Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నీలకంఠం కుటుంబానికి మీనా భోజనం వడ్డిస్తుంది. అడుగడుగునా అవమానించిన కాంతం కావాలనే తనపై సాంబార్ పడేలా చేస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు.
ఏయ్ నువ్ అసలు మనిషివేనా. కళ్లు నెత్తిమీద పెట్టుకున్నావా ఏంటీ. వడ్డించే పద్ధతి ఇదేనా అని కాంతం అంటుంది. డైనింగ్ టేబుల్ మ్యానర్స్ అందరికీ తెలియదులే అత్త అని సంజు అంటాడు. ఏం తెలియదురా. ఈమె మొగుడుకి ఎంత పొగరు ఉందో అంతే తనకు ఉంది. కావాలనే మీద సాంబార్ పోసింది అని కాంతం అంటుంది. బాలును సత్యం కంట్రోల్ చేయడం సంజు చూస్తాడు.
రారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్ గొడవ పడాలి. నేను నిన్ను తన్నాలి. నువ్ నన్ను తన్నాలి. తర్వాత నీ మొహం నీ చెల్లి జీవితంలో చూడకుండా చేస్తా అని సంజు అనుకుంటాడు. నేను కావాలని ఎందుకు పోస్తాను అని మీనా అంటుంది. దాంతో మీనాపై ప్రభావతి అరుస్తుంది. ఇంతలో బాలు నువ్ ఆగమ్మా ఆమె నాకు ఏమవుతారు అని బాలు అడిగితే.. పెద్దమ్మరా అని ప్రభావతి అంటుంది. ఏయ్.. నువ్వేమైనా పదహారేళ్ల బాలకుమారు అనుకుంటున్నావా. నీకన్న చిన్నదాన్ని అని కాంతం అంటుంది.
సరే సరే పిన్నిగారే అని అంటాను. ఎందుకు పిన్నిగారు బాధపడతారు. అన్ని కోట్ల ఆస్తి ఉన్న మీకు ఆఫ్ట్రాల్ ఒక చీర ఓ లెక్క. నా భార్య కావాలని పోయలేదు. కావాలనే పోసేది అయితే చీరమీద ఎందుకు పోస్తుంది. మీ మొహం మీదే పోస్తుంది కదా అని బాలు అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. పార్లరమ్మా నువ్వు వడ్డించు. మీరు వెళ్లి వాష్ చేసుకోండి అని బాలు అంటుంది. దాంతో బాలు రూమ్ దగ్గరికి శ్రుతి తీసుకెళ్తుంది.
ఈ ఇంట్లో అందిరికి నిలువెల్లా ఉంది అని కాంతం అంటే.. మీలో ఉందే మాలో ఉంది. అదే మీరు ఏదైతే ఉందన్నారో అదే ఉందని శ్రుతి అంటుంది. నువ్ ఇక్కడే ఉండమ్మా అని కాంతం లోపలికి వెళ్తుంది. ఇదేమైనా పబ్లిక్ టాయిలెటా.. ఇక్కడే ఉండటానికి అని శ్రుతి వెళ్తుంది. సాంబార్ కడుక్కున్న కాంతం తాళిబొట్టు కోసం వెతుకుతుంది. బీరువాలో నుంచి తీసి తన ఒడ్డానం దగ్గర పెట్టుకుంటుంది కాంతం. మరోవైపు ఛ.. నేను అనుకున్నది ఏది జరగట్లేదు. మంచితనం ముసుగు నాకు నచ్చట్లేదు. వెళ్లేలోపు ఏదో ఒకటి చేసి వెళ్లకపోతే ఇంట్లో అడుగుపెట్టి కూడా ఏం చేయలేదని బాధపడాలి అని సంజు అంటాడు.
బాలుగాడు ఏంట్రా మన్ను తిన్న వాడిలా మారిపోయాడు. ఆ పెద్దవాడు అసలే పిరికి సన్నాసిలా ఉన్నాడు. డబ్బు మొహం ఎన్నడు చూడనోడిలా ఉన్నాడు అని నీలకంఠం అంటాడు. ఇంతలో కాంతం వచ్చి తను చేసింది చెప్పకుండా ఊరిస్తుంది. ఏం చేస్తానో చూడు. అసలు నీ పెళ్లాం జీవితంలో ఈ ఇంటికి రాదు. మనింటికి వాళ్లు రాలేర్రా అని సస్పెన్స్‌లో ఉంచుతుంది కాంతం. మరోవైపు మీనాను పక్కకు తీసుకెళ్లి నేను ఇవాళ లేకపోతే ఏమైపోయేది. ఆమె ఆడదేనా అని బాలు అంటాడు.
అసలు ఇది మిరేనా. ఎక్కడ ఆవిడ మొహంమీదే సాంబార్ పోస్తారనుకున్నాను. నాకే ఒక ఇటుకరాయితో కొట్టాలనిపించింది. ఎక్కడ గొడవ పడి మౌనికను ఇక్కడే వదిలివెళ్లేలా చేయాలని చూస్తుంది. వాడికంటే ఆమె ఎక్కువగా ఉంది అని మీనా అంటుంది. అందుకేగా వాడు కావాలని నన్ను తీసుకొచ్చాడు. మిగతావాళ్లు ఏమనరుగా. నేను వెళ్లిపోతే మరోలా అంటారు. మా నాన్నకు నోట్లో నాలుక లేదు. మా అమ్మ నిన్ను తప్పా ఎవరిని ఏమనదు అని బాలు అంటాడు.
ఫంక్షన్ పూర్తయ్యేదాకా ఓం పని చేద్దాం నాకు కోపం వస్తే నువ్వు దగ్గు అలాగే నీకు కోపం వస్తే నేను హచ్ అని తుమ్ముతాను. నీకు అది సిగ్నల్, నాకు దగ్గు సిగ్నల్ అని బాలు అంటాడు. ఇంతలో మీనాను ప్రభావతి పిలుస్తుంది. మరోవైపు శ్రుతి కాల్ మాట్లాడుతూ ఉంటుంది. కారు దగ్గరికి వచ్చిన కాంతం కారులో తాళి పెట్టాలని డోర్ తీస్తుంది. ఇంతలో కాల్ మాట్లాడిన శ్రుతి మౌనిక తాళి మార్చే ఫంక్షన్‌ను వీడియో తీసి పెట్టుకుందాం అని వీడియోలు తీస్తుంది.
ఇంతలో ఫంక్షన్ ఎలా చేస్తారో చూస్తాను అని తాళి చూస్తూ కారులో పెడుతుంది కాంతం. మరోవైపు తాళి తీసుకురమ్మని మీనాకు చెబుతుంది ప్రభావతి. తర్వాత తన గదిలోకి వెళ్లిన శ్రుతి హెడ్ సెట్ పెట్టుకుని ఫోన్‌లో ఏదో మాట్లాడుతుంది. తాళి కోసం మీనా ఎంత వెతికినా దొరకదు. కిందకు వచ్చిన మీనా పుస్తెలు తాడు కనిపించట్లేదని చెబుతుంది. దాంతో నీలకంఠం కాంతను చూస్తాడు. తన పనే అని సిగ్నల్ ఇస్తుంది. బీరువాలో పెట్టాను, అక్కడ లేదు, గదంతా వెతికాను అని మీనా అంటుంది.
మనోజ్ వైపు బాలు చూస్తాడు. వీడు తీస్తే ఇంత గుర్రుగా ఎందుకు చూస్తాడు అని బాలు అనుకుంటాడు. ఏదైనా పోవాలంటే ముందు ఉండాలి. అసలు కొన్నారో లేదో. పోయిందని చెబితే ఏం అనలేం కదా. ఆ తాళి ఎక్కడుందో తెలిసింది నీ పెళ్లానికి ఒక్కదానికే. ఇంట్లో అంతా మీ వాళ్లే మేము ఇక్కడే ఉన్నాం అని కాంతం అంటుంది. ప్రభావతి డౌట్ పడితే రవి అడ్డు చెబుతాడు. ఈ అబ్బాయి తేవడం తెచ్చాడేమో తీసేవాళ్లు తీస్తే అతనేం చేస్తాడు అని మీనాను దొంగలా అంటుంది కాంతం.
ఏవండి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. నా తోడి కోడలు అలాంటిది కాదు. అది పోతే ఇప్పటికిప్పుడు తీసుకొచ్చే స్తోమత మా అందరికి ఉంది. ఎవరో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడకండి అని మీనాకు సపోర్ట్‌గా మాట్లాడుతుంది రోహిణి. బంగారం లేదని చెబితే మూసుకుని పోతామా. వీడే ఆ డబ్బులతో తాగేశాడేమో. మెడలో పసుపుతాడు ఉందిగా. బంగారం కోసం ఆశపడిందేమో అని మాటలతో పొడుస్తుంది కాంతం. సత్యం నచ్చజెప్పిన కాంతం వినదు.
ఇప్పుడు ఏమంటారు ఉండమంటారా. మా కోడలిని తీసుకుని వెళ్లమంటారా అని నీలకంఠం అంటాడు. పర్లేదు నాన్నా. మనం వెళ్దాం. ఆ మాత్రం గోల్డ్ మనం కొనలేమా అని సంజు అంటాడు. సువర్ణ వీళ్లు ఏంటో తెలియడం లేదు. వీళ్లను నమ్మి గదిలోకి రానిచ్చారో శాంతం నాకేస్తారు అని కాంతం బాలు ఫ్యామిలి మొత్తాన్ని అంటుంది. ఆపండి అని బాలు అరుస్తే.. సత్యం, మీనా ఆపుతారు. మన గదిలోకి చివరగా ఎవరు వెళ్లారు అని బాలు అడిగితే.. ఆవిడే వెళ్లింది. సాంబార్ క్లీనింగ్ కోసం అని మీనా అంటుంది.
ఏంటీ నేనే తీశానంటారా అని కాంతం అంటుంది. ఏంటీ తనకు కేజీ బంగారం ఉంది. ఇలా ఇంటికి పిలిచి మా అక్కనే అవమానిస్తారా. మీకు అంత గతిలేదని చెబితే మేమే ఇంత బంగారం తీసుకొచ్చి మొహాన కొట్టేవాళ్లం అని నీలంకంఠం అంటాడు. మీకు దండం పెడుతాను. నాకు ఏం బంగారం వద్దు. ఈ పసుపుతాడుతో జీవితాంతం ఉండమన్నా ఉంటాను. దయచేసి గొడవలు వద్దు. అత్తయ్య వెళ్లిపోదాం అని మౌనిక అంటుంది.
పోయిందంటున్నారుగా. నిజమేంటో ఆ దేవుడికే తెలుసు. వెళ్లిపోదాం పదండి అని సువర్ణ అంటుంది. ఇంతలో కిందకు శ్రుతి వస్తుంది. దాంతో శ్రుతికి రవి అంతా చెబుతాడు. అయితే ఏంటిప్పుడు మమ్మల్ని దొంగలను చేస్తున్నారా మీరెంత మీ బంగారం ఎంత అని నీలకంఠం అంటాడు. అందరూ వాదించుకుంటారు. బాలు కొట్టడానికి వెళ్తే ఆపుతారు. అంటే ఈవిడ ఆ చైన్ కొట్టేసి కారులో పెట్టిందా అని డౌట్ పడుతుంది శ్రుతి.
కారు లాక్ తీసి వెళ్లి చూస్తుంది. అందులో తాళి ఉండటం చూసి షాక్ అవుతుంది శ్రుతి. ఆ తాళి తీసుకొస్తుంది. అందరిని ఆగమని అరుస్తుంది శ్రుతి. ఆ తాళి చూపిస్తుంది అందరికి. దాంతో నీలంకంఠం ఫ్యామిలీ షాక్ అవుతుంది. అంతా షాక్ అవుతారు. ఎక్కడ దొరికిందని రవి అడుగుతాడు. ఎక్కడ దొరికిందంటే అని శ్రుతి చెప్పబోతుంటే దొరికిందిగా మళ్లీ ఎక్కడైతే ఏంటీ అని కాంతం అంటుంది. మరి మీనాను అన్నారు. మీరెందుకు అన్నారు. ఏం తెలియకుండా దొంగ అని ఎలా అంటారు శ్రుతి నిలదీస్తుంది.
మీనా అలాంటి మనిషి కాదని చెప్పిన అన్నారు కదా. ఇప్పుడు మాట్లాడండి అని రోహిణి సపోర్ట్ చేస్తుంది. ఇలా ముగ్గురు తోడికోడల్లు ఒక్కటవుతారు. అదే గదిలో దొరికింది. అదికాదు ముఖ్యం. మీనాను దొంగ అన్నందుకు కాంతం సారీ చెప్పాలి శ్రుతి అంటే.. కరెక్ట్ అని రవి అంటాడు. అవును, మీనా ఎంత బాధపడి ఉంటుంది. చెప్పాల్సిందే అని రోహిణి అంటుంది. సారీ అని కాంతం చెబుతుంది. మీనాను చేయమంటే నేను ముట్టుకోను ఆ బంగారాన్ని. రోహిణితో చేయించండి అని అంటుంది.
తర్వాత కాంతంను పక్కకు పిలుస్తుంది శ్రుతి. తర్వాత అంతా వెళ్లిపోయాక మీనాను తాళి పోగొట్టావని, పరువు తీశావని తిడుతుంది ప్రభావతి. మీకేం తెలుసు ఆంటీ. ఆ తాళిని చంద్రంకాంతం తీసి కారులో పెట్టింది అని నిజం చెబుతుంది శ్రుతి. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం