Gunde Ninda Gudi Gantalu: కళ్యాణినే రోహిణి - నిజం తెలుసుకున్న మీనా - ప్రభావతి మైండ్‌బ్లాక్
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు లేటెస్ట్ ప్రోమోలో రోహిణిని డబ్బుల కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే రోహిణినే కళ్యాణి అనే నిజం బయటపెడతానని బెదిరిస్తాడు. వారి మాటల్ని మీనా వింటుంది. మీనాకు నిజం తెలియడంతో రోహిణి షాకవుతుంది.
Gunde Ninda Gudi Gantalu: మీనా గొంతు వింటేనే బాలు కోపంతో చిందులు తొక్కుతుంటాడు. కేవలం తండ్రి మాటకు కట్టుబడి మాత్రమే నిన్ను ఇంటికి తీసుకొచ్చానని, నిన్ను జీవితంలో క్షమించేది లేదని మీనాతో అంటాడు బాలు. తండ్రికి జరిగిన అవమానానికి, రవి పెళ్లి జరగడానికి నువ్వే కారణమని నిజం తెలుసుకోకుండా మీనాపై నిందలు వేస్తాడు. తన తప్పేం లేదని మీనా చెప్పడానికి ప్రయత్నించిన బాలు వినిపించుకోడు. తాగిన మత్తులో మీనాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. భర్త మాటలతో మీనా నొచ్చుకుంటుంది.
మీనాకు టార్చర్...
ప్రభావతి, రోహిణి ఏదో ఒక వంక పెట్టుకొని మీనాను తిడుతూ ఉంటారు. తమకు ఇష్టమైన ఫుడ్ చేసినా కావాలనే నచ్చలేదంటూ తప్పులు తీసి మీనాకు క్లాస్ ఇస్తారు. మీనా తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతుండటం ప్రభావతి చూస్తుంది. తమ గురించి చాడీలు చెబుతుందని మీనాను సూటిపోటి మాటలతో వేధిస్తుంది.
మీనా కుట్రలు...
అమాయకుడైన తన భర్తను మోసం చేసినట్లు తనను మోసం చేయలేదని, నిన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టే రోజు తొందరలోనే వస్తుందంటూ మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. రవి, మనోజ్‌లను ఇంటి నుంచి దూరం చేయడానికే మీనా కుట్రలు చేస్తుందని అపోహపడుతుంది. తాను ఎలాంటి కుట్రలు చేయడం లేదని మీనా ఎంత చెప్పిన ప్రభావతి పట్టించుకోదు.
రోహిణి బాయ్‌ఫ్రెండ్..
కొరియర్ రావడంతో అది తీసుకోవడానికి రోహిణి బయటకు వస్తుంది. కొరియర్ బాయ్ వేషంలో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ను చూసి షాకవుతుంది. రొహిణితో పాటే బయటకు వచ్చిన ప్రభావతి కొరియన్ బాయ్ చేతిలో నుంచి కవర్ తీసుకుంటుంది ప్రభావతి. ఇదెదో చెక్‌లా ఉందని కవర్ ఓపెన్ చేయబోతుంది. చెక్ కాదని, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంటూ ప్రభావతి చేతిలోని కవర్‌ను కంగారుగా రోహిణి లాక్కుంటుంది.
డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్...
అబద్ధం చెప్పి ప్రభావతిని లోపలికి పంపిస్తుంది రోహిణి. ఆ తర్వాత ఇక్కడికి ఎందుకొచ్చావని తన బాయ్‌ఫ్రెండ్‌ను నిలదీస్తుంది. తనకు డబ్బు కావాలని రోహిణిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు బాయ్‌ఫ్రెండ్. తన దగ్గర లేవని రోహిణి అతడికి సమాధానమిస్తుంది. నా దగ్గర నీ రహస్యం ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు అంతా చెప్పేస్తాను అని రోహిణిని కళ్యాణి అని పిలుస్తుంది. ఆ పిలుపు విని రోహిణి షాకవుతుంది.
రోహిణికి డబుల్ షాక్...
బాయ్ ఫ్రెండ్‌కు సర్దిచెప్పి వెనక్కి తిరుగుతుంది రోహిణి. ఆమెకు అక్కడ మీనా కనిపించడంతో డబుల్ షాకవుతుంది. మీనాను చూసి రోహిణి బాయ్‌ఫ్రెండ్ కూడా భయపడతాడు. అత్తయ్యకు నువ్వు చెప్పుతావా...నన్ను చెప్పమంటావా అని మీనా అడగటంతో మీనా వణికిపోతుంది. రోహిణినే కళ్యాణి అనే నిజం మీనాకు తెలిసిసోయిందా? మీనా మాటలను ప్రభావతి నమ్మిందా? లేదా? అన్నది సోమవారం నాటి గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో చూడాల్సిందే.