Gunde Ninda Gudi Gantalu: మౌనిక ఫంక్షన్‌కు దూరంగా బాలు- అత్తను నిలదీసిన మీనా- నిస్సహాయ స్థితిలో సత్యం- సాధించిన ప్రభావతి-gunde ninda gudi gantalu latest episode promo balu did not attend mounika function star maa serial disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu: మౌనిక ఫంక్షన్‌కు దూరంగా బాలు- అత్తను నిలదీసిన మీనా- నిస్సహాయ స్థితిలో సత్యం- సాధించిన ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu: మౌనిక ఫంక్షన్‌కు దూరంగా బాలు- అత్తను నిలదీసిన మీనా- నిస్సహాయ స్థితిలో సత్యం- సాధించిన ప్రభావతి

Sanjiv Kumar HT Telugu

Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో బాలును మౌనిక ఫంక్షన్‌కు రావొద్దని అత్తింటివారు అన్నారని ప్రభావతి చెబుతుంది. దాంతో చెల్లెలి కోసం ఇంత కష్టపడ్డ మీ కొడుకు మీకు అక్కర్లేదా అని అత్త ప్రభావతిని నిలదీస్తుంది మీనా.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో మౌనిక ఇంట్లో ఫంక్షన్ కోసం అంతా రెడీ అయి వస్తారు. రవిపై బాలు సెటైర్లు వేస్తుంటాడు. ఇంతలో వచ్చిన శ్రుతి ఎవరిని అంటున్నాడు అని అడుగుతుంది. మనల్ని కాదులే అని రవి చెబుతాడు.

పనులన్నీ పూర్తయ్యాయి కదా

కానీ, వీన్నే అంటున్నాడను రవిని చూపిస్తాడు మనోజ్. అసలు నీకంటికి మీ తమ్ముడు ఎలా అని అనబోయిన శ్రుతి సత్యం, ప్రభావతి రావడం చూసి ఆగిపోతుంది. ఏంటీ నాన్న ఇప్పుడే లేచావా. రాత్రంతా నిద్రపోయినట్లు లేదే. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి. పనులన్నీ పూర్తి అయిపోయాయి కదా. ఇంకెందుకు టెన్షను అని బాలు అంటాడు. దాంతో ప్రభావతిని సత్యం చూస్తాడు.

సత్యం భుజాలపై చేయి వేసి

తర్వాత ఏమైందని బాలు అడుగుతాడు. కాకినాడ దగ్గర ఓ గుడి ఉంది. అక్కడికి నువ్వు వెళ్లి పూజ చేసి రావాలి అని ప్రభావతి చెబుతుంది. నేను వెళ్లను ఇక్కడే ఉంటా అని సత్యం భుజాలపై చేయి వేసి పక్కనే కూర్చుంటాడు బాలు. కాకినాడ గుడిలో పూజ చేయడం మంచిది అని, అలా చేస్తే మంచి జరుగుతుందని చాలా విధాలుగా బాలుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారు.

నేను రావాల్సిందే

కానీ, బాలు ఏమాత్రం వినడు. ప్రతిసారి అన్నింటికి ఎందుకు అడ్డంగా సమాధానాలు ఇస్తావ్ అంటీ అని శ్రుతి అంటుంది. ఓ డబ్బుడమ్మ నిన్నేమైనా అన్నానా. నా మీద పడతావేంటీ అంటూ పంచ్‌లు వేస్తాడు బాలు. ఎవరు చెప్పిన నేను వినను. మౌనిక ఫంక్షన్‌కు కచ్చితంగా నేను రావాల్సిందే అని అంటాడు. ఎంత చెప్పిన బాలు వినకపోయేసరికి ప్రభావతి కోపం తెచ్చుకుంటుంది.

ఫంక్షన్‌లోనే ఉండొద్దన్నారు

దాంతో చివరికి ఏం చేయలేక బాలుకు నిజం చెబుతుంది ప్రభావతి. వాళ్లు నిన్ను అసలు ఫంక్షన్‌లోనే ఉండొద్దు అన్నారు అని ప్రభావతి చెబుతుంది. దాంతో మీనా, రవి, శ్రుతి షాక్ అయి చూస్తారు. కానీ, మనోజ్ మాత్రం నవ్వుతాడు. ఎందుకు రాకూడదు, ఏం తప్పు చేశాం అని బాలు అంటాడు. దాంతో బాలు చేసింది అంతా ప్రభావతి చెబుతుంది. భర్తకు సపోర్ట్‌గా నిలిచిన మీనా నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంది.

మీకు కొడుకు అక్కర్లేదా?

కానీ, ప్రభావతి ఏమాత్రం వినదు. నా కూతురి ఫంక్షన్ ఏ గొడవ లేకుండా జరగాలి అని ప్రభావతి గట్టిగా చెబుతుంది. మౌనిక ఫంక్షన్ కోసం ఇంతకష్టపడ్డ మీ కొడుకు మీకు అక్కర్లేదు అని అత్తను నిలదీస్తుంది మీనా. దాంతో ప్రభావతి షాక్ అయి చూస్తుంది. మనోజ్, రోహిణి కూడా అలాగే చూస్తారు. సత్యం కళ్లు ఎర్రగా ఉంటాయి. కొడుకును కూతురు ఫంక్షన్‌కు రావొద్దని చెబుతున్నామనే బాధతో అలాగే ఉండిపోతాడు సత్యం.

సత్యం కాళ్ల దగ్గర కూర్చుని

వాళ్లు బాలు గాడిని ఉండొద్దని చెప్పినప్పుడు మీరు ఉన్నారుగా అని ప్రభావతి అంటుంది. దాంతో బాలు, మీనా షాక్ అయి చూస్తారు. అటు కొడుకుకు, ఇటు భార్యకు చెప్పుకోలేక సత్యం నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. దాంతో కుర్చీలో కూర్చున్న సత్యం కాళ్ల దగ్గర కింద కూర్చుని బాలు మాట్లాడుతాడు. ఈ విషయం నీకు తెలుసా నాన్నా. ఇది ముందే చెబితే సరిపోయేది కదా నాన్నా. దీనికోసమా ఇంతలా బాధపడుతున్నావ్ అని బాలు అంటాడు.

వెళ్లిపోయిన బాలు

నువ్ ఉండొద్దురా అని అంటే ఈపాటికే వెళ్లిపోయి ఓ చెట్టుకింద కూర్చునే వాన్ని కదా నాన్నా. నేను వెళ్లిపోతాను అని బాలు అంటాడు. దాంతో సత్యం షాక్ అయి చూస్తాడు. మీనా కూడా బాధగా అలాగే చూస్తుంటుంది. చెల్లెలి ఫంక్షన్ కోసం అంత కష్టపడిన బాలు చివరిగా అటెండ్ కాకుండా ఉంటాడు. ఇక ప్రభావతి కోరుకుంది జరిగి సంతోషిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం