Gunde Ninda Gudi Gantalu: బాలుపై అలిగి పుట్టింటి నుంచి వెళ్లిపోయిన మీనా - కూతురి తప్పును ఒప్పుకున్న పార్వతి
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 18 ఎపిసోడ్‌లో దీపావళికి మీనా పుట్టింటికి వచ్చిన బాలు తాగిన మత్తులో రచ్చ చేస్తాడు. తన కారు, డబ్బు పోవడానికి మీనానే కారణమని అంటాడు. తన కళ్ల ముందే మీనాను బాలు అవమానించడం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రోహిణి తండ్రితో మాట్లాడాలని ప్రభావతి, మనోజ్ ఫిక్సవుతారు. ఇప్పుడే ఫోన్ చేయమని రోహిణిని పట్టుపడుతుంది ప్రభావతి. ట్రిప్‌లో ఉన్నారు...చేస్తే బాగోదు అని రోహిణి తప్పించుకోవడానికి చూస్తుంది. ప్రభావతి వినదు. తన స్నేహితురాలు విద్య నంబర్‌కు ఫోన్ చేస్తుంది రోహిణి. ఆ నంబర్ స్విఛాఫ్ అని వస్తుంది. ట్రిప్ నుంచి ఇంకా రాలేదని, అందుకే స్విఛాఫ్ వస్తుందని ప్రభావతి మనోజ్‌ను నమ్మిస్తుంది.
స్విఛాఫ్ అని రావడానికి ముందే విద్యకు ఫోన్ చేస్తుంది రోహిణి. మలేషియా ట్రిప్ నుంచి బయటపడేందుకు విద్య కు కాల్ చేసి ఆమె ఫోన్‌ను స్విఛాఫ్ చేయమని అంటుంది. నీ నంబర్‌ను మా నాన్న నంబర్ అని అత్తయ్యతో పాటు భర్తను నమ్మిస్తానని తన ప్లాన్‌ను విద్యకు వివరిస్తుంది. ఎలాగోలా ఈ సారి తప్పించుకన్నానని రోహిణి అనుకుంటుంది.
తాగేసి బాలు రచ్చ...
కారు విడిపించుకొని వస్తానని వెళ్లిన బాలు అర్ధరాత్రి దాటినా ఇంటికి రాడు. బాలుకు ఫోన్ చేస్తుంది మీనా. ఇంటి బయటే ఫోన్ రింగ్ సౌండ్ వినిపించడంతో మీనా డోర్ తీస్తుంది. ఫుల్‌గా తాగేసిన బాలు..ఓనర్ ఇంటివైపు వెళుతూ కనిపిస్తాడు. ఎటు వెళ్తున్నారని భర్తను అడుగుతుంది మీనా.
కారు సర్వీస్‌కు ఇవ్వలేదని, అమ్మేసిన నిజం ఓనర్‌కు చెప్పడానికి వెళుతున్నాని బాలు అంటాడు. ఇప్పుడు ఆ గొడవ వదిలేసి...మీరు వెళ్లిన పని ఏమైందో చెప్పమని బాలును నిలదీస్తుంది మీనా. పైనాన్షియర్ కారు ఇవ్వనని అన్నాడని, ఆ బాధలోనే మందు తాగినట్లు బాలు అంటాడు.
అబద్దాలు చెప్పను....
నేను నిజాలే చెబుతానని, నీలా అబద్దాలు ఆడనని మీనాతో అంటాడు బాలు. పెళ్లాం మాట విన్నవాడు బాగుపడ్డట్లు చరిత్రలో లేదని మత్తులో మీనాపై సెటైర్లువేస్తాడు. మీనా ఎంత చెప్పిన వినకుండా ఓనర్ ఇంటి తలుపు కొడతాడు. ఇంత రాత్రి వేళ పక్కింటివాళ్ల తలుపు కొడితే దరిద్రంగా ఉంటుందని మీనా అంటుంది. అయినా బాలు వినకుండా నిజం చెప్పాల్సిందే నని పట్టుపడతాడు.
రవ్వ లడ్డు ప్లాన్...
మీనా తెలివిగా తాము రవ్వలడ్డులు చేశామని, అవి ఇవ్వడానికి వచ్చామని ఓనర్‌తో అబద్ధం ఆడుతుంది. రవ్వలడ్డులు ఇవ్వడానికి ఫ్యామిలీ మొత్తం తమ ఇంటికి రావడం చూసి ఓనర్ ఆశ్చర్యపోతాడు. బాలును మాట్లాడనివ్వకుండా అతడిని లాక్కొస్తుంది మీనా.
సుమతి షాక్...
ఇంట్లోకి రాగానే తన జీవితం మొత్తం సర్వ నాశనం అయిపోయిందని బాధపడతాడు బాలు. నాన్నను పోలీసులు అరెస్ట్ చేశాడు...ఆయనకు గుండెపోటు వచ్చింది. చివరకు నా కారు పోయి రోడ్డు మీద పడ్డానని బాలు అంటాడు. ఈ అనర్థాలన్నింటికి కారణం ఇదే అని సుమతివైపు వేలు చూపిస్తాడు బాలు. అది చూసి మీనా, పార్వతి కంగారుపడతాడు. నువ్వు కాదు...మీనా అంటూ భార్య వైపు తిరుగుతాడు.
పార్వతి కన్నీళ్లు...
నా ప్లేస్‌లో ఎవరు ఉన్నా భార్యను కాపురానికి తీసుకురారని బాలు అంటాడు. నాకు అసలు ఇక్కడికి రావడం ఇష్టం లేదని, నాన్న చెప్పాడని వచ్చానని పార్వతితో చెబుతాడు బాలు మీనా చేసింది తప్పా కాదా అని పార్వతిని అడుగుతాడు బాలు. తప్పేనని పార్వతి అంటుంది. మీనాకు తాను బుద్ది చెబుతానని పార్వతి అంటుంది.
సుమతికి సలహా...
మీనా కారణంగా తనకు మనశ్వాంతి, ప్రశాంతతో పాటు కారు, డబ్బు అన్ని పోయాయని అంటాడు. నువ్వు మీ అక్కా మాదిరిగా తయారుకాకు అంటూ సుమతికి సలహా ఇస్తాడు బాలు. మీ అక్క మాకు చెప్పకుండా రవికి పెళ్లిచేసి మా అందరికి ద్రోహం చేసిందని అంటాడు. నువ్వు మాత్రం ఇలా ఎవరి దొంగ పెళ్లి చేయద్దని అంటాడు.
పార్వతి కన్నీళ్లు....
మా నాన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది...హాస్పిటల్ పాలు చేసింది...మా కుటుంబం పరువు బజారు పాలు చేసింది అన్ని మీనానేనని బాలు అంటాడు. తాను ఏం చేయలేదని మీనా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మీనాను మాట్లాడవద్దని పార్వతి అంటుంది. మీనాను తన కళ్ల ముందే బాలు అవమానించడం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనాను పెళ్లిచేసుకున్నందుకు నేను ఏడ్వాలి...మీరెందుకు ఏడుస్తున్నారు...మీనా మిమ్మల్ని కూడా మోసం చేసిందా అని పార్వతిని అడుగుతాడు బాలు.
వెళ్లిపోయిన మీనా...
బాలు నిద్ర లేవడంతో పార్వతి, సుమతి టెన్షన్ పడతారు. మీనా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో బాలుకు ఏం చెప్పాలో తెలియక భయపడుతుంటారు. తాగిన మత్తు దిగిన తర్వాత రాత్రి నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా పార్వతి, సుమతిలను బాలు అడుగుతాడు. ఏం మాట్లాడలేదని అబద్ధం ఆడుతారు. మీనా కనిపించకపోవడంతో ఎటు వెళ్లిందని బాలు అడుగుతాడు.
రాత్రి నువ్వు తిట్టావనే బాధతో అక్క మీ ఇంటికే వెళ్లిందని బాలుతో నిజం చెబుతాడు శివ. ఆ మాట విని బాలు షాకవుతాడు. ఎక్కడైతే మొగుడు తిడితే పెళ్లాం పుట్టింటికి వెళుతుంది...కానీ మీనా ఏంటి అత్తింటికి వెళ్లిందని బాలు అంటాడు. నువ్వు తిట్టింది పుట్టింట్లో కావడంతో అత్తింటికి వెళ్లిందని శివ కవర్ చేయబోతాడు. వారి మాటల్ని బాలు పట్టించుకోడు. మీనాపై కోపంతో రగిలిపోతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.