Gunde Ninda Gudi Gantalu Today Episode: పంచెకట్టులో బాలు మాస్ ఎంట్రీ- భయపడిపోయిన తండ్రీకొడుకులు- బావ, మామయ్య అంటూ!-gunde ninda gudi gantalu serial december 30th episode sanju neelakantam afraid to balu over mounika marriage star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: పంచెకట్టులో బాలు మాస్ ఎంట్రీ- భయపడిపోయిన తండ్రీకొడుకులు- బావ, మామయ్య అంటూ!

Gunde Ninda Gudi Gantalu Today Episode: పంచెకట్టులో బాలు మాస్ ఎంట్రీ- భయపడిపోయిన తండ్రీకొడుకులు- బావ, మామయ్య అంటూ!

Sanjiv Kumar HT Telugu
Dec 30, 2024 10:44 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial December 30 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో సంజు ఇంటికి మౌనిక పెళ్లికోసం సత్యం ఫ్యామిలీ అంతా వెళ్తుంది. కారులో నుంచి నమస్తే మామయ్య అంటూ మాస్ ఎంట్రీ ఇస్తాడు బాలు. అది చూసి షాక్ అవుతాడు నీలకంఠం. సంజు దగ్గరికి వెళ్లి బాలు గురించి చెబుతాడు నీలకంఠం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 30 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 30 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లికి సత్యం ఫ్యామిలీ అంతా రెడీ అయి వెళ్తుంది. బాలు పంచె కట్టుకుని అందరికంటే స్పెషల్ అట్రాక్షన్‌లా కనిపిస్తాడు. బాలు పంచెకట్టుకుని సంతోషంగా రావడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది.

yearly horoscope entry point

సంజు ఇంటికి సత్యం ఫ్యామిలీ

సత్యం, మౌనిక మాత్రం చాలా సంతోషిస్తారు. తర్వాత సంజు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. సంజు వెడ్స్ మౌనిక అంటూ పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. సంజు ఇంటికి బంధువులు అంతా వచ్చేస్తారు. అలాగే, సత్యం ఫ్యామిలీ అంతా ఒక కారులో సంజు ఇంటికి వస్తారు. వారితో రంగా, కామాక్షి కూడా ఉంటారు. వారంతా వచ్చి నీలకంఠంను, సువర్ణను పలకరిస్తారు. బాగున్నారా అంటూ కుశలప్రశ్నలు వేసుకుంటారు. బాలు గురించి నీలకంఠం అడుగుతాడని తెలుస్తోంది.

బాలు మాస్ ఎంట్రీ

బాలు పెళ్లికి రావట్లేదా. మా మీద ఎందుకు కోపం ఉందో అర్థం కావట్లేదని నీలకంఠం అన్నట్లు తెలుస్తోంది. ఇంతలో తన కారులో వచ్చిన బాలు నమస్తే మామయ్య అని బాలు డోర్ తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. డోర్ నుంచే రెండు చేతులు పైకి పెట్టి నమస్తే అంటాడు బాలు. అది చూసి నీలకంఠం షాక్ అవుతాడు. కండువను భుజంపై వేసుకుంటూ స్టైల్‌గా, మాస్‌గా నడుచుకుంటూ వస్తాడు బాలు. అదేంటీ మావయ్య ఈ పెళ్లిలో నేను లేకుండా ఎక్కడికిపోతాను అని నీలకంఠం అన్నదానికి బాలు అంటాడు.

తాగిన మత్తులో అన్నాను

మిమ్మల్ని అందరిని జాగ్రత్తగా చూసుకోవాలి. మర్యాదలు చేయాలి. రండి అంటూ వాళ్లనే ఇంట్లోకి తీసుకెళ్తాడు బాలు. బాలు మాటలకు నీలకంఠం కంగారుపడిపోతుంటాడు. పక్కనున్న భార్యవైపు చూస్తూ బాలును ఏం అనలేక చేతులు పిసుక్కుంటాడు. తర్వాత ఇంట్లో హాల్లో అందరు కూర్చుంటారు. పైనుంచి సంజు పెళ్లి కొడుకు దుస్తుల్లో మెట్లు దిగుకుంటూ వస్తాడు. బావ నేనేదో తాగిన మత్తులో అన్నాను. నువ్వు మర్చిపో.. నేను మర్చిపోతాను అని బాలు అంటాడు.

ప్రభావతికి అనుమానం

అంటే, బాలు చేసిన గొడవ గురించి మాట్లాడుకుంటుంటే సంజు వచ్చి తాగి చేసిన రచ్చ గురించి చెప్పినట్లు ఉన్నాడు. అందుకే తాగిన మత్తులో మాట్లాడానను కవర్ చేస్తాడు. బాలు ప్రవర్తనకు ప్రభావతి అర్థం కాకుండా చిరాకుగా చూస్తుంది. అసలు వీడేంటీ ఇలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని అనుకుంటుంది ప్రభావతి.

పెళ్లి చెడగొట్టాలని చూస్తాడు

మరోవైపు సంజుతో నీలకంఠం మాట్లాడుతాడు. పెళ్లికి ఆ బాలు గాడు వచ్చాడంటే మాత్రం ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొట్టాలనుకుంటాడు అని కొడుకుతో నీలకంఠం అంటాడు. దాంతో సంజు ఆలోచనలో పడిపోతాడు. అయితే, పెళ్లికి బాలు రావడంతో తండ్రికొడులు నీలకంఠం, సంజు ఇద్దరు భయపడిపోతారు. ఇక పెళ్లిలో సంజును తన ఫ్రెండ్స్‌తో కిడ్నాప్ చేయించేందుకు బాలు ప్లాన్ చేస్తాడు. దాంతో బాలు ఫ్రెండ్స్ పెళ్లిలోకి ఎంట్రీ ఇస్తారు.

శ్రుతిని బతిమిలాడిన రవి

మరోవైపు మౌనిక పెళ్లికి వచ్చేందుకు శ్రుతిని ఒప్పించడానికి రవి బతిమాలుడుతుంటాడు. బాలు కోపం ఎక్కువే కానీ చాలా మంచివాడని, తను వద్దన్న నేను పెళ్లి చేసుకున్నాని, నాన్న పోలీస్ స్టేషన్, హాస్పిటల్‌కు వెళ్లారనే బాధతోనే ఆ కోపం ఉందని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు రవి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుందని తెలుస్తోంది.

Whats_app_banner