Gunde Ninda Gudi Gantalu: ప్లేట్ తిప్పేసిన బాలు- మౌనిక పెళ్లికి శ్రుతి- మీనాకు డౌట్- పెళ్లి మండపం నుంచి సంజు కిడ్నాప్?
Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సంజును పెళ్లి మండపం నుంచి కిడ్నాప్ చేసేందుకు తన ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి ప్లాన్ చేస్తాడు బాలు. మరోవైపు మౌనిక పెళ్లికి వచ్చేందుకు శ్రుతిని ఒప్పించేందుకు కష్టపడతాడని తెలుస్తోంది.
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో సత్యం ఫ్యామిలీ అంతా మౌనిక పెళ్లికి రెడీ అవుతారు. బాలు మాత్రం పంచెకట్టులో దర్శనం ఇస్తాడు. దాంతో అంతా ఆశ్చర్యపోతారు. తర్వాత అందరిని పదమని కంగారుపెడుతూ బయటకు వెళ్లిపోతుంది సుశీల.
నీ మంచికోసమే
పెళ్లికి రావేమో అనుకున్నానురా అని సత్యం అంటే.. నా చెల్లి పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను అని బాలు అంటాడు. ఇదిగో, ఇప్పుడే చెబుతున్నాను. పెళ్లిలో ఎవరితో గొడవ పెట్టుకోవద్దని చెప్పండి అని ప్రభావతి అంటుంది. నేను ఎవరితో గొడవ పడను. ఏం చేసినా మీరు పెళ్లి ఆపరు అని తెలిసాకా ఎందుకు గొడవ పడతాను అని బాలు అంటాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య అని మౌనిక అంటే.. నేను ఏం చేసినా నీ మంచికోసమే అని బాలు అంటాడు.
పొగిడిన బాలు
సరే పదండి అని బాలు అనడంతో అంతా బయలుదేరుతారు. అంతా పెళ్లి మండపానికి వెళ్తారు. ఎప్పటిలాగే నీలకంఠం, సంజు చాలా మర్యాదగా నడుచుకుంటారు. కానీ, బాలు గెటప్ చూసి ఆశ్చర్యపోతారు. వీడేంట్రా పెళ్లి అంటే ఇష్టమున్నట్లే ఇంత బాగా రెడీ అయి వచ్చాడు అని నీలకంఠం, సంజు అనుకుంటుంటారు. అది గమనించిన బాలు నీలకంఠం కుటుంబాన్ని కావాలనే పొగుడుతూ ఉంటాడు. వాళ్లు చాలా మంచివాళ్లని, చీమకు కూడా హాని తలపెట్టరని మాట్లాడుతుంటాడు బాలు.
ప్లేట్ తిప్పేశాడేమో
అది విని ప్రభావతి షాక్ అవుతుంది. వీడేంటీ ఇన్ని రోజులు వాళ్లు దుర్మార్గులు అన్నాడు. ఇప్పుడేమో తెగ పొగిడేస్తున్నాడు. నిజమేనా లేకపోతే ఇంకేమైనా చేస్తాడా అని ప్రభావతి డౌట్ పడుతుంది. వీడేంట్రా మనల్నీ ఎత్తేస్తున్నాడు అని నీలకంఠం అంటాడు. మనల్నీ చేసేదేం లేదని వాడికి బాగా అర్థమైనట్లుంది. అందుకే ఇలా ప్లేట్ తిప్పేశాడేమో అని సంజు సమాధానం ఇస్తాడు. మరోవైపు మౌనికను చూసి సంజు తల్లి సువర్ణ బాధపడుతుంది.
గొప్పలు పోయిన ప్రభావతి
ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోతే బాగుండు అని కోరుకుంటుంది సువర్ణ. పెళ్లి ఏర్పాట్లను మీనా చూసుకుంటూ ఉంటుంది. నీలకంఠం బంధువులకు రోహిణిని, మనోజ్‌ను పరిచయం చేస్తుంది ప్రభావతి. రోహిణి సొంతగా బ్యూటి పార్లర్ నడిపిస్తుందని, వాళ్ల నాన్నకు చాలా దుబాయ్‌లో చాలా ఆస్తులు ఉన్నాయని గొప్పలు పోతుంది ప్రభావతి. మనోజ్ కూడా మంచి జాబ్ చేస్తాడని, అక్కడ వాడు చెప్పినట్లే సాగుతుందని, త్వరలో సొంత కంపెనీ పెట్టబోతున్నట్లు అబద్ధాలు ఆడుతుంది.
మీనాకు వచ్చిన అనుమానం
తర్వాత సుశీల వచ్చి రోహిణి వాళ్ల నాన్న గురించి అడుగుతుంది. మీ నాన్న ఇంకెప్పుడు వస్తారు అని అంటుంది సుశీల. దాంతో బిత్తరపోతుంది రోహిణి. ఆలోచించి వర్క్‌లో బిజీగా ఉండి రాలేకపోతున్నారు. ఫ్లైట్ దొరకలేదట అని కవర్ చేస్తుంది రోహిణి. ఇక శ్రుతిపై యాసిడ్ అటాక్ చేసినప్పుడు సంజుతో ఉన్న ఇద్దరు మనుషులను చూసిన మీనా వీళ్లను ఎక్కడో చూసినట్లుందే అని అనుమానిస్తుంది. కానీ, మొహాలు చూడకపోవడంతో మీనా గుర్తుకురాదు.
ఒప్పుకున్న శ్రుతి
మరోవైపు బాలు ఫ్రెండ్స్ రాజేష్ వాళ్లు సంజును కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. పెళ్లి కొడుకు గది నుంచే సంజును కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు రాజేష్ వాళ్లు. మరోవైపు మౌనికి పెళ్లికి వెళ్లేందుకు శ్రుతిని ఒప్పిస్తుంటాడు రవి. కానీ, శ్రుతి మాత్రం రానని గట్టిగా చెబుతుంది. బాలు సంగతి అమ్మ చూసుకుంటుంది, నాన్న వాళ్ల ముందు బాలు అన్నయ్య ఏం చేయడు అని సర్దిచెబుతాడు రవి. దాంతో చాలా సేపటి తర్వాత మౌనిక పెళ్లి రావడానికి శ్రుతి ఒప్పుకుంటుంది. ఇలా ఇదంతా గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
టాపిక్