ నైట్, లైఫ్ టైమ్ పనిష్‌మెంట్- సత్యం ఉగ్రరూపం- వణికిపోయిన ప్రభావతి-gunde ninda gudi gantalu serial today episode mounika get lifetime punishment satyam angry on prabhavathi manoj star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu: మందు పెగ్‌తో మౌనిక ఫస్ట్ నైట్, లైఫ్ టైమ్ పనిష్‌మెంట్- సత్యం ఉగ్రరూపం- వణికిపోయిన ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu: మందు పెగ్‌తో మౌనిక ఫస్ట్ నైట్, లైఫ్ టైమ్ పనిష్‌మెంట్- సత్యం ఉగ్రరూపం- వణికిపోయిన ప్రభావతి

Sanjiv Kumar HT Telugu
Jan 06, 2025 11:00 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial January 6th Episode: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు సంజు. ఇది నీకు కాళరాత్రి అని సంజు అంటాడు. బాలు మాటలు తలుచుకున్న మౌనిక ఈ శిక్షను నేను జీవితాంతం పడతాను, ఇక్కడే చస్తాను అని అనుకుంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 6 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 6 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ గదిలోకి మౌనిక ఎంట్రీ ఇస్తుంది. అక్కడ సంజు తాగుతుండటం చూసి షాక్ అవుతుంది. రా.. నువ్వేమైనా వీఐపీవా. దగ్గరికొచ్చి వెల్‌కమ్ చెప్పడానికి అని సంజు అంటాడు. దాంతో షాక్ అయి చూస్తుంది మౌనిక.

yearly horoscope entry point

వాడొక్కడే సరిగ్గా అర్థం చేసుకున్నాడు

దగ్గరికొచ్చి పాలు తాగే టైమా ఇదా. ఫస్ట్ నైట్ అంటే పాలే పంచుకోవాల. ఇద్దరం కలిసి పెగ్ పంచుకుందాం. రా అని చేయి పట్టుకుంటాడు. దానికి మౌనిక అమ్మా అని అరవడంతో చేయి చూస్తాడు. మీ అన్నయ్యను కొట్టిన చేయే కదా ఇది. అందుకే కాల్చుకున్నావ్ కదా. వద్దు. ఈ చేయి అంటే నాకిష్టం. కావాలంటే ఆ చేయి కాల్చుకో. ఇది ఆ బాలుగాడిని కొట్టిన చేయి కదా. అసలు వాడు నన్ను ఎన్నిసార్లు కొట్టాడో తెలుసా అని సంజు అంటాడు.

మా అన్నయ్య నా మీద ప్రేమతో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడని మౌనిక అంటే.. అయ్యయ్యో లేదే. ఈ ప్రపంచంలో నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకుంది మీ అన్నయ్యనే. ఇప్పటివరకు నా మీద చేయి చేసుకున్నాడే లేడు. నా మీద చేయి చేసుకున్న లెక్కల మాస్టర్ తర్వాత ఎడమ చేతితోనే తింటున్నాడు. ఎప్పుడైనా అందరిని నేనే కొట్టేవాడిని. అలాంటిది మీ బాలు నా షర్ట్ చింపి అందరిముందు మోకాళ్లమీద కూర్చొపెట్టాడు అని సంజు చెబుతాడు.

ఇంకా మీ చిన్నన్నయ్య నన్ను వెర్రివాన్ని చేసి ఆ శ్రుతిని లేవదీసుకుని పోయాడు. ఆ శ్రుతి నాతో పెళ్లి ఫిక్స్ అయ్యాక రవిగాడితో లేచి పోయి పెళ్లి చేసుకుంది. అందుకే వాళ్లు కూడా నా శత్రువులే కదా. వాళ్లకు మీ మీనా వదిన ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. అందుకే నాకు మీ మీనా నచ్చదు. నాకున్న డబ్బు, పరపతితో మీ బాలుగాన్ని ఎప్పుడే లేపించేవాడిని. కానీ అలా చేస్తే వాడికి నాతో పెట్టుకుని ఎంత పెద్ద తప్పు చేశాడో తెలిసేలోపే చస్తాడు. అలా కాకూడదు కదా. ప్రతిరోజు ఫీల్ అవ్వాలి కదా. వాడు నా జోలికి రాకుండా చేతులు కట్టేసి ఆడుకుంటే అప్పుడు కదా నాకు మజా వచ్చేదని సంజు అంటాడు.

ముక్కలుముక్కలుగా నరుకుతాడు

అందుకే నీ మెడలో పసుపుతాడి కట్టి ఇక్కడికి లాక్కొచ్చాను. ఇప్పటినుంచి నీకు ప్రతిరోజు శిక్ష వేస్తుంటాను. ఇక్కడ దెబ్బ పడితే వాడు అక్కడ గిలిగిలలాడాలి. ఇక్కడ కోడలివి అనుకుంటున్నావేమో. నువ్ నా పర్సనల్ పని మనిషివి. నీకు ఇక్కడ ఎలాంటి సపోర్డ్ ఉండదు. అర్థమైందా అని సంజు అంటాడు. ఛీ అర్థమైంది. నువ్ అసలు మనిషివేనా. నీ అసలు రూపం తెలియకా, బాలు అన్నయ్య ఎంత అడ్డుపడ్డా వినలేదు. నీ గురించి మా అన్నయ్యకు ఒక్క ముక్క చెబితే నిన్ను ముక్కలుముక్కలుగా నరుకుతాడు అని మౌనిక అంటుంది.

నీలాంటి వాడిని నరికినా తప్పులేదు. ఇప్పుడే నీ గురించి అందరికి చెబుతాను అని మౌనిక వెళ్లబోతుంటే సంజు ఆగమంటాడు. అప్పుడు దిండు కింద ఉన్న గన్ తీసి.. వెళ్లి చెప్పి.. నాకు అదే కావాలి. వాడు రావాలి. వాడు నా చేతుల్లో చస్తే నేను జైలుకు వెళ్లను. కానీ, నా మీద హత్యాప్రయత్నం చేస్తే వాడు జైలుకు వెళ్తాడు. రెండింట్లో ఏది జరిగినా నాకే లాభం. నీ కాపురం కూలిపోయి మీ అన్నయ్య జైలుకు పోయి మీరంతా సర్వ నాశనం అయిపోతే మీ నాన్న గుండె పట్టుకుని కూలిపోయి మీ నాన్న విధవ అయిపోయి కుటుంబమంతా ముక్కలైపోతుంది. ఇదే కదా నాకు కావాల్సింది అని సంజు అంటాడు.

ఎప్పుడైతే నువ్ ఈ గడపదాటి నిజం చెబుతావో అప్పుడు ఇవన్ని జరుగుతాయి. మీ బాలు జైలుకు వెళ్లిన నేను వదిలిపెట్టను. క్షణం క్షణం నరకం చూపిస్తాను. ఈరోజు కోసమే నేను ఇన్నిరోజులు బాలు గాడు ఎంత అవమానించిన పడ్డాను. ఈ రోజు నాకు శుభరాత్రి. ఇకనుంచి నీకు కాళరాత్రి. చీర్స్ అని సంజు అంటాడు. దాంతో మౌనిక కుప్పకూలిపోతుంది. అప్పుడు బాలు, రవి చెప్పిన మాటలు తలుచుకుంటుంది మౌనిక. బాలును కొట్టింది తలుచుకుని నన్ను క్షమించు అన్నయ్య. నేను జీవితాంతం శిక్ష అనుభవిస్తాను. ఇక్కడే చస్తాను అని అనుకుంటుంది మౌనిక.

రానిచ్చేది లేదు

మరోవైపు మౌనిక ఏడుపు విని సువర్ణ వెళ్లబోతుంది. కానీ, నీలకంఠం అడ్డుకుంటాడు. ఆ బాలుగాడి చేతిలో నా కొడుకు ఎన్ని దెబ్బలు పడ్డాడు. మరి వాడు ప్రతికారం తీర్చుకోకూడదా. వాడు ఒంటి మీదే కొట్టాడు. వీడు వాడి ఇంటి మీదే కొట్టాడు. ఈ ఇంట్లో నువ్ ఉండాలంటే ఏం జరిగినా చూస్తూ ఉండాలి అని వార్నింగ్ ఇస్తాడు నీలకంఠం. మరోవైపు బాలు రాలేదని ప్రభావతితో అంటాడు సత్యం. వచ్చిన రానిచ్చేదిలేదు అని ప్రభావతి అంటుంది.

ఇంతలో బాలు వస్తే ఆగమని ఇంట్లో ఉండొద్దు అని ప్రభావతి అంటుంది. అందరికి నేను ఎందుకు. నాతో ఏం పని. నేను కారు డ్రైవర్‌ని. నీ పెద్దకొడుకు, చిన్న కొడుకు కోటీశ్వరుడి భార్యను చేసుకున్నారు. నీ కూతురుకి కూడా కోటీశ్వరుల సంబంధం చూశావ్. నేనే పూలమ్ముకునే వాళ్ల అమ్మాయిని చేసుకున్నాను. కానీ, వీరికి నేను ఏమైపోయాను అని అవసరం లేదు. కానీ, ఇది మాత్రం నన్ను తీసుకొచ్చింది అని బాలు అంటాడు.

దానికి బుద్ధి లేదు. మేము ప్రశాంతంగా బతకాలంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు. వీడొక పచ్చి రౌడీ, గూండా. రౌడీయిజం చేయడం తప్పా మంచి చెడు, పెద్ద చిన్న తేడా తెలియదు. ఇలాంటివాడికి ఇంట్లో చోటు లేదు అని ప్రభావతి అంటుంది. ఎవరికి ఉంది. లక్షలు మింగినోడికా. లేచిపోయినవాడికా అని బాలు అంటాడు. నీ వల్ల పెళ్లి ఆగిపోయేది. వాళ్లు మంచివాళ్లు కాబట్టి ఊరుకున్నారు. వెళ్లరా. నీ వల్ల ఎవరికి మనశ్శాంతి లేదు అని మనోజ్ అంటాడు.

సత్యం ఉగ్రరూపం

ఎందుకు లేదు. నా భర్త ఏం నేరం చేశాడు. దొంగతనం చేశాడా, అబద్ధాలు చేప్పడా. అందరిని మోసం చేశాడా అని మీనా అంటుంది. ఇంతలో ప్రభావతి అడ్డుపడితే.. క్షమించండి అత్తయ్య. ఇందాక ఇంత వయసు వచ్చిన మీరే మీ అత్తగారిని అడ్డుపడితే జోక్యం చేసుకోవద్దన్నారు. ఆ మాట నేను మిమ్మల్ని అంటే బాగుండదు అని మీనా అంటుంది. దాంతో ప్రభావతి, సత్యం షాక్ అవుతారు. ఏం తెలుసని ఆయన మీద అరుస్తున్నారు. ఎందుకు అన్నిసార్లు పెళ్లిని ఆపాలని చూశారు. అంత మూర్ఖుడా నా భర్త అని మీనా అంటుంది.

బారులో జరిగిన గొడవ వల్ల కాదు. ఇంకో కారణం ఉంది. ఆ కారణాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే తోడబుట్టిన చెల్లెలికి అన్యాయం జరగకూడదని పోరాటం చేశాడు. అది తప్పా. మీరంతా ఎంత తాగాడనే చూస్తారు. కానీ, ఎందుకు తాగాడని చూడరు. పసివాడు నా భర్త. అందరు కావాలనుకుంటాడు. కానీ, అందరూ వెలివేస్తారు. అది మా దురదృష్టం. మీరు రండి అని మీనా అంటుంది. మనోజ్ అడ్డుకుంటాడు. మీరు గొప్పగా బతకలాని 40 లక్షలు ఎత్తుకెళ్లారు. కానీ, వాళ్ల నాన్న కోసం నాలుగు లక్షలకు జీవనాధారం వదిలేసారు అని మీనా అంటుంది.

హక్కు, అధికారం ఉన్న నా భర్తను ఇంట్లో ఉండకూడదని చెప్పే అధికారం ఎవరికి లేదు అని మీనా అంటుంది. నాకు ఇంట్లో హక్కులు, అధికారాలు ఉన్నాయనుకుంటుంది. నువ్ కూడా నన్ను పొమ్మంటావా నాన్న అని బాలు అంటుంది. అమ్మా వాడికి చెల్లెలి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. తీసుకెళ్లి భోజనం పెట్టి పడుకోబెట్టు అని సత్యం అంటాడు. దాంతో బాలును మీనా తీసుకెళ్తుంది. అమ్మా అని మనోజ్ అంటే.. ఏం కావాలి.. ఏం కావాలి.. లోపలికి వెళ్లు అని గట్టిగా మనోజ్‌పై అరుస్తాడు సత్యం.

భయపడిన ప్రభావతి

దాంతో మనోజ్‌ను రోహిణి తీసుకెళ్తుంది. నా నోరు మూయిస్తారు. పెళ్లిలో వాడి నోరు మూయించారా. మీరు ఇలా చేయబట్టే వాడు ఇలా అని ప్రభావతి అంటుంటే.. ఏంటీ అని కోపంగా అంటాడు. దాంతో భయపడిపోయిన ప్రభావతి ఏం లేదు. తొందరంగా వచ్చి పడుకోండి అని వెళ్లిపోతుంది. అలా సత్యం ఉగ్రరూపంతో ఇల్లంతా భయపడిపోతుంది. తర్వాత బాలుకు భోజనం తీసుకొచ్చి ఇస్తే వద్దంటాడు. తినాలని లేదంటాడు.

గుండెనిండా బాధ ఉన్నప్పుడు, కడుపునిండా దుఖం ఉన్నప్పుడు తినాలని అనిపిస్తుందా అని బాలు అంటాడు. ఉండదు. అందుకే దేవుడు తల్లిని సృష్టించాడు. పెళ్లయ్యాక తల్లి బాధ్యత తీసుకోడానికి భార్యను సృష్టించాడు. బాధని, దుఖాన్ని, సంతోషాన్ని పస్తులు పడుకోనివ్వకుండా తోడుండాలంటాడు. అందుకే ఎంత రాత్రి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా తినేసి పడుకోదు అని బాలుకు అన్నం తినిపిస్తుంది మీనా.

ఇక చాలు, జీవితంలో మొదటిసారి భయమేస్తుంది. అమాయకు లేడి పిల్లను పులి బోనులోకి పంపించినట్లు పంపించారు. వీళ్లంతా అమాయకులు మీనా. వాడి నటన చూసి నమ్మేశారు. నీకు తెలుసు కదా. నన్నే కట్టిపడేశాడు. నేనెందుకు మౌనిక భవిష్యత్ నాశనం చేస్తాను చెప్పు అని బాలు బాధపడుతాడు. మౌనికకు కాళ్లు పట్టుకున్న కనికరించని కఠినాత్ముడు దొరికాడు. ఇప్పుడు మౌనిక వాడికి బెదిరిపోయి నా మాట విననందుకు కుమిలిపోతుంటుంది అని బాలు అంటాడు.

సంజు ఇంటికి బాలు

మరుసటి రోజు ఉదయం మౌనిక కాఫీ పెట్టబోతుంటే కింద పడుతుంది. అది విని లేచిన సంజు కావాలనే డిస్టర్బ్ చేశావ్ కదా. ముందు వెళ్లి ఆ చెత్తను క్లీన్ చేయి అని సంజు అంటాడు. తర్వాత మౌనికను కష్టపెడుతున్నారు. నేను వెళ్లి తీసుకొస్తాను అని బాలు బయలుదేరుతాడు. అది తెలిసి ప్రభావతి ఆపుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner