భార్యలతో గొడవలు పడి డాబాపై పడుకుంటారు బాలు, మనోజ్, రవి. ముగ్గురు చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకొని సరదాగా నవ్వుకుంటారు. మరోవైపు మీనా, రోహిణి, శృతి కూడా టీ తాగుతూ అర్థరాత్రి వరకు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటారు. బాలు, మనోజ్, రవిలకు పనిష్‌మెంట్ ఇవ్వాలని అనుకుంటే సీన్ రివర్స్ కావడం రోహిణి, మీనా, శృతి తట్టుకోలేకపోతారు. రవిని ఓ ఆట ఆడుకుంటానని శృతి అంటుంది.
ఉదయం లేవగానే మీనా కాఫీ తీసుకురా అంటూ ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. ఇదేమైనా హోటలా ఆర్డర్ వేస్తున్నావని సత్యం కోపంగా అంటాడు. మీనా కాఫీ ఇవ్వదని, కస్టమర్స్ వచ్చారని షాప్ దగ్గరకు వెళ్లిందని సత్యం అంటాడు. నువ్వే కాఫీ పెట్టుకోమని భార్యకు సలహా ఇస్తాడు.
పూల షాప్ పెట్టినప్పటి నుంచి ఇరవై నాలుగు అక్కడే ఉంటుందని, ఇంట్లో ఉండటమే మానేసిందని ప్రభావతి కోపంతా అంటుంది. ఇరవై నాలుగు ఇంట్లో ఉండటానికి మీనా ఏం ఇంటి పనిమనిషి కాదని సత్యం సెటైర్లు వేస్తాడు. నువ్వేమైనా కలెక్టర్ జాబ్ చేస్తున్నావా అర్జెంట్‌గా వెళ్లి సంతకాలు పెట్టడానికి వెళ్లి కాఫీ పెట్టుకోమని భార్యకు క్లాస్ ఇస్తాడు.
అప్పుడే మనోజ్ చాప, దిండు తీసుకొని మేడపై నుంచి కిందికొస్తాడు. నువ్వు మేడపై పడుకోవడం ఏంటి? అని మనోజ్‌ను అడుగుతుంది. ఏం లేదని సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతాడు. రోహిణి, శృతి ఏదో గొడవ పడి ఉంటారని ప్రభావతి అనుకుంటుంది. అదేదో తెలుసుకోవాలని రోహిణి, మనోజ్ రూమ్‌కు వెళుతుంది.
రోహిణి డల్‌గా కనిపించడం చూసి ఏమైందని రోహిణిని అడుగుతుంది ప్రభావతి. రాత్రి నేను, శృతి, మీనా లేట్‌నైట్ వరకు మాట్లాడుకుంటూ ఉండిపోయామని రోహిణి బదులిస్తుంది. వాళ్లు ముగ్గురు కలిసిపోవడం చూసి ప్రభావతి కంగారు పడుతుంది. అలా జరగడానికి వీలు లేదని మనసులో అనుకుంటుంది. మనోజ్ ముభావంగా కనిపించడంతో తనకు తెలియకుండా ఏదో జరుగుతుందని అనుకుంటుంది.
నాకు సూటవ్వని జాబ్ చేసి తప్పు చేశానని మనోజ్ అంటాడు. ఏ జాబ్ లేకుండా నువ్వు ఇంటికి రావొద్దని అనడంతోనే ఆ జాబ్‌లో చేరాల్సివచ్చిందని రోహిణిపై నింద వేస్తాడు. నింద నాపై వేసి తప్పించుకోవాలని అనుకుంటున్నావా, నీకు జాబ్ చేయడం బద్ధకం అంటూ భర్తపై రోహిణి ఫైర్ అవుతుంది. నా డిగ్రీలు, డిగ్నీటిని పక్కనపెట్టి నీ కోసం వెయిటర్ జాబ్‌లో జాయిన్ అయ్యానని అసలు నిజం బయటపెడతాడు మనోజ్.
నువ్వు వెయిటర్ జాబ్ చేయడమేంటి రోహిణి అంటుంది. నీ మాటను గౌరవించి జాయిన్ అయ్యానని, నీ కోసం ఎన్నో అవమానాలు పడ్డానని మనోజ్ అంటాడు. నిన్ను బాధపెట్టడం జాబ్ గురించి ఇన్నాళ్లు నీకు చెప్పలేదని రోహిణితో అంటాడు. నా క్వాలిఫికేషన్‌కు తగ్గ జాబ్ దొరికే వరకు నన్ను ఇబ్బంది పెట్టద్దొని రోహిణితో అంటాడు మనోజ్.
నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు...ఎంత సంపాదిస్తున్నావని లెక్కలు వేసుకొని నిన్ను పెళ్లిచేసుకోలేదని మనోజ్‌కు బదులిస్తుంది రోహిణి. జాబ్ చేస్తేనే నలుగురు గౌరవిస్తారని, అలాగని వెయిటర్ జాబ్ చేయమని నేను చెప్పలేదని రోహిణి అంటుంది. నీ డిగ్రీకి సరిపోయే జాబ్ చూసుకోమని భర్తకు సలహా ఇస్తుంది. అది నువ్వు చెబితే తప్ప తెలుసుకోలేనంత చిన్న పిల్లాడిని కాదని, కొద్ది రోజులు జాబ్ అని నన్ను టార్చర్ చేయద్దని రోహిణితో అంటాడు మనోజ్. నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? అయితే నిన్ను జాబ్ గురించి అడగనని కోపంగా అంటుంది రోహిణి.
ఎలాగైనా మనోజ్, రోహిణి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రభావతి అనుకుంటుంది. వాళ్ల రూమ్ నుంచి గట్టిగా అరుపులు వినిపించాయని భర్తతో అంటుంది. ఏదో విషయంలో ఘర్షణ జరిగి ఉంటుందని, వాళ్లే సర్ధుకుంటారని జోక్యం చేసుకోవద్దని ప్రభావతితో చెబుతాడు సత్యం.
అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. బయట నీ కారు లేదు, ఏమైందని కొడుకును అడుగుతాడు సత్యం. టాక్సీ స్టాండ్‌లో ఉందని బాలు అబద్ధం ఆడుతాడు. నువ్వు కారును, భార్యను వదలవు...ఇప్పుడేంటి దూరంగా ఉంటున్నావని ప్రభావతి సెటైర్లు వేస్తాడు. ఏదైనా సమస్య ఉంటే నువ్వేమైనా సాయం చేస్తావా...పెద్దవి చేస్తావని తల్లితో కోపంగా అంటాడు అంటాడు.
కారు రిపేర్‌కు వచ్చిందా? ఏదైనా సమస్య ఉందా? సత్యం ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తాడు. రాజేష్ కారు ట్రబుల్ ఇస్తుందని, అతడు కారు రిపేర్ ఇచ్చాడని, అప్పటివరకు నేను ఖాళీగా ఉన్నప్పుడు నా కారు నడుపుకుంటున్నాడని బాలు అబద్ధం చెప్పి వెళ్లిపోతాడు.
తన రూమ్‌లో కూర్చొని ఫోన్ చూస్తుంటాడు బాలు. శివ దొంగతనం చేసిన వీడియోను ఎవరికి చూపించలేక, డిలీట్ చేయలేక తనలో తానే సతమతమవుతాడు. కోపంగా ఫోన్‌ను బెడ్‌పై పడేసి బాత్‌రూమ్‌కు వెళతాడు.
ఫోన్ చూసి బాలు ఆవేశ పడటంతో మీనా డౌట్ పడుతుంది. బాలు బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే ఫోన్ ఓపెన్ చూసి చూడబోతుంది. బయటకు వచ్చిన బాలు మీనా చేతి నుంచి ఫోన్ లాక్కుంటాడు. నువ్వెందుకు నా ఫోన్ తీసుకున్నావని, ఇంకొకరి ఫోన్ చూడటం సంస్కారం కాదని అంటాడు.
చూస్తే ఏమవుతుందని, మీరు నా భర్తే కదా అని, అందులో అంత పెద్ద ర హస్యాలు ఏమున్నాయని మీనా అంటుంది. నేను లేనప్పుడు ఫోన్ చూడాలని అనుకున్నావంటే నన్ను అనుమానిస్తున్నావా అని మీనాను అడుగుతాడు బాలు. ఈ ఫోన్‌లో లక్షలు దాచిపెట్టాను...నువ్వు చూస్తే సగం ట్రాన్స్‌ఫర్ చేయమని అంటావని దాచిపెట్టానని బాలు కోపంగా అంటాడు. ఇంకోసాని నా ఫోన్ ముట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తాడు.
భర్త మాటలతో చిరాకుగా మీనా కిందికి వెళ్లిపోతుంది. వాళ్ల గొడవను చూసి ప్రభావతి ఆలోచనలో పడుతుంది.
అప్పుడే రవి చాప, దిండు పట్టుకొని మేడపై నుంచి కిందికిదిగుతాడు. హాల్‌లో ఉన్న తల్లిని చూసి భయపడి చాప, దిండు దాచేస్తాడు. శృతి గదిలో నుంచి బయటకు వెళ్లిపోయిందా అని మీనాను అడుగుతాడు. చెట్టంతా మనిషిని నేను ఇక్కడ ఉండటా దానిని అడుగుతావేంటి అని రవిపై కోప్పడుతుంది ప్రభావతి. నేను చెట్లతో పుట్టలతో మాట్లాడనని రవి పంచ్ వేస్తాడు. శృతితో చిన్న ఆర్గ్యూమెంట్ వచ్చిందని, కోపంతో పైకివెళ్లి పడుకున్నానని మీనాతో జరిగింది చెబుతాడురవి. శృతి రాత్రి భోజనం చేసిందో లేదో అని బాధపడతాడు.
శృతిది చిన్న పిల్లల మనస్తత్వమని, జరిగింది ఏది మనసులో పెట్టుకోదని రవికి సర్ధిచెబుతుంది మీనా. అసలు ఏం జరిగిందో నాకు చెప్పమని, మీనా ఏమన్నా మీ సమస్యలు తీర్చుతుందా? అని ప్రభావతి కోపంగా అంటుంది. నువ్వు అరుస్తావో, గొడవ తీరుస్తావో తెలియదు కదా అని రవి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతాడు. రవి ఎంత వెటకారంగా సమాధానం చెబుతున్నాడో చూశారా అంటూ తన బాధను భర్తతో పంచుకుంటుంది ప్రభావతి. ఇదే మాట శృతిని అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పదని సత్యం అంటాడు.
హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ డ్యాన్స్ చేస్తుంటుంది శృతి. నువ్వు రూమ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత హ్యాపీగా పడుకున్నానని చెప్పి రవిని ఏడిపిస్తుంది. మీ అమ్మ మన మధ్య మంట పెట్టి వెళ్లి హాయిగా ఉందని రవి అంటాడు. నువ్వేంటి మీ బాలు అన్నయ్యలా మాట్లాడుతున్నావని శృతి బదులిస్తుంది. ఇద్దరు గొడవడతారు. ఒకరికొకరు ఏ మాత్రం తగ్గరు.
హాల్‌లో తెగ కంగారుగా తిరుగుతుంటుంది ప్రభావతి. అప్పుడే మీనా కాఫీ కప్‌తో వస్తుంది. నేను నిన్ను కాఫీ అడగలేదని ప్రభావతి అంటుంది. నేను మీ కోసం తేలేదని మీనా చెబుతుంది. రవి కోసం తెచ్చిన కాఫీ ఇదని అంటుంది. పూలకొట్టుదానితో నీకు మాటలు ఏంటి రవిపై ఫైర్ అవుతుంది ప్రభావతి. మర్యాదగా మాట్లడమని, మర్యాద ఇస్తేనే తిరిగి మర్యాద ఇస్తారని తల్లికి క్లాస్ ఇస్తాడు రవి. చిన్న సమస్యను నువ్వు జోక్యం చేసుకొని పెద్దది చేయద్దని తల్లితో అంటాడు రవి.
అప్పుడే శృతి అక్కడికి రావడంతో రవి మేడపై నుంచి వచ్చాడేంటి అని ప్రభావతి. మేడపైకి వెళితే కిందికి రావాల్సిందే కదా అని శృతి బదులిస్తుంది. మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది. అది మీరు రవినే అడిగి తెలుసుకొండి అని కోపంగా బదులిచ్చి వెళ్లిపోతుంది. రాత్రి బాలుతో పాటు మనోజ్, రవి ముగ్గురు పైన పడుకున్నారని సంతోషంగా నవ్వుతూ కబుర్లు చెప్పారని ప్రభావతి అంటుంది.
ముగ్గురు అన్నదమ్ములు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటే సంతోషపడకగా సవతి తల్లిలా కుళ్లుకుంటావేంటి అని సత్యం వెటకారంగా సమాధానమిస్తాడు.
మీనాకు ఫోన్ చేస్తుంది పార్వతి. మళ్లీ శివ జాబ్‌కు వెళతానని అంటున్నాడని అంటుంది. చదువు, ఉద్యోగం రెండు ఉంటే శివ పక్కదార్లు పట్టడని మీనా బదులిస్తుంది. గుణ దగ్గర పనిచేస్తున్నాడని తెలిసి మీనా కంగారు పడుతుంది. గుణ దగ్గర ఉద్యోగం అయితే ఖాళీగా ఉండటమే మంచిదని అంటుంది. శివ చేయిదాటిపోయాడని భయపడుతుంది.
ప్రభావతి దగ్గర కొట్టేసిన డబ్బును బాలుకు తిరిగి ఇచ్చేస్తాడు శివ. ఆ డబ్బును తండ్రికి తిరిగి ఇస్తాడు బాలు. ప్రభావతి దగ్గర దొంగ కొట్టేసిన డబ్బులు ఇవని, పోలీసులు పట్టుకొని తిరిగి ఇచ్చేశాడని అబద్ధం చెబుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం