Gunde Ninda Gudi Gantalu Today Episode కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్- చలించిపోయిన బాలు- అత్తింట్లో రోహిణి ఊహించని ట్విస్ట్-gunde ninda gudi gantalu march 5th episode manoj crying for rohini at suguna home star maa serial disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్- చలించిపోయిన బాలు- అత్తింట్లో రోహిణి ఊహించని ట్విస్ట్

Gunde Ninda Gudi Gantalu Today Episode కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్- చలించిపోయిన బాలు- అత్తింట్లో రోహిణి ఊహించని ట్విస్ట్

Sanjiv Kumar HT Telugu

Gunde Ninda Gudi Gantalu Serial March 5th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 5 ఎపిసోడ్‌లో రోహిణిని వెతుక్కుంటూ సుగుణ ఇంటికి వెళ్తారు. అక్కడ భార్య కోసం మనోజ్ కన్నీళ్లుపెట్టుకుంటూ ఏడుస్తాడు. అది చూసి బాలు చలించిపోతాడు. తీరా ఇంటికి వెళ్లిన మనోజ్, బాలు, మీనాకు రోహిణి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 5 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కేపీ పాలెంలో రోహిణి కోసం బాలు, మీనా, మనోజ్ వెతుకుంటారు. మనోజ్‌పై బాలు సెటైర్లు వేస్తూనే ఉంటాడు. మనోజ్ ఓ చోట కారు ఆపమంటాడు. దాంతో బాలు ఆపుతాడు. పౌరుషం పొడుచుకొచ్చిందా.. దిగరా.. దిగరా.. అని బాలు అంటాడు. దాంతో మనోజ్ దిగి ఇంతసేపు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని వెళ్లిపోతుంటాడు.

మనకేం అవసరం లేదు

వెళ్లురా.. వెళ్లు.. ఖర్చులకు కూడా డబ్బులు కూడా లేవు కదా నీ దగ్గర. ఇలాగే ఊరంతా నీ భార్యను వెతుకు అని బాలు అంటుంది. మీనా అలా అంటారేంటి అని అంటుంది. పని వదిలేసుకుని వీడికోసం వస్తే పనిపాట లేనోడికి కూడా పౌరుషం వస్తుంది. మనం వెళ్దాం పదా. ఇంత దూరం వస్తే కొంచెమైనా కృతజ్ఞత ఉందా వీడికి. మనకేం అవసరేం లేదు కానీ పద అని బాలు అంటాడు. ఇంతలో చింటు కొట్టిన బాల్ కారుకు తగులుతుంది.

మీనా ఆంటీ అంటూ చింటూ వస్తాడు. ఇక్కడ ఉన్నావేంట్రా అని మీనా అడిగితే.. ఇదే మా ఊరు అని చింటు చెబుతాడు. మీ అమ్మమ్మకు కాల్ చేస్తే కలవట్లేదు. ఎక్కడ ఉందిని మీనా అంటుంది. అమ్మమ్మకు ఫోన్ లేదుగా అని చింటు చెబుతాడు. వీళ్ల ఇంటికి వెళ్లి ఓసారి అడుగుదాం పదండి అని చింటుని పట్టుకుని సుగుణ ఇంటికి వెళ్తారు. మరోవైపు జరిగిందంతా తలుచుకుంటే ఒళ్లంతా భగభగ మండిపోతుంది. ఆ ఇంట్లో నేనేమైనా రాజభోగాలు అనుభవిస్తున్నారా. వాళ్లేమైనా కోటీశ్వరులా అని రోహిణి అంటుంది.

నాకో కుటుంబం కావాలని అన్ని సర్దుకుని బతికాను. మూడో కోడలు వచ్చేవరకు నేనే రాణిలా బతికాను. సరే కొత్త కోడలు నగలు తెచ్చింది. మా అత్తయ్య ఆమెకే ఎక్కువ విలువ ఇస్తుందనుకున్నా. ఈలోపు ఇది బయటపడింది. ఉద్యోగం సద్యోగం లేని మొగుడితో కాపురం చేయొచ్చు. అబద్ధం చెప్పి మోసం చేసినవాడితో నేను బతకలేను అని రోహిణి అంటుంది. నువ్ గిరిగీసుకుని బతుకున్నావే. దొంగతనాలు, జైలుకు వెళ్లి వచ్చినవాళ్లు ఉన్నారు. అందమైన భార్య పెట్టుకుని ఇంకో అమ్మాయితో తిరిగేవారున్నారు. వాళ్లతో పోలిస్తే నీ భర్త చేసిన తప్పెంత అని సుగుణ చెబుతుంది.

పురుగును చూసినట్లు

అమ్మా అక్కడ నాకు అన్నీ సమస్యలే. ఇప్పుడు నేను బ్యూటిపార్లర్ అమ్మేసి అక్కడే పనిచేస్తున్నాను. అది ఎక్కడ బయటపడుతుందేమోనని భయం. దానికి తోడు మలేషియా నుంచి మీ నాన్న ఎప్పుడు వస్తాడని మా అత్తయ్య మాటిమాటికి అడుగుతూనే ఉంటుంది. ఇవన్ని తట్టుకుని అక్కడ ఉంది ఎందుకు. నా భర్తకోసమే. ఆ మనిషి నాతోనే ఉంటూ మోసం చేశాడు. ఆ బాలు, మీనా నన్ను పురుగును చూసినట్లు చూస్తారు. అది చూసి తట్టుకోవడం నా వల్ల కాదు అని రోహిణి అంటుండంగా.. మనోజ్ వాళ్లు కారులో వస్తారు.

కారు సౌండ్ చూసి బయటకు వెళ్లి చూసిన రోహిణి షాక్ అవుతుంది. అమ్మా కొంప మునిగింది. బాలు వాళ్లతో మనోజ్ వచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్లు తెలిస్తే మొత్తం బయటపడుతుంది. నువ్ బయటపడకు అని లోపలికి వెళ్లి దాక్కుంటుంది రోహిణి. ఇన్నాళ్లకు ఈ అమ్మను చూడాలనిపించిందా మీకు. మీరు రావడం సంతోషంగా ఉంది అని లోపలికి తీసుకెళ్తుంది సుగుణ. ఏదో పని మీద వచ్చినట్టున్నారు అని అడుగుతుంది.

వెళ్లిపోయినవాళ్లని, పారిపోయినవాళ్లని, దాక్కున్నవాళ్లను వెతుక్కుంటూ వెళ్లడమే నా పని అయిపోయింది అని బాలు అంటే సుగుణ షాక్ అవుతుంది. ఈ అబ్బాయి అని సుగుణ అంటే.. వీళ్ల అన్నయ్య అని మీనా చెబుతుంది. మంచినీళ్లు తెస్తానని లోపలికి వెళ్లిన సుగుణ నిన్ను వెతుక్కుంటు వచ్చినట్లున్నారు అని అంటుంది. ఇక్కడికే ఎందుకు వచ్చారు. నువ్ మా అమ్మవని తెలిసిపోయిందా అని రోహిణి అడుగుతుంది. తెలియడం లేదే అని సుగుణ అంటుంది.

దుబాయ్ నుంచి వచ్చిందా

తొందరగా వాళ్లు వెళ్లేలా చూడు. ఇక్కడ ఉండమని అనకు. పొరపాటున కూడా నోరు జారకు అని రోహిణి అంటుంది. సరేనని సుగుణ వెళ్లిపోతుంది. ఇంతలో చింటు మనోజ్ దగ్గరికి వచ్చి ఓ ఎయిర్ ప్లేన్ చూపించి ఇది నాకు అత్తయ్య కొనిచ్చింది అని చెబుతాడు. దాంతో సుగుణ, రోహిణి ఇద్దరు షాక్ అవుతారు. అత్తయ్య అంటున్నాడు. మీ అమ్మాయా. దుబాయ్‌ నుంచి వచ్చిందా అని మీనా అంటుంది. లేదమ్మా.. ఇక్కడ ఓ అమ్మాయి ఉంటుంది. తను వచ్చి వెళ్తుంటుంది అని సుగుణ కవర్ చేస్తుంది.

కాదు కాదు ఇది నాకు కల్యాణి అత్తయ్యే కొనిపెట్టింది అని చింటు అంటాడు. ఈ పేరు ఎక్కడో విన్నానే అని మీనా అంటుంటే.. మీరెందుకు వచ్చారు అని సుగుణ డైవర్ట్ చేస్తుంది. ఓ ఫ్రాడ్‌ను వెతుక్కుంటూ అని బాలు అంటే.. రేయ్.. ఇంకోసారి రోహిణిని ఫ్రాడ్ అంటే ఊరుకోను అని మనోజ్ అంటాడు. చెప్పకుండా వెళ్లిపోయినా వాళ్లను పార్లరమ్మా అనరు పారిపోయినమ్మా అనే అంటారు అని బాలు అంటాడు. మా తోడి కోడలు వీళ్ల అన్నయ్య మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అందుకే వచ్చి వెతుకుతున్నాం అని మీనా చెబుతుంది.

ఎవరో చెప్పారు. ఈ ఊరు బస్సు ఎక్కిందని. అందుకే ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారేమో అని ఇక్కడికి వచ్చాం. చింటుతో మీ ఇంటికి వచ్చాం అని బాలు అంటాడు. తనపేరు రోహిణి. ఆ పేరుతో ఇక్కడ ఎవరైనా ఉండేవారా అని మీనా అంటుంది. తనను ఒక్కసారే కదా చూసింది అంతగా గుర్తు లేదని సుగుణ అంటే.. మనోజ్ ఫోన్‌లో ఫొటో చూపిస్తాడు. ఆ ఫొటో నేను చూస్తాను అని చింటు అంటే.. అడ్డుపడుతుంది సుగుణ.

ఏడ్చిన మనోజ్

అయినా ఈ ఊరు ఎందుకు వచ్చినట్లు అని బాలు అంటే.. మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి. అక్కడ దిగిపోయిందేమో అని సుగుణ అంటుంది. రేయ్ ఇక్కడ దొరక్కుంటే నువ్వెళ్లి మలేషియా వెళ్లి వెతుక్కోవాల్సిందే అని బాలు అంటాడు. దాంతో మనోజ్ డీలా పడి ఏడుస్తుంటాడు. నేనే తప్పే చేశాను. నా వల్లే మనసు విరిగిపోయి వెళ్లిపోయింది అని కన్నీల్లు పెట్టుకుంటాడు. రోహిణి ఎంత బాధపడిందో, ఎక్కడికి వెళ్లిపోయిందో అని మనోజ్ అంటాడు.

ఎవరో అమ్మాయిని నమ్మి మోసపోయాను. ఇక జీవితమే నాకు లేదనుకున్నాను. రోహిణి దేవతలా వచ్చింది. మా అమ్మ తర్వాత తనే నన్ను ప్రేమగా చూసుకుంది అని బాధగా చెబుతాడు మనోజ్. దానికి రోహిణితోపాటు బాలు కూడా కాస్తా ఎమోషనల్ అయి చలించిపోతాడు. ఏదో కోపంలో వెళ్లిపోయింటుంది. కానీ, మీకోసం తప్పకుండా వస్తుంది. మీ అమ్మలాంటి దాన్ని చెబుతున్నాను. కచ్చితంగా వస్తుంది అని సుగుణ అంటుంది.

లేదు రోహిణి జీవితంలో క్షమించదు. నిజంగా నేను మోసం చేశానుకుంటుంది. ఉద్యోగం పోయిందని తెలిస్తే బాధపడుతుందని దాచిపెట్టాను తప్పా మోసం చేయాలని కాదని తనకు ఎలా తెలుస్తుంది. ఎవరు చెబుతారు. ఎక్కడ అని వెతకాలి. మళ్లీ కనిపిస్తుందో లేదో అని వణకిపోతున్నాను అని మనోజ్ అంటాడు. రేయ్ ఏంట్రా ఇది.. నీకూడా ఏడుపు వస్తుందా. మోసం చేస్తే నాన్న, అమ్మలాగా అందరు సర్దుకుపోతారనుకున్నావా అని బాలు అంటాడు.

పోలీస్ కంప్లైంట్

నిజమే రోహిణి కనిపిస్తే క్షమించమని అడుగుతాను. నాకు ఏ శిక్ష వేసిన భరిస్తాను అని మనోజ్ అంటాడు. ఇంతగా ప్రేమించే భర్తను ఏ భార్య దూరం చేసుకోదు. కచ్చితంగా తిరిగి వస్తుంది అని సుగుణ అంటుంది. మీరు భలే చెప్తారమ్మా. ఆవిడేదో మీ ఇంట్లోనే ఉన్నట్లు అని బాలు అంటాడు. దాంతో సుగుణ, రోహిణి షాక్ అవుతారు. ఎక్కడ అని వెతకాలో ఏమో అని బాలు అంటాడు. తర్వాత బాలు వాళ్లు వెళ్లిపోతారు. సుగుణ లోపలికి వెళ్తుంది.

విన్నావా.. అల్లుడి గారి మాటలు వింటుంటే మోసం చేసినట్లు అనిపిస్తుందా. దానికే కాపురం కూల్చుకుంటావా. ఏ భర్త అబద్ధాలు చెప్పట్లేదా. నిజానికి నువ్ చెప్పే అబద్ధాలు బయటపడేవరకే నువ్ మంచిదానివి. అవన్ని బయటపడిన రోజు నీకోసం ఇలాగే ఏడుస్తాడా. ఛీ కొడతాడు. అన్ని అబద్ధాలు చెప్పావ్. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకోసం ఒక మంచి కుటుంబం ఎదురుచూస్తుంది. ఇవన్నీ మర్చిపోయి వెళ్లు. ఇకనుంచి అల్లుడు గారిని బాగా చూసుకో అని రోహిణికి చెబుతుంది సుగుణ.

మరోవైపు బాలు వాళ్లు వెతుకుతుంటారు. నాకెందుకో తను ఇక్కడికి రాలేదని అనిపిస్తుంది అని మీనా అంటుంది. రోహిణి వాళ్ల ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందేమో అని మీనా అంటే.. మనోజ్ అందరిని అడిగా ఎక్కడికి వెళ్లలేదట అని చెబుతాడు. ఇంత పకడ్బందీగా వెళ్లిందంటే ఎవరు వెతకొద్దని తెలుస్తోంది. నీ దగ్గరికి వచ్చిన అమ్మాయిలేంట్రా అలా పారిపోతున్నారు. ఆ అమ్మాయి నీ దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయింది. ఇప్పుడు నువ్ మోసం చేశావని ఈమె వెళ్లిపోయిందని అని బాలు అంటాడు.

అసహ్యం పుట్టేలా చేశావ్

వెళ్లేటప్పుడు ఓ రుద్రాక్ష కొనిస్తాను. కాశీకి పంపిస్తాను. వెళ్లి సన్యాసం తీసుకో. నీకు అదే కరెక్ట్ అని బాలు అంటాడు. తర్వాత కారులో ముగ్గురు వెళ్తుంటారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం, రోహిణి కనిపించట్లేదని కంప్లైంట్ ఇద్దామని అంటాడు మనోజ్. ముందు ఇంటికి వెళ్దాం. నాన్నను అడిగి ఇద్దామని బాలు అంటాడు. ముగ్గురు ఇంటికి వెళ్తారు. రోహిణి ఎక్కడ కనిపించలేదు, తిరిగి తిరిగి వచ్చామని మనోజ్ అంటాడు. బాలు పంచ్‌లు వేస్తుంటాడు.

నాన్న వీడే నాన్న అంతా చేసింది. రోహిణికి ఇంట్లో ఉండాలంటే అసహ్యం పుట్టేలా చేశాడు. పైగా నా బాధలో నేనుంటే నన్ను సన్యాసంలో కలిసిపో అంటున్నాడు అని మనోజ్ అంటాడు. సారీ సన్యాసంలో కాదు సన్నాసుల్లో కలిసిపో అని చెప్పాల్సింది అని బాలు అంటాడు. రేయ్ ఇంకో మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. నా లైఫ్ సర్వనాశనం చేశావ్ అని మనోజ్ అంటాడు. వీడికోసం ఊరంతా తిరిగాం. ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని తిరిగాం. ఇంటికి వచ్చి ఈ అమ్మావతికి ఏం చెబుతున్నాడో చూడు అని బాలు అంటాడు.

200 కిలోమీటర్లు తిరిగాను. కిలోమీటర్‌కు 15 రూపాయలు. 3 వేలు ఇచ్చేయ్. తీయిరా డబ్బులు. నువ్ విషపు నాగువురా.. తేలు కొండివిరా అని బాలు అంటాడు. చూడు నాన్న. వీడు ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటూనే ఉంటాడు అని మనోజ్ అంటాడు. నేనా.. 40 లక్షలు ఎత్తుకెళ్లింది ఎవడ్రా.. పనిపాట లేనోడా.. పార్కుల్లో పడుకునేటోడా.. అని బాలు అంటుంటాడు. ఇంతలో బాలు ఆపు.. అని రోహిణి ఇంట్లోంచి ఎంట్రీ ఇచ్చి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది.

మీనా కాళ్లు పట్టుకున్న బాలు

అది చూసి ముగ్గురు షాక్ అవుతారు. మనోజ్ మాత్రం సంతోషిస్తాడు. రోహిణి అంటూ వెళ్లు హగ్ చేసుకుంటాడు మనోజ్. తర్వాత కాళ్లు లాగేస్తున్నాయని బాలు చెబితే మీనా కాళ్లు పడుతుంది. ఒక మగాడికి అసలైన హాయి సుఖం ఎక్కడ దొరుకుతాయో తెలుసా. ఇలా పతిసేవలు చేసినప్పుడు. నీకు నొప్పి పెట్టడం లేదా అని బాలు అంటాడు. ఇప్పుడు నా కాళ్లు పడతారా ఏంటీ అని మీనా అంటుంది. దాంతో ఇటువ్వు అని మీనా కాళ్లు బాలు పట్టుకుంటాడు.

కానీ మీనా పట్టుకోనివ్వదు. ఆ తోపులాటలో ఒకరిపై మరొకరు పడి రొమాంటిక్‌గా చూసుకుంటారు. ఏంటీ బెట్టు చేస్తున్నావ్ అని బాలు అంటే.. అది బెట్టు కాదు సిగ్గు అని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం