మనోజ్‌కు అప్పు ఇచ్చిన వ్యక్తి అతడు పనిచేసే రెస్టారెంట్‌కు వస్తాడు. అతడిని చూసి మనోజ్ పారిపోబోతాడు. కానీ దొరికిపోతాడు. శాలరీ వచ్చిన తర్వాత వడ్డీతో సహా అప్పు తీర్చేస్తానని అప్పు ఇచ్చిన అతడిని బతిమిలాడుతాడు మనోజ్. హోటల్‌లో ఉన్న అన్ని ఫుడ్ ఐటెమ్స్ మనోజ్ తోటి తెప్పించుకొని తింటాడు ఆ ఫ్రెండ్.
ఆ తర్వాత అవే ఐటెమ్స్‌ను పార్శిల్ కూడా చేయించుకుంటాడు. వడ్డీ కింద వాటి బిల్ మాత్రం నువ్వే కట్టేయ్ అని మనోజ్‌కు పనిష్‌మెంట్ ఇచ్చి వెళ్లిపోతాడు. బాగా తిని బిల్ ఇవ్వకుండా వెళ్లిపోయిన మనోజ్ స్నేహితుడిపై రెస్టారెంట్ ఓనర్ ఫైర్ అవుతాడు. ఇంకోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే బాగుండదని మనోజ్‌కు వార్నింగ్ ఇస్తాడు.
మీనా పుట్టింటి నుంచి తిరిగొచ్చిన సత్యం ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తాడు. నేను చెబుతున్న వినకుండా మీనా పుట్టింటికి వెళ్లరుగా? డబ్బులు ఇచ్చారా? ఇంకా కావాలా అని అడిగారా అని భర్తపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ప్రభావతి. బాలు వల్ల ఇల్లువాకిలి అన్ని అమ్ముకోవాల్సివస్తుందని సెటైర్లు వేస్తుంది.
పార్వతి డబ్బులు తీసుకోలేదని సత్యం అంటాడు. ఆ మాట వినగానే ప్రభావతి ఆనందపడుతుంది. మీనా పూల కొట్టు పెట్టి డబ్బులు బాగా సంపాదిస్తుందని, శివ ట్రీట్‌మెంట్‌కు తనే డబ్బులు ఇచ్చి ఉంటుందని నిందలు వేస్తుంది.
అప్పుడే మీనా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. . నా భర్తను మీ పుట్టింటివాళ్లు ఏమన్నారు అంటూ మీనాపై ఎగిరిపడుతుంది ప్రభావతి. అప్పుడే బాలు కూడా అక్కడికి రావడంతో అతడితో మాట్లాడేందుకు పక్కకు తీసుకెళతాడు సత్యం. బాలును సత్యం పక్కకు ఎందుకు తీసుకెళ్లాడని మీనాను అడుగుతుంది ప్రభావతి. అదేదో మీ ఆయన్నే అడగండి అని మీనా అంటుంది.
అడుగుతాను...నాకేంటి మేము ఏమైనా మీలా రోజు గొడవలు పడుతున్నామా అని మీనా మనసును గాయం చేసేలా మాట్లాడుతుంది ప్రభావతి. మీ తమ్ముడు చేయి విరిచాడు బాలు. ఆ తర్వాత నువ్వే అని బాలుపై మీనాకు ఉన్న కోపాన్ని మరింత పెంచుతుంది.
శివ చేయిని ఎందుకు విరిచావో చెప్పమని బాలును నిలదీస్తాడు సత్యం. శివను చూసి నేనే తట్టుకోలేకపోయానని సత్యం అంటాడు. నువ్వు మంచోడివే కానీ నీ కోపం, మూర్ఖత్వం నీ మంచితనాన్ని దహించివేస్తున్నాయని బాలుకు అర్థమయ్యేలా వివరించబోతాడు. మీనా వాళ్ల అమ్మ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వచ్చానని అంటాడు. శివ నిన్ను ఏమైనా అన్నాడా వాడిని అంటూ బాలు కోపంగా అంటాడు. చిన్న పిల్లాడిపై నీ ప్రతాపం ఏంటి అని బాలు కోపాన్ని కంట్రోల్ చేస్తాడు సత్యం.
సొంత అల్లుడు శివ చేయి విరిచేశాడని పార్వతి ఎంతో బాధపడుతుందని, కానీ నోరు తెరిచి నిన్ను ఒక్క మాట అనలేదని అంటాడు. మీనా పుట్టింటికి మనం తప్ప ఎవరు లేరని చెబుతాడు. మీ అమ్మ ఎన్ని మాటలు అన్న మీనా నిన్నే నమ్ముకొని ఉంటుందని, ఎందుకిలా తయరవుతున్నావని కొడుకుకు క్లాస్ ఇస్తాడు. ఇందులో నా తప్పేం లేదని తండ్రితో చెబుతాడు బాలు. శివను నేను ఎందుకు కొట్టానో తెలుసా అని బాలు నిజం చెప్పబోతాడు. కానీ మీనా రావడంతో ఆపేస్తాడు.
ఇంకెప్పుడు ఎవరితో గొడవపడను. నిన్ను తలదించుకునే పని మాత్రం చేయనని తండ్రితో అంటాడు బాలు. సత్యానికి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాలు మనసులో చెప్పుకోలేదని బాధ ఉందని మీనాతో సత్యం అంటాడు. బాలు కావాలని కొట్టాడని నేను అనుకోవడం లేదని మీనా అంటుంది.
చాలా ఆలస్యంగా ఇంటికివస్తాడు మనోజ్. కొత్త జాబ్ పనంతా నీకే చెబుతున్నారా అని రోహిణి అడుగుతుంది. కనీసం కూర్చునే అవకాశం లేదని, అందరూ తిన్న తర్వాతే తాను ఇంటికి రావాల్సివస్తుందని నోరు జారుతాడు. తిన్న తర్వాత రావడం ఏంటి అని రోహిణి అనగానే...మన ఇంట్లో వాళ్లు తిన్న తర్వాత రావాల్సివస్తుందని కవర్ చేస్తాడు.
మా ఎండీకి నాపై చాలా నమ్మకమని, నేను తొందరగా పైకి రావాలని అనుకుంటున్నాడని మనోజ్ బిల్డప్‌లు ఇస్తాడు. వర్క్ ఎక్కువగా ఇస్తే అందుకు తగ్గట్లే శాలరీ అడగమని మనోజ్‌కు సలహా ఇస్తుంది రోహిణి. ఇవ్వాల్సిన డబ్బులే ఎప్పుడు ఇస్తాడో తెలియదని, ఎక్కువగా మాట్లాడితే జాబ్ నుంచి తీసేస్తాడని మనోజ్ కంగారు పడతాడు.
మనోజ్ షర్ట్ ఉతకడానికి తీసుకుంటుంది రోహిణి. ఆ షర్ట్ మొత్తం సాంబార్ వాసన రావడంతో రోహిణి అనుమానపడుతుంది. అది పర్‌ఫ్యూమ్ స్మెల్ అని అబద్ధం ఆడుతాడు. నువ్వేదో నిజం దాస్తున్నట్లుగా అనిపిస్తుందని మనోజ్‌ను అనుమానంగా అడుగుతుంది రోహిణి. అదేం లేదని కవర్ చేస్తాడు. ఈ సారి రోహిణికి దొరక్కుండా జాగ్రత్త పడాలని మనోజ్ అనుకుంటాడు.
బాలు కనిపించకపోవడంతో అతడి గురించి ఆలోచిస్తుంటారు రాజేష్‌తో పాటు అతడి స్నేహితులు. సడెన్‌గా ఆటో డ్రైవర్‌గా బాలు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఈ వేషం ఏంటి? నువ్వు ఆటోలో రావడం ఏంటి అని రాజేష్ అడుగుతాడు. ఇన్ని రోజులు కారు నడిపాను. ఇక నుంచి ఆటో నడపబోతున్నానని చెబుతాడు.
నిన్ను ఇలా చూడటం కష్టంగా ఉందని బాలుతో అతడి స్నేహితులు అంటారు. మా కోసం నువ్వు కారు అమ్ముకోవడం బాధగా ఉందని అంటారు. ఆటో డ్రైవర్‌గా మారడంలో తనకేమీ నామోషీగా లేదని బాలు అంటాడు. కారు అమ్మేసిన విషయం ఎవరికి చెప్పొద్దని రాజేష్‌తో అంటాడు. కనీసం మీనాకైనా చెప్పమని బాలుకు సలహా ఇస్తాడు రాజేష్. కొద్ది రోజులు ఎవరికి తెలియకపోవడమే మంచిదని బాలు బదులిస్తాడు.
మనోజ్ పనిచేసే రెస్టారెంట్‌కు కస్టమర్ వస్తాడు. పొరపాటుగా అతడిపై సాంబార్ పడేస్తాడు మనోజ్. ఎక్కడ చూసి నడుస్తున్నావ్ రా, కళ్లు కనిపించడం లేదా అని మనోజ్‌పై ఆ కస్టమర్ కోప్పడుతాడు. సర్వర్‌వి...సర్వర్ పని సరిగ్గా చేయడం రాదా అని క్లాస్ ఇస్తాడు. మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకోనని ఆ కస్టమర్‌కు వార్నింగ్ ఇస్తాడు మనోజ్.
మీ షర్ట్‌పై పడింది కొంచెం సాంబార్ కదా...ఎక్కువ చేస్తున్నావేంటి అని గొడవపతాడు. అయితే నీ మీద కూడా సాంబర్ పోయమంటావా అని గిన్నెలోని సాంబార్ మనోజ్‌పై పోస్తాడు ఆ కస్టమర్. కోపం పట్టలేని మనోజ్ ఆ కస్టమర్ కాలర్ పట్టుకొని అతడిని కొట్టబోతాడు.
హోటల్ ఓనర్ వచ్చి మనోజ్‌ను ఆపేస్తాడు. కస్టమర్‌కు సారీ చెప్పి మనోజ్‌ను పక్కకు తీసుకెళ్లి క్లాస్ పీకుతాడు. నీ వల్ల ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని, ఏ పని సరిగ్గా చేయడం లేదని ఫైర్ అవుతాడు. అసలు నీకు శాలరీ ఇవ్వడం దండగా అని అంటాడు.
ఇప్పటివరకు నువ్వు చేసింది చాలు..ఇప్పుడు నా హోటల్ నుంచి వెళ్లిపోరా అని అంటాడు. సరేరా అని మనోజ్ కోపంగా బదులిస్తాడు. భవిష్యత్తులో ఇంటర్నేషన్ హోటల్ కడతానని, నీ లాంటి వాళ్లను వెయిటర్లుగా పెట్టుకుంటానని ఓనర్ ముందు బిల్డప్‌లు ఇస్తాడు మనోజ్. నీ హోటల్‌నే కొనేస్తానని అంటాడు.
సత్యం ఇంటికి పార్వతి, సుమిత్ర వస్తారు. భయంగా భయంగా లోపలికి అడుగుపెడతారు. మీనా అని పిలుస్తారు. ఇది మీనా ఇల్లు కాదు నా ఇల్లు అని ప్రభావతి అంటుంది. పార్వతిని లోపలికి పిలవమని సత్యం ఆర్డర్ వేస్తాడు. ఏం బొట్టు పెట్టి పిలవాలా...నాకేం అభ్యంతరం లేదు. ఆవిడకే ఆ రాత లేదు అని అవమానిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు....అసలు నువ్వు మనిషివేనా ప్రభావతికి క్లాస్ ఇస్తాడు సత్యం.
పార్వతిని లోపలికి రమ్మని అంటాడు. ఊరికే పిలవని పేరంటానికి ఎందుకొస్తారు అని వెళ్లండి అని తల్లిని కసుకుంటుంది మీనా.
తండ్రి కర్మ రోజు ఫొటోకు హారతి ఇవ్వబోతాడు శివ. నొప్పి కారణంగా అతడి చేతిలోని హారతి పళ్లెం కిందపడుతుంది. బాలు చాలా తొందరపాటు మనిషి అని, కోపిష్టి అంటూ నానా మాటలు అంటుంది పార్వతి. బస్తీ జనాలు కూడా బాలును తలో మాట అంటారు.
అప్పుడే అక్కడికి వచ్చిన బాలు వారి మాటలు వింటాడు. బస్తీ జనాలను పోగేసి మరి నా గురించి ఇంత చెడుగా ప్రచారం చేయాలా అని అత్తను నిలదీస్తాడు. నా చేయి విరగ్గొట్టి మా ఇంటికే తినడానికి వచ్చావా అని బాలును అవమానిస్తాడు శివ. అతడి మాటలు తట్టుకోలేని బాలు కోపంగా వచ్చి శివను కొడతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం