బాలు, మీనాలపై రివేంజ్ తీర్చుకోవడానికి పూల మాలల ట్రక్‌ను తన మనుషులతో దొంగతనం చేయిస్తాడు గుణ. ఆ ట్రక్‌లోని పూల మాలలు కాల్చేయాలని అనుకుంటాడు. కానీ రాజేష్‌తో పాటు మరికొంత మంది స్నేహితుల సహాయంతో ఆ ట్రక్‌ను పట్టుకుంటారు బాలు, మీనా. మీతో ఎవరు ఈ పని చేయించారో చెప్పమని గుణ గ్యాంగ్ మెంబర్స్‌ను చితక్కొడతాడు బాలు. పూల మాలలు డెలివరీ చేసేందుకు టైమ్ అయ్యిందని, అదే మనకు ముఖ్యమని మీనా, రాజేష్ అనడంతో గుణ మనిషిని బాలు వదిలేస్తాడు.
పొలిటికల్ లీడర్ వీరబాబుకు ఫోన్ చేసి ట్రక్ దొరికిందని, పది నిమిషాల్లో ఫంక్షన్ హాల్‌కు వస్తామని బాలు అంటాడు. బాలు రాగానే తన మనుషులతో బాలును బందిస్తాడు వీరబాబు. ప్రత్యర్థులతో చేతులు కలిపి తన పేరును నాశనం చేయడానికే బాలు కుట్రలు పన్నాడని వీరబాబు నిందలు వేస్తాడు.
తమ కష్టపడి పనిచేస్తామని, కానీ అబద్దాలు చెప్పమని వీరబాబుకు జరిగింది చెబుతుంది మీనా. బాలు డబ్బులకు అమ్ముడుపోయే మనిషి కాదని అంటుంది. సాక్ష్యాలతో సహా బండి దొంగతనాన్ని బయటపెడతాడు బాలు. తన ప్రత్యర్థులే ఈ పని చేసి ఉంటారని వీరబాబు నమ్ముతాడు. బాలుకు సారీ చెబుతాడు.
డీల్ ప్రకారం ఒప్పుకున్న డబ్బులు మాత్రమే కాకుండా తన పరువు కాపాడినందుకు కొంత డబ్బు ఎక్కువ ఇస్తాడు. బాలుపై ప్రశంసలు కురిపిస్తాడు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్న నేను ఉన్నాననే విషయం మర్చిపోకు అని బాలుతో చెబుతాడు వీరబాబు.
పూల మాలలు కట్టడంలో సాయం చేసిన బస్తీ వాసులకు మీనా, బాలు థాంక్స్ చెబుతారు. వారికి డబ్బులు ఇవ్వబోతుంది మీనా. కానీ డబ్బులు తీసుకోవడానికి వాళ్లు ఒప్పుకోరు. మేము డబ్బుల కోసం మీకు సాయం చేయలేదని అంటారు. తమ కోసం మీనా చేసిన సాయాన్ని గుర్తుచేస్తారు.
మీనా తమకు ఆడపడుచు లాంటిదని అంటాడు. డబ్బులిచ్చి పరాయివాళ్లను చేయద్దని అంటారు. బాలు పక్కకు వెళ్లిన తర్వాత ఆ డబ్బులతో ఏం చేస్తావని మీనాను అడుగుతారు బస్తీ వాసులు. బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటున్నట్లు చెబుతుంది మీనా. అది మన మీనా అంటే అనే బస్తీ మహిళ్లలు పొగడ్తలు కురిపిస్తారు.
బాలు ట్రక్ దొంగతనం చేశారని తెలిసి సత్యం టెన్షన్ పడతాడు. కానీ భర్త మాటలను ప్రభావతి నమ్మదు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు, మీనా ట్రక్ దొరికిందని, పూల మాలలు కరెక్ట్ టైమ్‌కు డెలివరీ చేశామని అంటారు. వీరబాబు ఇచ్చిన డబ్బులను సత్యానికి ఇస్తాడు బాలు. పూల కొట్టు మీద మొదటిసారి మంచి లాభం వచ్చిందని ఆశీర్వదించి తమకు ఇవ్వమని బాలు అంటాడు. ఆ డబ్బులను మీనాకు ఇస్తాడు సత్యం.
మీనాను మంచి చేసుకొని మాలల ఆర్డర్ ద్వారా వచ్చిన డబ్బులను కొట్టేయాలని ప్రభావతి ప్లాన్ చేస్తుంది.
ఇంట్లో కొంత మంది సంపాదించింది మొత్తం వాళ్లే అనుభవిస్తున్నారని సెటైర్లు వేస్తుంది. రోహిణి మాత్రమే నెల నెల తనకు డబ్బులు ఇస్తుందని కోడలిని పొగడుతుంది. ప్రభావతి మాటలతో ఆవేశంగా మీనా రూమ్‌లోకి వెళుతుంది. మీనా డబ్బు లెక్కపెట్టడం చూసి తనకే ఆ డబ్బులు ఇస్తుందని ప్రభావతి ఆశపడుతుంది. మీనా బయటకు రాగానే ఆమెతో ప్రేమగా మాట్లాడుతుంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా డబ్బులతో బయటకు వెళ్లిపోవడంతో ప్రభావతి షాకవుతుంది.
బాలు కోసం కారు కొనాలని అనుకుంటుంది మీనా. ఆ విషయం బాలుకు తెలియకుండా రాజేష్ సహాయంతో కారు కొని భర్తను సర్‌ప్రైజ్ చేయాలని అనుకుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం