పూల దండలు కట్టడానికి వచ్చిన వాళ్లతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిద్రపోతారు. మీనా మాత్రం భర్త మాట పోకూడదని రాత్రంతా మేల్కొని కష్టపడుతుంది. మీనా కోసం టీ పెట్టి తీసుకొస్తాడు బాలు. టీలో షుగర్ వేయడం మర్చిపోతాడు. బాలు తన కోసం ప్రేమగా టీ పెట్టడంతో బాగాలేదని చెప్పడం ఇష్టం లేక షుగర్ లేకపోయినా తాగేస్తుంది మీనా.
పూల మాలల లోడ్‌తో కూడిన ట్రక్‌ను కొట్టేయాలని గుణ మనుషులు అనుకుంటారు. బాలు ఉన్నప్పుడు కొట్టేస్తే రిస్క్ అని తన మనుషులను హెచ్చరిస్తాడు గుణ. ట్రక్‌లో పూల మాలలు లోడ్ చేసి పంపిస్తారు బాలు, మీనా. ఆ ట్రక్‌ను గుణ మనుషులు ఫాలో అవుతారు. ట్రక్ డ్రైవర్‌ను బురిడీ కొట్టించి వ్యాన్ కొట్టేస్తారు గుణ మనుషులు.
చెప్పిన టైమ్‌కు పూలమాలలు రాకపోవడంతో పొలిటికల్ లీడర్ వీరబాబు...బాలు స్నేహితుడు అశోక్‌పై నిప్పులు చెరుగుతాడు. వీరబాబు మాటలకు భయపడ్డ అశోక్ వణికిపోతాడు. బాలుకు ఫోన్ చేసి దండలు ఇంకా రాలేదని అంటాడు. డ్రైవర్‌కు ఫోన్ చేయాలని బాలు అనుకుంటాడు. కానీ డ్రైవర్ నుంచే మిస్‌డ్ కాల్స్ ఉండటంతో కంగారు పడతాడు. డ్రైవర్ ఫోన్ చేసి ట్రక్ ఎవరో ఎత్తుకుపోయారని అంటాడు. ఏం జరిగిందో బాలుకు చెబుతాడు డ్రైవర్. అతడి మాటలు విని బాలు టెన్షన్ పడతాడు. ట్రక్ వెతకడానికి బాలు, మీనా ఇద్దరు కలిసి బయలుదేరుతారు.
ట్రక్‌ను కొట్టేసిన విషయం గుణకు చెబుతారు అతడి మనుషులు. తన ప్లాన్ సక్సెస్ కావడంతో గుణ సంబరపడతాడు. ఆ ట్రక్‌లోని పూల మాలలను డంపింగ్ యార్డ్‌లో పడేసి తగలపెట్టమని చెబుతాడు. ట్రక్‌ను వెతకడానికి ఆటోలో మీనా, బాలు బయలుదేరుతారు. వారిని సీక్రెట్‌గా కారులో ఫాలో అవుతాడు గుణ. బాలు, మీనా టెన్షన్‌ను కళ్లారా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు గుణ.
టైమ్‌కు పూల మాలలు చేరకపోవడంతో బాలుపై కోపంతో వీరబాబు రగిలిపోతాడు. బాలుకు ఫోన్ చేసి ఆరగంట టైమ్ ఇస్తాడు. ఈ లోపు పూల మాలలు రాకపోతే నిన్ను, అశోక్‌ను చంపేస్తానని వార్నింగ్ ట్రక్‌ను ఎవరో ఎత్తుకుపోయారని బాలును చెప్పిన మాటలను వీరబాబు నమ్మడు. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి తన పేరును చెడగొట్టడానికి బాలు అబద్దాలు ఆడుతున్నాడని అంటాడు.
మన కష్టం వృథా పోదని, తప్పకుండా ట్రక్ దొరుకుతుందనే నమ్మకముందని మీనా అంటుంది. మిస్సయిన ట్రక్ ఫొటోలు, బండి నెంబర్‌ను తమ డ్రైవర్స్ వాట్సప్ గ్రూప్‌లో పెడతాడు బాలు. ఈ ట్రక్‌ను ఎవరో ఎత్తుకుపోయారని, ఎక్కడైనా కనిపిస్తే తనకు వెంటనే తెలియజేయమని అంటాడు. ఆ ట్రక్‌ను ఓ ఆటో డ్రైవర్ చూస్తాడు. డంపింగ్ యార్డ్‌కు వెళ్లే రూట్‌లో ఉందని బాలుకు చెబుతాడు. రాజేష్ పాటు మరికొంత మంది ఆటో డ్రైవర్‌లు ట్రక్‌ను ఫాలో అవుతారు. గుణ మనుషులను పట్టుకుంటారు.
నీతో ఎవరు ఈ పనిచేయించారో చెప్పమని గుణ మనుషులను కొడతాడు బాలు. తన మనుషులు దొరికిపోవడంతో గుణ టెన్షన్ పడతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం