Gunde Ninda Gudi Gantalu: కాపురం విషయంలో మీనా అబద్ధం - భార్యను హర్ట్ చేసిన బాలు - బయటపడ్డ రోహిణి సీక్రెట్స్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 8 ఎపిసోడ్‌లో అత్తింట్లో అడుగుపెట్టిన మీనాను ప్రభావతి, రోహిణి సూటిపోటి మాటలతో వేధిస్తుంటారు. ఇంట్లో జరిగిన గొడవలకు మీనానే కారణమని బాలు కూడా మీనానే తప్పుపడతాడు. తాను ఏ తప్పు చేయలేదని మీనా ఎంత చెప్పిన బాలు నమ్మడు.
Gunde Ninda Gudi Gantalu: అత్తింట్లోకి అడుగుపెట్టిన మీనాను సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు రోహిణి, ప్రభావతి. అడగకుండా టిఫిన్ చేసిందనే వంక పెట్టుకొని ఇద్దరు కలిసి మాటలతో టార్చర్ పెడతారు. ఇక నుంచి ఎవరికి ఏం కావాలో అడిగి చేయాలని ఆర్డర్ వేస్తారు. భర్త బాలుకు ఇష్టమని పూరి, కుర్మా చేశానని మీనా అంటుంది.
నాకు ఇష్టమైనవి చేసిపెట్టమని నిన్ను అడిగానా అంటూ మీనాపై బాలు ఫైర్ అవుతాడు. చేసిన తప్పను మర్చిపోవాలని నిన్ను కూల్ చేయడానికి ఇవన్నీ చేస్తుందని మీనాపై చాడీలు చెబుతుంది ప్రభావతి. నువ్వు అందరికంటే ముదురు అన్న సంగతి మీ ఆవిడకు అర్థం కావడం లేదని ప్రభావతి అంటుంది.
నువ్వు చేసిన పూరి తినను...
నాకు పూరి అంటే ఇష్టమే కానీ నీ చేతితో చేసిన పూరి మాత్రం తిననని బాలు అంటాడు. తండ్రి సర్ధిచెప్పిన వినడు. మా నాన్న ముందు మంచిదానిలా ఓవర్‌యాక్షన్ చేయకు అంటూ మీనాకు వార్నింగ్ ఇచ్చి తినకుండానే వెళ్లిపోతాడు. ఏంటి నీ ప్లాన్ చెడిపోయిందా అంటూ మీనాను దెప్పిపొడుస్తుంది ప్రభావతి.
మనోజ్, ప్రభావతికి మీనా చేసినా పూరి తినాలని ఉన్నా...ఆయిల్ ఫుడ్ అంటూ తినకుండా చేసేస్తుంది. బాలు తినకుండా వెళ్లడంతో మీనా బాధపడిపోతుంది. తాను కూడా తినకుండా వెళ్లబోతే సత్యం, మౌనిక ఆపేస్తారు.
బాలుపై రివేంజ్...
బాలుపై రివేంజ్ తీర్చుకునేందుకు ఫైనాన్షియర్ ఎదురుచూస్తుంటాడు. వడ్డీ డబ్బుల కోసం బాలుకు ఫోన్ చేస్తాడు. వాడు ఏదో అన్నాడని వెనుక ముందు ఆలోచించకుండా కాలర్ పట్టుకున్నావని, ఇప్పుడు డబ్బుల కోసంతంటాలు పడుతున్నావని బాలుతో అతడి ఫ్రెండ్ రాజేష్ అంటాడు.
నన్ను ఏమన్నా పడతానని, కానీ నాన్నను అంటే ఊరుకోనని బాలు స్నేహితుడికి సమాధానమిస్తాడు. ఈ కోపమే నీ కొంప ముంచుతుందని బాలును మందలిస్తాడు రాజేష్. కోపమే నీ వీక్నెస్ అని చెబుతాడు. ఏదో ఒకటి చేసి సేట్ డబ్బు వాడి ముఖంపై కొట్టి జీవితంలో వాడి ముఖం చూడనని బాలు ఛాలెంజ్ చేస్తాడు.
బాలు ఎమోషనల్...
బాలు దగ్గర కారు కొన్న గణపతి అక్కడికి వస్తాడు. డాక్యుమెంట్స్ కూడా అడక్కుండా తనకు సాయం చేసినందుకు గణపతికి థాంక్స్ చెబుతాడు బాలు. తన దగ్గర ఉన్న కారు డాక్యుమెంట్స్ అతడికి ఇస్తాడు. చివరి సారిగా తన కారును నడిపి చూసుకుంటాడు బాలు. కారుతో తనకున్న అనుబంధం గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతాడు. కారు దూరం కావడంతో బాలు బాధపడతాడు.
మీనాపై సెటైర్లు...
కారు పోయిన బాధలో ఫుల్‌గా మందు తాగి ఇంటికొస్తాడు బాలు. తండ్రి మెలకువగా ఉన్నాడేమోనని కంగారు పడతాడు. తండ్రి నిద్రపోయాడని మీనా చెప్పగానే లోపలికివస్తాడు. మీనా అన్నం తినమని అంటుంది. నీ చేతితో ఏది ఇచ్చిన తిననని అంటాడు. నువ్వు పెట్టే అన్నం వద్దు, సున్నం వద్దని అంటాడు. నీ వల్లే మా నాన్న పోలీస్ స్టేషన్ వెళ్లాడు, నీ వల్లే నా నా కారు అమ్ముడుపోయిందని మీనాపై బాలు నిందలు వేస్తాడు.
ఇంటి పత్రాలు మావయ్యకు ఇచ్చిన సంగతి నువ్వు చెప్పలేదు. ఏది చెప్పి చేయడం నీకు అలవాటు లేదుగా అంటూ మీనాపై తాగిన మత్తులో కోప్పడుతాడు. అన్నింటికి కారణం నువ్వేనని అంటాడు. బాలు మాటలతో మీనా బాధపడుతుంది.
చచ్చే దాకా అంటాను...
ప్రతి రోజు ప్రతి పూట ఇదే మాట అంటారేంటని మీనా ఎమోషనల్ అవుతుంది. చచ్చే దాకా ఈ మాట అంటూనే ఉంటానని బాలు సమాధానమిస్తాడు. రవి, శృతిల పెళ్లి చేయడం వల్లే ఇదంతా వచ్చిందని చెబుతుంది. నేను ఆ పెళ్లి చేయలేదని మీనా ఎంత చెప్పిన వినకుండా నీకు మాట్లాడే రైట్స్ లేవని బాలు అంటాడు.
మీనా అబద్ధం...
తల్లి ఫోన్ చేయడంతో తాను బాగానే ఉన్నానని మీనా అబద్ధం ఆడుతుంది. మావయ్య తనను చూసి సంతోషపడ్డారని అంటుంది. బాలు తనతో బాగానే ఉన్నాడని చెబుతుంది. కన్నకూతురు కాపురం అస్తవ్యస్తంగా ఉంటే తాను ఎలా సంతోషంగా ఉండగలనని మీనా తల్లి ఎమోషనల్ అవుతుంది.
ఇంటి నుంచి వెళ్లగొట్టే రోజు...
మీనా వాళ్ల అమ్మతో మాట్లాడటం ప్రభావతి చూస్తుంది. ఇక్కడి విషయాలు అక్కడికి చేరవేస్తున్నావా అంటూ కోడలిపై కోప్పడుతుంది. నువ్వు మీ అమ్మ కొంపలు కూల్చడంలో ఎక్స్‌పర్ట్ అంటూ అవమానిస్తుంది.
రవిని ఇంటి నుంచి పంపించావు. మనోజ్, రోహిణి మధ్య గొడవలు సృష్టించి ఈ ఇంటిని మహారాణిలా ఎలాలని చూస్తున్న నీ కుట్రలు నేను ఉండగా ఫలించవని మీనాతో అంటుంది ప్రభావతి. మళ్లీ నిన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టే రోజు తప్పకుండా వస్తుందని, ఎందుకైనా మంచిది మూటముల్లే సిద్ధంగా ఉండమని మీనాను హెచ్చరిస్తుంది ప్రభావతి.
దొరికిపోయిన రోహిణి...
కొరియర్ బాయ్ రూపంలో రోహిణి శత్రువు ఇంటికొస్తాడు. అతడిని చూసి రోహిణి కంగారు పడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతిని రోహిణి ఇంట్లోకి పంపిస్తుంది. ప్రభావతి ఇంట్లోకి వెళ్లగానే తనకు డబ్బు కావాలని రోహిణిని అతడు బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తన దగ్గర డబ్బు లేదని రోహిణి అంటుంది. నా దగ్గర నీ రహస్యం ఉంది అని చెబుతాడు. రోహిణిని కళ్యాణి అని పిలుస్తాడు. వారి మాటల్ని మొత్తం మీనా వింటుంది. మీనాను చూసి రోహిణి కంగారు పడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.