Gunde Ninda Gudi Gantalu: మీనాకు గాజులు తొడిగిన బాలు - ప్ర‌భావ‌తికి మౌనిక వార్నింగ్ - మ‌నోజ్, రోహిణి అబ‌ద్దాలు-gunde ninda gudi gantalu serial promo meena forgives to balu gunde ninda gudi gantalu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu: మీనాకు గాజులు తొడిగిన బాలు - ప్ర‌భావ‌తికి మౌనిక వార్నింగ్ - మ‌నోజ్, రోహిణి అబ‌ద్దాలు

Gunde Ninda Gudi Gantalu: మీనాకు గాజులు తొడిగిన బాలు - ప్ర‌భావ‌తికి మౌనిక వార్నింగ్ - మ‌నోజ్, రోహిణి అబ‌ద్దాలు

Nelki Naresh Kumar HT Telugu
Dec 07, 2024 08:26 AM IST

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు లేటెస్ట్ ప్రోమోలో మీనా వ‌ల్లే కారు తిరిగి త‌న‌కు ద‌క్క‌డంతో ఆమెకు గాజుల‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు బాలు. భ‌ర్త ఇచ్చిన బ‌హుమ‌తి చూసి మీనా పొంగిపోతుంది. నాపై కోపం పూర్తిగా పోయిందా అని బాలును అడుగుతుంది. ఆ కోపం మాత్రం ఎప్ప‌టికీ పోద‌ని బాలు ఆన్స‌ర్ ఇస్తాడు.

గుండె నిండా గుడి గంట‌లు
గుండె నిండా గుడి గంట‌లు

Gunde Ninda Gudi Gantalu: త‌న ఆప‌రేష‌న్ కోసం బాలు కారు అమ్మేసి క్లీన‌ర్‌గా జాబ్ చేస్తూ క‌ష్టాలుప‌డుతున్నాడ‌ని తెలిసి స‌త్యం బాధ‌ప‌డ‌తాడు. బాలు అమ్మేసిన కారును తిరిగి అత‌డికి ఇవ్వాల‌ని అనుకుంటాడు బాలు వ‌ద్ద కారు కొన్న గ‌ణ‌ప‌తిని క‌లుస్తాడు స‌త్యం. మూడున్న‌ర ల‌క్ష‌లు ఇచ్చి కారు తీసుకెళ్ల‌మ‌ని స‌త్యంతో గ‌ణ‌ప‌తి చెబుతాడు.

yearly horoscope entry point

ఆ డ‌బ్బు కోసం ఇంటి ప‌త్రాలు తాక‌ట్టు పెట్టాల‌ని స‌త్యం ఫిక్స‌వుతాడు. కానీ బాలు కోసం ఇంటి ప‌త్రాలు తాక‌ట్టు పెట్ట‌డానికి ప్ర‌భావ‌తి ఒప్పుకోదు. మ‌నోజ్‌, రోహిణి కోసం త‌న‌కు చెప్ప‌కుండా ప్ర‌భావ‌తి ఇంటి ప‌త్రాలు తాక‌ట్టు పెట్టిన సంగ‌తిని స‌త్యం గుర్తుచేయ‌డంతో ప్ర‌భావ‌తి సెలైంట్ అయిపోతుంది.

బాలు కంగారు...

బాలును నిద్ర‌లేప‌డానికి ప్ర‌య‌త్నించి అత‌డిపై ప‌డిపోతుంది మీనా. ఏయ్ పూల‌గంప నువ్వా...ఏం చేస్తున్నావ‌ని బాలు కంగారుగా మీనాను అడుగుతాడు. మీ క‌ళ్ల‌లో న‌ల‌క ప‌డుతుందేమో నాలుక‌తో తీద్దామ‌ని ఎదురుచూస్తున్నాన‌ని రొమాంటిక్‌గా మీనా స‌మాధానం చెబుతుంది. న‌ల‌క కాదు క‌దా ఎల‌క ప‌డ్డ నీతో మాత్రం తీయించుకోన‌ని బాలు స‌మాధాన‌మిస్తాడు.

మౌనిక అనుమానం...

మ‌నోజ్ ఇంట్లోనే గేమ్స్ ఆడుతూ క‌నిపించ‌డంతో మ‌నోజ్ జాబ్ మానేశాడ‌ని మౌనిక‌కు డౌట్ వ‌స్తుంది. ఆఫీస్‌కు ఎందుకు వెళ్ల‌లేద‌ని అడుగుతుంది. మ‌నోజ్‌కు ఒంట్లో బాగాలేద‌ని అత‌డి బ‌దులు ప్ర‌భావ‌తి ఆన్స‌ర్ ఇస్తుంది. ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవ‌డం ఒంట్లో బాగాలేక‌పోవ‌డ‌మా అని మౌనిక సెటైర్లు వేస్తుంది.

నా జోలిక‌స్తే బాగోదు...

బాలుకు మీనా టిఫిన్ వ‌డ్డిస్తుంటుంది. మొత్తం వాడికే తోడిపెట్ట‌కు త‌ర్వాత తినేవాళ్లు ఉన్నార‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ఆమె మాట‌ల‌కు బాలు నొచ్చుకుంటాడు. తినేట‌ప్పుడు ఏం మాట‌లు అంటూ అత్త‌పై మీనా ఫైర్ అవుతుంది. అది అర్థం చేసుకునేవాళ్ల‌కు చెప్పొచ్చు. మా అమ్మ‌కు కాదు అని బాలు, మీనాల‌కు మౌనిక స‌పోర్ట్ చేస్తుంది. కూతురిని కొప్పుడుతుంది ప్ర‌భావ‌తి. నా జోలికి వ‌స్తే బాగుంద‌ని త‌ల్లికి మౌనిక వార్నింగ్ ఇస్తుంది. ఏద‌న్న అంటే ప‌డ‌టానికి తాను మీనాను కాద‌ని, అన్ని దులిపేసుకొని వెళ్లే నీ పెద్ద కొడుకును కాద‌ని హెచ్చ‌రిస్తుంది.

అత్త భ‌జ‌న...

రోహిణి సీరియ‌స్‌గా రాయ‌డం చూసి ఏం రాస్తున్నావ‌ని ప్ర‌భావ‌తి అడుగుతుంది. అత్త భ‌జ‌న అని కొత్త‌గా క‌నిపెట్టింద‌ని బాలు పంచ్‌లు వేస్తాడు. ఇంట్లో నువ్వు, మ‌నోజ్ క‌ష్ట‌ప‌డి సంపాదిస్తుంటే తిని కూర్చునేవాళ్లు పెరిగిపోతున్నార‌ని బాలు, మీనాల‌పై త‌న మ‌న‌సులో ఉన్న కోపం బ‌య‌ట‌పెడుతుంది ప్ర‌భావ‌తి.

మెతుకు మెతుక్కి.....

నేను ఎందుకు క్లీన‌ర్ జాబ్ చేస్తున్నానో నీకు అర్థ‌మైంది. మెతుకు మెతుక్కి లెక్క‌లు క‌ట్టే ఈ త‌ల్లి ఎలా మాట్లాడుతుందో నాకు తెలుసున‌ని బాలు అంటాడు. కార్ల‌కు ఉన్న మురికిని క‌డిగేయ‌చ్చు...కానీ ఇలాంటి నోర్ల‌కు ఉన్న మురికి క‌డిగేయ‌డం క‌ష్టం అని బాలు అంటాడు.

బాలు ఆనందం...

గ‌ణ‌ప‌తికి డ‌బ్బులు ఇచ్చేసి కారును ఇంటికి తీసుకొస్తాడు స‌త్యం. కారు కీస్‌ను మీనా చేతుల మీదుగా బాలుకు ఇప్పిస్తాడు. మీనా వ‌ల్లే కారు తిరిగి త‌న సొంతం కావ‌డంతో బాలు ఆనంద ప‌డ‌తాడు. ఫైనాన్షియ‌ర్‌ను క‌లిసినందుకు మీనాను అన‌వ‌స‌రంగా తిట్టాన‌ని బాధ‌ప‌డ‌తాడు. ఆ విష‌యంలో మీనాకు సారీ చెప్పాల‌ని అనుకుంటాడు. డైరెక్ట్‌గా ఈ మాట చెప్ప‌లేక‌పోతాడు.

మీడియేట‌ర్‌...

మీనాకు సారీ చెప్పే విష‌యంలో త‌న స్నేహితుడిని మీడియేట‌ర్‌గా ఉండమ‌ని బ‌తిమిలాడుతాడు బాలు. ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకొండి మ‌ధ్య‌లో న‌న్ను ఇన్‌వాల్వ్ చేయ‌ద్ద‌ని బాలుతో ఫ్రెండ్ అంటాడు. నోరు మూసుకొని నేను నీకు చెప్పింది మీనాతోచెప్ప‌మ‌ని స్నేహితుడికి బాలు వార్నింగ్ ఇస్తాడు.

నీ వ‌ల్లే కారు ద‌క్కింద‌ట‌...తొంద‌ర‌ప‌డి తిట్ట‌డ‌టా...నీకు సారీ చెప్పాల‌ని బాలు అనుకుంటున్నాడ‌ని మీనాతో బాలు ఫ్రెండ్ చెబుతాడు. తిట్టిన‌ప్పుడు కొట్టిన‌ప్పుడు లేని రోషం...పౌరుషం సారీ చెప్ప‌డానికి వ‌చ్చిందా అని మీనా అంటుంది. నా జీవితంలో నేను ఎవ‌రికి సారీ చెప్ప‌లేద‌ని బాలు వాదిస్తాడు. చివ‌ర‌కు మెట్టు దిగిన బాలు...మీనాకు సారీ చెబుతాడు. భ‌ర్త‌ను క్ష‌మించేస్తుంది మీనా.

బాలు గిఫ్ట్‌...

మీనాను తీసుకెళ్లి కారు ముందు సీటులో కూర్చోబెడ‌తాడు బాలు. క‌ళ్లు మూసుకోమ‌ని చెబుతాడు. ఆమె చేతికి గాజులు తొడుగుతాడు. ఆ గాజులు చూసి మురిసిపోతుంది మీనా. నాపై కోపం పూర్తిగా పోయిందా అని బాలును అడుగుతుంది మీనా. ఆ కోపం అలాగే ఉంద‌ని బాలు అంటాడు.

నీ వ‌ల్ల నాకు కారు ద‌క్కింది. అందుకు గాజులు గిఫ్ట్‌గా ఇచ్చాన‌ని చెబుతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియాలంటే సోమ‌వారం నాటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ చూడాల్సిందే.

Whats_app_banner