రోహిణి కోసం ఊరంతా తనను తిప్పిన మనోజ్‌పై బాలు ఫైర్ అవుతాడు. ఏ పని పాట లోనడా, నలభై లక్షలు మింగినోడా అంటూ క్లాస్ ఇస్తాడు. అప్పుడే అక్కడికి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి ఆపండి అని అరుస్తుంది. రోహిణిని చూసి బాలు, మీనాతో పాటు మనోజ్ షాకవుతారు. బాలు, మీనా కంటే ముందే ఇంటికొచ్చేస్తుంది రోహిణి. ఇదేం ట్విస్ట్...ఇంట్లో వెతక్కుండా మమ్మల్ని ఊరంతా తిప్పించావా అని మనోజ్‌తో కోపంగా అంటాడు బాలు.
రోహిణిని చూడగానే మనోజ్ ఎమోషనల్ అవుతాడు. నువ్విక రావేమోనని భయపడ్డానని అంటాడు. నువ్వు చేసిన పనికి రాకూడదనే అనుకున్నాను. కానీ నాకు ఇక్కడ నాకు దిక్కు ఎవరున్నారు. ఎవరికి వెళ్లి చెప్పుకోవాలి. అత్తయ్య, మావయ్యలే నాకు అన్ని...అందుకే తిరిగి వచ్చానని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతుంది రోహిణి.నా వల్లే నీ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అన్నావుగా...ఇప్పుడు ఏం అంటావు అని మనోజ్‌ను నిలదీస్తాడు బాలు.
బాలు మాటలతో రోహిణి ఫైర్ అవుతుంది. నా భార్తను చాలా అన్నావు...ఇక చాలు. నా భర్తను తక్కువ చేసి మాట్లాడటానికి వీలు లేదని బాలుతో అంటుంది రోహిణి. మనోజ్‌ను అడిగే హక్కు, అనే హక్కు లేదని చెబుతుంది.
మీ భర్త నిన్నే కాదు...ఇంట్లో అందరిని మోసం చేశాడని అలాంటప్పుడు అనే హక్కు ఎందుకు ఉండదని మీనా ప్రశ్నిస్తుంది. మండుతున్న పొయ్యిలో పెట్రోల్ పోసేందుకు చూస్తున్నావా అని మీనాను కోప్పడుతుంది ప్రభావతి. మీ పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు నిజంగానే ఎవరికి లేదని శృతి అంటుంది. ఇది మా పర్సనల్ విషయం నువ్వు జోక్యం చేసుకోవద్దని శృతికి వార్నింగ్ ఇస్తాడు బాలు.
శృతి ఈ ఇంటి మనిషేనని, ఎందుకు మాట్లాడకూడదని రవి అంటాడు. రవి మాటలతో కోపం పట్టలేక అతడి కాలర్ పట్టుకుంటాడు బాలు. నన్నే అడిగే స్థాయికి చేరుకున్నావా అని అంటాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని వార్నింగ్ ఇస్తాడు. మా ఆయనకు మీ డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అని బాలు, మీనాలను రివర్స్ ఎటాక్ మొదలుపెడుతుంది రోహిణి.
ఇచ్చేవాళ్లు జేబులుఉ నింపి పంపిస్తున్నారని ప్రభావతిని ఇరికిస్తుంది మీనా. మనోజ్‌కు నేను డబ్బులు ఇస్తున్నానా...ఎవరు చెప్పారు..నువ్వు చూశావా అని ప్రభావతి కోపంగా అంటుంది. మొన్న బాలు ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తే...అందులో నుంచి మనోజ్ తీసుకోలేదా మీనా అంటుంది. అందరూ కలిసి నా భర్తపై పడితే ఊరుకోనని అంటుంది. రవి, మనోజ్ చేసిన తప్పులను ఎత్తిచూపుతాడు బాలు. రూల్స్ మాట్లాడితే మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనివ్వనని శృతిని హెచ్చరిస్తాడు. నన్ను, మా ఆయనను తక్కువ చేసి మాట్లాడితే మేము కూడా ఇంట్లో ఉండలేమని రోహిణి అంటుంది.ఆ శుభసమయం కోసం ఎదురుచూస్తున్నామని బాలు సమాధానమిస్తాడు.
మనోజ్ తప్పు చేసిన ఒప్పు చేసిన పార్లరమ్మ ఈ ఇంటి మనిషి. తన కనపడక పోతే నేను ఎంత తిరిగాను అది ఎందుకు రోహిణికి అర్థం కావడం లేదని బాలు అంటాడు. నీ కోపమే నువ్వు చేసిన మంచిని మింగేస్తుందని సత్యం అంటాడు. మనోజ్ చేసిన తప్పును అందరి ముందు బయటపెట్టడమే నీ తప్పు అని బాలుతో కోపాన్ని తగ్గిస్తాడు సత్యం. ఇక నుంచి మనోజ్ జోలికి వెళ్లద్దని బాలును హెచ్చరిస్తాడు. ఇంకోసారి చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లొద్దని రోహిణిని మందిస్తాడు సత్యం. తండ్రి మాటలకు కట్టుబడి ఇంకోసారి మనోజ్, రోహిణి జోలికి వెళ్లనని బాలు మాటిస్తాడు.
రోహిణికి సారీ చెబుతాడు మనోజ్. ఇంకోసారి నన్ను వదిలి వెళ్లొద్దని అంటాడు. నిన్ను నమ్ముకొనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు అబద్ధం చెప్పే సరికి తట్టుకోలేక ఫైర్ అయ్యానని రోహిణి అంటుంది. ఈ జాబ్ సంగతి అప్పుడే చెబితే ఏదో ఒక పరిష్కారం వెతికేవాళ్లం కదా అని రోహిణి అంటుంది. ప్రేమ కంటే నమ్మకం చాలా బలమైందని, ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించడం కష్టమని రోహిణి చెబుతుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైందని, ఇంకెప్పుడు నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోనని మాటిస్తాడు.
నీకు నిజం చెప్పాలని చాలా సార్లు అనుకున్నానని, కానీ అమ్మ తనను ఆపిందని మనోజ్ అంటాడు. చాటు నుంచి వాళ్ల మాటలను వింటున్న ప్రభావతి కంగారు పడుతుంది. ఇంక మనోజ్ ఏం అబద్దాలు చెబుతాడో అక్కడికి వస్తుంది. ఏదైనా మంచి జాబ్ దొరికిన తర్వాతే నీకు నిజం చెప్పాలని అనుకున్నామని ప్రభావతి అంటుంది. రోహిణికి సర్ధిచెబుతుంది.
మనోజ్‌ను బాలు అవమానించడం నాకు అస్సలు నచ్చలేదని రోహిణి అంటుంది. వాడో పనికిమాలిన వెధవ అని , వాడి మాటలను పట్టించుకోవద్దని మీనా అంటుంది. బాలుఇలాంటి గొడవలు చేస్తాడనే మనోజ్‌కు జాబ్ లేదనే విషయం ఇన్నాళ్లు దాచామని అంటుంది. టాపిక్ మలేషియా షిప్ట్ కావడంతో రోహిణి కంగారు పడుతుంది. రేపే మంచి జాబ్ వెతుక్కొని నిన్ను గర్వపడేలా చేస్తానని రోహిణికి మాటిస్తాడు మనోజ్. బాలుకు ఏ పని లేక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని, బాలును మీనానే రెచ్చగొడుతుందని, వాళ్ల పని నేను చెబుతానని ప్రభావతి అంటుంది.
తండ్రిని మోసం చేసిన మనోజ్‌పై కోపంతో బాలు రగిలిగిపోతాడు. మనోజ్‌కు జాబ్ లేదనే సంగతి తెలిసి
నాన్న బాధపడి ఉంటాడని బాలు అంటాడు. రోహిణి కోసం ఊరంతా తిరిగి కాళ్లు నొప్పులు వస్తున్నాయని బాలు అంటాడు. బాలు కాళ్లు పడుతుంది మీనా. భార్య సేవలతో బాలు రిలీఫ్‌గా ఫీలవుతాడు.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ ఒక మగాడికి అసలైన హాయి, సుఖం భార్య చేసే సేవల్లోనే దొరుకుతాయని అంటాడు. మొరటోళ్లు కూడా కవిత్వాలు చెబుతారా అని మీనా అంటుంది.
నువ్వు కూడా నాతో పాటు తిరిగావుతా...నీ కాళ్లు లాగడం లేదా అని మీనాను అడుగుతాడు. ఏం లాగుతున్నాయంటే మీరు నా కాళ్లు పడతారా అని మీనా అంటుంది. వెంటనే మీనా కాళ్లు పట్టుకోబోతాడు బాలు. నేను సరదాగా అన్నానని వద్దని మీనా అంటుంది. కాళ్లు ముట్టుకుంటే కొడతానని వార్నింగ్ ఇస్తుంది. ఏం పెళ్లాలే మొగుళ్లకు సేవ చేయాలా...మగాళ్లు భార్యలకు సేవ చేయద్దా అంటూ మీనా కాళ్లు నొక్కుతాడు బాలు.
మీనా కళ్లల్లోకి చూస్తూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతాడు బాలు. భర్త చూపులతో సిగ్గు పడుతుంది మీనా. ముద్దు కావాలని అడుగుతాడు. పొద్దున్నే లేవాలి అంటూ బాలు దగ్గర నుంచి వెళ్లిపోతుంది మీనా.
మనోజ్ ఉద్యోగం వెతుక్కోవడానికి బయలుదేరుతాడు. అతడిక వీర తిలకం దిద్ది పంపిస్తుంది రోహిణి. నా దగ్గర డ్రైవర్ పోస్ట్ ఖాళీగా ఉంది చేస్తావా అని మనోజ్‌ను అడుగుతాడు బాలు. చదువు కోలేదు కాబట్టే నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తున్నావు...మా ఆయనకు ఏం ఖర్మ అని బాలుతో కోపంగా అంటుంది రోహిణి.
చదువుకొని మీ ఆయనేం వెలగబెట్టాడు అని మీనా బదులిస్తుంది. నీకు ఏమైందే శివంగిలా అరుస్తున్నావని మీనాపై అరుస్తుంది ప్రభావతి. ఏంటి గొంతు పెంచి అరుస్తున్నారని అత్తయ్యకు వార్నింగ్ ఇస్తుంది మీనా. ఏమన్నావు అని ప్రభావతి అడుగుతుంది. ఏ విషయమైనా నాకు రెండు సార్లు చెప్పే అలవాటు లేదని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం