మీనా తనను ద్వేషించడం బాలు తట్టుకోలేకపోతాడు. రూమ్‌లో కాకుండా డాబాపై పడుకుంటాడు. జీవితంలో మీ మొహం చూడను. మీతో కలిసి ఉండలేనని వెళ్లిపోతున్నానని మీనాతో తనతో చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా బాలుకు కల వస్తుంది. మీనా అని అరుస్తూ మేల్కొంటాడు. ఇలాగే ఉంటే తనను మీనా నిజంగానే విడిచిపోతుందని బాలు భయపడతాడు. మీనాతో మాట్లాడకపోతే గుండె బరువుగా ఉన్నట్లుగా ఫీలవుతాడు. మంచితనాన్ని పక్కనపెట్టి నిజం చెప్పేయాలని అనుకుంటాడు. మీనా దగ్గరకు వస్తాడు.
కానీ ఎలా పిలవాలో తెలియక దగ్గు వచ్చినట్లుగా సౌండ్ చేస్తాడు. ఆ అలికిడికి మీనా లేస్తుంది.
నిజం చెబితే మీనా తట్టుకుంటుందా అని బాలు తనలో తానే ఆలోచిస్తాడు. ఆవేశపడి వచ్చి ఇరుక్కుపోయానని అనుకుంటాడు. వాటర్ తాగేసి వెళ్లిపోతాడు. ఒక్క సారీ చెబితే ఆయన సొమ్మేం పోతుంది. మగాడినన్న అహంకారం అని బాలును అపార్థం చేసుకుంటుంది మీనా. ఆడది ఏం చేస్తుందిలే అన్న అలుసు అని అనుకుంటుంది. నాకేనా పౌరుషం లేనిది అని కోప్పడుతుంది.
తాను ఇచ్చిన డెడ్‌లైన్ లోపు డబ్బులు కట్టకపోవడంతో రాజేష్‌తో పాటు అతడి స్నేహితుల కార్లు తీసుకుపోవడానికి వస్తాడు గుణ. కారు లేకపోతే మా ఫ్యామిలీ గడవదని గుణను బతిమిలాడుతాడు రాజేష్. ఎంత బతిలిమాడిన గుణ వినడు. బాలు నన్ను అవమానించాడు..వాడు నా కాళ్లు పట్టుకుంటేనే మీ కార్లు వదిలిపెడతానని గుణ ఆవేశంగా అంటాడు. గుణ మనిషి రాజేష్ కారుపై చేయబోతుండగా బాలు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఎవడైనా కారుపై చేయివేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు.
వచ్చాడు హీరో...ఇక మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అయినట్లేనని బాలును చూసి గుణ అంటాడు. వచ్చి నా కాళ్లు పట్టుకుంటే మీ స్నేహితుల కార్లు వదిలేస్తానని గుణ చెబుతాడు. కాళ్లపై పడటమంటే గుడిలో దేవుడి పాదాలను భక్తి శ్రద్ధలతో ముట్టుకుంటాంగా అలా అని గుణ వెటకారంగా మాట్లాడుతాడు. కానీ బాలు కాలు ఎత్తి గుణను తన్నబోతాడు. ఇక తన్ను తన్నానంటే ఇక్కడే కుప్పకూలిపోతావని వార్నింగ్ ఇస్తాడు. అధిక వడ్డీలకు డబ్బులిచ్చే అడ్డమైన గాడిద అంటూ గుణను అవమానిస్తాడు.
తన స్నేహితుల బదులుగా గుణకు తానే డబ్బు ఇస్తాడు బాలు. వాళ్ల అప్పులను క్లియర్ చేస్తాడు. గుణ డబ్బులు తీసుకుంటుండగా వీడియో తీస్తాడు. నా బామ్మర్ధిని ట్రాప్‌లు వేశావు కదా...నీ లెక్కలు సరిచేస్తా అని గుణకు వార్నింగ్ ఇస్తాడు. బాలు గొప్ప మనసుకు అతడి స్నేహితులు ఫిదా అవుతారు.
సడెన్‌గా బాలు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియక కంగారు పడతాడు రాజేష్. తన కారు అమ్మేసిన నిజం రాజేష్‌తో చెబుతాడు బాలు. గుణకు డబ్బులు ఇవ్వకపోతే వాడి కాళ్లపై పడాల్సివచ్చేది. నేను ఆ పనిచేయలేనని అంటాడు. కారు లేకపోతే ఏం చేయలేమా...బాలు తల్చుకుంటే ఏమైనా చేయగలడని రాజేష్‌తో చెబుతాడు.
పుట్టింట్లో దిగాలుగా కూర్చుంటుంది మీనా. ఏమైంది...మీ ఆయన నిన్ను కూడా కొట్టాడా అని మీనాను అడుగుతాడు శివ. మీ ఆయన ఏంటి..మర్యాదగా మాట్లాడమని తమ్ముడికి వార్నింగ్ ఇస్తుంది మీనా. ఇక నుంచి బాలును తాను బావ అని పిలవనని శివ అంటుండగానే అక్కడికి సత్యం వస్తాడు. శివ యోగక్షేమాలు కనుక్కుంటాడు సత్యం.
బాలు తొందరపడ్డాడని, శివ ఏం తప్పు చేశాడని అతడిని కొట్టాడని సత్యాన్ని నిలదీస్తుంది పార్వతి. బాలు వల్లే ఇంత పెద్ద కష్టం వస్తుందని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుమతి కూడా బాలునే తప్పు పడుతుంది. శివనే తమ కుటుంబానికి దిక్కు అని పార్వతి అంటుంది. పరీక్షల ముందు శివను కొట్టి అతడి చదువును బాలు చెడగొట్టాడని నిందలు వేస్తుంది.
బాలు ఎందుకు ఇంత తొందరపడ్డాడో అంతుపట్టడం లేదని సత్యం అంటాడు. వాడంతట వాడు ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లడని సత్యం చెబుతాడు. శివ కూడా ఏ తప్పు చేసి ఉండడని సుమతి వాదిస్తుంది. ఏది ఏమైనా నా కొడుకు వల్ల మీ కుటుంబానికి కష్టం వచ్చిందని, అందుకు మిమ్మల్ని క్షమించమని అడగాలని వచ్చానని సత్యం అంటాడు.
చేతులు జోడించి దండం పెడతాడు. సత్యం క్షమాపణలు చెప్పడం చూసి మీనా ఎమోషనల్ అవుతుంది. కొంత డబ్బు పార్వతికి ఇవ్వబోతాడు సత్యం. శివ హాస్పిటల్‌కు చాలా ఖర్చు అయ్యి ఉంటుందని అంటాడు.
కానీ డబ్బు తీసుకోవడానికి పార్వతి ఒప్పుకోదు. అల్లుడిగారికి కోపం వస్తే ఏది ఆలోచించరని అర్థమైంది. శివ చేయి విరగొట్గాడు. రేపు మీనాను ఏం చేస్తాడోనని భయంగా ఉంనది అంటుంది. అలాంటి ఆవేశపరుడితో నా కూతురు ఎలా బతుకుతుందోనని చెబుతుంది.
బాలు మంచి చెడు తెలియని మూర్ఖుడు కాదని కొడుకును సపోర్ట్ చేస్తాడు సత్యం. ప్రేమ చూపించేవాళ్ల కోసం ప్రాణమైనా ఇస్తాడని అంటాడు. మీ ఇంట్లో మా అమ్మాయి క్షేమంగా ఉంటుందని నాది హామీ అని పార్వతితో అంటాడు సత్యం.
బాలు ఆవేశం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని భర్తను సపోర్ట్ చేస్తుంది మీనా. నా భర్త కనపడిన వాళ్లను కొడుతున్నాడని ఎందుకు అనుకుంటున్నారని, కారణం లేకుండా ఆయనకు కోపం రాదని మీనా అంటుంది. శివకు అలా అయ్యేసరికి అమ్మ భయంతో అలా మాట్లాడుతుందని సత్యంతో అంటుంది మీనా.
నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని సత్యంతో చెబుతుంది పార్వతి. ఆడపిల్ల తల్లిగా మీ భయం సహజమని, మీనా గురించి మీకు ఏ దిగులు అవసరం లేదని సత్యం అంటాడు.
సత్యం వెళ్లిపోగానే తల్లిపై మీనా ఫైర్ అవుతుంది. ఎవరో చేసిన తప్పుకు సత్యం క్షమాపణ తెచ్చే పరిస్థితి తెచ్చారని అంటాడు. బావకు ఈ విషయం తెలిస్తే మళ్లీ అక్కను ఏదో ఒక మాట అంటాడని సుమతి అంటుంది. ఇంత భయపడుతూ బాలుతో ఎలా కాపురం చేస్తావని మీనాతో పార్వతి అంటుంది. మా మధ్య ఏం జరిగినా బాలు నా మీద చేయిచేసుకోవడని మీనా అంటుంది.
మనోజ్‌కు అప్పు ఇచ్చిన అతడి ఫ్రెండ్ రెస్టారెంట్‌కు వస్తాడు. అతడికి కనిపించకుండా దాక్కోబోతాడు మనోజ్. కానీ మనోజ్ దాక్కోవడం అతడు చూస్తాడు. ఏంటి ఆర్డర్ వేసే పొజిషన్‌లో ఉంటావని అనుకుంటే...ఇలా ఆర్డర్స్ తీసుకొనే పొజిషన్‌లో ఉన్నావేంటి అని సెటైర్లు వేస్తాడు.
తన నంబర్‌ను ఎందుకు బ్లాక్ చేశావని అంటాడు. అదేం లేదని మనోజ్ అబద్ధం ఆడుతాడు. కానీ మనోజ్ ఫోన్ తీసుకున్న అతడి ఫ్రెండ్ తానే డయల్ చేస్తాడు. కానీ బ్లాక్ చేసినట్లు అందులో కనిపిస్తుంది. నా దగ్గర వడ్డీగా తీసుకున్న డబ్బులు ఇప్పుడే కావాలని అంటాడు. మీ వైఫ్‌ను బురిడీ కొట్టించినట్లు నన్ను బోల్తా కొట్టించలేవని అంటాడు.
నాకు అప్పు ఇవ్వడమే కాదు...వసూలు చేసుకోవడం తెలుసునని అంటాడు. శాలరీ రాగానే ఇస్తానని అతడిని బతిలిలాడుతాడు మనోజ్. హోటల్‌లోని అన్ని ఐటమ్స్ ఒక్కో ప్లేట్ తీసుకురమ్మని మనోజ్‌తో అంటాడు వడ్డీ ఇచ్చిన స్నేహితుడు. టిఫిన్ తిన్న డబ్బులు తనతోనే ఎక్కడ కట్టిస్తాడోనని మనోజ్ భయపడతాడు. వడ్డీకి డబ్బులు తీసుకున్నందుకు పనిష్‌మెంట్ ఇలా పడిందని బాధపడతాడు.
పార్వతి కుటుంబసభ్యులకు సత్యం సారీ చెప్పాడని తెలిసి బాలు ఫైర్ అవుతాడు. శివను నేను ఎందుకు కొట్టానో తెలుసా అని నిజం చెప్పబోతాడు. కానీ అక్కడే మీనా కనిపించడంతో బాలు ఆగిపోతాడు.అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం