గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: ఫ‌స్ట్‌నైట్‌ రోజు బాలుకు మీనా స‌ర్‌ప్రైజ్- రోహిణి ముందు అడ్డంగా బుక్కైన మ‌నోజ్-gunde ninda gudi gantalu serial today episode april 29th 2025 meena express her feelings on balu star maa jio hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: ఫ‌స్ట్‌నైట్‌ రోజు బాలుకు మీనా స‌ర్‌ప్రైజ్- రోహిణి ముందు అడ్డంగా బుక్కైన మ‌నోజ్

గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: ఫ‌స్ట్‌నైట్‌ రోజు బాలుకు మీనా స‌ర్‌ప్రైజ్- రోహిణి ముందు అడ్డంగా బుక్కైన మ‌నోజ్

Nelki Naresh HT Telugu

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 29 ఎపిసోడ్‌లో బాలు మూర్ఖుడు అని, మీనాకు పొగ‌రు ఎక్కువ‌ని రుస‌రుస‌లాడుతుంది ప్ర‌భావ‌తి. నాతో చేసిన ఛాలెంజ్‌లో గెలిచాన‌ని చూపించ‌డానికే మ‌ళ్లీ పెళ్లిచేసుకున్నార‌ని మీనాను నానా మాట‌లు అంటుంది. బెడ్‌రూమ్‌ను పూల‌తో అందంగా అల‌క‌రించి బాలును స‌ర్‌ప్రైజ్ చేస్తుంది మీనా.

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 29 ఎపిసోడ్‌

గుడిలో మ‌ళ్లీ చేసుకుంటారు బాలు, మీనా. త‌ల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాల‌ని బాలు అనుకుంటాడు. బ‌ల‌వంతంగా బాలు, మీనాల‌ను దీవిస్తుంది ప్ర‌భావ‌తి. నీ పెళ్లాంతో మ‌ళ్లీ పెళ్లైనందుకు చాలా సంతోషంగా ఉంద‌ని వెట‌కారంగా అంటుంది. మీ ఇద్ద‌రికి ఇష్టం లేని పెళ్లి చేశాను. మీ కాపురం ఎలా ఉంటుందోన‌ని భ‌య‌ప‌డ్డాన‌ని, ఇప్పుడు ఆ భ‌యం పోయింద‌ని బాలుతో అంటాడు స‌త్యం. మ‌ళ్లీ మ‌ళ్లీ పెళ్లి చేసుకోకుండా పెళ్లి రోజులు మాత్రం చేసుకొండి అని ప్ర‌భావ‌తి.

వ‌దిలిపెట్టి పోతుంద‌ని అనుకున్నా...

పెళ్లి జ‌రిగేట‌ప్పుడు మీనా ముఖం కూడా చూడ‌లేద‌ని, నాలుగు రోజుల్లోనే న‌న్ను వ‌దిలిపెట్టి వెళ్లిపోతుంద‌ని అనుకున్నాని, ఈ రోజే మీనా ముఖం చూసి సంతోషంగా తాళిక‌ట్టాన‌ని బాలు అంటాడు. నేను కూడా ఈ మ‌నిషితో కాపురం చేయాలేన‌ని అనుకున్నాని, మా పెళ్లి నిల‌బ‌డ‌ద‌ని బాధ‌ప‌డ్డాన‌ని మీనా అంటుంది. ఇదే మాకు అస‌లైన పెళ్లిరోజు అని, ఇక నుంచి ఇదే డేట్‌కు మ్యారేజ్ డేను సెల‌బ్రేట్ చేసుకుంటామ‌ని అంటారు.

రాజేష్‌కు గుణ వార్నింగ్‌...

ఈఎమ్ఐ డ‌బ్బ‌ల కోసం బాలు స్నేహితుడు రాజేష్‌తో గొడ‌వ ప‌డ‌తాడు గుణ‌. మొన్న ఒక పేమెంట్ వ‌స్తుంద‌ని అనుకున్నాన‌ని, కానీ అనుకోకుండా ఆ పేమెంట్ రాలేద‌ని రాజేష్ చెబుతాడు. ఈ రాత్రి లోపు వ‌డ్డీ డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే రేపు ఏం జ‌రిగిన నాకు సంబంధం లేద‌ని రాజేష్‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు గుణ‌.

ఎగ‌తాళి చేద్దాం...ఏడిపిద్దాం...

మీనా వంట చేస్తుంటుంది. నువ్వు గంట‌ల త‌ర‌బ‌డి వంట చేస్తుంటే మేము ఆక‌లితో ఎంత సేపు ఆగాలి అని మీనాపై కోప్ప‌డుతుంది ప్ర‌భావ‌తి. మొగుడు మూర్ఖుడు, పెళ్లానికి పొగ‌రు అంటూ మీనా, బాలును త‌క్కువ చేసి మాట్లాడుతుంది ప్ర‌భావ‌తి. న‌న్ను ఎలా ఎగ‌తాళి చేద్దాం, ఎలా ఏడిపిద్దాం అని చూడ‌ట‌మే త‌ప్పితే రోహిణి, మ‌నోజ్‌, ర‌వి, శృతిలా ఎప్పుడైనా ఉన్నారా అని మీనాను నిల‌దీస్తుంది.

వాళ్లు న‌లుగురు నేను చెప్పిన‌ట్లే వింటార‌ని అంటుంది. ఏదైనా చూసే దృష్టిని బ‌ట్టే ఉంటుంద‌ని సెటైర్ వేస్తుంది. మీ ఆట‌ల‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంద‌ని, ఒక‌సారి పెళ్లైనా వాళ్లు మ‌ళ్లీ పెళ్లిచేసుకోవ‌డం ఏంటి అని మీనాను నిల‌దీస్తుంది ప్ర‌భావ‌తి. న‌న్ను అవ‌మానించ‌డానికే ఈ తాళి పెళ్లి అని త‌క్కువ చేసి మాట్లాడుతుంది.

కొత్త జీవితం మొద‌లైంది

మా పెళ్లి ఎలాంటి ప‌రిస్థితిల్లో జ‌రిగిందో మీకు తెలుసు. ఇప్పుడు ఆయ‌న నాతో ప్రేమ‌గా ఉంటున్నారు. కొత్త జీవితం ప్రారంభ‌మైంద‌ని అనిపించింద‌ని ప్ర‌భావ‌తికి అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తుంది మీనా. అందుకే మ‌ళ్లీ పెళ్లిచేసుకున్నామ‌ని అంటుంది. నాట‌కాలు ఆడ‌కు...అ నా మీద నువ్వు చేసిన శ‌ప‌థంలో గెల‌వ‌డానికే ఈ పెళ్లిచేసుకున్నావ‌ని అపోహ‌ప‌డుతుంది ప్ర‌భావ‌తి. మీతో శ‌ప‌థాలు చేసి గెల‌వాల‌ని అనుకునే మూర్ఖురాలిని కాద‌ని మీనా అంటుంది. ముమ్మాటికి అలాంటిదానివేన‌ని ప్ర‌భావ‌తి అంటుంది.

ఇదే మొద‌టిసారి...చివ‌రిసారి...

బాలు నీకు బంగారం కొనివ్వ‌డం ఇదే మొద‌టిసారి, చివ‌రి అని అంటుంది. బాలు దారం తెగిన గాలిప‌టం లాంటోడు ఎప్పుడు ఎగిరిపోతాడో తెలియ‌ద‌ని అంటుంది. ప్ర‌భావ‌తి మాట‌ల‌ను స‌హించ‌లేక‌పోతుంది మీనా. కూర‌లో తాళింపు వేస్తుంది. ఆ ఘాటుకు ప్ర‌భావ‌తి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పొమ్మ‌లేక‌ప పొగ‌బెడుతున్నావ‌ని మీనాపై కొప్పుడుతూ కిచెన్‌లో నుంచి వెళ్లిపోతుంది.

ఫొటో బాగుంది...

మీనాతో తాను దాగిన పెళ్లి ఫొటోను స‌త్యానికి చూపిస్తాడు బాలు. ఫొటో బాగుంద‌ని స‌త్యంతో పాటు ర‌వి అంటారు. సినిమా హీరోహీరోయిన్ల‌లా ఉన్నార‌ని స‌త్యం అంటాడు. తండ్రి మాట‌ల‌కు బాలు సిగ్గుప‌డిపోతాడు. ఇంత‌కుముందు పెళ్లైన‌ప్పుడు ఇలా ఫొటోలు ఎందుకు దిగ‌లేద‌ని ర‌వి అడుగుతాడు.

అప్పుడు డ‌బ్బులు పోయిన బాధ‌లోఉన్నామ‌ని మ‌నోజ్‌పై సెటైర్ వేస్తాడు బాలు. ఇద్ద‌రు మేడ్ ఫ‌ర్ ఇచ్ అద‌ర్‌లా ఉన్నార‌ని బాలు, మీనా ఫొటోపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంది. ఆ ఫొటోను చూడ‌టానికి ప్ర‌భావ‌తి ఒప్పుకోదు. బాగుంద‌నే మాట‌ల‌ను స‌హించ‌లేక‌పోతుంది.

సొంత బెడ్ రూమ్ కాదు...

ఆ ఫొటోను ఫ్రేమ్ క‌ట్టించి బెడ్‌రూమ్‌లో పెట్టుకుందామ‌ని మీనా అంటుంది. అదేం నీ సొంత బెడ్‌రూమ్ కాద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. హాల్‌లో పెడ‌తాన‌ని బాలు అంటాడు. హాల్‌లో ప్లేస్ లేద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. మ‌నోజ్ ఫొటో పెట్ట‌డానికి ప్లేస్ ఉంటుంది కానీ నా ఫొటో పెట్ట‌డానికి ఉండ‌దా అని ప్ర‌భావ‌తిపై బాలు ఫైర్ అవుతాడు. పెద్ద ఫ్రేమ్ క‌ట్టించి ఇదే గోడ మీద పెడ‌తాన‌ని, ఎవ‌రో అడ్డ‌స్తారో చూస్తాన‌ని అంటుంది. నువ్వు పెడ‌తావో చూస్తాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది.

బాలు అల‌క‌...

త‌న బెడ్‌రూమ్‌లో ఎలాంటి అలంక‌ర‌ణ‌లు లేకుండా నార్మ‌ల్‌గా క‌నిపించ‌డం చూసి బాలు డిస‌పాయింట్ అవుతాడు. ఏంటి బెడ్ అలాగే ఉంద‌ని మీనా అడుగుతుంది. నువ్వు మంచి చీర క‌ట్టుకున్నావు. త‌ల‌లో మ‌ల్లెపూలు పెట్టుకున్నావు...మ‌రి శోభ‌నం ఏర్పాట్లు ఎందుకు చేయ‌లేద‌ని మీనాను అడుతాడు బాలు. ఏం చేయాలి మీనా అంటుంది. నా మీద నీకు మ‌న‌సు అనేది ఉంటేక‌దా అని బాలు అలుగుతాడు.

బాలును బుజ్జ‌గిస్తుంది మీనా. ఏం అక్క‌ర‌లేద‌ని ఇంట్లో అంద‌రికి ఏమేం కావాలో అవ‌న్నీ చేసిపెట్టు అని చిరాకు ప‌డ‌తాడు. పొద్దున పెళ్లి ఏర్పాట్లు చేసిన‌ట్లే ఫ‌స్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తాన‌ని అనుకున్నాన‌ని మీనాతో అంటాడు బాలు. మ‌న‌కు ఫ‌స్ట్ నైట్ ఏంటి ఎన్నో నైట్స్ అయిపోయాన‌ని మీనా అంటుంది.

స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌...

పెళ్లి మాత్రం పెళ్లిలా జ‌ర‌గాలి..ఆ త‌ర్వాత ఇంకేం జ‌ర‌గ‌కూడ‌దా అని మీనాను అడుగుతాడు బాలు. మీకు న‌లుగురు పిల్ల‌లు పుడ‌తార‌నే భ‌యం క‌దా అని అందుకే అని మీనా అంటుంది. దోశెల కోసం ప‌ప్పు రుబ్బాల‌ని మీనా రూమ్ నుంచి వెళ్ల‌బోతుంది. ఆమెపై ఫైర్ అవుతాడు బాలు. మీకో స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఉంద‌ని మీనా అంటుంది. మీకు న‌చ్చేది...మీరు కోరుకునేది అని మీనా చెబుతుంది. ఫుల్ బాటిల్ తెచ్చావా అని బాలు అంటాడు. మీరు కూర్చున్న దుప్ప‌టి తీసేస్తే క‌నిపిస్తుంద‌ని అంటుంది.

ఇది క‌దా స‌ర్‌ప్రైజ్ అంటే...

దుప్ప‌టి తీసేస్తాడు బాలు. పూల‌తో బెడ్ అందంగా అల‌క‌రించి క‌నిపిస్తుంది. ఇది క‌దా స‌ర్‌ప్రైజ్ అని బాలు ఫిదా అవుతాడు. పూల పాన్నుతో పాటు ప‌క్క‌న నువ్వు కూడా ఉండాల‌ని మీనాను ద‌గ్గ‌ర‌కు లాక్కుంటాడు బాలు. పూల గంప బాగుంద‌ని మీనాను పొగ‌డుతాడు బాలు.

స్వీట్స్ తెస్తా…

మీ కోసం నేను ఏమైనా చేస్తాన‌ని మీనాతో అంటాడు బాలు. స్వీట్స్ తేస్తాన‌ని బాలు బ‌య‌ట‌కు వెళ్ల‌బోతాడు. మ‌న ఫ‌స్ట్ నైట్ అని ఇంట్లో అంద‌రికి చెబుతారా ఏంటి అని బాలుపై మీనా కోప్ప‌డుతుంది. అయితే చెప్పేస్తాను అని బాలు బ‌య‌ట‌కు వెళ్ల‌బోతాడు. అత‌డిని ప‌ట్టుకొని వెన‌క‌నుంచి కౌలిగించుకుంటుంది. బాలు మాట్లాడ‌బోతే...తెల్లారేవ‌ర‌కు ఇలాగే మాట్లాడుతారా అని బాలును ఆట‌ప‌ట్టిస్తుంది మీనా.

ఇష్ట‌మైన రౌడీ...

నీకు నేనంటే ఇష్ట‌మేనా అని మీనాను అడుగుతాడు బాలు. రెండు సార్లు తాళి క‌ట్టి ఇప్పుడు అడుగుతున్నారా అని బ‌దులిస్తుంది. అంతే ముందు న‌న్ను రౌడీలా చూశావు క‌దా అని బాలు అంటాడు. ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నాన‌ని, అప్పుడు ఇష్టం లేని రౌడీ, ఇప్పుడు ఇష్టం ఉన్న రౌడీ అని మీనా అంటుంది.

మ‌నోజ్ క‌ల‌వ‌రింత‌లు...

ర‌వి శృతి ఇద్ద‌రు క‌లిసి గేమ్ ఆడుతారు. ఆ గేమ్‌లో ర‌విని శృతి ఓడిస్తుంది. ర‌వి కోపంతో బుంగ‌మూతి పెడ‌తాడు. బుజ్జ‌గించి అత‌డి అల‌క పోగొడుతుంది శృతి. మ‌రోవైపు మ‌నోజ్ నిద్ర‌లో టిఫిన్స్ లిస్ట్ క‌ల‌వ‌రిస్తుంటాడు. ఇడ్లీ దోషం, పెస‌ర‌ట్టు...ఊత‌ప్పం స్పెష‌ల్ అని గ‌ట్టిగా అరుస్తాడు. అత‌డి అరుపులు విని రోహిణి కంగారు ప‌డి నిద్ర‌లేపుతుంది. తాను దొరికిపోవ‌డంతో మ‌నోజ్ కంగారు ప‌డ‌తాడు.

ఇంట్లో దోమ‌ల మంద‌ను స్ప్రే చేస్తుంది శృతి. ఆ వాస‌న‌కు ఉపిరి అంద‌క ఉక్కిరిబిక్కిరి అవుతాడు స‌త్యం. అత‌డిని హాస్పిట‌ల్‌కు తీసుకెళుతుంది మీనా. ఈ విష‌యం బాలుకు ఫోన్ చేసి చెబుతుంది. స‌త్యాన్ని హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసి ఆక్సిజ‌న్ పెడ‌తారు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం