Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి రోహిణి ఔట్ - తులసి కృష్ణ ప్లేస్‌లో కొత్త నటి ఎంట్రీ
Telugu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి రోహిణి పాత్రలో నటిస్తోన్న తులసి కృష్ణ అర్థాంతరంగా తప్పుకున్నది. తులసి కృష్ణ స్థానంలో డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది. టీఆర్‌పీ లో స్టార్ మా సీరియల్స్‌లో గుండె నిండా గుడి గంటలు టాప్ ఫైవ్‌లో ఒకటిగా కొనసాగుతోంది.
Telugu Serial: ప్రస్తుతం స్టార్ మా సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా టాప్ ఫైవ్‌లో ఒకటిగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ కొనసాగుతోంది. ఒకనొక టైమ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న బ్రహ్మముడి సీరియల్‌కు గుండె నిండా గుడి గంటలు గట్టి పోటీ ఇచ్చింది. అర్బన్ ఏరియాలో టాప్ సీరియల్‌గా నిలిచింది.
మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్..
మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆరంభం నుంచి బుల్లితెర ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. మీనా, బాలు జోడీ, వారి కెమిస్ట్రీ ఈ సీరియల్‌కు హైలైట్‌గా నిలుస్తూ వస్తోంది.
ఇష్టంలేని కోడలిగా అడుగుపెట్టిన ఓ యువతికి అత్తయ్యతో పాటు తోటి కోడలి నుంచి ఎలాంటి సాధింపులు ఎదురయ్యాయి? కోపిష్టి అయిన భర్త ఆమెను అపార్థం చేసుకున్నాడు? ఓర్పుతో అందరి మనసుల్ని ఆ కోడలు ఎలా గెలిచింది? అత్తింటిని ఏ విధంగా చక్కదిద్దిందనే పాయింట్‌తో ఈ సీరియల్ కొససాగుతోంది.
రోహిణి పాత్రలో...
గుడి నిండా గుడి గంటలు సీరియల్‌లో రోహిణిగా నెగెటివ్ షేడ్‌తో కూడిన పాజిటివ్ క్యారెక్టర్‌లో తులసి కృష్ణ నటించింది. తనకు ఇదివరకే పెళ్లయినా ఈ విషయాన్ని అత్త, భర్త దగ్గర దాచిపెడుతూ వారి దగ్గర మంచి మార్కులు కొట్టేసే కోడలిగా రోహిణి పాత్రలో తులసి కృష్ణ తన నటనతో మెప్పించింది. రోహిణి పాత్ర అంటేనే తులసి కృష్ణ అనేంతగా పేరుతెచ్చుకున్నది.
సీరియల్ నుంచి ఔట్...
అర్ధాంతరంగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి తులసి కృష్ణ తప్పుకుంది. ఆమె ప్లేస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో (డిసెంబర్ 13) కొత్త నటి జ్యోతిక కనిపించి సీరియల్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. వ్యక్తిగత కారణాల వల్లే తులసి కృష్ణ గుండె నిండా గుడి గంటలు నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది.
మై విలేజ్ సర్పంచ్...
తెలుగులో రాధమ్మ కూతురుతో పాటు పలు సీరియల్స్‌లో కనిపించింది తులసి కృష్ణ. మై విలేజ్ సర్పంచ్ పేరుతో గతంలో తెలుగులో ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించింది.
అమూల్యగౌడ...
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు పాత్రలో విష్ణుకాంత్ కనిపించబోతుండగా...మీనాగా అమూల్య గౌడ నడిస్తోంది. అనీలా శ్రీకుమార్, శ్రీకాంత్ హేబ్లిగర్ కీలక పాత్రలు పోషిస్తోన్నారు. జై ఆర్‌వీ ఈ సీరియల్‌కు దర్శకత్వం వహిస్తోన్నాడు.
300 ఎపిసోడ్స్ కంప్లీట్...
తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన సిరాగడిక్కా ఆశై సీరియల్‌కు రీమేక్‌గా గుండె నిండా గుడి గంటలు తెరకెక్కుతోంది. 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇటీవలే 300 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది.