Gunde Ninda Gudi Gantalu: మనోజ్ ఇంటర్వ్యూకు బయలుదేరుతాడు. మనోజ్ కోసం కొత్త షర్ట్ కొంటుంది రోహిణి. ఆ షర్ట్ చూసి మనోజ్ హ్యాపీగా ఫీలవుతాడు. భర్త గౌరవాన్ని పెంచేది భార్య అనిపించేంత బాగుందని రోహిణి కొన్న షర్ట్‌కు కాంప్లిమెంట్ ఇస్తాడు మనోజ్.ఇలా జాబ్ లేకుండా ఎంత కాలం ఉండిపోతావని మనోజ్‌కు క్లాస్ ఇస్తుంది రోహిణి.
నువ్వు మేథావి అనే ఫీలింగ్‌ను తీసేయమని అంటుంది. నచ్చిన జాబ్ దొరికేవరకు వచ్చిన జాబ్ చేయమని చెబుతుంది. జాబ్ లేని మగాడిని సొసైటీ గౌరవించదని అర్థమయ్యేలా వివరిస్తుంది. రోహిణి మాటలతో రియలైజ్ అవుతాడు మనోజ్.
మనోజ్‌కు జాబ్ రావాలని పూజ చేస్తుంది ప్రభావతి. బోట్టు పెడుతుంది. అప్పుడే అక్కడికి బాలు ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు వీడు బాహుబలి యుద్ధానికి ఏమైనా వెళుతున్నాడా? వీరమాత వీర తిలకం దిద్దుతుందని సెటైర్ వేస్తాడు. మనోజ్ ఇంటర్వ్యూకు వెళుతున్నాడని అతడి మైండ్‌ను చెడగొట్టద్దొని రోహిణి అంటుంది. మనోజ్‌ను అక్కడి నుంచి పంపిచబోతుంది రోహిణి.
ఇంతకుముందు పనిచేసిన షోరూమ్‌లో నాకు ఉద్యోగం ఇచ్చే అదృష్టం, అవకాశం మీకు ఇచ్చాను అన్నాడట. ఇప్పుడు వెళ్లిన చోట ఇలాగే మాట్లాడితే ఎగిరి తంతారని బాలు అటాడు.మనోజ్ కోసం తానే ఓ మంచి జాబ్ చూశానని చెబుతాడు. నీకు ఎలాగూ డ్రైవింగ్ తెలుసు కదా...రెంట్‌కు కారు ఇప్పిస్తా...వచ్చి డ్రైవర్ జాబ్ చేసుకోమని ఆఫర్ ఇస్తాడు బాలు.
మనోజ్‌కు డ్రైవర్‌గా పనిచేసే ఖర్మ పట్టలేదని రోహిణి అంటుంది. మనోజ్ క్వాలిఫికేషన్ తెలుసా అంటూ రోహిణి ఇంగ్లీష్‌లో బాలుపై ఫైర్ అవుతుంది. కోడి ఈకలు పీకే పని చికెట్ సెంటర్‌లో ఉంటుందని రోహిణికి కౌంటర్ ఇస్తాడు బాలు.చదువుకుంటేనే కదా ఉద్యోగాల గురించి తెలిసేది... చదువుకోలేదు కాబట్టే నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తున్నావని బాలును తక్కువ చేసి మాట్లాడుతుంది రోహిణి.
మీ ఆయనకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది...పడుకోవడానికి బోలెడన్నీ పార్కులు, చెప్పడానికి ఎన్నో అబద్దాలు, చేయడానికి ఎన్నో మోసాలు ఇలా చాలా ఉన్నాయిగా అని మనోజ్, రోహిణిలకు ఇచ్చి పడేస్తుంది.
మీనా మాటలను అడ్డకోబోతుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నావని కసురుకుంటుంది. చదువుకొని మనోజ్ ఏం వెలగబెట్టాడు. మావయ్య రిటైర్‌మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బును ఎత్తుకొని వెళ్లిపోయాడు. మా ఏరియాలో దానిని దొంగతనం అని అంటారని మనోజ్‌ను మీనా దులిపేస్తుంది.
చదువుకున్న వాళ్ల కంటే నా భర్త చాలా గొప్పవాడు. కారు అమ్మేసిననప్పుడు కూడా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పనిచేసి ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చారని భర్త గురించి గొప్పగా చెబుతుంది మీనా. ఏమైందే నీకు శివంగిలా ఎగిరిపడుతున్నావని మీనాను నిలదీస్తుంది ప్రభావతి. నన్ను అంటే పడతాను...నా భర్తను అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది.
మీనా మాటలతో రోహిణి షాకవుతుంది. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటుంది. నీ భర్త నీకు గొప్ప అయితే నా భర్త నాకు గొప్ప, కారు నడపటం గురించి చీప్‌గా మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది.
మనోజ్ పని దొంగ అని, మళ్లీ ఉద్యోగం చేస్తున్నానని నిన్ను మోసం చేస్తాడు. వీడికి తోడు అమ్మ తోడు దొంగ అని, పాకెట్ మనీ ఇచ్చ చెడగొడుతుందని రోహిణిని హెచ్చరిస్తాడు బాలు. మనోజ్ చదివిన చదువుకు గొప్ప జాబ్ వెతుక్కుంటూ వస్తుందని బాలుతో ఛాలెంజ్ చేస్తుంది రోహిణి. ఇన్నాళ్లు ఎందుకు రాలేదు...ఇంటి అడ్రెస్ తెలియలేదా అని బాలు ఎగతాళిగా మాట్లాడుతాడు.
అప్పుడే అక్కడికి సత్యం రావడంతో మనోజ్‌ను డ్రైవర్ ఉద్యోగం చేయమని బాలు అంటున్నాడని అతడిపై చాడీలు చెబుతుంది ప్రభావతి. ఖాళీగా ఉండే బదులు డ్రైవర్ జాబ్ చేస్తే తప్పేముందని సత్యం అంటాడు. ఈ గొడవ ఆగేలా లేదని నువ్వు ఇంటర్వ్యూకు వెళ్లమని మనోజ్‌తో అంటుంది రోహిణి. ఇంటర్వ్యూకు వెళుతూ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు మనోజ్. కారులో వెళ్లి కారులో వచ్చే పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేయమని కొడుకును దీవిస్తుంది ప్రభావతి. అందరికి నీ వాల్యూ తెలిసే రోజు రావాలని రోహిణి అంటుంది.
బాలు వెళ్లిపోగానే మీనాపై ఫైర్ అవుతుంది ప్రభావతి. మీనాను బెదిరించాలని చూస్తుంది. మీనా వంట చేస్తుండగా ఏయ్ ఇట్రా అని కోపంగా మీనాను పిలుస్తుంది. అత్తయ్య పిలుపు విని పట్టించుకోనట్లుగా మీనా ఉంటుంది. వినికూడా పట్టించుకోవేంటని ప్రభావతి కోపంగా అంటుంది. నా పేరు మీనా...మీకు తెలుసు కదా...,ఏయ్ అంటే ఎవరో అని అనుకున్నాని కౌంటర్ వేస్తుంది మీనా.
మీ ఆయన ఎక్కడ మీనాను అడుగుతుంది ప్రభావతి. నా పెద్ద కొడుకును పట్టుకొని కారు డ్రైవర్‌గా పనిచేయమంటాడా? వాడు ఎంత, వాడి లెవెల్ ఎంత? నా పెద్ద కొడుకు చదువు ఎక్కడ? అసలు ఏం అనుకుంటున్నాడు మీ ఆయన అని మీనాపై ఎగిరిపడుతుంది ప్రభావతి. బాలు లేడని తెలిసే గొంతు పెంచి అరుస్తున్నారేంటి? ఉన్నప్పుడు అడగకుండా ఏం చేశారని మీనా బదులిస్తుంది. నువ్వు రాసిస్తేనే బాలు అలా మాట్లాడాడని ప్రభావతి కోపంగా అంటుంది. అవును నేను రైటర్‌ను...మా ఆయన శృతిలాగా డబ్బింగ్ చెబుతున్నాడని మీనా ఎగతాళిగా మాట్లాడుతుంది.
బాలు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావని రోహిణి కోపంగా అంటుంది. మీ ఆయన ఆఫీసరైనా, పార్కులో పళ్లీలు తిన్న పట్టించుకోను. కానీ నా భర్తను మాత్రం తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. మీ ఆయన ఏమైనా కలెక్టరా అని ప్రభావతి అంటుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా పార్కులో పని తిరగడం కంటే కష్టపడి పనిచేస్తూ అందరికి అన్నం పెడుతున్నాడని భర్తను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది మీనా.
నాకు మీ అంత ఖాళీ లేదని, ఇక్కడ వండి పెట్టి, పూల కొట్టు చూసుకోవాలని మీనా అంటుంది. నువ్వు రోజు అంత కష్టపడితే మహా అయితే వెయ్యి సంపాదించగలవు...కానీ రోహిణి పార్లర్‌లో పదివేలు సంపాదించగలడు అంటూ ప్రభావతి బిల్డప్‌లు ఇస్తుంది. నాకు మా అత్తయ్య ఇళ్లు తాకట్టు పెట్టి లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టలేదు. నేను ఎవరిలా అబద్ధం చెప్పి సంపాదించడం లేదని రోహిణి, ప్రభావతి గాలి తీసేస్తుంది.
తాను ఏం మాట్లాడినా మీనా ధీటుగా సమాధానం ఇవ్వడంతో ఏం చేయలేకపోతారు ప్రభావతి, రోహిణి. ఈ రోజు ఏమైంది నీకు తిరగబడి మాటకు మాట సమాధానం చెబుతున్నావని ప్రభావతి అంటుంది. బాలు నుంచే నేర్చుకున్నావా అని అంటుంది. మీ దగ్గర నుంచే నేర్చుకున్నానని మీనా బదులిస్తుంది. మీనా మారిపోయిందని రోహిణి అంటుంది.
బాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, వాడిని కంట్రోల్‌పెట్టుకోమని చెబుతుంది. మీ కొడుకును మీరే కంట్రోల్‌లో పెట్టాలి. కాదంటే అప్పుడు నన్నుఅడగంటి అని కౌంటర్ వేస్తుంది. బాలును మోసం చేసి పూల కొట్టు పెట్టించుకొని ఇలా మాట్లాడుతున్నావా అని ప్రభావతి నిలదీస్తుంది. మాయలు, మోసాలు నాకు తెలియదని మీనా ఆన్సర్ ఇస్తుంది.
వంట, ఇంటి పనులు అయ్యానని నేను వెళుతున్నానని సమాధానం ఇస్తుంది. ఎక్కడికి ఆని మీనాను ఆపబోతుంది ప్రభావతి. పార్కుకు వెళ్లి పండుకుంటానా...పల్లీలు కొనుక్కొని తింటానా...పూల కోట్టు చూసుకోవడానికి వెళుతున్నానని సమాధానమిస్తుంది.
మీనా కౌంటర్లలో ప్రభావతి, రోహిణి షాకైపోతారు. మీనాకు రోజు రోజుకు పొగరు పెరుగుతుందని, మీనా డ్రామాలు తన ముందు చెల్లవని ప్రభావతి మనసులో అనుకుంటుంది.
ఇంటర్వ్యూకు వెళతాడు మనోజ్. ఇది వరకు జాబ్ ఆఫర్ చేసిన లేడీ ఎండీ ఉన్న చోట వర్క్ చేయనని మనోజ్ ఉద్యగం వదిలేసి వెళ్లిపోతాడు. నువ్వు ఎక్కడ ఎక్కువ రోజులు పనిచేయవనే సంగతి నాకు తెలుసునని ఎండీ అంటుంది.
ఈ జాబ్ తనకు అవసరం అని ఎండీని బతిమిలాడుతాడు మనోజ్. నేను మారిపోయానని చెబుతాడు. కానీ మనోజ్ మాటలను ఎండీ నమ్మదు. జాబ్ ఇవ్వనని చెబుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం