Gunde Ninda Gudi Gantalu: తాళిబొట్టు దొంగతనం చేసి కారులో దాచేస్తుంది కాంతం. గొడవ చేసి ఫంక్షన్ ఆపేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ కాంతం తాళిబొట్టు కొట్టేయడం శృతి చూస్తుంది. కాంతాన్ని పక్కకు తీసుకెళ్లి దులిపేస్తుంది.
ఒసేయ్ దొంగమొహమా.... చీటర్, నువ్వు అసలు మనిషివేనా, ఆడదానివేనా అని కాంతంపై విరుచుకుపడుతుంది. సంజు ఓ వెధవ, వాడి తండ్రి ఓ పోరంబోకు అని అంటుంది.
మా మీనాను దొంగ అంటావా? మా మావయ్యను, అత్తయ్యను చీప్‌గా చూస్తావా? అని కాంతాన్ని నిలదీస్తుంది శృతి. నేను ఎవరో తెలుసా అని బిల్డప్పులు ఇస్తుంది కాంతం. తెలుసు నువ్వో దొంగవి అని శృతి బదులిస్తుంది. దొంగ అనగానే కాంతం తడబడుతుంది.
కావాలనే సాంబార్ మీద పడేసుకొని మీనా రూమ్‌లోకి వెళ్లి తాళి కొట్టేయడం నేను చూశానని శృతి అంటుంది. నేను దొంగతనం చేయడం ఏంటి? సంజు, నీలకంఠాన్ని పిలవబోతుంది కాంతం. ఆరిస్తే చీపురుతో కొడతానని వార్నింగ్ ఇస్తుంది.
నేను దొంగతనం చేశానని రుజువు ఏంటి శృతిని నిలదీస్తుంది కాంతం. చూస్తావా అంటూ కాంతం దొంగతనం చేస్తుండా తీసిన వీడియోను చూపిస్తుంది శృతి. ఆ వీడియో చూడగానే కాళ్లబేరానికి వస్తుంది కాంతం. కావాల్సినంత డబ్బు ఇస్తానని శృతితో అంటుంది. ఛీ.... నీ డబ్బు ఎవడికి కావాలని శృతి సమాధానమిస్తుంది.
మౌనిక ఫంక్షన్ ఆగిపోకూడదని సైలెంట్‌గా ఉంటున్నానని కాంతానికి వార్నింగ్ ఇస్తుంది శృతి. ఫంక్షన్ పూర్తయ్యే వరకు అందరితో ప్రేమగా మాట్లాడాలి. ఎది వంక పెట్టకూడదు. నచ్చలేదని చెప్పకూడదు. లేదంటే ఈ వీడియో బయటపెడతానని కాంతానికి వార్నింగ్ ఇస్తుంది శృతి. ఆమె చెప్పినట్లే చేస్తానని కాంతం భయపడుతూ బదులిస్తుంది.
కాంతాన్ని చూడగానే మీ ఆయన ఇంకా ఉన్నాడా? సన్యాసుల్లో కలిగిపోయాడా అని బాలు సెటైర్‌వేస్తాడు. ఊరుకో బాలు...జోకులేస్తావు...చిలిపి అని కాంతం అంటుంది. ఆమె మాటతీరు ఒక్కసారిగా మారిపోవడంతో బాలు, మీనా షాకవుతారు. ప్రభావతిని చెల్లెలు అని ప్రేమగా కాంతం పిలుస్తుంది. ఆమె పిలుపుతో ప్రభావతి పొంగిపోతుంది.
కాంతం మారిపోవడం చూసి సంజుకు అంతుపట్టదు. మీ ప్రేమ నాకు జీర్ణం కావడం లేదని బాలు అంటాడు. పెద్దమ్మతో పరాచికాలు ఆడితే మొట్టికాయలు వేస్తానని కాంతం అంటుంది. సడెన్‌గా ఏమైందని కాంతాన్ని అడుగుతాడు నీలకంఠం. జరిగింది చెప్పబోతుంది కాంతం.శృతి ఫోన్ చూపించడంతో బెదిరిపోతుంది.
తాళిబొట్టు చూసి సన్నగా ఉందని కాంతం ఎగతాళి చేయబోతుంది. కానీ శృతి వీడియో గుర్తొచ్చి సన్నగా ఉంటేనే మంచిదని మాట మార్చేస్తుంది. సడెన్‌గా కాంతం మారిపోవడం చూసి...నువ్వు ఏమైనా మర్డర్ చేస్తానని వార్నింగ్ ఇచ్చావా అని బాలును అడుగుతాడు రవి. అదేం డౌట్‌రా అని తమ్ముడిపై బాలు ఫైర్ అవుతాడు.
తానే దగ్గరుండి అందరికి అక్షింతలు ఇస్తుంది కాంతం. సంజుకు తాళిబొట్టు ఇచ్చి మౌనిక మెడలో వేయమని ఆర్డర్ వేస్తుంది. ఫంక్షన్‌ను చెడగొడతానని బిల్డప్‌లు ఇచ్చిన కాంతం తానే దగ్గరుండి అన్ని పనులు చేయడం చూసి ఆమెకు మతిభ్రమించి ఉంటుందని నీలకంఠం అనుకుంటాడు.
సంజుకు బట్టలు పెడతాడు సత్యం. ఇలాంటి బట్టలు నేను ఎప్పుడు వేసుకోలేదని చీప్‌గా మాట్లాడుతాడు సంజు. నోర్మూయ్ అంటూ సంజుకు వార్నింగ్ ఇస్తుంది కాంతం. బట్టలు బాగున్నాయని, మీ నాన్న కూడా ఇలాంటివి ఎప్పుడు కోనలేదని కాంతం అంటుంది.
సంజును శృతి అన్నయ్య అని పిలుస్తుంది. ఆ పిలుపు విని సంజు షాకవుతాడు. నువ్వు మౌనిక కలిసి అందరి ఆశీర్వాదం తీసుకోవాలని శృతి అంటుంది. చెప్పరేంటి కాంతం అంటీ అని శృతి అనగానే కాంతం కంగారు పడుతూ నిజమేనని అంటుంది.
అత్తమావయ్యల కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోమని అంటుంది. ఫోన్ చూపించి మా కాళ్లకు కూడా సంజును నమస్కరించమని చెప్పమని కాంతాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంది శృతి. ఈ వీడియో చూపిస్తే అందరూ నిన్ను జీవితాంతం దొంగ అంటారని బెదిరిస్తుంది.
మీ బావలు నీ కంటే పెద్దవాళ్లని... వాళ్ల కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని సంజుతో చెబుతుంది కాంతం. దగ్గరుండి మనోజ్ - రోహిణి, బాలు - మీనా కాళ్లపై సంజు పడేలా చేస్తుంది కాంతం. ఆ అవమానం భరించలేకపోతాడు సంజు. బాలును తన కాళ్లపై పడేలా చేస్తానని అనుకుంటే తాను బాలు కాళ్లపై పడాల్సివచ్చిందని లోలోన రగిలిపోతాడు. ఫోన్ వచ్చినట్లుగా నాటకం ఆడి అత్తింటి నుంచి బయలుదేరుతాడు.
ఇంటి ముందు పూల కొట్టు ఉంటే శుభమని కాంతం అంటుంది. బయటి నుంచి చూస్తే చిన్నగా ఉన్న లోపల ఇళ్లు పెద్దగానే ఉందని, తాను అన్న మాటలు మనసులో పెట్టుకోవద్దని ప్రభావతిని క్షమాపణలు కోరుతుంది. కాంతం మాటలు విని ప్రభావతి సంబరపడుతుంది.
అత్తింటికి వెళ్లబోతూ మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకు ఏ సమస్య ఉన్నా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు అని చెల్లెలితో బాలు అంటాడు. మా మౌనిక మీద ఈగ వాలకుండా చూసే బాధ్యత మీదే కాంతానికి శృతి వార్నింగ్ ఇస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయమని మౌనికతో అంటుంది శృతి.
సంజు ఫ్యామిలీ వెళ్లిపోగానే మీనాపై ఎగిరిపడుతుంది ప్రభావతి. బంగారం ఎంత విలువైందో తెలియదా? నీకు భయం భక్తి, బుద్ది జ్ఞానం నీకు అసలు ఉన్నాయా అని నానా మాటలు అంటుంది. ఎవరి మీద అరుస్తున్నావు. మీనా ఏం చేసింది అని బాలు....తల్లిని నిలదీస్తాడు.
తాళి బొట్టు పొగొట్టి అందరి చేత నన్ను మాటలు పడేలా మీనా చేసిందని ప్రభావతి కోపంగా అంటుంది. నా పరువు తీసిందని గొడవ చేస్తుంది. మీకు ఏం తెలుసు అని మీనా మీద అరుస్తున్నారు ప్రభావతితో శృతి అంటుంది.
అందరికి మీనా బొమ్మలా కనిపిస్తుందా, మీనా చేయని తప్పుకు కాంతం దొంగను చేసింది. మీరు ఆమెను తిడుతున్నారని శృతి అంటుంది. ఆ తాళిని చంద్రకాంతం తీసి కారులో దాచిందని శృతి నిజం బయటపెడుతుంది. కారులో కాంతం దాయడం తాను వీడియో తీశానని శృతి చెబుతుంది.
సుశీల అందరిని పండగకు పల్లెటూరికి రమ్మని అన్నది బాలు అంటాడు. తనకు వీలుపడదని మనోజ్ బదులిస్తాడు. అవును నువ్వు లేకపోతే పార్కు బోసిపోతుందని బాలు అంటాడు. రోహిణి తండ్రి బిజినెస్‌కు మనోజ్ వారసుడని, వాడిని చీప్‌గా తీసేస్తే ఊరుకోనని ప్రభావతి అంటుంది.
బాలు పొగరు అణచాలంటే వెంటనే మీ నాన్నకు ఇక్కడికి పిలిపించమని రోహిణికి ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. లేని తండ్రిని ఎక్కడి నుంచి తేవాలని రోహిణి కంగారు పడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం