Gunde Ninda Gudi Gantalu: భర్త గిఫ్ట్‌కు పొంగిపోయిన మీనా -అత్తింట్లో మందేసి బాలు రచ్చ -చిక్కుల్లో పడ్డ రోహిణి
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు నవంబర్ 14 ఎపిసోడ్‌లో పండుగకు మలేషియాలో ఉన్న మీ నాన్న దగ్గరకు వెళదామని రోహిణితో మనోజ్ అంటాడు. ప్రభావతి కూడా రోహిణి తండ్రితో మాట్లాడుతానని పట్టుపడుతుంది. భర్త, అత్త మాటలతో రోహిణి టెన్షన్ పడుతుంది.
మీనా ఇంటికి ఆమె తల్లి పార్వతి వస్తుంది. తల్లిని చూడగానే మీనా కంగారుపడిపోతుంది. ఇక్కడికి ఎందుకొచ్చావని అడుగుతుంది. పార్వతిని లోపలికి రమ్మని ఆహ్వానిస్తాడు సత్యం. కానీ పార్వతి లోపల అడుగుపెట్టడానికి వీలులేదని ప్రభావతి అంటుంది. ఇంట్లో జరిగిన గొడవలకు నువ్వు, నీ కూతురు కారణమంటూ నిందలు వేస్తుంది. సత్యం ఆమె మాటల్ని అడ్డుకుంటాడు.
కాఫీకి కూడా దిక్కుండదు...
బాలు, మీనాలను సంక్రాంతి పండుగకు ఇంటికి రమ్మని అడగటానికి వచ్చానని సత్యంతో అంటుంది పార్వతి. తనకు చాలా పనులు ఉన్నాయని, మీ ఇంటికి రావడం కుదరదని బాలు తేల్చేస్తాడు. కావాలంటే మీనాను తీసుకెళ్లి దీపావళి వరకు అక్కడే ఉంచుకొమ్మని అంటాడు. అక్కడికి వెళితే కాఫీకి కూడా దిక్కుండు అంటూ మీనా కుటుంబంపై తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడుతుంది ప్రభావతి. అల్లుడిని ఎంత మర్యాదగా చూసుకోవాలో నాకు తెలుసునని, కాఫీకి కూడా దక్కులేకుండా మేము ఏం లేమని పార్వతి చెబుతుంది.
ఫలక్‌నుమా ప్యాలెస్...
ప్రభావతి మాటలు పట్టించుకోవద్దని బాలును, మీనాను తాను దీపావళికి మీ ఇంటికి పంపిస్తానని పార్వతికి సత్యం మాటిస్తాడు. రోహిణి, మనోజ్‌లను కూడా తమ ఇంటికి పండుగకు రమ్మని పిలుస్తుంది పార్వతి. మీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కూర్చోవడానికైనా చోటు ఉంటుందా అని ప్రభావతి మరోసారి తన నోటికి పనిచెబుతుంది. పార్వతి వెళ్లిపోగానే...పండక్కి వెళితే పట్టుబట్టలు పెట్టి...పది తులాల బంగారం పెట్టి బైక్ ఇచ్చి పంపిస్తుంది కావచ్చు మీ అత్త అని బాలుతో వెటకారంగా అంటుంది ప్రభావతి.
మలేషియా ట్రిప్...
ఈ దీపావళికి మలేషియాలోని మీ ఇంటికి వెళదామని రోహిణితో అంటాడు మనోజ్. భర్త మాటలు వినగానే రోహిణి షాకవుతుంది. పండుగకు మలేషియా వెళితే ఆ లెవలే వేరు..వెంటనే టికెట్స్ పంపించమని మీ నాన్నకు చెప్పమని రోహిణితో అంటుంది ప్రభావతి. అత్తయ్యకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రోహిణి మౌనంగా ఉంటుంది. పార్వతికి తాను మాటిచ్చానని పండుగకు మీనా పుట్టింటికి నువ్వు వెళ్లాల్సిందేనని బాలుతో అంటాడు సత్యం. మీనా ఇంటికి తాను వెళ్లనని బాలు బెట్టుచేస్తాడు. తండ్రి సీరియస్ కావడంతో అతడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాలుసరేనని అంటాడు.
రోహిణి ఫైర్...
మీనా తల్లి పుట్టింటి టాపిక్ తీసి తనను ఇరికించేసిందని రోహిణి టెన్షన్ పడుతుంది. మలేషియా టూర్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. వాళ్ల గురించి చూసుకోకుండా నా గురించి మాట్లాడటం ఎందుకు అని మీనా తల్లిపై కావాలనే ఫైర్ అవుతుంది రోహిణి. అందరి బతుకుల్లో జోక్యం చేసుకోవడం వాళ్లకు అలవాటు అంటూ మీనా ఫ్యామిలీపై ప్రభావతి కూడా నిందలు వేస్తుంది.
రోహిణి అబద్ధం.
పార్వతి అందని కాదు కానీ...మలేషియా వెళ్లాలని మనోజ్ కూడా ముచ్చటపడుతున్నాడని, పండుగను సెలబ్రేట్ చేసుకున్నట్లుగా ఉంటుంది... ఆరోగ్యం బాగా లేని మీ నాన్నను చూసినట్లు ఉంటుందని రోహిణితో అంటుంది ప్రభావతి. మీ నాన్నతో నేను మాట్లాడుతానని, నెంబర్ చెప్పమని మనోజ్ అంటాడు. నాన్న పెద్ద వాళ్లతో మీటింగ్‌లో ఉంటాడని, ఫోన్ చేస్తే డిస్ట్రబ్ అవుతాడని రోహిణి అబద్ధం ఆడుతుంది.
మలేషియా వెళ్లడం నాకు ఇష్టం లేదని, ఇక్కడే బాగుందని రోహిణి అంటుంది. నీకు మొహమాటమైతే చెప్పు మీ నాన్నతో నేను మాట్లాడుతానని ప్రభావతి అనడంతో రోహిణి టెన్షన్ మరింత పెరుగుతుంది.
బాలు, మీనా షాపింగ్...
బాలు, మీనా దీపావళి షాపింగ్‌కు బయలుదేరుతారు. మీనాతో ఏం మాట్లాడకుండా కోపంగా డ్రైవింగ్ చేస్తుంటాడు బాలు. ఏమైంది నోటికి అని బాలును అడుగుతుంది మీనా. మాట్లాడాలంటే నోరుతో పాటు మనసు కూడా బాగుండాలని బాలు కోపంగా బదులిస్తాడు. కారును షాప్ ముందు ఆపి నువ్వే వెళ్లి చీర కొనుక్కోమని, నేను షాప్‌లోకి రానని బాలు అంటాడు.
సేల్స్‌మెన్ పొగడ్తలు...
మావయ్యకు ఫోన్ చేస్తానని మీనా బ్లాక్‌మెయిల్ చేయడంతో నచ్చకపోయినా షాప్ లోపలికి వెళతాడు.
మంచి చీరలు చూపించమని సేల్స్‌మెన్‌తో మీనా అంటుంది. మా వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంత ఖరీదైన పర్లేదని మీనా అంటుంది. మీనా మాటలతో తన జేబులో క్యాష్ ఎంతుందో బాలు చూస్తాడు.
మీనాకు చీరలు చూపిస్తూ సేల్స్‌మెన్ తెగ పొగుడుతాడు. అనుష్క, నయనతారలా ఉన్నారంటూ మీనాతో అంటాడు. సేల్స్‌మెన్ మాటలతో బాలు చిరాకు మరింత పెరుగుతుంది. తానే కోపంగా వచ్చి ఓ చీర సెలెక్ట్ చేసి ఇది ప్యాక్ చేసి ఇవ్వమని అంటాడు.
మీనా సంతోషం...
బాలు కోసం షర్ట్ తీసుకోవాలని మీనా అనుకుంటుంది. కానీ తన కోసం ఏం కొనాల్సిన అవసరం లేదని బాలు అంటాడు. మీనా పట్టుపట్టి షర్ట్ కొనేలా చేస్తుంది. బాలు తనకు చీర కొనడంతో పాటు అమ్మ మాటకు కట్టుబడి పుట్టింటికి రావడం చూసి మీనా సంతోషపడుతుంది. మీనా ఆనందాన్ని చూసి బాలు సహించలేకపోతాడు. నేను సంతోషంగా మీ ఇంటికి రావడం లేదని, మా నాన్న చెప్పాడు కాబట్టి వస్తున్నానని అంటాడు.
ఫైనాన్షియర్ మనుషులతో బాలు గొడవ...
బాలు కారుకు ఫైనాన్షియర్ మనుషులు అడ్డుపడతారు. కారు తీసుకురమ్మని ఫైనాన్షియర్ చెప్పాడని అంటారు. అన్న మీద చేయి చేసుకుంటే ఊరుకోడని, టైమ్ చూసి నీ బతుకు మీద కొట్టాడని ఫైనాన్షియర్ మనుషులు చెబుతారు. మీనాను ఇంటి దగ్గర డ్రాప్ చేసి కారు తానే తీసుకొచ్చి ఫైనాన్షియర్‌కు ఇస్తానని బాలు ఎంత చెప్పిన అతడి మనుషులు వినరు. ఇప్పుడే కారు తీసుకెళ్లాల్సిందేనని చెప్పి బాలు చేతిలోని కీస్ బలవంతంగా లాక్కుంటారు.
మీనాపై నిందలు...
కారును పైనాన్షియర్ మనుషులు తీసుకెళ్లడంతో మీనా ఎమోషనల్ అవుతుంది. అన్నింటికి కారణం నువ్వేనని, నీ వల్లే సొంత కారు పోయింది, అద్దె కారు కూడా పోయిందని బాలు అంటాడు. తిరిగి ఇంటికి వెళ్లిపోదామని మీనా అంటుంది. అద్దె కారు పోయిన సంగతి నాన్నకు తెలిస్తే బాధపడతాడని బాలు అంటాడు.
మీనా అబద్ధం...
మీనా, బాలు ఆటోలో రావడం చూసి కారు ఏమైందని పక్కింటివారు అడుగుతారు. కారు సర్వీసింగ్‌కు ఇచ్చామని మీనా అబద్ధం ఆడుతుంది. మీనా అబద్దాలు చూసి బాలు షాకవుతాడు. మీనా, బాలులకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించాలని పార్వతి అనుకుంటుంది. నేను ఏం సాధించలేదని, మీనా మాత్రం ప్రేమించుకున్నవాళ్లను కలిపిందని, ఒకడిని ఇంట్లో నుంచి పంపించి చాలా సాధించాదని మీనాపై ఆమె తల్లి ముందే అవమానిస్తాడు బాలు. పదే పదే మీనాను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.