Gunde Ninda Gudi Gantalu: బాలుకు పనిష్‌మెంట్ - అత్తింట్లో మౌనికకు సంజు టార్చర్ - భర్తకు మీనా సపోర్ట్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు జనవరి 3 ఎపిసోడ్‌లో బాలు తమ ఇంటి గడప తొక్కకూడదని, మౌనికను మళ్లీ కలవకూడదని కండీషన్ పెడతాడు నీలకంఠం. అప్పుడే మౌనికను తమ ఇంటికి తీసుకెళతామని అంటాడు. అతడి షరతుకు ప్రభావతి ఒప్పుకుంటుంది.
Gunde Ninda Gudi Gantalu: సంజు మంచివాడు కాదని బాలు, మీనా ఎంత చెప్పిన ప్రభావతితో పాటు మిగిలిన కుటుంబసభ్యులు వినరు. ఆవేశంలో బాలు మౌనిక మెడలో సంజు కట్టిన తాళి తెంచబోతాడు బాలు. మౌనిక బాలును కొడుతుంది. సంజు తన భర్త అని, కాదనే హక్కు నీకు లేదని బాలుతో అంటుంది.
నీలకంఠం డ్రామా...
బాలు చేసిన అవమానాన్ని తట్టుకోలేక మౌనికను పెళ్లి మండపంలోనే వదిలిపెట్టి వెళ్లిపోయినట్లుగా నీలకంఠం, సంజు నాటకం ఆడుతారు. మౌనికను కాపురానికి పంపించడం ఇష్టం లేనప్పుడు మీ ఇంట్లోనే ఉంచుకొండి అని అంటారు. బాలు రౌడీలా ఉన్నాడని, రోజు వచ్చి గొడవలు పడితే ఎవరు ఆపుతారు. అవన్నీ భరించడంతన వల్ల కాదని నీలకంఠం అంటాడు.
కండీషన్...
నీలకంఠం ఫ్యామిలీకి సత్యంతో పాటు ప్రభావతి, సుశీల క్షమాపణలు చెబుతారు. వారు ప్రాధేయపడటంతో నీలకంఠం తగ్గుతాడు. బాలు జీవితంలో మళ్లీ మా ఇంటి గడప తొక్కకూడదు. మౌనికను కలవకూడదని కండీషన్ పెడతాడు.
ఆ కండీషన్‌కు ఒప్పుకుంటేనే మౌనికను మా ఇంటికి తీసుకెళతామని నీలకంఠం అంటాడు. నీలకంఠం షరతును ప్రభావతి అంగీకరిస్తుంది. జీవితంలో బాలు మళ్లీ మౌనిక ముఖం చూడడు. మళ్లీ మీ ఇంటికొచ్చి గొడవ చేయకుండా చూసే బాధ్యత తనది అని మాటిస్తుంది.
షాకిచ్చిన మీనా...
అప్పగింతల టైమ్‌లో బాలు చేసిన తప్పుకు మౌనికపై కోపం చూపించవద్దని సంజుతో అంటుంది ప్రభావతి. మాకు కోడలైనా...కూతురైనా మీ అమ్మాయే అంటూ మౌనికపై ప్రేమను కురిపిస్తుంది సంజు తల్లి రేవతి. బాలు మూర్ఖుడు అని, వాడి నీడ మా ఇంటిపై పడకూడదని నీలకంఠం అంటాడు. బాలు అలా ఎందుకు మాట్లాడాలో మీకు తెలుసు...మీ అబ్బాయికి తెలుసు అని నీలకంఠానికి షాకిస్తుంది మీనా.
బాలు ఇదంతా ఎందుకు చేశాడో ఇక్కడున్న ఎవరికి అర్థం కాకపోయిన నాకు తెలుసు అని చెబుతుంది. మా మౌనిక మీ ఇంట్లో క్షేమంగా ఉంటుందని పంపిస్తున్నామని మీనా అంటుంది. మీనా మాటలతో నీలకంఠం, సంజు తడబడతారు. నీకు ఏ కష్టం వచ్చిన నీకు బాలు, నేను ఉన్నామని మౌనికతో చెబుతుంది మీనా.
సత్యం ఫ్యామిలీ ఎమోషనల్...
మీనాకు అప్పగింతలు చెబుతూ సత్యం ఫ్యామిలీఎమోషనల్ అవుతారు.అందరూ వెళ్లిపోయిన తర్వాత మీనాను కలుస్తుంది రేవతి. మౌనికను తాను జాగ్రత్తగా చూసుకుంటానని, బాలును భయపడవద్దని చెప్పమని అంటుంది.
బాలు బాధ...
చెల్లి జీవితం తన కళ్ల ముందే నాశనం కావడం బాలు తట్టుకోలేకపోతాడు. ఫుల్‌గా మందేసి బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు. కుటుంబసభ్యులు తనను అన్న మాటలు పదే పదే గుర్తుచేసుకొని బాధపడతాడు.
తప్పు జరుగుతున్నప్పుడు ఆపడం మా లాంటి మనుషుల వల్ల కాకపోతే నువ్వైన ఆపవా అని ఎదురుగా ఉన్నవినాయకుడి విగ్రహంతో చెబుతాడు బాలు. ఎవరికి ఎవరిని ముడిపెట్టాలో కన్నవాళ్లతో పాటు ఎవరూ నిర్ణయించలేరని, పుట్టుకతోనే భగవంతుడు నుదుటిపైరాసి పంపుతాడని బాలుతో అంటాడు పూజారి. దానినే విధి లిఖితం అని అంటారని చెబుతాడు.
మార్పు వస్తుంది....
తన చెల్లెలు ఓ రాక్షసుడిని పెళ్లి చేసుకుందని, తనను వాడు ఏం చేస్తాడో అని భయపడుతున్నానని బాలు అంటాడు. వాడు మారుతాడనే నమ్మకం తనకు లేదని చెబుతాడు.లోకంలోని సమస్తం మారుతాయని, అలాగే నీ చెల్లెలి భర్త కూడా మారే రోజు వస్తుందని, ఏ నమ్మకంతో అయితే నీ చెల్లెలు పెళ్లిచేసుకుందో అదే నమ్మకం ఆమె భర్తలో మార్పు తీసుకొస్తుందని పూజారి బాలుకు ధైర్యం చెబుతాడు.
సంజు రివేంజ్...
అత్తింట్లో అడుగుపెట్టిన మౌనిక దేవుడికి దీపం వెలిగిస్తుంది. బాలుపై తన భర్తకున్న కోపం పోవాలని, అందరూ ఆనందంగా కలిసి ఉండేలా చేయమని దేవుడిని వేడుకుంటుంది. మౌనిక అన్నయ్యలపై పగ తీర్చుకునే అవకాశం ఇచ్చిన దేవుడికి థాంక్స్ చెబుతాడు సంజు. తాను చెప్పిన మాటలు నమ్మి శ్రీరాముడు చంద్రుడు అని నమ్మి నేరుగా మౌనిక పులి బోనులో తలపెట్టిందని, మౌనికను ఆమె ఫ్యామిలీని ఎవరూ కాపాడలేరని సంజు మనసులో అనుకుంటాడు.
నరకంలోకి మౌనిక...
బాలు ఇంటికి రాకపోవడంతో అతడి కోసం మీనా వెతకడం మొదలుపెడుతుంది. ఓ చోట చెట్టు కింద బాలు కూర్చొని కనిపిస్తాడు. మౌనిక కొట్టినందుకు బాధపడుతున్నారా అని బాలును అడుగుతుంది మీనా. ఇంకో నాలుగు దెబ్బలు కొట్టిన బాధపడేవాడిని కాదు...కానీ సంజుతో కలిసి నరకంలోకి వెళ్లిపోయినందుకు బాధగా ఉందని బాలు అంటాడు.
ఎప్పుడు బాలు అన్నయ్య ఏది చెబితే అదే అనే మౌనిక ఈ సారి నా మాట వినలేదని బాలు బాధపడతాడు. తొందరపడి సంజును చంపేస్తే మీరు జైలుకు వెళ్లాల్సివస్తుందనే భయంతోనే మౌనిక మిమ్మల్ని కొట్టిందని, మీపై కోపంతో కాదని భర్తకు సర్ధిచెబుతుంది మీనా. మౌనిక జీవితాన్ని కాపాడే బాధ్యత నీదేనని, నీపైనే భారం వేశానని, తన చేతుల్లో ఏమి లేదని వినాయకుడిని ప్రార్థిస్తాడు బాలు.
రోజుకో శిక్ష...
ఫస్ట్ నైట్ రోజే తన నిజస్వరూపాన్ని సంజు బయటపెడతాడు. ఈ ప్రపంచంలో నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకుంది మీ బాలు అన్నయ్య మాత్రమేనని సంజు అంటాడు.
వాడిపై రివేంజ్ తీర్చుకోవడానికి నీ మెడలో తాళికట్టానని, ఇక నుంచి నీకు రోజుకో శిక్ష వేస్తూనే ఉంటానని సంజు అంటాడు. సంజు మాటలతో మౌనిక షాకవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.