Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి మావయ్యగా మటన్ కొట్టు మాణిక్యం- లక్ష అప్పు- బాలుకు ముద్దుపెట్టిన మీనా-gunde ninda gudi gantalu march 24th episode meena kissed balu rohini new drama debt star maa serial disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి మావయ్యగా మటన్ కొట్టు మాణిక్యం- లక్ష అప్పు- బాలుకు ముద్దుపెట్టిన మీనా

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి మావయ్యగా మటన్ కొట్టు మాణిక్యం- లక్ష అప్పు- బాలుకు ముద్దుపెట్టిన మీనా

Sanjiv Kumar HT Telugu

Gunde Ninda Gudi Gantalu Serial March 24th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 24 ఎపిసోడ్‌లో బాలు అవమానించేసరికి రోహిణిని నాన్నను, గానీ మావయ్యను గాని ఇంటికి పిలిపించమంటుంది ప్రభావతి. దాంతో ఫ్రెండ్‌తో కలిసి తన మావయ్యగా మటన్ కొట్టే మాణిక్యంను నాటకం ఆడమంటుంది రోహిణి. బాలుకు మీనా ముద్దుపెడుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 24 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకాంతమే తాళి దొంగతనం చేసి మీనాపై నెట్టిందని అంతా చెబుతుంది శ్రుతి. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. మీనాను అనడంపై సత్యం కోప్పడతాడు. ఆవిడకు డబ్బున్నోళ్లే గొప్పోళ్లు, వాడు అయితే డబ్బు ఇస్తానంటే రోజు ఇంటికి వెళ్లి కడుగుతాడు కాళ్లు. అయినా ఇప్పుడు చెబుతున్నావేంటీ డబ్బుడమ్మా. అప్పుడే చెబితే అయిపోయేదిగా అని బాలు అంటాడు.

పిల్లికూన అయిందని

చెబితే ఏం చేసేవాళ్లు. గొడవ చేసేవాళ్లు. దాంతో ఆ సంజయ్ తిరిగి పెద్దది చేసేవాడు. ఇద్దరు కలిసి కొట్టుకునేవాళ్లు. మీ అందరి మధ్యలో మన మౌనిక ఎంత నలిగిపోతుందో ఆలోచించారా. గోల్డ్ దొరికాక ఆవిడ ఎంతలా మారిపోయిందో చూశారుగా. బయటకు తీసుకెళ్లి బండబూతులు తిట్టాను. ఎక్కువ చేస్తే వీడియో బయటపెడతాను అన్నావ్. దాంతో పిల్లికూన అయిందని శ్రుతి చెబుతుంది. నువ్ చాలా జీనియస్ శ్రుతి అని రవి మెచ్చుకుంటాడు.

థ్యాంక్స్ శ్రుతి. నా మీద పడిన నిందనే కాదు ఫంక్షన్ బాగా జరిగేలా చేశావ్. రోహిణి నువ్ కూడా నన్ను వెనుకేసుకొచ్చావ్. నాకు చాలా సంతోషంగా ఉంది అని మీనా అంటుంది. కోడళ్లు ముగ్గురు ఒక్కటి అయినట్లు చూసిన ప్రభావతి తెగ షాక్ అయి నోరెళ్లబెట్టి చూస్తుంది. అది చూసిన బాలు ఈవిడేంటీ అవాక్కైంది. నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయిందా అని బాలు అంటాడు. దాంతో చంద్రకాంతం చేసిన డ్రామా విశ్లేషించుకుంటారు.

మొత్తానికి ఫంక్షన్ బాగా జరిగిందని సత్యం అంటే.. అవును, క్రెడిట్ అంత బాలు అన్నయ్యదే అని రవి అంటాడు. అవును, ఖర్చు పెట్టినోడిదేగా పేరు అని ప్రభావతి అలుగుతుంది. తర్వాత రాత్రి అంతా భోజనం చేస్తారు. సత్యంకు సుశీల కాల్ చేస్తుంది. ఉగాదికి ఊరికి రమ్మని చెబుతుంది. పండక్కా. బిడ్డలందరికి ఖాళీ ఉండాలిగా అని సత్యం అంటే.. సంక్రాంతికి రాలేదు. ఉగాదికి రండిరా. ఒక్కరోజు వచ్చి ఉండటం కాదు. రవిని వాడి పెళ్లాన్ని కూడా తీసుకురా. బాలుకు ఇవ్వు అని సుశీల అంటుంది.

నాకు ఏడుపు వస్తుంది

మీనా ఎలా ఉందని బాలును సుశీల అడిగితే.. బాగుందని చెప్పి లక్షలు మింగినోడు, లేచిపోయినోడు అంటూ బాలు మాట్లాడుతాడు. దాంతో బాలు నోర్మూసిన ప్రభావతి అవన్ని అవసరం లేదని చెబుతుంది. పండక్కి మీరు తాళం వేసి అందరూ ఇక్కడికి రావాలని, ఇంట్లో ఒంటరిగా అనిపిస్తుంది. మీరు వస్తే కళకళాలాడుతుంది అని సుశీల చెబుతుంది. నువ్ అలా మాట్లాడకే నాకు ఏడుపు వస్తుంది అని బాలు అంటే.. నువ్ తలుచుకుంటే అందరినీ తీసుకొస్తావ్ అని సుశీల కాల్ కట్ చేస్తుంది.

నక్కలను, సాధు జంతువులను, క్రూర జంతువులను, నాగ లోకాన్ని అందరిని కట్టకట్టుకుని రమ్మంటుంది అని బాలు అంటే.. ఎక్కడికి జూకా అని శ్రుతి అంటుంది. ఇదే జూ అని బాలు అంటుంది. పండక్కి రమ్మంటుంది అంతేగా అని సత్యం ఆపేస్తాడు. నాకు వీలుకాదని మనోజ్ అంటే.. పార్క్ బోసిపోతుంది. పల్లీలవాడికి ఆదాయం తక్కువ అవుతుదని బాలు కౌంటర్స్ వేస్తాడు. దాంతో బాలుపై రోహిణి ఫైర్ అవుతుంది. నాకు ఇంటర్వ్యూ ఉందని మనోజ్ చెబుతాడు.

రాని ఉద్యోగానికి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తావ్ అని బాలు అంటాడు. నువ్వేమైనా జాబ్ ఇప్పిస్తావా అని రోహిణి అంటుంది. నేను పనిదొంగలకు జాబ్ ఇప్పించలేను. మీ నాన్నకు చెప్పి మలేషియాలో జాబ్ ఇప్పించలేకపోయావా అని బాలు అనేసరికి రోహిణి షాక్ అవుతుంది. ఇప్పించే టైమ్ వస్తే జాబ్ ఏంటీ ఆయన బిజినెస్‌లు అన్ని వీడికే అప్పజెబుతారు అని ప్రభావతి అంటుంది. ముందు ఆ ఇంటి నుంచి ఇక్కడికి ఒక్కరు అయినా రాని. అప్పుడు చూద్దాం. ఈ జన్మలో వీడికి అత్తగారి ఇల్లు చూసే యోగ్యం ఉందో లేదో పాపం అని బాలు అంటాడు.

ఎగిరెగిరి పడుతున్నారు

అటు తిప్పి ఇటు తిప్పు ఈ బాలు నన్ను బుక్ చేసేలా ఉన్నాడు. ఇక్కడ ఉంటే దొరికిపోతాను అని మనసులో అనుకున్న రోహిణి బయటకు ఛ.. ఎప్పుడు ఏదొకటి అంటూనే ఉంటాడు. మనశ్శాంతి లేకుండా పోతుంది అని కోపంగా రోహిణి వెళ్లిపోతుంది. పైకి వెళ్లిన రోహిణి బాలు అన్న మాటల గురించి ఆలోచిస్తుంది. ప్రభావతి వచ్చి బాలు మాటలు పట్టించుకోకంటుంది. మనోజ్‌ గురించి పాడిన పాటే పాడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాను అని రోహిణి అంటుంది.

వాడు అంతనేమ్మా. వాడికితోడు మీనా చేరింది. బుట్టెడు పూలు అమ్మి పెద్ద వ్యాపారస్థుల్లాగా ఎగిరెగిరి పడుతున్నారు. అలాంటి వాళ్ల పొగరు దించాలంటే మీ నాన్నను ఇక్కడికి రప్పించాలి. మీ నాన్నతో మనోజ్‌కు పెద్ద బిజినెస్ పెట్టించాలి. అది చూసి బాలుగాడు, పూలమ్ముకునేది కుళ్లుకుని చావాలి. వెంటనే ఫోన్ చేసి పిలిపించు మీ నాన్నను అని ప్రభావతి అంటుంది. నాకు మొహం చూడటానికే నాకు ఇష్టంలేదు. ఎలా రమ్మనను. అలా చేశారు ఆయన అని రోహిణి అంటుంది.

వయసుపైబడి తోడు కోసం ఇంకో పెళ్లి చేసుకుని ఉంటారు అంతే. అయినా అలాంటివన్ని సహజమే. అది మనసులో పెట్టుకుని ఎంతకాలం దూరం ఉంటావ్ చెప్పు. నా మాట విని పంతానికి పోకుండా ఫోన్ చేసి పిలిపించు అని ప్రభావతి అంటుంది. లేని నాన్నను ఎక్కడి నుంచి పిలిపించాలి. దీనికి ఒక పరిష్కారం చూడకుంటే నేను ఇరుక్కుంటాను అని రోహిణి అనుకుంటుంది. తర్వాత కన్నీళ్లు పెట్టుకుని ఎటు తేల్చుకోలేకపోతున్నాను. మా అమ్మ ఉంటే ఇక్కడికి వచ్చేది. డబ్బు బంగారం ఇచ్చేది. మా అమ్మ ప్రేమకు నోచుకోలేకపోయాను అని డ్రామా చేస్తుంది.

జర్మనీ వెళ్లారట

తల్లి లేని పిల్ల అని కూడా చూడలేదు. నిజంగా నామీద ప్రేమ ఉంటే వచ్చి చూసేవారు కదా. బిజినెస్ అంటూ తిరగరు కదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఊరుకోమ్మా అని ప్రభావతి సర్దిచెబుతుంది. నీకు టైమ్ వచ్చింది. మీ నాన్నగారు నువ్ ఏది అడిగిన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని ప్రభావతి అంటుంది. నేను ఆల్రెడీ మా నాన్నతో మాట్లాడాను. ఆయన బిజినెస్ పనిమీద జర్మనీ వెళ్లారట. అక్కడ చాలా లేట్ అయ్యేలా ఉందట. అందుకే ఫోర్స్ చేయలేకపోతున్నాను అని రోహిణి అంటుంది.

పోని మీ మావయ్యను రమ్మను. ఎవరైతేనే వీళ్ల నోళ్లు మూయించడానికి. అదే నా బాధ అని ప్రభావతి అంటుంది. మీ బాధ నా చావుకు వచ్చేలా ఉందని రోహిణి మనసులో అనుకుంటుంది. ఆలస్యం చేయకు. తొందరగా మీ మావయ్యను రమ్మని చెప్పు అని ప్రభావతి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం తన ఫ్రెండ్‌కు జరిగిందంతా చెబుతుంది. సో ఇప్పుడు నువ్ సెంటర్ పాయింట్ అయ్యావ్. శ్రుతి కంటే ఎక్కువ సారే తీసుకెళ్లాలన్నమాట అని తను అంటుంది.

శ్రుతి వచ్చాకే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. సమస్యలన్నీ నా తలకు చుట్టుకున్నాయి అని రోహిణి అంటుంది. ఇద్దరు అత్త ప్రభావతి ఆస్తి ఆశల గురించి మాట్లాడుకుంటారు. ఏదో ఒక ఐడియా చెప్పు. పరిష్కారం చెప్పేవరకు వెళ్లను అని రోహిణి అంటుంది. ఐడియా వచ్చింది. ఇకనుంచి మీ నాన్న మలేషియా నుంచి వస్తాడని అనడం మానేయ్. ఎందుకంటే మీ నాన్న ఆల్రెడీ మలేషియా నుంచి వచ్చారు. మనం ఒకచోటికి వెళ్తున్నాం. అక్కడ ఒకరిని చూసి మీ నాన్న క్యారెక్టర్ ఇస్తావో, మావయ్య క్యారెక్టర్ ఇస్తావో నీ ఇష్టం అని ఫ్రెండ్ అంటుంది.

పాత్రకు ప్రాణం పోస్తున్నాం

నువ్ కథలో చెప్పిన క్యారెక్టర్‌కు మనం ప్రాణం పోస్తున్నాం. మలేషియా నుంచి ఒకరు వచ్చినట్లు నాటకం ఆడి మన సమస్యను సాల్వ్ చేయబోతున్నాం అని రోహిణి ఫ్రెండ్ అంటుంది. అంటే, ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామానా అని రోహిణి షాక్ అవుతుంది. నువ్ ఆ ఇంట్లో మంచి కోడలిగా ఉండాలంటే ఈ డ్రామా తప్పదని ఫ్రెండ్ అంటుంది. ఇంతకీ ఎవరే అతను అని రోహిణి అడిగితే.. మటన్ కొట్టే అతని గురించి చెబుతుంది ఫ్రెండ్.

మటన్ కొట్టే మాణిక్యం వ్యక్తి దగ్గరికి రోహిణిని తీసుకెళ్తుంది ఫ్రెండ్. పందికి ఎర్ర ఏప్రాన్ కట్టినట్లు ఉన్నాడు. పైగా మా మావయ్య పాత్ర వద్దని రోహిణి అంటుంది. వాడి నటన గురించి నీకేం తెలుసు అని గొప్పగా చెబుతుంది ఫ్రెండ్. తాను వేసిన శవం పాత్ర చూసి మహా నటుడు మాణిక్యం అని అందరు అనడం మర్చిపోలేను అని మాణిక్యం అంటాడు. నీకు అవకాశం వచ్చిందని రోహిణి ఫ్రెండ్ అంటే.. ఏ సినిమాలో, బాహుబలి 3లో విలన్‌గానా, భజరంగీ భాయిజాన్‌లో సల్మాన్‌కు బదులు నన్ను అడిగారా అని మాణిక్యం అంటాడు.

అంతలా ఊహించుకోకు. మహేశ్ బాబు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తుందిగా సినిమా. అందులో. వారం రోజులు కదా ఆడిషన్స్ అని రోహిణి ఫ్రెండ్ అంటుంది. దాంతో సంతోషంతో పిడ్స్ వచ్చినట్లు పడిపోతాడు మాణిక్యం. మటన్ కోసం వచ్చిన అతను నీళ్లు చల్లడంతో మాములు మనిషి అవుతాడు మాణిక్యం. తర్వాత గుణ దగ్గర మీనా తమ్ముడు ఉంటాడు. అక్కడికి రోహిణి వచ్చి లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటుంది. అది చూసిన మీనా తమ్ముడు ఈవిడకెందుకు అంత డబ్బు అనుకుంటాడు.

బాలుకు మీనా ముద్దు

తర్వాత మీనాకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు బాలు. అది చూసిన మీనా చీర అని సంతోషిస్తుంది. దాంతో బాలుకు మీనా ముద్దు పెడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం