Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాలును అవమానించుదామని వచ్చిన సంజుకే ఘోర అవమానం జరుగుతుంది. అత్త చంద్రకాంతం రివర్స్ కావడంతో బాలు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు సంజు. తర్వాత జరిగిన అవమానం తట్టుకోలేక అక్కడ ఉండబట్టలేక వెళ్లి కారులో కూర్చుంటాడు.
తండ్రి నీలకంఠం కూడా వెళ్తాడు. అత్తింట్లో ఏదైనా సమస్య వస్తే తనకు కాల్ చేయమని మౌనికకు, ఏం జరగకుండా తనను చూసుకోవాలని కాంతంకు చెబుతుంది శ్రుతి. తర్వాత నీలకంఠం ఫ్యామిలీ వెళ్లిపోతుంది. మీనా పని చూస్తుండగా ఇంట్లోకి వచ్చిన ప్రభావతి అరుస్తుంది. నీకు బంగారం అంటే లెక్కలేదా, పోగొడతావా అని మండిపడుతుంది. ఇప్పుడు మీనా ఏం చేసిందని సత్యం అడ్డుకున్న ప్రభావతి వినదు.
మీ భార్యాభర్తల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. తాళి జాగ్రత్తగా పెట్టమని చెప్పాను మనకిస్తే కదా. తన భర్తే ఇదంతా చేస్తున్నాడని తెలిసేలా తన దగ్గరే పెట్టుకుంది అని ప్రభావతి అంటుంటే బాలు, శ్రుతి మిగతా వాళ్లంతా వస్తారు. ఏమైంది అని బాలు అడిగితే.. మీనా తాళి పొగొట్టిందని, వాళ్ల ముందు తన పరువు తీసిందని తిడుతుంది ప్రభావతి. అసలు మీకు ఏం తెలుసు ఆంటీ అని శ్రుతి అనడంతో అంతా షాక్ అవుతారు.
అంటే ఏంటీ అని ప్రభావతి అంటుంది. మీనాను ఎందుకు అంటున్నారు. ఆవిడేమో దొంగ అని అంటగట్టింది. మీరేమో తిడుతున్నారు. ఆ చంద్రకాంతమే తాళి దొంగతనం చేసి మీనా మీదకు నెట్టింది. నేను బయట వీడియోలు తీసుకుంటుంటే రికార్డ్ అయింది కాబట్టి చూసి వెళ్లి తీసుకొచ్చాను అని శ్రుతి చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అంటే, ఆ సాంబార్ కూడా తనే కావాలనే పోయించుకుందా అని మీనా అంటుంది.
ఎగ్జాట్లీ. తనముందే మీనా పుస్తెలు తాడు ఎక్కడుందో చెప్పింది కదా. కావాలనే సాంబార్ పోసుకుని బట్టలు మార్చుకుందామని వెళ్లి గోల్డ్ తీసుకెళ్లి కారులో పెట్టింది అని శ్రుతి అంటుంది. అమ్మో.. అదే తీసి అదే ఇంత గొడవ చేసిందా అని ప్రభావతికి ఫీజులు ఎగిరిపోతాయి. చూశావా అనవసరంగా మీనాను అన్నావ్ అని సత్యం అంటాడు. దాంతో ప్రభావతి, మీనా ఒకరినొకరు చూసుకుంటారు. ఏం జరిగినా అనడానికి, పడటానికి నేను ఉన్నాను, అందరికి నేను అంటే అలుసు అని మీనా బాధపడుతుంది.
తర్వాత ఇంట్లో అందరిని బాలు పిలుస్తాడు. వీడు మళ్లేదో చేసేనట్లున్నాడు అని ప్రభావతి అనుకుంటుంది. షీలా (నానమ్మ సుశీల) డార్లింగ్ పండగకు అందరిని కట్టకట్టుకుని అక్కడికు తీసుకురమ్మంటుంది అని బాలు అంటాడు. అందరం వెళ్దాం, సరదాగా ఉంటుందని అనుకుంటారు. ఏమంటారు అని సత్యం అడుగుతాడు. నాకు వీలు కాదు నాన్న అని మనోజ్ చెబుతాడు. అవును, పార్క్ బోసి పోతుంది అని బాలు కౌంటర్ వేస్తాడు.
ఎందుకు మాటి మాటికి అదే గుర్తు చేసి ఏడిపిస్తావ్ అని బాలుపై ఫైర్ అవుతుంది రోహిణి. మీ నాన్నకు చెప్పి మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పించకపోయావా అని బాలు అంటాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఆయన బిజినెస్‌లన్నీ వీడికే అప్పజెబుతారు అని ప్రభావతి గొప్పగా అంటుంది. ముందు వాళ్ల పుట్టింటి నుంచి ఒక్కరంటే ఒక్కరు అయినా మన ఇంటికి వచ్చి మొహం చూపించమను. అప్పుడు చూద్దాం అని బాలు ఛాలెంజ్ చేస్తాడు.
తర్వాత ఈ విషయం గురించి ప్రభావతి, రోహిణి మాట్లాడుకుంటారు. తను ఎంత పొగరుగా మాట్లాడాడో చూశారుగా, మనోజ్‌ను ఎప్పుడు అవమానిస్తూనే ఉంటాడు అని రోహిణి బాధగా చెప్పుకుంటుంది. అలాంటి వాళ్ల పొగరు దించాలంటే ఒక్కటే మార్గం. మీ నాన్నను ఇక్కడికి పిలిపించడమే అని ప్రభావతి అంటుంది. లేని నాన్నని ఎక్కడి నుంచి పిలిపించాలి. దీనికి పరిష్కారం చూడకపోతే నేను ఇరుక్కుంటాను అని రోహిణి అంటుంది.
మనోజ్ జాబ్ సమస్య రోహిణి మెడకు చుట్టుకుంటుంది. మరి ఈ బిగుసుకున్న ఉచ్చు నుంచి రోహిణి బయటపడుతుందా లేదా చూడాలి. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం