మీనాకు వచ్చిన పూల మాలల ఆర్డర్ గురించి శివ ద్వారా తెలుసుకుంటాడు గుణ. బాలు, మీనాలపై రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ దొరికిందని అనుకుంటాడు. మీనా పూల మాలలు సామూహిక వివాహాలు జరిగే మండపానికి చేరకుండా వారి బండిని కొట్టేయమని తన మనుషులకు ఆర్డర్ వేస్తాడు గుణ. అదే జరిగితే ఆ పొలిటికల్ లీడర్... బాలును ప్రాణాలతో వదిలిపెట్టడని గుణ అనుకుంటాడు.
ఇంట్లో వాళ్లతో పాటు పూల మాలలు అల్లడానికి వచ్చిన వారికి కోసం స్పెషల్‌గా కిచిడీ తయారుచేస్తాడు రవి. మనోజ్, రోహిణి మాత్రం కిచిడీ వద్దని ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి రెస్టారెంట్స్ కోసం వెతుకుతుంటారు. కిచిడీ వాసన చూసి మనోజ్ ఆకలి పెరుగుతుంది. కిచిడీ తినాలని అనుకుంటాడు. కానీ రోహిణి అడ్డుకుంటుంది. వాళ్లది వేరే లెవెల్ అని మనోజ్‌పై బాలు సెటైర్లు వేస్తాడు.
రవి చేసిన కిచిడీ బాగుందని అందరూ మెచ్చుకుంటారు. ఇంత మంచి కిచిడీ తాను ఎప్పుడూ తినలేదని శృతి మెచ్చుకుంటుంది. నీకు కమ్మగా వండిపెట్టే మొగుడు వచ్చాడని శృతితో అంటుంది కామాక్షి. ఇంత టేస్టీగా వంట చేస్తాడనే రవిని పెళ్లిచేసుకున్నానని భర్తను అందరి ముందు ఆటపట్టిస్తుంది శృతి.
ఈ సంతోష సమయంలో మౌనిక ఉంటే బాగుండేదని సత్యం ఎమోషనల్ అవుతాడు. మౌనిక అత్తింటి గురించి గొప్పలు చెబుతుంది ప్రభావతి. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం..నిన్ను పురుగును తీసేసినట్లు తీసేస్తారు అని ప్రభావతి గాలి తీసేస్తుంది కామాక్షి. మీనా పుట్టింటి సంస్కారం గురించి పొగుడుతుంది.
మౌనికకు ఫోన్ చేస్తాడు బాలు. మేము మీకు పరాయివాళ్లం అయిపోయామా...నాకు అంతా తెలిసిపోయిందని అంటాడు. ఏం తెలిసిందోనని మౌనిక కంగారు పడుతుంది. సత్యం, ప్రభావతితో పాటు కుటుంబసభ్యులందరితో ఫోన్ మాట్లాడుతుంది మౌనిక.
ఈ గ్యాప్‌లో రవి చేసిన కిచిడీ ఎవరూ చూడకుండా తినాలని కిచెన్‌లోకి వస్తాడు మనోజ్. కిచిడీని ప్లేట్‌లో వేసుకొని తినడం మొదలుపెడతాడు. ఎవరో వచ్చిన సౌండ్ కావడంతో కిచెన్‌లో దాక్కుంటాడు. అక్కడ దొంగచాటుగా కిచిడీ తింటూ రోహిణి కనిపిస్తుంది. ఆమెను చూసి షాకవుతాడు. రవి చేసిన కిచిడీ బాగుందని ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు.
అనుకోకుండా కిచెన్‌లోకి వచ్చిన బాలు...వాళ్లను చూసి ఏం అనాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పోయి పోయి బాలుకే దొరికిపోయామని రోహిణి, మనోజ్ కంగారు పడతారు. రవి వంటలపై అందరూ పొగడ్తలు కురిపిస్తారు. వంటలక్కను మించిపోయాడని...వంటల తమ్ముడు అని అతడికి బిరుదు ఇస్తారు.
సుమతి, రవి క్లోజ్‌గా మూవ్ కావడం ప్రభావతి భరించలేకపోతుంది. శృతిని పక్కకు పిలిచి సుమతి కావాలనే రవి చేయి పట్టుకుంటుందని చాడీలు చెబుతుంది. సుమతి పెద్ద ఖిలాడీ అని, రవిని వలలో వేసుకుంటుందని అంటుంది. నేను ఈ ప్రాబ్లెమ్‌ను క్లియర్ చేస్తానని శృతి అంటుంది.అందరి ముందు ఆమె సుమతిపై అరుస్తుందని ప్రభావతి అనుకుంటుంది.
కానీ ప్రభావతిని అందరి ముందు గట్టిగా ఇరికించేస్తుంది శృతి. రవితో సుమతి ఫ్రెండ్లీగా మాట్లాడటం మీకు ఎవరికైనా తప్పుగా అనిపించిందా అని అడుగుతుంది. మాకేం తప్పుగా అనిపించలేదని అందరూ అంటారు. ఏమైందని, ఎందుకు అలా అడుగుతున్నావని రవి, మీనా అంటారు. డౌట్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాలి కదా అని శృతి బదులిస్తుంది. నలుగురిలో ఒక అమ్మాయి...అబ్బాయితో మాట్లాడటం తప్పు అని మీ అమ్మ అంటుంది...ప్రభావతి డౌట్ పడుతుందని ఆమె డౌట్ క్లారిఫై చేసుకోవాలని అడిగానని ప్రభావతిని అందరి ముందు బుక్ చేస్తుంది.
ఇది మీ కాలం కాదు, అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటం పెద్ద విషయం కాదు అని ప్రభావతికి క్లాస్ ఇస్తుంది శృతి. మీ అబ్బాయి గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ నా భర్త గురించి నాకు బాగా తెలుసునని అంటుంది. ప్రభావతికి తగ్గ కోడలు వచ్చిందని కామాక్షి అనుకుంటుంది.
ప్రభావతిని రూమ్‌లోకి తీసుకెళ్లిగా ఆమెకు గట్టిగా క్లాస్ ఇస్తాడు సత్యం. ఆడపిల్లపై అభాండాలు వేయడం తప్పు అని దుమ్ము దులుపుతాడు. ఐదు వందల పూల మాలలను ప్యాక్ చేసి ట్రాలీలో ఎక్కిస్తారు బాలు, మీనా. కానీ ఆ ట్రాలీని గుణ మనుషులు కొట్టేస్తారు. ఆ విషయం తెలిసి బాలు, మీనా షాకవుతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.