గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: బాలుతో గొడ‌వ ప‌డిన మ‌నోజ్‌ -సారీ చెప్పిన రోహిణి - మీనాపై ప్ర‌భావ‌తి కంప్లైంట్‌-gunde ninda gudi gantalu serial today episode april 30th 2025 rohini apologises to balu star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: బాలుతో గొడ‌వ ప‌డిన మ‌నోజ్‌ -సారీ చెప్పిన రోహిణి - మీనాపై ప్ర‌భావ‌తి కంప్లైంట్‌

గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: బాలుతో గొడ‌వ ప‌డిన మ‌నోజ్‌ -సారీ చెప్పిన రోహిణి - మీనాపై ప్ర‌భావ‌తి కంప్లైంట్‌

Nelki Naresh HT Telugu

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 30 ఎపిసోడ్‌లో మ‌నోజ్ కోసం టిఫిన్ తీసుకొస్తుంది రోహిణి. ఆ విష‌యం తెలియ బాలు దోశ తినేస్తాడు. మ‌రొక‌రి కోసం తెచ్చింది తిన‌డానికి మ్యాన‌ర్స్ ఉండాల‌ని బాలును రోహిణి, మ‌నోజ్ క‌లిసి అవ‌మానిస్తారు. ప్ర‌భావ‌తి వారికే స‌పోర్ట్ చేస్తుంది.

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 30 ఎపిసోడ్‌

నిద్ర‌లో టిఫిన్ పేర్లు క‌ల‌వ‌రిస్తాడు మ‌నోజ్‌. ఆర్డ‌ర్ తీసుకుంటున్న‌ట్లు అరుస్తాడు. అది చూసి రోహిణి కంగారు ప‌డుతుంది. మ‌నోజ్‌ను నిద్ర‌లేపుతుంది. హోట‌ల్‌లో వెయిట‌ర్‌లా ఫుడ్స్ పేర్లు చెబుతున్నావేంటి అని అనుమానంగా అడుగుతుంది. దొరికిపోయాన‌ని మ‌నోజ్ కంగారు ప‌డ‌తాడు. నేను ఫుడ్ ఆర్డ‌ర్ తీసుకోవ‌డమేంటి? నువ్వేదో పొర‌పాటుగా విన్నావ‌ని బుకాయిస్తాడు.

మ‌నోజ్ అబ‌ద్ధం...

ఉద‌యం ఒక చోట టిఫిన్ చేద్దామ‌ని ఓ హోట‌ల్‌కు వెళ్లాన‌ని, అక్క‌డి క‌పుల్ దోశ బాగుంద‌ని, కానీ నీతోనే తినాల‌ని కేవ‌లం ఇడ్లీ మాత్ర‌మే తిని వ‌చ్చేశాన‌ని అంటాడు. ఆ కోరిక అలాగే ఉండి క‌ల‌వ‌రించి ఉంటాన‌ని అబ‌ద్ధం ఆడుతాడు మ‌నోజ్‌. అప్పుడు ఒక్క దోశ పేరు చెప్పాలి కానీ అన్ని టిఫిన్స్ పేరు ఎందుకు క‌ల‌వ‌రించావ‌ని లాజిక్‌తో కొడుతుంది రోహిణి. నాకు కావాల్సిన దానితో పాటు చుట్టూ ఉన్న వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకునే టాలెంట్ ఉంద‌ని బిల్డ‌ప్‌లు ఇస్తాడు మ‌నోజ్‌.

హీరోయిన్లు కల‌లోకి వ‌స్తారు...

మ‌నోజ్ మాట‌లు విని రోహిణి న‌వ్వుకుంటుంది. మామూలుగా మ‌గాళ్ల‌కు హీరోయిన్లు క‌ల‌లోకి వ‌స్తారు. నీకు మాత్రం టిఫిన్లు కల‌లోకి వ‌చ్చాయ‌ని న‌వ్వుకుంటుంది. నా హీరోయిన్ నా ప‌క్క‌న ఉండ‌గా...వేరే హీరోయిన్లు ఎందుకు క‌ల‌లోకి వ‌స్తార‌ని మ‌నోజ్ అంటాడు. ప‌దే ప‌దే రోహిణి త‌న‌ను వెయిట‌ర్ అన‌డంతో మ‌నోజ్ చిరాకు ప‌డ‌తాడు. న‌న్ను అన్నిసార్లు అలా పిల‌వొద్ద‌ని అంటాడు. మ‌సాలా దోశ‌, చ‌ట్నీ సాంబార్‌ల‌లో నీకు ఏది న‌చ్చింది అని మ‌నోజ్‌ను టీజ్ చేస్తుంది రోహిణి.

ప్ర‌భావ‌తి జెల‌సీ...

రోహిణి గ‌ట్టిగా న‌వ్వ‌డంతో ఆ సౌండ్‌కు ప్ర‌భావ‌తి నిద్ర డిస్ట్ర‌బ్ అవుతుంది. భ‌ర్త‌ను నిద్ర‌లేపి ఏంటి మ‌న‌కు ఈ త‌ల‌నొప్పి అని అంటుంది. అర్ధ‌రాత్రి ప‌క‌ప‌క ఈ న‌వ్వులు ఏంటి అని కోపంతో నిప్పులు తొక్కుతుంది. తెల్ల‌వార్లు ఏంటి ఈ గోల అని అంటుంది. స‌వ‌తి త‌ల్లిలా మాట్లాడ‌కు...కొడుకులు, కోడ‌ళ్లు ఏ గొడ‌వ‌లు లేకుండా సంతోషంగా కాపురం చేసుకుంటుంటే సంతోషించాలి కానీ ఏంటి ఈ వాదులాట అని ప్ర‌భావ‌తికి క్లాస్ ఇస్తాడు స‌త్యం.

బాలు, మీనా లేక‌పోతే ఇళ్లు ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని, ఆ రూమ్‌లో మ‌నం ప‌డుకోవ‌చ్చున‌ని భ‌ర్త‌తో అంటుంది ప్ర‌భావ‌తి. ఏం తిక్క‌తిక్క‌గా ఉందా...నోరు మూసుకోని ప‌డుకో...లేదంటే వీధిలోకి వెళ్ల‌మ‌ని ప్ర‌భావ‌తికి వార్నింగ్ ఇస్తాడు స‌త్యం. క‌ట్టుకున్న భ‌ర్త న‌న్ను అర్థం చేసుకోవ‌డం లేద‌ని వాపోతుంది ప్ర‌భావ‌తి.

మ‌నోజ్ కోసం టిఫిన్‌...

మ‌నోజ్ కోసం బ‌య‌టి నుంచి టిఫిన్ తీసుకొస్తుంది రోహిణి. తాను తెచ్చిన టిఫిన్‌ను హాల్‌లో పెట్టి రూమ్‌లోకి వెళ్లిపోతుంది. ఆ టిఫిన్స్ మీనా తీసుకొచ్చింద‌ని పొర‌ప‌డిన బాలు వాటిని తింటుంటాడు. అప్పుడే అక్క‌డికి మీనాతో పాటు రోహిణి, మ‌నోజ్ వ‌స్తాడు.

ఈ టిఫిన్‌ను ఏ హోట‌ల్ నుంచి ఆర్డ‌ర్ పెట్టావ‌ని మీనాను అడుగుతాడు బాలు. అది తాను తేలేద‌ని, రోహిణి తీసుకొచ్చింద‌ని మీనా అంటుంది. అయినా బానే ఉందే...టేస్ట్ ఏం మార‌లేద‌ని బాలు అంటాడు.

మ‌ధ్య‌లోనే వ‌దిలేయాలా...

ఎవ‌రు కొన్నారు...ఎవ‌రి కోసం తెచ్చార‌న్న‌ది ఆలోచించ‌కుండా తింటున్నావా అని బాలుపై మ‌నోజ్ ఫైర్ అవుతాడు. స‌గం తిన్న త‌ర్వాత తెలిసింద‌ని, మ‌ధ్య‌లోనే వ‌దిలేయ‌మంటావా అని బాలు బ‌దులిస్తాడు. నీ ఎంగిలి నేను తినాలా అని మ‌నోజ్ కోపంగా అంటాడు.

మ‌నోజ్ కంప్లైంట్‌...

అస‌లు ఏం జ‌రిగింద‌ని స‌త్యం అడుగుతాడు. రోహిణి నా కోసం మ‌సాలా దోశ తెచ్చింద‌ని, అది బాలు తినేస్తున్నాడ‌ని మ‌నోజ్ కంప్లైంట్ ఇస్తాడు. రోహిణి వాళ్ల ఆయ‌న కోసం తెచ్చింద‌ని తెలియ‌క బాలు తిన్నాడ‌ని మీనా అంటుంది. కావాల‌నే బాలు టిఫిన్ తిన్నాడ‌ని ప్ర‌భావ‌తి ఫైర్ అవుతుంది. దోశ కోసం గొడ‌వ ప‌డ‌టం చూసి శృతి చిరాకుప‌డుతుంది. మ‌నోజ్ ప్రేమ‌గా అడిగాడ‌ని తెచ్చాన‌ని, ఇంకొక‌రి కోసం తెచ్చింది తిన‌డానికి మ్యాన‌ర్స్ ఉండాల‌ని రోహిణి కోపంగా అంటుంది.

పంచాయితీ...

మ్యాన్స‌ర్ గురించి నువ్వు నాకు చెబుతున్నావా...నువ్వు, మీ ఆయ‌న అన్ని మ్యాన‌ర్స్ ప్ర‌కార‌మే చేస్తున్నారా? తెలియ‌క తిన్నాన‌ని చెప్పినా... ప‌ది మంది ముందు పంచాయితీ పెట్టిన మీకు మ్యాన‌ర్స్ ఉందా? రోహిణిపై క్లాస్ ఇస్తాడు. మ్యాన‌ర్స్ అంటే మీనింగ్ తెలియ‌ని నీతో మ్యాన్స‌ర్స్ గురించి మాట్లాడ‌టం అవివేకం అంటూ రోహిణి అవ‌మానిస్తుంది.

నిజాలు చెప్పేస్తా...

నా నోరు క‌ట్టేయ‌ద్దు...న‌న్ను ఆప‌ద్దు నాన్న అని బాలు అంటాడు. అంద‌రి క‌ళ్లు తెరిపిస్తాన‌ని, నిజాలు త‌న్నుకొస్తున్నాయ‌ని, చెప్పేస్తాన‌ని, గుట్టువిప్పేస్తాన‌ని బాలు అంటాడు. బాలు నోరు మూసేస్తాడు స‌త్యం. ఏంట్రా ఈ ఆవేశం అని అంటాడు. రోహిణి గురించి చెప్ప‌డానికి ఏం ఉంద‌ని, బాలును చెప్ప‌నివ్వ‌మ‌ని మ‌నోజ్ అంటాడు.

రోహిణి కంగారు...

బాలుకు త‌న గురించి ఏం తెలిసిపోయిందోన‌ని రోహిణి కంగారు ప‌డుతుంది. అన‌వ‌స‌రంగా గొడ‌వ పెడితే త‌న సీక్రెట్స్ మొత్తం బాలు బ‌య‌ట‌పెడ‌తాడ‌ని భ‌య‌ప‌డుతుంది.

ఇంటి కోసం ఇంత చేసే నా భ‌ర్త‌ను ఒక్క దోశ తిన్నందుకు ఇంత‌లా అవ‌మానిస్తారా? తినేవాడిని మ‌ధ్య‌లో లేపేస్తారా? క‌న్న‌త‌ల్లితో పాటు వ‌దిన ఇలా మాట్లాడొచ్చా? అని మీనా కోపంగా అంటుంది. బాలు మాట్లాడే ప‌ద్ద‌తి నాకు న‌చ్చ‌దు. కానీ ఒక్క దోశ కోసం తినేవాడిని మ‌ధ్య‌లో నుంచి లేప‌డం చూస్తుంటే నాకు మండిపోతుంద‌ని శృతి అంటుంది.

అంద‌రూ ఉన్న ఇంట్లో ఇలా ఒక్క‌రికి టిఫిన్స్ తీసుకురావ‌డం క‌రెక్ట్ కాద‌ని రోహిణికి క్లాస్ ఇస్తాడు స‌త్యం.

బాలుకు రోహిణి సారీ...

ఏంటి తాచుపాములా బుస‌లు కొడుతున్నావ‌ని బాలును కోప్ప‌డుతుంది ప్ర‌భావ‌తి. అమ్మ న‌న్ను పాము అంటుంది...నేను నిజం బ‌య‌ట‌పెట్టేస్తాన‌ని బాలు అంటాడు. ఈ బాలుకు త‌న గురించి ఏదో తెలిసిపోయింద‌ని అత‌డి మాటల‌ను బ‌ట్టి అర్థం చేసుకుంటుంది రోహిణి. భ‌యంతో వ‌ణికిపోతుంది.

నా దోశ తిన్నందుకు డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని బాలును అడుగుతాడు మ‌నోజ్‌. ఇప్ప‌టికే మ‌నం మ్యాన‌ర్స్, డీసెన్సీ లేకుండా ప్ర‌వ‌ర్తించామ‌ని, జ‌రిగింద‌ని చాలు అని మ‌నోజ్‌తో అంటుంది రోహిణి. బాలుకు సారీ చెబుతుంది. నిజంగా సారీ అని అంటుంది. అర్థ‌మైపోయిన‌ట్లు ఉంద‌ని స‌త్యంతో బాలు అంటాడు.

ర‌వి క్లాస్‌...

బాలు ఎందుకు అంత‌లా గోల చేస్తున్నారు...మీరేందుకు ఆపుతున్నార‌ని స‌త్యాన్ని అడుగుతుంది ప్ర‌భావ‌తి. పిల్ల‌లం మేము త‌ప్పు చేస్తే స‌ర్ధిచెప్పాల్సింది పోయి మీరు కూడా మ‌నోజ్‌ను వెన‌కేసుకొస్తున్నారేంటి? మాదే త‌ప్పు ఉంద‌ని ఒప్పుకున్నాం క‌దా అని రోహిణి అంటుంది.

నేను దాని గురించి మాట్లాడ‌టం లేద‌ని, బాలు ఎందుకు బుస‌లు కొడుతున్నాడ‌ని ప్ర‌భావ‌తి అంటుంది. గొడ‌వ ఇంత‌టితో ఆగిపోతే నీకు మ‌న‌శ్శాంతిగా ఉండ‌దు క‌దా...బాలు తెలియ‌కుండా తిన్నాడు...రోహిణి వ‌దిన‌కు త‌ప్పు అర్థమై సారీ చెప్పింది. అయినా మ‌ధ్య‌లో నువ్వు ఎందుకు త‌వ్వుతున్నావ‌ని ప్ర‌భావ‌తిపై ర‌వి ఫైర్ అవుతాడు. గొడ‌వ‌ను ఆపేస్తాడు.

గాలిలో మేడ‌లు క‌ట్టి...

కామాక్షితో క‌లిసి బ‌య‌ట‌కు వెళుతుంది ప్ర‌భావ‌తి. బాలు, మీనా గురించి కామాక్షికి తెగ కంప్లైంట్స్ ఇస్తుంది ప్ర‌భావ‌తి. మ‌నోజ్ గాలిలో మేడ‌లు క‌ట్టి నీ భ‌జ‌న చేస్తాడు కాబ‌ట్టి నీకు న‌చ్చుతాడు. ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడితే బాలు న‌చ్చ‌డు అంతే క‌దా అని ప్ర‌భావ‌తితో కామాక్షి అంటుంది. బాలు, మీనాల‌ను ఇంట్లో నుంచి పంపించేయ‌డానికి మంచి ఐడియా ఉంటే చెప్ప‌మ‌ని కామాక్షిని అడుగుతుంది ప్ర‌భావ‌తి.

బాలు కూడా ల‌క్ష‌లు మింగేసి ఉద్యోగం లేకుండా పార్కులో ప‌ల్లీలు తింటుంటే నీకు న‌చ్చుతాడు అంతేనా అని ప్ర‌భావ‌తిని అడుగుతుంది. ఇంటి ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు ఇచ్చే బాలు, ఇంటెడు చాకిరి చేసే మీనా నాకు వ‌ద్దా ప్ర‌భావ‌తిని నిల‌దీస్తుంది కామాక్షి. నువ్వు వెట‌కారంగా అన్న నాకు అదే కావాల‌ని ప్ర‌భావ‌తి బ‌దులిస్తుంది.

మ‌నోజ్‌కు షాక్‌...

టిఫిన్ త‌ర్వాత ఈ ప్లాన్ గురించి ఆలోచిద్దామ‌ని ప్ర‌భావ‌తితో కామాక్షి అంటుంది. ఇద్ద‌రు క‌లిసి టిఫిన్ చేయ‌డానికి ఓ హోట‌ల్‌కు వెళ‌తారు. అదే హోట‌ల్‌లో మ‌నోజ్ ప‌నిచేస్తుంటాడు. త‌ల్లితో పాటు కామాక్షిని చూడ‌గానే మ‌నోజ్ దాక్కుంటాడు. ఈ హోట‌ల్‌లో ఆర్డ‌ర్ తీసుకోవ‌డానికి ఎవ‌రు లేరా? కామాక్షి అంటుంది. ఆమె అరుపులు విన్న ఓన‌ర్‌...కొత్త‌గా చేరిన ఆ మిడిగుడ్లోడు ఎక్కిడికి వెళ్లాడ‌ని మ‌నోజ్‌ను కోపంగా పిలుస్తాడు.

పెద్ద ఉద్యోగం వ‌చ్చింది...

అప్పుడే త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన ఓ వ్య‌క్తి రావ‌డంతో అత‌డిని బ‌తిమిలాడి ప్ర‌భావ‌తి, కామాక్షి టేబుల్ ద‌గ్గ‌ర ఆర్ట‌ర్ తీసుకోవ‌డానికి పంపిస్తాడు మ‌నోజ్‌. కామాక్షి హ్యాండ్ వాష్ చేసుకోవ‌డానికి రావ‌డంతో ఆమె క‌నిపించ‌కుండా దాక్కుంటాడు మ‌నోజ్‌. మ‌నోజ్‌కు పెద్ద ఉద్యోగం వ‌చ్చింద‌ని, సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడ‌ని గొప్ప‌లు చెబుతుంది ప్ర‌భావ‌తి.

అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన ఓన‌ర్‌...ఆ మ‌నోజ్‌గాడు ఎక్క‌డ చ‌చ్చాడు...,క‌స్ట‌మ‌ర్స్ వ‌చ్చారు..ఆర్డ‌ర్ తీసుకోమ‌ని చెప్ప‌మ‌ని ఓన‌ర్ కోపంగా అంటాడు. ఓన‌ర్ చెబుతున్న మ‌నోజ్....మ‌న‌వాడేనా కామాక్షి అనుమానంగా అడుగుతుంది. నా కొడుకుకు వెయిట‌ర్ జాబ్ చేయ‌డ‌మేంటి అని ప్ర‌భావ‌తి అంటుంది. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం