Gunde Ninda Gudi Gantalu Today Episode: మామను నిలదీసిన మీనా- బాలుతో సంజు కాళ్లు కడిగించే ప్లాన్- శ్రుతి సపోర్ట్- అవమానం!-gunde ninda gudi gantalu march 17th episode sanju insulted balu in mounika function star maa serial disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: మామను నిలదీసిన మీనా- బాలుతో సంజు కాళ్లు కడిగించే ప్లాన్- శ్రుతి సపోర్ట్- అవమానం!

Gunde Ninda Gudi Gantalu Today Episode: మామను నిలదీసిన మీనా- బాలుతో సంజు కాళ్లు కడిగించే ప్లాన్- శ్రుతి సపోర్ట్- అవమానం!

Sanjiv Kumar HT Telugu

Gunde Ninda Gudi Gantalu Serial March 17th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 17 ఎపిసోడ్‌లో బాలును ఫంక్షన్‌లో ఉండకూడదని చెప్పారని ప్రభావతి అంటుంది. దాంతో ఒక్కో డైలాగ్‌తో ప్రభావతి నోరెత్తకుండా చేస్తుంది మీనా. బాలు ఏడిపించేస్తాడు. సంజు వాళ్లు వస్తారు. సంజు కాళ్లను బాలుతో కడిగించమని అత్త చెబుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 17 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనిక ఫంక్షన్ కోసం సత్యం ఫ్యామిలీ అంతా రెడీ అవుతుంది. సత్యం వస్తే.. రాత్రి నిద్రపోయినట్లు లేదే. పనులన్నీ పూర్తయ్యాయి కదా ఇంకెందుకు టెన్షన్ అని బాలు అంటాడు.

ప్రశాంతంగా ఉండనివ్వవా

ఫంక్షన్ బాగా జరగాలంటే కాకినాడ గుడిలో నువ్వెళ్లి పూజ చేసి రావాలి అని ప్రభావతి అంటుంది. దానికి ఫంక్షన్ రోజే వెళ్లి పూజ చేయాలా. నేను వెళ్లను అని సత్యం పక్కనే కూర్చుంటాడు బాలు. నేను వెళ్లకపోతే మౌనిక ఎంత బాధపడుతుంది అని బాలు అంటాడు. నువ్వుంటనే బాధపడుతుందిరా. ఇంట్లో అందరిని వేదించుకుని తింటున్నావ్. కనీసం దాన్ని అయినా ప్రశాంతంగా ఉండనివ్వవా అని ప్రభావతి అంటుంది. ఏంటీ ఇంకేమైనా కారణం ఉందా అని బాలు అంటాడు.

వాళ్లు అసలు నిన్ను ఫంక్షన్‌కే రావొద్దన్నారు అని ప్రభావతి చెబితే.. అంతా షాక్ అవుతారు. మనోజ్ మాత్రం సంతోషిస్తాడు. అవును, వాళ్లొచ్చేసరికి నువ్ ఉండకూడదని చెప్పేశారు. ఉంటే గొడవ పెట్టుకుంటావ్ అని ప్రభావతి అంటుంది. ఏంటీది అత్తయ్య ఆయనకు ఇంకే పని లేదా. అందరితో గొడవ పడుతూనే ఉంటారా అని మీనా అంటుంది. ఇంతసేపు నాతో, మనోజ్, రవితో గొడవ పడుతూనే ఉన్నాడుగా అని రోహిణి అంటుంది.

అది వేరు ఇది వేరు అని మీనా అంటే.. నువ్ వాన్ని వెనుకేసుకురాకు. పెళ్లి చూపుల్లో, పెళ్లిల్లో ఎంత గొడవ చేశాడు. వాళ్లు అలా అన్నారంటే వాళ్లను ఎంత విసిగించి ఉంటాడు. వీడికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు కొడతాడో తెలియదు. నా కూతురు ఫంక్షన్ ఏ గొడవ లేకుండా జరగాలి అని ప్రభావతి అంటుంది. వాళ్లు అంటే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావమ్మా అని రవి అంటాడు. ఏ చేయమంటావురా. ఆడపిల్లను ఇచ్చాం. చెప్పినట్లు వినాలి కదా అని ప్రభావతి అంటుంది.

ఒక్కడైనా డబ్బు అరెంజ్ చేశాడా

డబ్బు ఉన్న వాళ్లని కండిషన్‌కు ఒప్పుకోవాలి. అదేగా చెప్పేది అని బాలు అంటాడు. వాళ్ల అబ్బాయిని కొట్టావ్. అది నీ తప్పు వాళ్ల తప్పు కాదు అని ప్రభావతి అంటుంది. ఎవ్వరైనా అలాగే అంటారు. వాళ్లను ఎంతలా అవమానించాడు. మేమున్నాం కదా. చూసుకుంటాం అని మనోజ్ అంటాడు. నాన్న ఫంక్షన్‌కు డబ్బు అడిగినప్పుడు నేను అరెంజ్ చేస్తానని ఒక్కడైనా అన్నాడారా. నా దగ్గర ఏమైనా డబ్బు మూలుగుతుందా. నేను అప్పులు చేసి తిప్పలు పడి అరెంజ్ చేశాను కదా. అది అందరికి తెలుసు కదా అని బాలు అంటాడు.

కరెక్టే కదా ఆంటీ అని శ్రుతి అంటుంది. ఏంటీ కరెక్ట్ శ్రుతి. నా భర్తకు ఉద్యోగం లేదు కాబట్టి నేను, రవికి అంత జాబ్ లేదు కాబట్టి నువ్వు సర్దుతాను అన్నావ్. మనమేం చేతులెత్తలేం కదా. మీనా ఏమైనా ఇచ్చిందా అని రోహిణి అంటుంది. మీనా ఇచ్చింది నీకు తెలుసా. తన పుస్తెల కోసం దాచిన డబ్బులు, గాజులు విడిపించడానికి ఉంచిన డబ్బులు, పూలు కొనడానికి దాచిన డబ్బులు అన్ని ఊడ్చి ఇచ్చింది. ఇందులో మీనా డబ్బులు కూడా కలిశాయ్ అని బాలు చెబుతాడు.

దాంతో కన్నీళ్లు తుడుచుకున్న మీనా ఫంక్షన్ ఎవరి డబ్బు పెట్టి చేసిన ఇంటి పెద్ద మావయ్య గారు చేసినట్లే రోహిణి. కానీ, చెల్లెలి ఫంక్షన్‌కు అన్నయ్య ఉండకూడదా. ఇదెక్కడి అన్యాయం. రాత్రి పగళ్లు కష్టపడ్డారు. గాయమైనా చేసి కష్టపడి సంపాదించి తెచ్చారు. దేనికోసం చెల్లెలి ఫంక్షన్‌కు ఎలాంటి లోటు రాకూడదనే కదా. కనీసం ఆయన మనసులో ఎంత చిన్నబుచ్చుకుంటున్నారో, ఎంత నొచ్చుకుంటున్నారో కూడా ఆలోచించకుండా వెళ్లిపోవడమే కరెక్ట్ అని మాట్లాడుతున్నాడు ఈ లక్షలు మింగిన మనిషి అని మీనా అంటుంది.

కడుపులో మోసినా మీరే

ఏయ్ అని ప్రభావతి అరుస్తుంది. ఆ ఏంటీ అత్తయ్య. నేను అన్నది ఏమైనా లేనిదా, జరగనిదా.. మౌనిక ఫంక్షన్ కోసం ఇంతకష్టపడ్డా మీ కొడుకు మీకు అక్కర్లేదు. రూపాయి అయినా ఇచ్చి ఇంతే ఉంది అని కూడా అనలేని ఆ కొడుకు మీకు ఉండాలి. ఒక తల్లికి గర్భసంచిలో ఒకరు అద్దె సంచిలో ఒకరు పుట్టరు. ఇద్దరిని కడుపులో మోసిన మీరే ఇలా తేడా ఎందుకు చూపించాలి అని మీనా గట్టిగా నిలదీస్తుంది. దాంతో ప్రభావతి ఏం మాట్లాడలేకపోతుంది.

ఇదేంటండి అండి, నేనేదో దెయ్యాన్ని, బూతాన్నో అన్నట్లు నన్ను అంటున్నారు. నన్ను మాత్రం ముందుకు తోసేసి మీరు మాత్రం ఏం మాట్లాడకుండా ఉన్నారు. వాన్ని బాలు గాడిని వద్దన్నప్పుడు మీరు ఉన్నారు కదా. విన్నారు కదా. మాట్లాడరేంటండి మీరు అని ప్రభావతి అంటుంది. ఏంటీ మావయ్య ఆ మాట మీ ముందే అన్నారా. మీరుండి కూడా ఈ అన్యాయానికి ఒప్పుకున్నారా. ఏం మాట్లాడరేంటీ మావయ్య అని మీనా అంటుంది.

ఆగు మీనా వద్దు. ఇంతసేపు మా అమ్మకు మాత్రమే తెలుసు అనుకున్నాను. ఇప్పుడు నాన్నకు కూడా తెలుసుని తెలుసుకున్నాను. నువ్వెందుకు నాన్న మనసులోనే బాధపడుతున్నావ్. నిన్న డబ్బులిచ్చినప్పుడే చెబితే అయిపోయిండేది కదా నాన్న. ఈపాటికే నేను వెళ్లిపోయి ఏ చెట్టుకిందో కూర్చునేవాన్ని. పర్లేదు నాన్నా. నేను వెళ్లిపోతాను. ఫంక్షన్ చూసుకోడానికి ఇంతమంది ఉన్నారు. నేను లేకపోతే ఏంటీ. మనమంతా కోరుకునేది మౌనిక సంతోషమే కదా అని బాలు అంటాడు.

నలిగిపోకుండా ఉంటే చాలు

బాధపడకమ్మా ఓ.. భయపడకమ్మా అని చెప్పాలి కదా. భయపడకు. నాన్న ఇది చెప్పలేక రాత్రంతా నిద్రపోకుండా బాధపడుతున్నావా. నేను బయటకెళ్లిపోతాలే అని బాలు అంటాడు. నువ్వెందుకు అన్నయ్య వెళ్లడం రానివ్వు మాట్లాడుదాం అని రవి అంటాడు. అవును, మీరు బాధపడుకుంటూ వెళ్లకండి అని శ్రుతి అంటుంది. పర్లేదు. బాధేం లేదు. మా నాన్న బాధపడకుండా, వాళ్లకు నా మధ్య నలిగిపోకుండా ప్రశాంతంగా ఉంటే అదే చాలు అని బాలు అంటాడు.

దాంతో సత్యం కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీనా అయినా ఉండొచ్చా.. నాతోపాటే తీసుకెళ్లనా అని బాలు అల్లాడించేస్తాడు. అరేయ్ ఇదంతా వాళ్లు అన్నమాటేరా. నాకు ఆయనకు ఏ సంబంధం లేదు. మీనా మీద ఏ కోపం లేదు. ఏదైనా ఉంటే నీమీదే అని ప్రభావతి అంటుంది. నువ్వుండు మీనా. దగ్గర ఉండి చూసుకో అని పైకి వెళ్లిపోతాడు బాలు. మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. పైన ఉన్న బాలును మాట్లాడిస్తుంది మీనా. మా అమ్మనాన్న స్థానంలో ఎవరున్నా ఇలాగే అంటారు. వాళ్ల భయంలో అర్థముంది అని బాలు అంటాడు.

కానీ, ఈ ఫంక్షన్ జరుగుతుందే మీ వల్లే. బాధ్యత పంచుకున్న మీకే బాధను పంచారు. అందరు సంతోషంగానే ఉన్నారు. బాద మాత్రం మీకే అని మీనా అంటుంది. వద్దని చెప్పినా వాడికిచ్చి చేశారు. ఏదైనా వాడిని అంటే అత్తింట్లో మౌనికను అంటారు. దానికి బదులు లేకపోవడమే మంచిది. ఈలోపు నాలుగు ట్రిప్‌లు వేసుకుంటే వాళ్లు వెళ్లిపోతారు అని బాలు అంటాడు. మౌనిక కోసం మీరు మాటలు పడటం నాకిష్టం లేదు. అన్నగా మీ బాధ్యత పూర్తి చేశారు. అంతటితో తృప్తి పడదాం అని మీనా అంటుంది.

లెక్కలు వేసుకున్న మీనా

మీనా చీర మార్చుకుంటాను అంటే.. బాలు వద్దని అంటాడు. నేను వెళ్లి పూలకొట్టులో కూర్చుంటాను. నా భర్తను పిలవని పేరంటానికి నేనెందుకు వెళ్లాలి. నేను లేకపోతే ఇక్కడ పనులెవరు చేస్తారు. అందుకే నేనుండాలి. పనులకు కోడలు ఉండాలి. ఫంక్షన్‌కు కొడుకు ఉండకూడదు. వాళ్లకు మీరు అక్కర్లేనప్పుడు నాకు వాళ్లు అక్కర్లేదు. నేను ఫంక్షన్‌కి వెళ్లను. పూలు అమ్మితే డబ్బులు అయినా వస్తాయి అని మీనా అంటుంది.

నువ్వు కూడా లెక్కలు వేసుకుంటున్నావా అని బాలు అంటాడు. గుండె మండిపోతుందండి. తప్పులు చేసిన వాళ్లందరు గొప్పవాళ్లే. మంచి చేసే మీరు శత్రువు అయిపోతున్నారా. నాకు ఈ తేడా నచ్చట్లేదు. ఎవరు ఏమన్నా సరే ఈ ఫంక్షన్‌లో నేనుండను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా. ఎలాంటి గొడవ జరగకుండా నేను చూసుకునేదాన్ని. సంజును కొట్టారన్న కారణం ఒక్కటి దొరికింది మీ అమ్మకు. లక్షలు ఎత్తుకెళ్లడానికంటే, లేచిపోవడం కంటే పెద్ద నేరమా. ఇప్పుడే అడగాలని ఉంది. కానీ నాకెందుకు. నా పూలు నేను అమ్ముకుంటాను అని మీనా అంటుంది.

మీనా నువ్వుండాలి. మా అమ్మకోసం కాదు. నాన్న కోసం. నేను లేకుంటే మౌనిక అర్థం చేసుకుంటుంది. నువ్ లేకుంటే బాధపడుతుంది. నా స్థానంలో నువ్ నిలబడి ఉండాలి కదా అని బాలు అంటాడు. పదండి టిఫిన్‌కు అన్ని తెచ్చింది మీరు. తినకుండా త్యాగాలు చేసింది చాలు అని మీనా అంటుంది. ఇంతలో బాలు ఫ్రెండ్ వచ్చి పుస్తెలు తీసుకొస్తాడు. ఫంక్షన్ ఇవాలే కదరా ఇంకా రెడీ కాలేదేంటీ అని ఫ్రెండ్ అంటాడు.

లక్షలు మింగినోళ్లు

ఫంక్షన్‌లో ఆయన ఉండకూడదని మౌనిక మామయ్య కండిషన్ పెట్టారు అని మీనా చెబుతుంది. మంచి పని చేశారు. నువ్వుంటే ఏదో ఒక గొడవ అవుతుంది. లేకపోవడమే మంచిదిరా అని ఫ్రెండ్ అంటాడు. శత్రువులు ఎక్కడో లేర్రా పక్కనే, ఇంట్లోనే ఉన్నారు అని బాలు అంటాడు. ఇంతలో మనోజ్‌ను చూసిన బాలు పుస్తెలు జాగ్రత్తగా పెట్టు అసలే ఇంట్లో లక్షలు మింగినోళ్లు ఉన్నారు అని సెటైర్లు వేస్తాడు. బాలుకు టిఫిన్ పెడుతుంది మీనా.

ఇంతలో వచ్చిన ప్రభావతి ఇంకా వెళ్లలేదా వీడు. అప్పుడెప్పుడో చెబితే ఇంకా ఏం చేస్తున్నాడు. ఇక్కడే ఉండి ఫంక్షన్ పాడు చేయాలనుకుంటున్నాడా అని ప్రభావతి అంటుంది. అంతకుళ్లు కుతంత్రాలు మీ అబ్బాయికి తెలీదు అని మీనా అంటుంది. మీనా అవన్నీ పట్టించుకోకు. ఇప్పటివరకు నాలుగు ఇడ్లీలే తిందామనుకున్నాను. ఇప్పుడు ఇంకో నాలుగు తింటాను అని బాలు అంటాడు. అయ్యో నువ్వేంట్రా ఇలా తయారయ్యావ్. నిన్ను కన్నందుకు నాకు ఈ మానసిక క్షోభ ఏంట్రా అని ప్రభావతి అంటుంది.

తర్వాత సంజు ఫ్యామిలీ వస్తుంది. దిగు అత్త అని ఒకరిని పిలుస్తాడు సంజు. ఈ రౌడీగాడు ఇంకా ఇక్కడ ఉన్నాడేంటీ అని నీలకంఠం అంటాడు. ట్రిప్‌కు టైమ్ అయింది కదా వెళ్లిపో నాన్నా అని ప్రభావతి అంటుంది. ఎక్కడికి తప్పించుకుని వెళ్తున్నావ్. నీ ముద్దుల చెల్లెలి ఫంక్షన్ నువ్ లేకపోతే ఎలా బావ అని సంజు అంటాడు. దాంతో బాలును కూడా ఇంట్లోకి తీసుకెళ్తారు.

సంజు కాళ్లు కడగమంటూ

మొదటిసారి ఇంటి అల్లుడు ఇంటికొస్తే బావమరిది బావ కాళ్లు కడిగి లోపలిక తీసుకురావాలి. ఎలాగు మీ అబ్బాయిని మావాడు ఆపాడు కదా. ఇతనితోనే కాళ్లు కడిగించండి అని సంజు అత్త అంటుంది. బావ కాళ్లు కడగడానికి బావమరిదికి నామోషినా అని సంజు అత్త అంటుంది. వాడు కాళ్లు కడిగే రకం కాదే కాళ్లు విరగొట్టే రకం అని ప్రభావతి అనుకుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం