తల్లి దగ్గర శివ కొట్టేసిన డబ్బును తిరిగి తండ్రికి ఇచ్చేస్తాడు బాలు. ఎవరు ఆ డబ్బులు కొట్టేసిన దొంగ అని బాలును అడుగుతాడు రవి. ఏమో తెలియదని బాలు అబద్ధం ఆడుతాడు. పోలీసులు పిలిచి విషయం చెప్పి డబ్బులు ఇచ్చారని బదులిస్తాడు.
మామూలుగా ఇలా డబ్బు దొరికితే పోలీసులు మొత్తం ఇవ్వరు అని మనోజ్ లాజిక్‌లు మాట్లాడుతాడు. నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదని రోహిణి కూడా బాలుపై డౌట్ వ్యక్తం చేస్తుంది. మీ మావయ్య మలేషియా నుంచి వచ్చాడంటే మేము నమ్మలేదు...ఇది అంతే అని వెటకారంగా సమాధానమిస్తాడు.
డబ్బు పోయిందని తాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని ప్రభావతి అంటుంది. కంప్లైంట్ ఇవ్వకుండానే దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు బాలును అడుగుతుంది రోహిణి. అమ్మ కంప్లైంట్ ఇవ్వలేదు కానీ డబ్బు పోయిన రోజే నాకు తెలిసిన పోలీస్‌కు చెప్పి పెట్టానని, దొంగను పట్టుకోగానే డబ్బు ఇచ్చారని అంటుంది.
దొంగను పట్టుకుంటే ముందు కోర్టులో సబ్‌మిట్ చేస్తారు కదా...డబ్బులు ఎలా ఇస్తారని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది రోహిణి. డిపార్ట్‌మెంట్ గురించి డీప్‌గా స్టడీగా చేసినట్లు ఉన్నావు...ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసు అని రోహిణిపై రివర్స్ ఎటాక్ మొదలుపెడతాడు బాలు. దాంతో రోహిణి సెలైంట్ అవుతుంది.
ఆ దొంగ కనబడితే తోలువొలిచేస్తా అని ప్రభావతి అంటుంది. వాడు జైలులో ఉండి ఉంటాడు...అక్కడికే వెళ్లి కలువు అని బాలు పంచ్ వేస్తాడు. డబ్బును తాను జాగ్రత్తగా దాచిపెడతానని ప్రభావతి అంటుంది. ఒకసారి ఇస్తే ఏం చేశావని సత్యం పంచ్ వేస్తాడు. పోలీసులు మొత్తం డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చారని బాలు చెప్పిన కథను రోహిణి అస్సలు నమ్మదు.
దీని వెనుక ఏదో మతలబు ఉంటుందని అనుకుంటుంది. ఎప్పుడో మిస్సైన డబ్బు ఇప్పుడు ఎలా వచ్చింది, బాలు మీద నాకు ఎందుకో అనుమానంగా ఉందని అంటుంది. ఆ దొంగకు బాలుకు ఏదో లింక్ ఉందని అంటుంది. లేదంటే బాలునే ఎవరైనా మనిషిని పెట్టించి డబ్బును కొట్టేసి ఉండొచ్చునని రోహిణి అంటుంది.
బాలుకు కోపం ఎక్కువే కానీ డబ్బు కోసం గడ్డి తినే రకం కాదని మనోజ్ అంటాడు. నా తమ్ముడు అని కాదు కానీ నిజాయితీలో వాడిని వేలేత్తి చూపించలేమని తమ్ముడిని సపోర్ట్ చేస్తాడు మనోజ్. దొంగతనం జరిగిన డబ్బు మొత్తం తిరిగి రాదు...కానీ బాలు మొత్తం ఎలా తిరిగితీసుకొచ్చాడని రోహిణి అంటుంది. దొంగ ఎవరో, దొంగతనం చేసింది ఎవరో తాను తెలుసుకొని తీరుతానని అంటుంది. రోహిణి, మనోజ్ మాటలను మీనా వింటుంది.
శివ తనతో అన్న మాటలు బాలు భరించలేకపోతాడు. మీనా రూమ్‌లోకి రాగానే పుట్టింటికి ఎందుకు వెళ్లావని ఆమెపై ఫైర్ అవుతాడు. నువ్వే పుట్టింటికి వెళ్లావుగా...నేను నిన్ను పంపించలేదుగా అని కోపంగా అడుగుతాడు.
గుణ దగ్గర జాబ్ చేయద్దని చెప్పడానికి నేను నిన్ను పుట్టింటికి పంపించానని మీ తమ్ముడు టాక్సీ స్టాండ్‌కు వచ్చి నాతో గొడవపడ్డాడని మీనాతో బాలు కోపంగా అంటాడు. ఈ సారి బతికిపోయాడు. మళ్లీ జోలికి వస్తే రెండో చేతిని విరిచేస్తానని మీనా ముందే శివకు వార్నింగ్ ఇస్తాడు. శివ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియడం లేదని, మీరు ఏదో దాస్తున్నారని బాలుకు బదులిస్తుంది మీనా.
మామూలుగా అయితే అంత గొడవ జరిగిన తర్వాత శివ మీ దగ్గరకు రాకూడదు...అసలు మిమ్మల్ని ఎందుకు కలిశాడో చెప్పమని బాలును అడుగుతుంది. అన్ని నన్నే అడుతావేంటి? నేను ఎప్పుడు ఇంత దిగజారలేదు. ఎవ్వడి ముందు తగ్గనివాడిని మీ తమ్ముడి ముందు తగ్గాల్సివచ్చిందని బాలు కోపంగా అంటాడు.
శివపై ఎందుకు మీకు ఇంత పంతం అని భర్తను నిలదీస్తుంది. పంత నాది కాదు వాడితే...మళ్లీ ఆ గుణతోనే తిరుగుతున్నాడు, వద్దన్న పనే చేస్తున్నాడని బాలు కోపంగా అంటాడు. గుణతో చేరి శివ ఏదేదో చేస్తున్నాడు బాలు కోపంగా అంటాడు.
అదే ఏం చేస్తున్నాడు...శివ మిమ్మల్ని ఎందుకు కలిశాడు? బైక్ దొంగతనం చేసిన విషయం దాచిపెట్టారు..ఇప్పుడు కూడా ఏదో దాస్తున్నారని అదేదో చెప్పమని బాలును నిలదీస్తుంది మీనా.
అసలు నువ్వు పుట్టింటికి వెళ్లడం వల్లే గొడవలు వస్తున్నాయని, నాపై ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇక నుంచి పుట్టింటికి వెళ్లొద్దని మీనాకు పనిష్‌మెంట్‌విధిస్తాడు బాలు.మీ అమ్మ, చెల్లిని కలవాలంటే, మాట్లాడాలంటే ఇక్కడికి రమ్మను, లేదంటే గుడికి వెళ్లి కలవమని మీనాతో చెప్పి వెళ్లిపోతాడు బాలు.
గొడవ గురించి తెలుసుకోవడానికి శివకు కాల్ చేస్తుంది మీనా. మీ బావను కలవడానికి వెళ్లావా అని శివను అడుగుతుంది మీనా. ఏ బావ అని వెటకారంగా బదులిస్తాడు శివ. చెప్పు తెగుద్ది అని మీనా కోపంగా అంటుంది. అసలు మీ మధ్య ఏం జరుగుతుంది అని నిలదీస్తుంది.
గుణతో చేరి అడ్డమైన పనులు చేస్తుంటే నేను కూడా ఊరుకోనని అంటుంది. గుణ దగ్గర పనిమానేసి బుద్దిగా చదువుకోమని అంటుంది. అసలు మీ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా, మీ మధ్య నేను నలిగిపోతున్నానని కోపంగా తమ్ముడిపై ఫైర్ అవుతుంది మీనా. నిన్ను కలవకూడదని, పుట్టింటికి రాకూడదని బావ అన్నాడని తమ్ముడితో చెబుతుంది మీనా. బాగానే ఆర్డర్లు వేస్తున్నాడు టాక్సీ మినిస్టర్ అంటూ శివ వెటకారం ఆడుతాడు.
నేను ఎలా ఉండాలో నాకు తెలుసు...నాకు ఎవరు ఏం చెప్పాల్సిన పనిలేదని లేదని శివ బదులిస్తాడు. మీ ఆయనను మీ ఇంటి సంగతి చూసుకోమని చెబుతాడు. గుణ దగ్గరే పనిచేస్తానని ఖరాఖండిగా అంటాడు. మా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడని, కానీ నీ వల్లే నేను పుట్టింటికి దూరం కావాల్సివస్తుందని మీనా అంటుంది. మీ ఆయన బాగానే చూసుకుంటే అక్కడే ఉండు...ఇక్కడికి రాకు...మా సంగతి నువ్వు, మీ ఆయన పుట్టించుకోవద్దు. మేం హ్యాపీగానే ఉంటామని ఫోన్ కట్ చేస్తాడు.
కేరళ ట్రిప్‌కు సంబంధించి శోభన ఇచ్చిన పాస్‌లో విషయంలో శృతి, రవి మధ్య మరోసారి గొడవలు జరుగుతాయి. ఎంత చెప్పిన ఆ ట్రిప్‌కు వెళ్లడానికి రవి ఒప్పుకోడు. నాకు డబ్బు సంపాదించడం చేతకాదని ఇన్‌సల్ట్ చేయడానికే ఆ పాస్‌లు ఇచ్చారని శృతితో అంటాడు రవి. నేను సంపాదించి సొంత ఖర్చులతోనే హనీమూన్ తీసుకెళతానని, నాపై నమ్మకం ఉంటే అప్పటివరకు వెయిట్ చేయమని రవి అంటాడు.
అప్పుడే శోభన ఫోన్ చేయడంతో గొడవ గురించి తల్లికి చెబుతుంది. రవి బాగా సంపాదించడానికి యాభై, అరవై ఏళ్లు పట్టొచ్చు...అప్పుడే హనీమూన్ వెళతామని అంటుంది. మీ వాళ్లకే కాదు నీకే నాపై నమ్మకం లేనట్లుగా ఉందని శృతి మాటలతో రవి అంటాడు. చాప దిండు తీసుకొని బయటకు వెళ్లిపోతాడు.
బాలుకు ఫేవరేట్ అని పూరి టిఫిన్ చేస్తుంది మీనా. సత్యం ఈజీగా కనిపెట్టేస్తాడు. పూరీ ఎందుకు చేశావో అర్థమైందని అంటాడు. నేను మామూలుగానే చేశావని బుకాయించబోయి దొరికిపోతుంది. బాలుకు దొరక్కుండా జాగ్రత్త పడాలని అనుకుంటుంది.
తల్లి దగ్గరకు వచ్చిన మనోజ్ ఇంటర్వ్యూకు వెళుతున్నానని, కొంచెం డబ్బు కావాలని అంటాడు. జాబ్ చేస్తున్నావుగా...ఇంటర్వ్యూ ఏంటి అని ప్రభావతి అడుగుతుంది. జాబ్ వదిలేశానని మనోజ్ బదులిస్తాడు.
ఒక్క ఉద్యోగం కూడా సరిగ్గా చేయగా అని మనోజ్ కాలర్ పట్టుకుంటుంది ప్రభావతి. బాలు ఈ మధ్యే నీ జోలికి రావడం మానేశాడు. ఈ సంగతి తెలిస్తే చీరేస్తాడని అంటుంది. నువ్వు జాబ్ మానేసిన సంగతి రోహిణికి తెలిస్తే వదిలేసి వెళ్లిపోతుందని ప్రభావతి అంటుంది. రోహిణికి ఆల్రెడీ తెలుసునని చెప్పి ప్రభావతికి షాకిస్తాడు మనోజ్. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం