Gunde Ninda Gudi Gantalu: నెరవేరిన బాలు కల - అత్తింట్లోకి భర్తతో శృతి ఎంట్రీ - సత్యం కుటుంబంలో చిచ్చు
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 9 ఎపిసోడ్‌లో గుడిలో సంజు చూడకుండా గుడిలో బాలు, మీనాలను కలుస్తుంది మౌనిక. సంజు తనను టార్చర్ పెడుతోన్న సంగతి అన్నయ్య దగ్గర దాస్తుంది. సంజు తనను బాగా చూసుకుంటున్నాడని అబద్ధం ఆడుతుంది. చెల్లెలు మాటలు నిజమని బాలు నమ్ముతాడు.
Gunde Ninda Gudi Gantalu: శృతిని తమకు దూరం చేసిన సత్యం, ప్రభావతిపై పగ తీర్చుకోవాలని శోభన, సురేంద్ర అనుకుంటారు. సత్యానికి అతడి ముగ్గురు కొడుకులను దూరం చేయాలని నిర్ణయించకుంటారు. తాము పడుతోన్న బాధను సత్యం కూడా అనుభవించేలా చేయాలని ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను శోభన తీసుకుంటుంది.
మౌనిక పేరు మీద అర్చన...
మరోవైపు సంజు, మౌనికలను తీసుకొని గుడికివస్తుంది రేవతి. తాను గుడిలోకి రానని పట్టుపడుతాడు సంజు. తల్లి బలవంతం చేయడంతో వస్తాడు. అదే గుడికి మౌనిక పేరు మీద అర్చన చేయించడానికి బాలు, మీనా వస్తారు. మౌనిక కోసం బాలు కొన్న గాజులను తీసుకొస్తుంది మీనా. ఈ గాజులు చెల్లికి చేతికి స్వయంగా తానే తొడిగే రోజు ఎప్పుడస్తుందోనని బాలు బాధపడతాడు. ఆ రోజు తొందరలోనే వస్తుందని బాలుకు సర్ధిచెబుతుంది మీనా.
బాలును కలిసిన మౌనిక...
గుడి చుట్టూ ప్రదక్షణలు చేస్తోన్న మౌనిక... బాలు, మీనాలను చూడగానే ఆనందపడుతుంది. వారి దగ్గరకు వెళుతుంది. చెల్లిని చూసి బాలు కూడా సంబరపడతాడు. మౌనిక కన్నీళ్లు పెట్టుకోవడం చూసి బాలు కంగారు పడతాడు. సంజు నిన్ను టార్చర్ పెడుతున్నాడా అని అడుగుతాడు.నీ మాట విననందుకు దేవుడు నాకు సరైన శిక్ష వేశాడని మనసులో మౌనిక అనుకుంటుంది.
నిజం దాచిన మౌనిక...
సంజు తనను టార్చర్ పెడుతోన్న సంగతి బాలు దగ్గర దాచిపెడుతుంది మౌనిక. బాలు, మీనా ఎన్ని ప్రశ్నలు వేసిన మౌనిక నోరు విప్పదు. సంజు తనను బాగానే చూసుకుంటున్నాడని అబద్ధం ఆడుతుంది. నీ మీద కోసం సంజు నా జీవితాన్ని బలిచేశాడని నువ్వు ఊరుకోవనే నిజం చెప్పడం లేదని మౌనిక లోలోన బాధపడుతుంది. సంజుకు నీపైనే కోపం ఉందని, నన్ను మాత్రం ప్రేమగా చూసుకుంటున్నాడని బాలుతో అంటుంది మౌనిక.
సంజు అనుమానం...
తల్లితో పాటు మౌనిక కనిపించకపోవడంతో సంజు గాబరా పడిపోతాడు. తప్పించుకొని పారిపోయిందా అని అనుమానంగా అడుగుతాడు. ఎందుకు పారిపోతుంది...నువ్వేమైనా టార్చర్ పెట్టావా అని కొడుకును నిలదీస్తుంది రేవతి. అవన్నీ ఇప్పుడెందుకు అని సమాధానం దాటవేసిన సంజు మౌనికను వెతకడానికి వెళతాడు. మౌనిక కోసం కొన్న గాజులను అతడి చేతికి స్వయంగా తొడుతుతాడు బాలు. అన్నయ్య ఇచ్చిన గాజులు చూసి మౌనిక మురిసిపోతుంది. గాజులు బాగున్నాయని అంటుంది. సంజు తనను వెతుక్కుంటూ రావడం చూసి మౌనిక భయపడుతుంది.
అన్నయ్య మీద కోపంతో...
ఏ అవసరం వచ్చిన తనకు ఫోన్ చేయమని చెల్లితో అంటాడు బాలు. మీ అన్నయ్య మీద కోపంతో సంజు నిన్ను కష్టపెడితే మేము ఊరుకునేది లేదని, నీకు మేము ఉన్నామని మీనా చెబుతుంది. తనకు ఏ కష్టాలు రావని బాగానే ఉంటానని మౌనిక చెప్పి వెళ్లిపోతుంది.
గుడిలో టార్చర్...
మౌనిక కనిపించగానే సంజు ఆమెపై ఫైర్ అవుతాడు. ఇంత సేపు ఎక్కడికి వెళ్లావు...చాటుకు వెళ్లి మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడివచ్చావా అంటూ కోప్పడుతాడు. రేవతి అతడికి సర్ధిచెబుతుంది. మౌనిక సంతోషంగా ఉండటం చూసి బాలు మనసు కుదుటపడుతుంది.
రవి, శృతి గొడవ...
సంజుతో మౌనిక పెళ్లి ఫిక్స్ చేసే ముందు మీ ఇంట్లో వాళ్లు మన అభిప్రాయం అడిగితే సంజు ఎలాంటి వాడో చెప్పేవాళ్లం కదా అని రవితో అంటుంది శృతి. సంజును గుడ్డిగా నమ్మి మౌనిక జీవితాన్ని నాశనం చేశారని, నిజం చెప్పిన కూడా పెళ్లి ఆపలేదని శృతి ఫైర్ అవుతుంది. మౌనికను సంజు పెళ్లి చేసుకోవడానికి మనం ఒక రకంగా కారణమయ్యామని రవి అంటాడు. మీ ఇంట్లో జరిగే ప్రతి నష్టానికి, కష్టానికి మన పెళ్లి కారణం అంటే ఊరుకునేది లేదని రవితో శృతి గొడవకు దిగుతుంది. అసలు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా ఉందని శృతి కోపంగా అంటుంది.
ప్రభావతి ఎంట్రీ...
ఎప్పుడు ఇంట్లో వాళ్ల గోలే...నిద్రలో కూడా వారి పేర్లు కలవరిస్తే నాతో ఉంటున్నావనే ఫీలింగ్ రావడం లేదని శృతి కోప్పడుతుంది. అసలు నిన్ను కాదు మీ అమ్మనాన్నల్ని అంటూ కోపంగా అనబోతుంది. అప్పుడే అక్కడికి ప్రభావతి రావడంతో శృతి సైలెంట్ అవుతుంది.
సంజు మంచివాడు...
అప్పుడప్పుడు గొడవలు పడాలి, మాటలు అనుకోవాలి..అప్పుడే కాపురం బాగుంటుందని ప్రభావతి శృతి గొడవను పట్టించుకోనట్లుగా కవర్ చేస్తుంది. సంజు మంచివాడు కాదని శృతి చెప్పబోతుంది. కానీ ప్రభావతి కోడలి మాటల్ని వినదు. సంజు మంచివాడని అంటుంది. నీతో పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం మౌనికకు పెళ్లి ముందే చెప్పాడని, అతడినిసందేహించాల్సిన పనిలేదని అంటుంది. సంజు మంచివాడంటే తనకు నమ్మబుద్ది కావడం శృతి డౌట్‌గా అంటుంది. మౌనిక కాపురం గురించి ఆలోచించడం మానేయమని చెబుతుంది.
అత్తింటికి వెళ్లడమే కరెక్ట్…
శృతి, రవిని తమ ఇంటికి తీసుకొచ్చేలా ఒప్పించడానికి ప్రభావతి సిద్ధం అవుతోండగానే అక్కడికి శోభన ఎంట్రీ ఇస్తుంది. తన ప్లాన్‌ను చెడగొట్టడానికే శోభన వచ్చిందని ప్రభావతి అనుకుంటుంది. కానీ
పెళ్లయిన తర్వాత కూతురు పుట్టింట్లో ఉండటం కంటే అత్తింటికి వెళ్లడమే కరెక్ట్ శృతితో అంటుంది శోభన. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వీళ్లతోనే ఉండాలని అంటుంది. శోభన మాటలు విని ప్రభావతి షాకవుతుంది. ఇలా ప్లేట్ ఫిరాయించింది ఏంటి అని డైలమాలో పడుతుంది. ఏదైతేనేం తన దారిలోకి వచ్చింది కదా అని అనుకుంటుంది.
నేను ఒప్పిస్తాను...
సురేంద్ర ఆమోదం లేనిదే మిమ్మల్ని ఇంటికి రానిచ్చేది లేదని సత్యం అంటున్నాడని, సురేంద్ర, శోభన కలిసి మీ ఇద్దరికి మాఇంటికి తీసుకురావలని కండీషన్ పెట్టాడని ప్రభావతి అంటుంది. అదంతా తాను చూసుకుంటానని, సురేంద్రను తాను ఒప్పిస్తానని శోభన అంటుంది. రేపే శృతి, రవిని మీ ఇంటికి తీసుకొస్తానని శోభన మాటిస్తుంది.
కోడలిగా కాదు కూతురిలా...
రవి ఇంటికి వెళ్లడానికి శృతి భయపడుతుంది. నిన్ను కోడలిగా కాదు కూతురిలా ఏ లోటు రాకుండా చూసుకుంటానని ప్రభావతి మాటివ్వడంతో అత్తింటికి రావడానికి శృతి ఒప్పుకుంటుంది. ప్రభావతి కోరిక మేరకు రవి, శృతి ఇంటికొస్తారు. వారిని చూడగానే బాలు రచ్చ మొదలుపెడతాడు. రవిని కొట్టడానికి వెళతాడు. శృతి అడ్డుపడుతుంది. తల్లి వారిని ఇంటికి రప్పించేలా చేసిందని బాలు అర్థం చేసుకుంటాడు. రవిని, శృతిని బయటకు వెళ్లమని అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.