Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు గుండె నొప్పి.. అత్తింట్లోకి శ్రుతి.. మొదటి రోజే ప్రభావతికి చుక్కలు-gunde ninda gudi gantalu serial january 10th today episode balu get heart stroke with prabhavati behaviour star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు గుండె నొప్పి.. అత్తింట్లోకి శ్రుతి.. మొదటి రోజే ప్రభావతికి చుక్కలు

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు గుండె నొప్పి.. అత్తింట్లోకి శ్రుతి.. మొదటి రోజే ప్రభావతికి చుక్కలు

Sanjiv Kumar HT Telugu
Jan 10, 2025 08:20 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial January 10th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 10 ఎపిసోడ్‌లో రవి, శ్రుతి వస్తారని బాలును ఇంట్లో లేకుండా చేసేందుకు ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తుంది ప్రభావతి. అది చూసి తట్టుకోలేకపోతాడు బాలు. తర్వాత అత్తింట్లోకి భర్త రవితో కలిసి శ్రుతి అడుగుపెడుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 10 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 10 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతితో లక్ష్మీ దేవిని ఇంటికి పంపిస్తున్నావని, పరాయి దేశం ఫర్నిచర్‌తో పాష్‌గా ఇల్లంతా కళకళలాడేలా చూడమని దేవుడుని కోరుకుంటుంది ప్రభావతి. నీతో తర్వాత మాట్లాడుతాను. ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని వెళ్లిపోతుంది ప్రభావతి. మీనా వంట చేస్తుంటే చక చకా చేయమని ఆర్డర్స్ వేస్తుంది.

yearly horoscope entry point

ప్రభావతికి కౌంటర్స్

రాత్రి చెప్పింటే చేసేదాన్ని ఇప్పుడు చెప్పారు కదా కాస్తా లేట్ అవుతుంది. మీలా ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే టాలెంట్ నాకు లేదని కౌంటర్స్ వేస్తుంది మీనా. తర్వాత ఇంటికి ఎవరొస్తున్నారు అని మీనా అడుగుతుంది. మీ పూలకొట్టు సంత అంతా వస్తుందని ప్రభావతి అంటుంది. వాళ్లు లేనిదానికి ఆశపడేవాళ్లు కాదని మీనా అంటుంది. అంటే ఏంటే నేను ఆశపడతాననా అని ప్రభావతి అంటుంది. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటారేంటీ అని కౌంటర్స్ వేస్తుంది మీనా.

చెప్పింది చేయమని వెళ్లిన ప్రభావతి అటు ఇటు కంగారుగా తిరుగుతుంది. వెనుకే వచ్చిన సత్యంను చూసుకోకుండా ఢీ కొడుతుంది. దాంతో సత్యం గోడ పక్కకు వెళ్లి పడతాడు. ఏమైందే నీకు అందరిని గుద్దుకుంటూ తిరుగుతున్నావ్ అని సత్యం అంటాడు. ఇప్పుడు ఈయనకు చెబితే నేను ఇష్టంతో చేస్తున్నాను అనుకుంటారు అని ఇల్లంత గందరగోళంగా ఉంది. ఆ వచ్చిన వాళ్లంతా ఏమనుకుంటారు అని చెప్పకూడదనుకుని నోరు జారుతుంది ప్రభావతి.

ఎవరొస్తున్నారు అని సత్యం అడుగుతాడు. దాంతో కాకి అరిచిందని, చుట్టాలు ఎవరైనా వస్తారేమో అని కవర్ చేస్తుంది. దాంతో తిట్టి వెళ్లిపోతాడు సత్యం. రవి వస్తున్నట్లు ఈయనకు ఎలా చెప్పాలో తెలియట్లేదు అని ఆలోచించిన ప్రభావతి బాలు ఉన్నట్లు గమనిస్తుంది. వీడు ఉంటే కొంప కొల్లేరు అవుతుందే. అసలే శ్రుతి వాళ్ల అమ్మ వీడు ఉండకూడదనే చెప్పిందే. వీన్ని ఎలాగైనా బయటకు పంపించాలి అని మీనాతో మాట్లాడుతుంది ప్రభావతి.

షాక్ అయిన బాలు

ట్రిప్ వచ్చినప్పుడు వెళ్తారు అని మీనా చెబుతాడు. ట్రిప్ ఇంటికి వచ్చి బెల్ కొడుతుందా. ఆటో స్టాండ్‌కు వెళ్తే వస్తుందని ప్రభావతి అంటుంది. ఆయన లేకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని మీనా డౌట్ పడుతుంది. నీ మొహం. బాధ్యత గుర్తు చేస్తున్నాను అని ప్రభావతి అంటుంది. దాంతో బాలు దగ్గరికి వెళ్తుంది మీనా. సరిగ్గా ఉడకని అన్నం, కూరను బాక్స్‌లో పెడుతుంది ప్రభావతి. ఇంతలో వచ్చిన బాలు వస్తాడు. ఆయనకు ఆకలేస్తుందట తినేసి వెళ్తారు అని మీనా అంటుంది.

తొందరగా బాలుకు అన్నం వడ్డించు అని ప్రభావతి అంటుంది. దాంతో ఎవరిని అని షాక్ అవుతాడు బాలు. తొందరగా తినేసి వెళ్లరా అని కరుచుకుంటుంది ప్రభావతి. సరే నువ్ మిగతా పనులు చూడు నేను వడ్డిస్తాను అని ప్రభావతి అంటుంది. దాంతో మరింత షాక్ అవుతారు బాలు, మీనా. ఇంతలో మనోజ్ వస్తే చేయి గిల్లి ఇది నిజమే అని అనుకుంటాడు బాలు. నేను నా చేత్తే వడ్డించాలని మొన్ననే అనుకున్నాను అని ప్రభావతి అంటుంది.

నాక్కూడా వడ్డించమని మనోజ్ అంటే.. నీకు తొందరేమొచ్చిందిరా. పనిపాట లేదు కానీ తినడానికి ముందే వస్తాడు అని ప్రభావతి అంటుంది. ఏంటీ వీడికి పనిపాట లేదా. అంటే ఈ ఉద్యోగం కూడా గోవిందా అని బాలు షాక్ అయి అడుగుతాడు. వాడికి ఇంకా టైమ్ ఉందిలేరా. మనోజ్ కాసేపు ఆగరా వాడు వెళ్లాలి అని ప్రభావతి అంటుంది. వీన్ని ఆపి నాకు అన్నం పెడతావా. నీ తలకు ఏమైనా దెబ్బ తగిలిందా అని బాలు అడుగుతాడు.

గుండెనొప్పి రాకుండా

నోరు మూసుకుని తినరా. మనోజ్ చేతులు ఖాలీ లేవు. తర్వాత రా అని ప్రభావతి అంటుంది. ముష్టోడికి చెప్పినట్లు చెబుతావేంటీ అమ్మ అని పక్కకు వెళ్తాడు మనోజ్. ఈ క్యారేజ్ ఎవరికి అని బాలు అడిగితే.. నేనే కట్టాను అని ప్రభావతి అంటుంది. దాంతో బాలు గుండె పట్టుకుని మీనా.. నాన్నను అడిగి గుండెనొప్పి రాకుండా ఉండే ట్యాబ్లెట్ తీసుకురావా. నా గుండె పంచర్ అయ్యేలా ఉంది. కళ్లముందున్న ఈ జీవితసత్యం గొంతుకు అడ్డుపడి మింగుడుపడట్లేదు అని బాలు అంటాడు.

ఇంతలో వచ్చిన సత్యం మనోజ్‌ను ఇంకా తినలేదా అని అడుగుతాడు. బాలు గాడు తిన్నాకే తినాలట. అమ్మె చెప్పింది అని మనోజ్ అంటాడు. దాంతో సత్యం కూడా షాక్ అయి హార్ట్ ట్యాబ్లెట్ తెచ్చుకోవాలని అంటాడు. నాక్కూడా తీసుకురా అని బాలు అడుగుతాడు. ఏ ఎగతాలిగా ఉందా. కొడుకు తల్లి అన్నం పెడితే ఇంత ఓవరాక్షన్ చేస్తారేంటీ అని బాలు, సత్యంకు అన్నం పెడుతుంది ప్రభావతి. మీనాపై అరుస్తు హడావిడి చేస్తుంది ప్రభావతి.

పక్కనే మనోజ్ ఆకలితో అలమటిస్తుంటాడు. బాలును తొందరగా తినమని కంగారుపెడుతుంది ప్రభావతి. బాలు తిన్నాక మీనాను న్యాప్‌కిన్ అడిగితే.. ప్రభావతి తన కొంగు ఇస్తుంది. దాంతో మరింత షాక్ అవుతాడు బాలు. తర్వాత వెళ్లినట్లే వెళ్లి బాలు ప్రతిసారి తిరిగి వస్తాడు. బయటకు వెళ్లిన బాలు మౌనిక పెళ్లి చూపులకు నేను లేకుండా ఉండేందుకు ఎలా ఓవరాక్షన్ చేసిందో ఇప్పుడు అలాగే చేసిందని మళ్లీ లోపలికి వెళ్తాడు బాలు.

దున్నపోతు అంటూ

తర్వాత ఏదో ఒక వంకతో ఇంట్లోకి వస్తున్న బాలుతో ఇప్పుడు వెళ్తావా లేదా అని అరుస్తుంది ప్రభావతి. ఎన్నడు లేనిది అమ్మా నాకు అన్నం పెట్టింది నాన్న. పాపం పసివాడు అని చూడకుండా నా హార్ట్‌తో ఆడుకుంటుంది. పైగా లక్షలు మింగినోడు అన్నం పెట్టమని వస్తే ముష్టోడు, పనిపాట లేదు. దున్నపోతు అంటూ కసురుకుంది అని బాలు అంటాడు. వీడు సోది చెప్పుకుంటూ ఇక్కడే ఉన్నాడే. వాళ్లను అటు నుంచి అటే పంపిస్తాడేమో అని ప్రభావతి భయపడుతుంది.

తర్వాత బాలు వెళ్తుంటే మీనా తుమ్ముతుంది. దాంతో తుమ్మింది అని బాలు తిరిగి వస్తాడు. తర్వాత అందరికి వస్తా అని చెప్పి వెళ్తాడు బాలు. తర్వాత కడుపునొప్పి అంటూ బాలు ఇంట్లోకి వస్తాడు. అమ్మ చూపించిన అతిప్రేమ వల్ల తిన్నది అరగలేదు. అరిగింది ఆగడం లేదు. నాన్న నువ్ కూడా తినకు అని పైకి వెళ్తాడు బాలు. దాంతో అయ్యో కర్మ. ఇవాళ వాడు వెళ్లేలా లేడు అనుకున్న ప్రభావతి బాలును చూసేందుకు పైకి వెళ్తుంది.

బాలు గదిలో నుంచి బయటకు రాకుండా తలుపు గడియ పెడుతుంది. లోపలే చావు అని కిందకు వస్తుంది ప్రభావతి. మనోజ్ తింటాను అంటే.. ఇంకో అరగంట ఆగితే చస్తావా. బాలులా చేస్తే ఫుట్‌బాల్ ఆడుకుంటాను అని ప్రభావతి అంటుంది. వాడిమీద ఇవాళ ప్రేమ చూపిస్తున్నావ్. నీ మీద కోప్పడుతున్నావ్ అని మనోజ్ అంటే.. వాళ్లు వస్తారు అని మళ్లీ నోరు జారుతుంది ప్రభావతి. ఎవరు వస్తారు అని సత్యం నిలదీస్తాడు.

భయపడిన శ్రుతి

రవి, శ్రుతి వస్తున్నారని శ్రుతి వాళ్ల అమ్మానాన్నే తీసుకొస్తున్నారు అని చెబుతుంది ప్రభావతి. ఇంతలో శోభన, సురేంద్ర వాళ్లు వస్తారు. కారు నుంచి దిగేందుకు సురేంద్ర తటపటాయిస్తాడు. శ్రుతిని తీసుకెళ్లు అని సురేంద్ర అంటాడు. మాకెన్ని తలవంపులు తీసుకొచ్చావే అని అన్న శోభన శ్రుతి, రవిని తీసుకెళ్తుంది. బాలు ఉంటాడా అని శ్రుతి భయపడితే.. మా అమ్మ ఉందిగా చూసుకుంటుంది అని రవి చెబుతాడు. హారతి తీసుకురమ్మని రోహిణికి చెబుతుంది ప్రభావతి.

మీనా హారతి తీసుకొచ్చి ఇస్తుంటే ప్రభావతి అడ్డుకుని రోహిణిని ఇవ్వమంటుంది. మీనా ఇస్తే పవర్ ఉండదా అని శ్రుతి కౌంటర్ ఇస్తుంది. ఇద్దరు వదినలు కలిసి ఇవ్వండి అని రవి అనడంతో మీనా, రోహిణి హారతి ఇస్తారు. కుడికాలు పెట్టి లోపల పెట్టి రా అమ్మా అని ప్రభావతి అంటుంది. నడవడానికి రెండు కాళ్లు ఇంపార్టెంట్. కానీ, కుడికాలే ముందు ఎందుకు పెట్టాలి అని శ్రుతి ప్రశ్నిస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత ఇంట్లో దీపం పెట్టమంటే కరెంట్ లేదా అని శ్రుతి అంటుంది.

అది ఆనవాయితీ అని శ్రుతితో దీపం పెట్టిస్తుంది ప్రభావతి. ఇంట్లో ఏం కావాలన్న నన్ను అడుగు అని మీనా అంటుంది. సరే అని శ్రుతి నవ్వుతూ అంటుంది. ఇదేంటీ దీనికి దగ్గర అవుతుంది అని ప్రభావతి అంటుంది. నేను ఇంటికి రావడానికి కారణం మీనానే అని శ్రుతి చెబుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner