Gunde Ninda Gudi Gantalu: ఏడ్చే సీన్‌లో కూడా నడుము చూపించాలంటారు.. గుండె నిండా గుడి గంటలు శ్రుతి కామెంట్స్-gunde ninda gudi gantalu serial actress shruthi viharika chowdary comments on exposing in emotional scenes and directors ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu: ఏడ్చే సీన్‌లో కూడా నడుము చూపించాలంటారు.. గుండె నిండా గుడి గంటలు శ్రుతి కామెంట్స్

Gunde Ninda Gudi Gantalu: ఏడ్చే సీన్‌లో కూడా నడుము చూపించాలంటారు.. గుండె నిండా గుడి గంటలు శ్రుతి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 30, 2024 08:38 AM IST

Gunde Ninda Gudi Gantalu Actress On Directors And Exposing: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో శ్రుతిగా అలరిస్తోంది విహారిక చౌదరి. సీరియల్స్ కంటేముందు పలు సినిమాలు, యూట్యూబ్‌ వెబ్ సిరీసులు చేసిన విహారిక చౌదరి. ఎమోషనల్ సీన్స్‌లో కూడా డైరెక్టర్స్ నడుము చూపించమంటారు అని కామెంట్స్ చేసింది.

ఏడ్చే సీన్‌లో కూడా నడుము చూపించాలంటారు.. గుండె నిండా గుడి గంటలు శ్రుతి కామెంట్స్
ఏడ్చే సీన్‌లో కూడా నడుము చూపించాలంటారు.. గుండె నిండా గుడి గంటలు శ్రుతి కామెంట్స్

Gunde Ninda Gudi Gantalu Actress About Exposing: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో శ్రుతి పాత్రలో అలరిస్తోంది విహారిక చౌదరి. బాలు తమ్ముడు రవికి లవర్‌గా, భార్యగా ఈతరం అమ్మాయి పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకుంటోంది. అయితే, విహారిక చౌదరి సీరియల్స్ కంటే ముందు పలు సినిమాలు, యూట్యూబ్ వెబ్ సిరీసుల్లో నటించి అలరించింది.

yearly horoscope entry point

విహారిక చౌదరి కామెంట్స్

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, నేను నా రాక్షసి వంటి యూట్యూబ్ వెబ్ సిరీస్‌లతోపాటు కాలం రాసిన కథలు సినిమాలో నటించిన విహారిక చౌదరి. ఇప్పుడు వారధి అనే కొత్త సినిమాతో మరోసారి హీరోయిన్‌గా అలరించేందుకు ప్రేక్షకులు ముందుకు వస్తోంది గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటి శ్రుతి. అయితే, నాలుగు నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో విహారిక చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"ఈయనేమో ఒక సినిమాకు డైరెక్టర్, ఒక సినిమాకు మేనేజర్. మీవేమో మూడు నాలుగు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఆ డైరెక్టర్స్‌కు ఈ డైరెక్టర్‌కు వర్క్, స్టైల్ పరంగా ఉన్న ఏం డిఫరెన్స్ గమనించారు" అని విహారిక చౌదరి యాంకర్‌ను అడిగాడు. అప్పుడు డైరెక్టర్స్ ప్రవర్తన, ఎక్స్‌పోజింగ్, నడుము చూపించడం గురించి చెప్పుకొచ్చింది విహారిక చౌదరి.

ప్రతి ఫ్రేమ్‌లో ఎక్స్‌పోజ్ చేయాలి

"వర్క్ స్టైల్ పరంగా అంటే నేను చేసిన వాళ్లలో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే.. ఆ సీన్స్‌కు అవసరం ఉన్నా అవసరం లేకపోయిన ఎక్స్‌పోజ్ చేయాలి. లేకపోతే కొంచెం రొమాంటిక్‌గా కనిపించాలి, రొమాంటిక్‌గా చూపించాలి. అంటే, అవసరం లేని దగ్గర అవసరం లేదు. అయినా కాని ప్రతి ఫేమ్‌లో ఎక్స్‌పోజ్ చేయాలి" అని విహారిక చౌదరి చెప్పింది.

"నిజంగా చెబుతున్నా మీరు నమ్మరు. ఒక మూవీ చేస్తున్నా. అది ఏ మూవీనో చెప్పలేను. ఆ మూవీ చేస్తున్నప్పుడు సినిమాలో సారీ కట్టుకున్న సీన్ ఉంటుంది. అంటే డల్ సీన్ అది. భర్తకు ఏదో సమ్‌థింగ్ అయిపోయి ఉంటుంది. అంత డల్‌గా, ఎమోషనల్‌గా ఉన్న సీన్‌లో కూడా బ్యాక్ నుంచి కెమెరా పెట్టి నడుము కనిపించాలి.. నడుము కనిపించాలి అంటున్నారు. వాట్ ద హెల్" అని విహారిక చౌదరి తెలిపింది.

యూత్ అట్రాక్షన్ కోసమంటూ

"అరే యార్.. అది ఏడ్చే సీను అక్కడ నడుము ఎవరు చూస్తారు. అలా కొన్ని ఎక్స్‌పీరియెన్సెస్ ఉన్నాయి. కానీ, సాగర్ గారితో వర్క్ చేస్తుంటే ప్లజంట్‌గా వెళ్లిపోతుంది. ఇబ్బంది ఉండదు. మనకు అవసరం లేని దగ్గర ఎక్స్‌పోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం ఉందా సీన్ వర్కౌట్ కోసం ఎవరైనా చేయాల్సిందే. తప్పదు. కానీ, అవసరం లేని దగ్గర కూడా కచ్చితంగా చేయాలి. యూత్ అట్రాక్షన్ కోసం అని అలా అయితే కాదు. సర్‌లో నాకు నచ్చిన గుడ్ థింగ్ అది" అని విహారిక చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అయితే, కాలం రాసిన కథలు సినిమా ప్రమోషన్స్ సమయంలో విహారిక చౌదరి ఈ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ ఎమ్ఎన్‌వీ సాగర్ గురించే గొప్పగా చెప్పింది విహారిక. ఇక ఎమోషనల్ సీన్స్‌లో కూడా నడుము చూపించాలని చెప్పిన డైరెక్టర్ ఎవరనేది మాత్రం విహారిక చెప్పలేదు.

Whats_app_banner