బాలు తనను తాగేసి కొట్టాడని అబద్ధం చెబుతాడు శివ. అతడి మాటలు నిజమని నమ్మిన మీనా బాలును నిలదీస్తుంది. శివ దొంగతనం చేశాడనే నిజం మీనా దగ్గర దాచి భార్య దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతాడు బాలు.
శివ చేయిని బాలు విరిచేశాడనే నిజం సత్యం, ప్రభావతితో పాటు మిగిలిన కుటుంబసభ్యులకు చెబుతుంది మీనా. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను రోహిణి, శృతి ఓదార్చుతారు.
బాలు ఇలా చేశాడంటే షాకింగ్‌గా ఉందని శృతి అంటుంది. మాటలు అనడం ఓకే కానీ ఇలా చేతుల, కాళ్లు విరిచేయడం ఏంటి రోహిణి ఫైర్ అవుతుంది. బాలుకు ఇదేం కొత్త కాదని, తన రెండు చేయి వేళ్లు విరిచేశాడని మనోజ్ అంటాడు.
శివ చేయకూడని తప్పు ఏదో చేసి ఉండొచ్చని బాలును సపోర్ట్ చేస్తుంది ప్రభావతి. శివ...గుణ దగ్గర పనిచేస్తున్నాడని, వడ్డీ డబ్బుల కోసం జరిగిన గొడవలో గుణను కొడుతుంటే శివ అడ్డుగా వెళ్లాడని, దాంతో కోపం పట్టలేని బాలు...శివ చేయివిరిచేశాడని మీనా అంటుంది.
మీనా మాటలను ప్రభావతి నమ్మదు. అడ్డం వెళ్లినందుకు ఎందుకు కొడతాడు... అంతకుమించి ఏదో బలమైన తప్పు ఏదో శివ చేసి ఉంటాడని ప్రభావతి అంటుంది. శివ...గుణ దగ్గర పనిచేస్తున్నాడని తెలిసి రోహిణి షాకవుతుంది. తాను రెండు లక్షలు తీసుకున్న విషయం శివకు తెలిసిపోయి ఉంటుందని భయపడుతుంది.
అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. శివను ఎందుకు కొట్టావు? చేయి ఎందుకు విరగొట్టావని బాలును నిలదీస్తాడు సత్యం. మీనా ఏం చెప్పలేదా అని బాలు అంటాడు. అది మాత్రమే కారణం కాదని అందరికి అర్థమవుతుందని సత్యం బదులిస్తాడు. శివ కాలేజీకి వెళ్లకుండా పనికిమాలిన వాళ్లతో తిరుగుతున్నాడని బాలు అంటాడు.
కాలేజీకి వెళ్లకపోతే బావగా ఆ ఇంటి బాధ్యత తీసుకోవాలి. లేదంటే మీనాతోనో, వాళ్ల అమ్మతోనో చెప్పాలి. అంతే కానీ చేయి విరిచే హక్కు నీకు లేదని సత్యం అంటాడు. రవి, శృతి కూడా బాలునే తప్పు పడతారు. మనవాళ్లు, పరాయివాళ్లు అన్నది కూడా బాలు ఆలోచించడని, ఇంట్లో వాళ్లనే రోజుకో రకంగా టార్చర్ పెడుతుంటాడని శృతి అంటుంది.
ఊరికే చెడుసావాసాలు తిరుగుతున్నాడంటే చేయిచేసుకోడు... శివనే బాలుకు ఎదురుతిరిగి ఉంటాడని ప్రభావతి అంటుంది. ఎవరికి ఏం చెప్పాలో తెలియక బాలు ఆలోచనలో పడతాడు. అమ్మ డబ్బులు కొట్టేశాడని చెబితే అది ఎక్కడికి దారితీస్తుందో అని భయపడతాడు.
మీనా తనను ఎంత ద్వేషిస్తుందో అనుంటాడు. నీ రౌడీయిజం అందరి మీద చూపిస్తావా అని బాలుతో వెటకారంగా అంటాడు. నువ్వు నోర్మూయ్ లేదంటే బాలు అనగానే...ఏం చేస్తావు మనోజ్ చేయి కూడా విరిచేస్తావా అని రోహిణి కోపంగా అంటుంది.
మీనా కాబట్టి ఊరుకుందని, ఇంకొకరు అయితే పోలీస్ కేసు పెట్టేవారని, ఇది క్రిమినల్ కేసు అని శృతి అంటుంది. ఇది నా సొంత విషయం మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని బాలు అంటాడు.
శివ తప్పేమి ఉండి ఉండదని రవి అంటాడు. నువ్వు చూశావా...అసలు వాడు చేసిన పనికి అని బాలు కోపంగా నిజం చెప్పబోయి ఆపేస్తాడు. ఏమైందో నిజం చెప్పు ఎందుకు ఆపేశావని సత్యం అంటాడు.
బాలును అడగటం ఆపేయమని సత్యంతో అంటుంది మీనా. మేం పేదవాళ్లం...పేదవాళ్లకు కోపం రాకూడదని, కొట్టిన తిట్టిన అడక్కూడదని సత్యంతో అంటుంది మీనా. రాజేష్ కోసమే శివ చేయిని బాలు విరిచేసి ఉంటాడని అపార్థం చేసుకుంటుంది. రేపు నా చేయి విరిచేసినా చూస్తూ ఊరుకోవాల్సిందేనని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నువ్వేమైనా శివకు డబ్బులు ఇచ్చావా...సంపాదిస్తున్నదంతా శివకే చేరవేస్తున్నావా అందుకే కొట్టావా అని ఫిట్టింగ్ పెడుతుంది ప్రభావతి. ఇంకో కొత్త కారణం పుట్టించొద్దు ప్రభావతిపై కోప్పడుతుంది మీనా. మా అమ్మ పూలు అమ్ముకొని బతుకుతుందని, తమ్ముడు కష్టపడి పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడని తన పుట్టింటిని వెనకేసుకొస్తుంది మీనా.
శివ అంతకుముందు బాలు బైక్ దొంగతనం చేశాడని, ఇప్పుడు అంతకంటే ఏదో పెద్ద తప్పే చేసి ఉంటాడని మనోజ్ అంటాడు. తన తమ్ముడు మారిపోయాడని, బుద్దిగా చదువుకుంటున్నాడని మీనా అంటుంది. ఒకసారి తప్పు చేస్తే మళ్లీ మళ్లీ తప్పులు చేయడానికి వాడేం మీలా కాదని, జాబ్ కోసమని వెళ్లి పార్కుల్లో పడుకొని రావడం లేదని మనోజ్ గట్టిగా ఇచ్చిపడేస్తుంది మీనా.
నిజంగా శివ పెద్ద తప్పు చేసి ఉంటే నేనే వాడిని ఇంట్లో నుంచి పంపిస్తానని, ఆ చేయి ఏదో నేనే విరిచేస్తానని మీనా అంటుంది. నీ ప్రతాపం మనోజ్ మీద కాదు...చేయి విరిచిన వాడిపై చూపించమని మీనాతో అంటుంది ప్రభావతి. శివకు, పార్వతికి క్షమాపణలు చెప్పమని బాలుకు ఆర్డర్ వేస్తాడు సత్యం.
నేను ఎవరికి క్షమాపణలు చెప్పను. నేనేం తప్పు చేయలేదని బాలు అక్కడి వెళ్లిపోతాడు. . ఇన్నాళ్లు బాలును కొంగున కట్టుకొని మీనా ఆడిస్తుందని అనుకున్నానని, కానీ బాలును ఎవరు మార్చలేని ప్రభావతి అనుకుంటుంది. ఈ గొడవను అడ్డుపెట్టుకొని మీనా, బాలులను ఇంట్లో పంపించేయాలని అనుకుంటుంది.
శివను కొట్టిన విషయం సత్యానికి చెప్పినందుకు మీనాపై ఫైర్ అవుతాడుబాలు . నీకు ఏదైనా సమస్య వస్తే నన్ను అడగాలి అని బాలు అంటాడు. మీతోనే సమస్య వస్తే అని మీనా అంటుంది. జరిగింది ఏమిటో తెలుసుకోవాలని బదులిస్తాడు బాలు.
ఇదంతా చెప్పి నా కుటుంబం నన్ను వేలెత్తి చూపేలా చేస్తావా అని మీనాతో కోపంగా అంటాడు బాలు. ఇంట్లో నా బాధను ఇంకొకరితో పంచుకునే హక్కు కూడా నాకు లేదా అని మీనా బదులిస్తుంది. బాలుపై కోపంతో వేడి గిన్నెను స్టౌ పై నుంచి ఉట్టి చేతులతో దించేస్తుంది మీనా.
వేడికి మీనా చేతి వేళ్లు కాలుతాయి. బాలు చూడబోతాడు. కానీ తన చేతులను విదిలించుకుంటుంది మీనా. ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటారో మీకే తెలియదని బాలును నానా మాటలు అంటుంది. . అందరితో మంచివాడిని అనిపించుకోవాలంటే నటించాలి.
అది నాకు రాదు... ఎవరితో ఏ గొడవ పెట్టుకోవద్దంటే తప్పు తప్పు అని చెప్పకూడదు. అదీ నాకు రాదు. నీ విషయంలో ప్రతిరోజు అమ్మతో గొడవపడుతూనే ఉన్నా. చూసి చూడనట్లు ఉండాల్సిందే అదీ నాకు రాదని బాలు అంటాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను అపార్థం చేసుకోవద్దని మీనాకు సర్ధిచెప్పబోతాడు బాలు.
తప్పంతా మాదేనా అని మీనా కోపంగా అంటుంది. బాలు అబద్ధం చెబుతున్నాడని అంటుంది. ఇంకెప్పుడు నన్ను వెనకేసుకొని రావడానికి మీ అమ్మతో గొడవపడొద్దని, నా చావు ఏదో నన్ను చావనివ్వండి అని అంటుంది.
బాలు, మీనా గొడవలు పడటం చూసి ప్రభావతి ఆనంద పట్టలేకపోతుంది. ఇన్నాళ్లు ఇద్దరు కలిసి తనను ఆడుకున్నారని, ఇప్పుడు ఎవరిని ఏమన్నా ఎవరు రారు అని కామాక్షితో తన సంతోషాన్ని పంచుకుంటుంది.మీనా తమ్ముడు పెద్ద దొంగ అని అంటుంది. మనోజ్- రోహిణి, రవి - శృతి ఏ గొడవలు జరిగిన తమ రూమ్‌లోనే చూసుకుంటారని, బాలు, మీనా మాత్రం రోడ్డుపై గొడవలు పడుతూ ఇంటి పరువు తీసేస్తున్నారని అంటుంది
ప్రభావతి మాటలు సత్యం వింటాడు. మీనా, బాలు గొడవ గురించి కామాక్షికి చెప్పడం అవసరమా అంటూ క్లాస్ ఇస్తాడు. వాళ్ల గొడవలు చూసి సంబరపడటం రాక్షసత్వం అనిపిస్తుందని అంటాడు. వాళ్లు నా కళ్ల ముందు గొడవలు పడటం నచ్చడం లేదని ప్రభావతి అంటుంది. బాలు , మీనాను ఇంట్లో నుంచి పంపించేద్దామని అంటాడు. అందుకు సత్యం ఒప్పుకోడు.
బాలు డాబాపై పడుకుంటాడు. తనను వదిలిపెట్టి మీనా వెళ్లిపోయినట్లు కల వస్తుంది. భయంతో జరిగింది మీనాకు చెప్పాలని రూమ్‌కు వస్తాడు.అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం