Gunde Ninda Gudi Gantalu Serial: మీనాపై అలిగిన బాలు -భర్తను జూనియర్ ఆర్టిస్ట్‌గా మార్చేసిన రోహిణి -ప్రభావతి చిందులు
Serial: గుండె నిండా గుడి గంటలు మార్చి 26 ఎపిసోడ్‌లో మీనా తనను తప్పుగా అర్థం చేసుకోవడంతో ఆమెపై కోపంతో బాలు అలుగుతాడు. భర్త అలకపోగొట్టేందుకు అతడికి ముద్దు పెడుతుంది మీనా. మరోవైపు మలేషియా నుంచి వస్తోన్న మావయ్యగా ఎలా నటించాలో మటన్ కొట్టు మాణిక్యానికి అన్ని జాగ్రత్తలు చెబుతుంది రోహిణి.
మీనాకు చీర గిఫ్ట్‌గా తీసుకొస్తాడు బాలు. ఆ చీర చూసి మీనా సంబరపడుతుంది. పైకి మాత్రం ఇప్పుడు అనవసరపు ఖర్చులు ఎందుకు అని భర్తతో అంటుంది. ఊళ్లో అందరి ముందు నా పెళ్లాం తక్కువ కాకూడదు కదా బాలు సమాధానమిస్తాడు.
బాలు అలక...
చీర కొనడానికే డబ్బులు అడిగారా అని బాలుతో అంటుంది మీనా. తాగి తందనాలు ఆడి, రాత్రి ఇంటికొచ్చి గొడవలు చేస్తానని అనుకున్నావా? కొన్ని మంచి పనులు కూడా మొగుళ్లు చేస్తారని అనుకోవచ్చుగా బాలు సమాధానమిస్తాడు. అయినా మీ పెళ్లాలు అలా ఎప్పటికీ అనుకోరని బాలు కోప్పడుతాడు.
నువ్వు అలాగే అనుకున్నావని అలుగుతాడు. భర్తకు సారీ చెబుతుంది మీనా. అతడి కోపం పోగొట్టడానికి అతడికి ఐ లవ్ యూ చెబుతుంది. అయినా బాలు కోపం తగ్గకపోవడంతో అతడికి ముద్దు పెడుతుంది. మీనా ముద్దుతో బాలు కోపం ఎగిరిపోతుంది.
రాజమౌళి సినిమాలో వేషం
రాజమౌళి సినిమాలో తనకు వేషం దొరికిందని అందరితో చెబుతుంటాడు మటన్ కొట్టు మాణిక్యం. తాను మలేషియా మావయ్య వేషం వేస్తున్నానని అంటాడు. ఇది సీక్రెట్ ఆడిషన్ అని, ఎవరిదో చెప్పొద్దని అన్నాం కదా మాణిక్యంపై విద్య, రోహిణి ఫైర్ అవుతారు. నీ పక్కన యాక్ట్ చేసిన మా అత్త పాత్రకు కూడా ఈ సీక్రెట్ గురించి చెప్పొద్దని అంటుంది.
జూనియర్‌కు ఎక్కువ...సీనియర్‌కు తక్కువ...
తన భర్త పాత్రలో నటించే యాక్టర్ ఇతడే అని మనోజ్ ఫొటో మాణిక్యానికి చూపిస్తుంది రోహిణి. వీడేంటి జూనియర్ తక్కువ...సీనియర్‌కు ఎక్కువలా ఉన్నాడని, ఇంకో ఆర్టిస్ట్ ఎవరూ దొరకలేదా అని మాణిక్యం అంటాడు. మాణిక్యం మాటలతో రోహిణి కోపం పట్టలేకపోతుంది. మర్యాదగా మాట్లాడమని అంటుంది. మీ భర్త పాత్రే కదా...నిజమైన భర్త కాదు కదా అని మాణిక్యం అంటాడు.
మాణిక్యానికి చీర, బ్రాస్‌లెట్ ఇస్తారు. ఇవి నువ్వు మలేషియా నుంచి తెచ్చినట్లు మనోజ్‌కు ఇవ్వాలని మాణిక్యానికి చెబుతారు విద్య, రోహిణి. మలేషియా నుంచి వచ్చినట్లుగా మంచి బట్టలు వేసుకొని ఇంగ్లీష్‌లో మాట్లాడాలని జాగ్రత్తలు చెబుతారు.
బాలు విలన్...
ఈ నాటకంలో బాలు అనే తాగుబోతు ఉన్నాడని, అతడితో జాగ్రత్తగా ఉండమని మాణిక్యంతో చెబుతుంది రోహిణి. నీ క్యారెక్టర్ కోసం అతడు పోటీపడుతున్నాడని మాణిక్యంతో అంటుంది. రోహిణి మాటలు నమ్మిన అతడు బాలు నాకు కూడా విలనేనని మాణిక్యం అంటాడు.
మనోజ్ కంగారు...
ఊరు వెళ్లే టైమ్ దగ్గరపడినా రోహిణి కనబడకపోవడంతో ప్రభావతి, మనోజ్ కంగారు పడతారు. మళ్లీ రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటుందని మనోజ్ అపోహపడతాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, పార్లర్‌లో కూడా రోహిణి లేదని టెన్షన్ పడతాడు. అప్పుడే రోహిణి ఇంట్లో అడుగుపెడుతుంది.
పని మీద బయటకు వెళ్లానని అంటుంది. నువ్వు ఇలా పదే పదే ఫోన్ చేసి నా గురించి ఎంక్వైరీ చేస్తే నా మీద అనుమాన పడుతున్నావని అనుకుంటారని మనోజ్‌తో అంటుంది రోహిణి. తన గురించి ఆరాలు తీయకుండా మనోజ్‌కు చెక్ పెడుతుంది.
మలేషియా మావయ్య...
మలేషియా నుంచి తన మావయ్య వస్తున్నాడని మనోజ్, ప్రభావతిలతో చెబుతుంది రోహిణి. కోడలి మాటలు వినగానే ప్రభావతి ఆనందం పట్టలేకపోతుంది. బిజీగా ఉండి కూడా నా మాట కాదనలేక మావయ్య వస్తున్నాడని రోహిణి అంటుంది. మీ మావయ్యను రిసీవ్ చేసుకోవడానికి నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళతానని మనోజ్ అంటాడు. భర్త మాటలతో రోహిణి కంగారు పడుతుంది.
నేరుగా మా మావయ్య పల్లెటూరికే వస్తానని చెప్పాడని కవర్ చేస్తుంది. మలేషియా మావయ్య నంబర్ అడిగినా మనోజ్‌కు ఇవ్వదు. రోహిణి మావయ్య గౌరవం ఏ మాత్రం తగ్గకూడదని, అన్ని ఏర్పాట్లు చూడమని భర్తకు ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. ఏదైనా తేడా జరిగితే తన బతుకు బస్టాండ్ కావడం ఖాయమని రోహిణి లోలోన బయపడుతుంది.
బాలు చిందరవందర...
ఊరు వెళ్లడానికి బట్లలు సర్దేస్తుంది ప్రభావతి. నాన్న మందుల డబ్బా పెట్టావా అని తల్లిని అడుగుతాడు బాలు. ప్రభావతి డౌట్ పడటంతో ఆమె సర్దేసిన బ్యాగ్ మొత్తం చిందరవందర చేస్తాడు బాలు. అది చూసి బాలుపై ప్రభావతి ఫైర్ అవుతుంది. తిట్ల దండకం మొదలుపెడుతుంది. మీనా సాయం చేయడానికి వస్తే ఆమెపై కసురుకుంటుంది.
సత్యం క్లాస్...
తన సొంతూరికి వెళ్లడంతో సత్యం సంబరపడతాడు. మీరేదో వరల్డ్ టూర్‌కు తీసుకెళుతున్నట్లు బిల్డప్పులు ఇవ్వొద్దని ప్రభావతి అంటుంది. ఆమెకు సత్యం, బాలు క్లాస్ ఇస్తారు.
మీ మావయ్య బయలుదేరాడా అని రోహిణిని అడుగుతుంది ప్రభావతి. బస్ ఎక్కడటా అని రోహిణి బదులిస్తుంది. మలేషియా నుంచి బస్‌లో వస్తున్నాడా అని సెటైర్లు వేస్తాడు బాలు. అది ఎయిర్‌బస్ అంటూ మనోజ్ భార్యకు సపోర్ట్‌గా మాట్లాడుతాడు. మలేషియా నుంచి రాజమండ్రికి నేరుగా విమానం వేశారా అని బాలు అంటాడు. హైదరాబాద్‌లో ఫ్లైట్ దిగి పసర్లపూడి బస్ ఎక్కాడటా అని రోహిణి బదులిస్తుంది. మొదటిసారి మీ పుట్టింటి నుంచి ఒకరు వస్తున్నారు అన్నమాట అని బాలు అంటాడు. మరి ఏమనుకున్నావు మా రోహిణి అంటే అని ప్రభావతి అంటుంది. ఆయన బస్‌లో వస్తే నువ్వు గాలిలో ప్రయాణిస్తున్నావేంటి బాలు సెటైర్ వేస్తాడు.
శృతి వాదన...
పల్లెటూరికి రావడానికి శృతి ఒప్పుకోదు. తనకు డబ్బింగ్ వర్క్ ఉందని రవితో వాదిస్తుంది. పల్లెటూరి గొప్పతనం గురించి శృతికి అర్థమయ్యేటట్లు వివరిస్తాడు రవి. పల్లెటూరికి వెళ్లే అదృష్టం అందరికి రాదని అంటాడు. ఇక్కడే మన ఉండటానికి సరైన బెడ్‌రూమ్ లేదు. డైనింగ్ టేబుల్ మీద టైమ్ ప్రకారం తినాల్సిన పరిస్థితి.
ఇక్కడే ఇంత అడ్జెస్ట్ అయితే పల్లెటూరిలో ఇంకా ఎలా ఉంటుందోనని శృతి భయపడుతుంది. భార్యను కన్వీన్స్ చేసి ఊరు రావడానికి ఒప్పిస్తాడు.
బాలు ఆనందం...
సత్యం ఫ్యామిలీ పసర్లపూడిలో అడుగుపెడతారు. నానమ్మను చూడగానే ఆనందంతో ఆమెను ఎత్తుకుంటాడు బాలు. నన్ను ఎత్తుకుంటే ఏం వస్తుంది మీనాను ఎత్తుకో అని సుశీల అంటుంది. మీనాను ఎత్తుకోవాలని చూడగా బాలుకు దొరక్కుండా పారిపోతుంది. మరోవైపు మటన్ కొట్టు మాణిక్యంతో రోహిణి సీక్రెట్‌గా మాట్లాడటం బాలు కనిపెడతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం