Gunde Ninda Gudi Gantalu: బాలు కోపానికి ముక్కలైన మీనా మనసు - కోడలిని క్షమించిన సత్యం - రెచ్చిపోయిన రోహిణి
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 7 ఎపిసోడ్‌లో రవి విషయంలో తాను ఏ తప్పు చేయలేదని భర్తకు సర్ధిచెప్పబోతుంది మీనా. కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఆలోచించమని అంటుంది. నాకు నీతులు చెప్పొద్దని, నీ హద్దుల్లో నువ్వు ఉండమని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu: మీనా తిరిగి ఇంటికి వచ్చే వరకు ట్యాబ్లెట్స్ వేసుకోనని పట్టుపడతాడు సత్యం. తండ్రి మొండితనం తెలిసిన బాలు...మీనాను తిరిగి తమ ఇంటికి తీసుకొస్తాడు. నీ పీడ విరగడ అయిపోయిందనుకుంటే మళ్లీ మా తలకే చుట్టుకున్నావని మీనాపై ప్రభావతి ఫైర్ అవుతుంది.
తనవైపు ఎలాంటి తప్పు లేదని, కావాలంటే రవి, శృతిని అడగమని మీనా అంటుంది. వాళ్ల పెళ్లిని నువ్వే జరిపించావు కాబట్టి నీకు అనుకూలంగానే మాట్లాడుతారని మీనాపై మనోజ్ నిందలు వేస్తాడు.
సాక్షి సంతకం చేశావంటే ఆ పెళ్లి నువ్వే చేశావని అర్థం అని అంటాడు. నువ్వు వాళ్ల పెళ్లి చేసి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావని రోహిణి డైలాగ్స్ కొడుతుంది. శృతిని ఇంటికి పిలిపించుకొని వాళ్లతో మంతనాలు చేసి ఎవరికి చెప్పకుండా పెళ్లిచేసుకోమని నువ్వే ఒప్పించి ఉంటావని ప్రభావతి మీనాను కోప్పడుతుంది.
సత్యం సపోర్ట్...
ఎవరు ఎన్ని మాటలు అన్న సత్యం మాత్రం మీనానే సపోర్ట్‌చేస్తాడు. అనేవాళ్లు అంటూనే ఉంటారు. వాళ్ల మాటలు పట్టించుకోవద్దని మీనాను ఓదార్చుతాడు. కానీ నా మనసులో ఒక్క చిన్న బాధ మాత్రం మిగిలిపోయిందని చెబుతాడు.
రవి పెళ్లి గురించి మాట్లాడటానికి వెళుతున్నానని దాచిపెట్టి దైవదర్శనం కోసం వెళుతున్నానని అబద్ధం ఆడటం బాధను కలిగించిందని సత్యం ఎమోషనల్ అవుతాడు. రవి బలవంతం చేయడంతోనే తాను అబద్ధం ఆడానని సత్యంతో మీనా అంటుంది. సత్యానికి క్షమాపణలు చెబుతుంది.
కోడలిగా కాదు కూతురిగా...
నా మీద నీకు ఎంత గౌరవం, అభిమానం లేకపోతే...వాళ్లంతా తిట్టి వెళ్లగొట్టిన నువ్వు చాటుగా హాస్పిటల్‌కు తాయత్తు కట్టడం నాకు గుర్తుందని సత్యం అంటాడు. నేను నిన్ను ఇంటికి కోడలిగా కాదు కూతురిగా తీసుకొచ్చానని, నువ్వు, బాలు ఎప్పటికీ కలిసే ఉండాలని సత్యం అంటాడు. మీనానే స్వయంగా ట్యాబ్లెట్స్ తీసిచ్చి సత్యానికి అందజేస్తుంది.
బాలు కోపాన్ని తట్టుకునే శక్తి...
తిరిగి అత్తింట్లోకి అడుగుపెట్టిన మీనా... ఇదే నా ఇళ్లు...ఇక్కడే నా జీవితం అని అనుకుంటుంది. భర్త కోపాన్ని తట్టుకొనే శక్తినాకు కావాలని, ఇది తనకు ఒక పరీక్ష అని, తప్పదు ఎదుర్కోవాలని మనసులో నిశ్చయించుకుంటుంది. మీనా అనుకున్నట్లుగానే బాలు చాలా కోపంగా రూమ్‌లోకి వస్తాడు.భోజనం గురించి మీనా అడిగితే వద్ధంటూ కఠువుగా సమాధానమిస్తాడు.
బయటతినేసి వస్తానని బదులిస్తాడు. తినకుండా పడుకోకూడదని , నా మీద కోపం తిండి మీద చూపించొద్దని మీనా అంటుంది. నువ్వు లేకపోతే నేను ఉండలేదని తీసుకురాలేదని మీనాపై బాలు ఫైర్ అవుతాడు. నాన్న తీసుకురమ్మంటేనే తీసుకొచ్చానని చెబుతాడు.
సేవలు చాలు...
ఇప్పటివరకు నువ్వు మాకు చేసిన సేవలు చాలని, నీ యాక్టింగ్‌ను ఆపేయమని మీనాను మాటలతో అవమానిస్తాడు బాలు. ఇంట్లో బెడ్, బీరువాలా నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో ఓ వస్తువేనని బాలు అంటాడు.
ఆ తప్పు లేదని మావయ్య అర్థం చేసుకున్నాడు. మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారని భర్తను అడుగుతుంది మీనా. మా నాన్న అందరిని క్షమిస్తాడు. కానీ నేను మాత్రం తప్పు చేసిన వాళ్లను క్షమించనని బాలు అంటాడు.
రవిని సపోర్ట్ చేయకు...
రవిని పోలీస్ స్టేషన్‌లో అతడి భార్య ముందు ఇష్టం వచ్చినట్లు కొట్టారు...తమ్ముడిని ప్రేమగా చూసుకునే మీరు శత్రువును కొట్టినట్లుగా కొడితే అతడి మనసు ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోమని బాలుతో అంటుంది మీనా. రవిని ఇంకా సమర్థించవద్దని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు.
మీకు కోపం వస్తే ఎవరన్నది చూసుకోరా...దయచేసి మీ కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఆలోచించండి అంటూ మీనాను రిక్వెస్ట్ చేస్తుంది మీనా. నువ్వు నాకు నీతులు చెప్పకు..అసలు నాతో మాట్లాడకు అని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు. రవిని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నిస్తే చంపేస్తానని అంటాడు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. నువ్వు ఏం చెప్పిన వినేది లేదని ఫైర్ అవుతాడు.
మీనా తప్పులేదు...
తండ్రి పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చోవడం బాలు గమనిస్తాడు. . తానే దగ్గరుండి తండ్రికి అయింట్‌మెంట్ రాస్తాడు. మనసుకు అయినా గాయాన్ని మాన్పించడానికి ఏ అయింట్‌మెంట్స్ లేవని బాలుతో సత్యం అంటాడు. మీనా గురించే తండ్రి చెబుతున్నాడని బాలు గ్రహిస్తాడు. ఈ ఇంట్లో జరిగిన అనర్థాలు అన్నింటికి మీనానే కారణమని బాలు కోప్పడుతాడు.
మీనాను నమ్మోద్దు...
మీనా తెలిసి ఏ తప్పు చేయదని బాలుకు సర్ధిచెప్పబోతాడు సత్యం. నాకు అవమానం జరగాలని, పోలీస్ స్టేషన్ వెళ్లాలని మీనా అనుకోలేదని సత్యం అంటాడు. మీనా ఏం చెప్పిన నమ్మొద్దని బాలు అంటాడు. నువ్వు ఎంత ఛీ కొట్టిన చెంపదెబ్బ కొట్టిన నువ్వు కావాలని వచ్చినందుకు అయినా నమ్మాలని కొడుకుకు క్లాస్ ఇస్తాడు సత్యం.
రవి ఆనందంగా ఉన్నాడు...
రవి నమ్మించి మీనాను మోసం చేసినా తప్పును అతడిపై వేయకుండా తనమీద వేసుకున్నందుకు అయినా మీనాను నమ్మాలని బాలుతో చెబుతాడు సత్యం. . భార్య వల్ల పొరపాటు జరిగితే భర్తనే క్షమించాలని అంటాడు. మీ అమ్మ నాకు తెలియకుండా ఇళ్లు తాకట్టు పెడితే నేను క్షమించలేదా అని చెబుతాడు.
అదే అమ్మ నా కోసం పోలీస్ స్టేషన్‌లో, హాస్పిటల్‌లో గుండెపగిలేలా ఏడ్చిందని అంటాడు. అదే భార్యభర్తల బంధం గొప్పతనం అని చెబుతాడు. రవి తన స్వార్థం తాను చూసుకున్నాడు. వాడు ఆనందంగా ఉన్నాడు. కానీ మీరు మాత్రం వాడి మూలంగా సంతోషాన్ని దూరం చేసుకున్నారు. గొడవలు పడుతున్నారు, ఇది తప్పని బాలుకు అర్థమయ్యేలా వివరిస్తాడు సత్యం.
శృతి సర్‌ప్రైజ్...
రవికి సర్‌ప్రైజ్ ఇస్తుంది శృతి. దీపావళి సందర్భంగా రవి కోసం కొత్త బట్టలు కొంటుంది. రవి కొన్న బట్టలు చూసి రవి ఆనందపడతాడు. నన్ను పిలిస్తే నేను కూడా షాపింగ్‌కు వచ్చి నీ కోసం బట్టలు సెలెక్ట్ వాడినని రవి అంటాడు.
రవిది బోరింగ్ సెలెక్షన్ అని శృతి సెటైర్లు వేస్తుంది. రవికి ఇంకో సర్‌ప్రైజ్ ఇస్తుంది. అతడి వేలికి గోల్డ్ రింగ్ తొడుగుతుంది. పెళ్లయ్యాక వస్తోన్న మొదటి దీపావళి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుందామని శృతి అంటుంది. తన ప్లాన్స్ మొత్తం చెబుతుంది.
కుటుంబం గుర్తొచ్చి...
కానీ రవి మాత్రం మూడీ అయిపోతాడు. దీపావళిని తన కుటుంబంతో ఎలా జరుపుకుంది చెబుతాడు. అవన్నీ మిస్సయ్యానని బాధపడతాడు. మనము అలాగే పండుగను జరుపుకుందామని శృతి అంటుంది. నీతో గడిపే ప్రతిక్షణంనాకు ఓ స్వీట్ మెమోరీలా ఉండాలని రవి బాధను పొగుడుతుంది శృతి. నేను కూడా మా అమ్మనాన్నలకు దూరమైనా సంతోషంగా ఉన్నానంటే నువ్వు నాతో ఉండటమే కారణమని చెబుతుంది. శృతి మాటలతో రవి మామూలు మనిషి అవుతాడు.
రోహిణి ఫైర్...
మీనా రాకతో ఇంటెడు చాకరి తనకు తప్పిందని లోలోన ప్రభావతి ఆనందపడుతుంది. పూరి, కూర్మా చేయడం చూసి కావాలనే మీనాపై రోహిణి, ప్రభావతి కోప్పడుతారు. మావయ్యకు ఆయిల్ ఫుడ్ మంచిది కాదని క్లాస్ ఇస్తారు.
మావయ్య కోసం వేరుగా ఇడ్లీ చేశానని మీనా సమాధానమిస్తుంది. మీనా పొద్దున లేచిన దగ్గర నుంచి పని చేస్తూనే ఉందని, నీకు నాపై అంత ప్రేమ ఉంటే నువ్వే స్వయంగా టిఫిన్ చేసిపెట్టమని సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.