సత్యాన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వచ్చిన సత్యాన్ని చూసి అప్పుడేం వచ్చేశారేం అని శృతి అంటుంది. ఏం అసలే రాకూడదని అనుకున్నావా...అంత తొందరగా ఎందుకు వదిలేశారని అడుగుతున్నావా అని బాలు సెటైర్లు వేస్తాడు. పెద్ద ప్రాబ్లెమ్ అనుకున్నానని, వారం రోజులైనా హాస్పిటల్‌లో ఉంటారని అనుకున్నానని శృతి అంటుంది.
అంటే చాలా పెద్ద ఎత్తులోనే ప్లాన్ చేశావా అని బాలు నిలదీస్తాడు. అసలు ఏం జరిగింది నాకేం అర్థం కావడం లేదని శృతి అంటుంది. జరిగిన తప్పేమిటో నాకు తెలియాలని శృతి చెబుతుంది. నువ్వు చేసిన దోమల స్ప్రే వల్లే మావయ్యకు సీరియస్ అయ్యిందని, అలాంటివి ఆయనకు పడవని డాక్టర్లు చెప్పారని మీనా అంటుంది.
తాను కావాలని స్ప్రే చేయలేదని, అది తప్పని అనొద్దని శృతి వాదిస్తుంది. ఇప్పుడు గొడవ పెద్దది చేయాలని చూడొద్దని, తనకు తెలియకుండా చేసిందని శృతికి సపోర్ట్ చేస్తూ బాలును కోప్పడుతుంది ప్రభావతి. ఇదే పొరపాటు మీనా చేసుకుంటే తప్ప, అప్ప అన్నది చూసుకోకుండా రచ్చ రచ్చ చేసేదానివి...శృతి డబ్బుంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు... సమస్య వచ్చింది మా నాన్నకు కాదు నీ భర్తకు కూడా అని ప్రభావతితో కోపంగా అంటాడు బాలు.
బిల్లు నువ్వు కడతావా, మీ ఆయన కడతావా...అనవసరంగా అప్పు చేయాల్సివచ్చిందని బాలు. అతడిని నాతో మాట్లాడవద్దని చెప్పు రవి అంటూ శృతి కోపంగా అంటుంది. మావయ్యకు సీరియస్ అయ్యిందనే బాధలో మాట్లాడుతున్నాడని, ఇదంతా కోపం కాదని, ఏం అనుకోవద్దని శృతికి మీనా సర్ధిచెబుతుంది. నేను చెప్పినప్పుడే దోమల స్ప్రే కొట్టడం ఆపేస్తే సరిపోయేదని మీనా అంటుంది. నేను అందరి గురించి ఆలోచించానని శృతి బదులిస్తుంది.
నీ కోడలు ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూశావా అని బాలు అంటాడు. పొగరు అంటే ఊరుకోనని శృతి ధీటుగా సమాధానమిస్తుంది. అప్పు చేసి బిల్లు కట్టినందుకే బాలు గొడవ చేస్తున్నాడని, ఎంత బిల్ అయ్యిందో చెబితే ఇప్పుడే ఇస్తానని అంటాడు. నీకు డబ్బుందన్న పొగరు అహంకారం అని బాలు చెబుతాడు. బాలు, శృతిలకు సర్ధిచెబుతుంది మీనా.
డబ్బుది ఏముంది...మావయ్య కోసం ఆయన ఎంతైనా ఖర్చుపెడతారు, కన్నతండ్రి కోసం కొడుకులు ఎంతైనా ఖర్చుపెడతారని మీనా అంటుంది. కొడుకు అను...కొడుకులు అనకు..ఒక్కడు ఒక్క రూపాయి తీయలేదని, పెళ్లాలకు ఉన్న పౌరుషం ఈ కొడుకులకు లేదని బాలు కోపంగా అంటాడు. గొడవ పెద్దది అవుతుందని సత్యం అందరిని అక్కడి నుంచి పంపించేస్తాడు.
సత్యాన్ని తన రూమ్‌లో పడుకోమ్మని బాలు అంటాడు. అక్కడైతే ఎవరూ స్ప్రే చేయరని బాలు అంటాడు. ఛీ అని శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బాలు పరుపును రూమ్‌లోకి తీసుకెళ్లబోతుంటే మీనా ఆగమని అంటుంది. నువ్వు మీ నాన్నను గదిలో పడుకోమని అంటున్నావని, మీ ఆవిడ మాత్రం వద్దని అంటుందని మీనాపై ప్రభావతి రుసరుసలాడుతుంది.
నాకు నోరుంది...ఏమైనా మాట్లాడగలనని మీనా కోపంగా బదులిస్తుంది. శృతి ఏదైనా చేయాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలని అని అడిగింది..అప్పుడే ఏమైంది మీ నోరు అని నిలదీస్తుంది. మీనా మాటలతో ప్రభావతి సైలెంట్‌గా మారుతుంది. మా రూమ్‌లో దుమ్ము ఉందని, క్లీన్ చేసి వస్తానని ఆగమన్నానని చెబుతుంది. బాగా అయ్యిందా...ఎప్పుడు నోరు తెరవని మీనా కూడా నీ నోరు మూయించేలా చేసుకున్నావని ప్రభావతితో అంటాడు సత్యం.
తండ్రికి క్షమాపణలు చెబుతాడు రవి. శృతి నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య వచ్చిందని బాధపడతాడు.జరిగిందేదో జరిగిపోయింది, ఆ అమ్మాయిని బాలు నానా మాటలు అన్నాడు...ఎంత బాధపడుతుందో ఏమిటోనని సత్యం అంటాడు. శృతిని బాధపడొద్దని చెప్పు...నువ్వు బాధపెట్టొద్దు అని రవితో చెబుతాడు సత్యం.
బాలు అన్న మాటలు సహించలేకపోతుంది శృతి. రవి రూమ్‌లోకి రాగానే...మీ అన్నయ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడని కోపంగా అంటుంది. నీ భార్యను నీ కళ్ల ముందే తిడుతుంటే ఏం చేశావని నిలదీస్తుంది. తప్పు నీ వైపు ఉంటే నిన్ను ఎలా సపోర్ట్ చేయాలని రవి బదులిస్తాడు.
నేనేదో ఇంటర్నేషనల్ క్రైమ్ చేసినట్లు పదే పదే తప్పు అనొద్దని భర్తపై శృతి ఫైర్ అవుతుంది. నాన్నకు హార్ట్ ఆపరేషన్ అయ్యిందని, ఆయన దగ్గితే ప్రమాదమని తెలియదా శృతితో రవి అంటాడు. చదువుకున్నావు కదా ఆ మాత్రం తెలియదా క్లాస్ ఇస్తాడు. నేను చదివింది ఇంజినీరింగ్...మెడిసిన్ కాదని శృతి బదులిస్తుంది.
ఇలాంటి బేసిక్ విషయాలు తెలుసుకోవడానికి కామెన్స్ సెన్స్ ఉంటే చాలని రవి అంటాడు. అది లేనిది మీ అన్నకు అని శృతి అంటుంది. అన్ని విషయాల్లో ఇన్‌వాల్వ్ అవుతాడని, తను తప్ప అందరిని చెడ్డొళ్లు అనుకుంటాడని బాలుపై ఫైర్ అవుతుంది శృతి. అన్నయ్యను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని శృతికి సర్ధిచెప్పబోతాడు రవి. అయినా శృతి వినదు.
నువ్వు కూడా మీ బాలు అన్న మాటలే కరెక్ట్ అని నన్ను తిడుతున్నావు...నేను తప్పు చేయలేదని, తెలిసి చేస్తే తప్పు...తెలియక చేస్తే పొరపాటు అని శృతి వాదిస్తుంది. అయితే ఒకే నీకు నచ్చినట్లే చేయి...నాన్నతో పాటు ఎవరికి ఏమైనా పర్వాలేదా అని రవి కోపంగా అంటాడు.
అంటే ఏంటి ఇప్పుడు నీకు సారీ చెప్పాలా అని శృతి అంటుంది సారీ చెబుతుంది. నాకు కాదు నాన్నకు చెప్పమని రవి అంటాడు. మీకు హెల్త్ కండీషన్ ఉందని తెలియక దోమల మందు స్ప్రే చేశానని, అది నా తప్పే వెటకారంగా సత్యంతో అంటుంది శృతి. నువ్వు ఇందంతా ఏం ఆలోచించకుండా పడుకోమని ప్రభావతి అంటుంది. శృతితో గొడవపడొద్దని రవితో అంటుంది. కోటీశ్వరురాల అమ్మాయి అయినా మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పిందని శృతిని వెనకేసుకొస్తుంది ప్రభావతి.
కోటీశ్వరులు అయితే పొరపాటు చేసినప్పుడు ఒప్పుకోరా అని సత్యం అంటాడు. అయినా నేనేం చెప్పమని అనలేదని సత్యం చెబుతాడు. అడక్కుండానే చెప్పడం సంస్కారం అని ప్రభావతి బదులిస్తుంది. మీరు తెచ్చారు పూలగంపను దానికి ఏమైనా కృతజ్ఞత అనేది ఉందా మీనాపై తన మనసులో ఉన్న ద్వేషాన్ని బయటపెడుతుంది. ఇంకా ఎంతకాలం ఆ అమాయకురాలిని వేధిస్తావని సత్యం అంటాడు. ఎంత ప్రయత్నించిన నాకు నువ్వు అర్థం కావని అంటాడు.
నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పినట్లు లేదని, రివర్స్‌లో ఇన్‌సల్ట్ చేసినట్లు ఉందని శృతితో అంటాడు రవి. ఎదుటివాళ్ల ఎమోషన్స్‌ను అసలు పట్టించుకోవు అని క్లాస్ ఇస్తాడు. పొగరు చూపిస్తున్నావని అంటాడు. ఎవరు పొగరు చూపిస్తున్నారని, పొగరు చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని దిండుతో రవిని కొడుతుంది శృతి. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకోవడానికి వస్తువులు ఎత్తుతారు. కోపగించుకున్నందుకు శృతికి సారీ చెబుతాడు రవి. అయినా శృతి కోపం పోకపోవడంతో ఆమెను గట్టిగా వాటేసుకుంటాడు.
మీనాకు సుశీల ఫోన్ చేస్తుంది. పెళ్లి ఫొటోలు బాలు పంపించాడని, బాగున్నాయని అంటుంది. పెళ్లి వద్దనే స్థాయి నుంచి నా పెళ్లాం నా పక్కన లేకుండా ఉండలేననే స్థాయికి బాలు చేరుకోవడం ఆనందంగా ఉందని అంటుంది. ఆ ఫొటోలు చూసి ప్రభావతి నిద్రపోయిందా? కొడుకు సంసారం చక్కగా ఓర్చుకోలేని తల్లి అని అంటుంది. సత్యానికి ఎలా ఉందని మీనాను అడుగుతుంది సుశీల. ఆయనకు ఓ సమస్య వచ్చిందని మీనా చెప్పబోతుండగా...చెప్పొద్దని సత్యం సైగలు చేస్తాడు. మావయ్యకు ఏ సమస్య లేదని మీనా అబద్ధం చెబుతుంది.
అప్పుడే వచ్చిన బాలు...మీనా మాట్లాడుతోన్న ఫోన్ తీసుకొని సుశీలతో మాట్లాడుతాడు. నాన్నను హాస్పిటల్ నుండి అని ఆగిపోతాడు. బాలు మాటలతో సుశీల కంగారు పడుతుంది. నాన్నను రెగ్యులర్ చెకప్‌ను తీసుకెళ్లానని, ఏ సమస్య లేదని అన్నారని మాట మార్చేస్తాడు. పెళ్లి ఫొటోల్లో ఇద్దరు బాగున్నారని అంటుంది. మీనా చాలా మంచిదని, తన మనసును కష్టపెట్టకుండా చూసుకోమని ఆమె నిన్ను రాజు చేసి అందలం ఎక్కిస్తుందని సుశీల అంటుంది. నాకు నేను రాజును అని బాలు అంటాడు. రాజేగా చేసేస్తే పోలా అని మీనా బదులిస్తుంది.
అమ్మకు ఇలాంటివి చెప్పి ఈ వయసులో బాధపెట్టడం ఇష్టలేకే చెప్పొద్దని అన్నానని మీనా, బాలుతో అంటాడు సత్యం. పల్లెటూళ్లో ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన గ్రూప్ ఫొటో ఒకటి ఫ్రేమ్ కట్టించి తీసుకురమ్మని, ఇంట్లో పెట్టుకుందామని సత్యంతో చెబుతాడు బాలు. ఇంట్లోనా ఎక్కడ పెడతారని ప్రభావతి అంటుంది. నీ ఫొటో ఒకటి తీసుకొచ్చి బయటపెడతా...దిష్టిబొమ్మలా బాగుంటుందని బాలు సెటైర్ వేస్తాడు.
గ్రూప్ ఫొటో ఫ్రేమ్ కట్టించడానికి స్టూడియోకు వెళతాడు బాలు. ఆ స్టూడియో ఓనర్ ప్రభావతి డబ్బులను శివ కొట్టేసిన వీడియోను బాలుకు చూపిస్తాడు. అది చూడగానే బాలు షాకవుతాడు. వడ్డీ డబ్బుల కోసం రాజేష్‌ను గుణ, శివ కొట్టబోతుండగా బాలు అడ్డుకుంటాడు. గుణను కొడతాడు. బాలు శివ కాలర్ పట్టుకుంటాడు. నువ్వు నా కాలర్ పట్టుకుంటావా అని కోపంతో బాలు శివను కొడతాడు అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం